వర్షాకాలంలో.. రైతులకు ఊరట.
షీట్ షెడ్ నిర్మాణానికి రూ.175 కోట్లు నిధులు మంజూరు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.
జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, గాల్వాలూమ్ షీట్ రూఫింగ్‌తో కూడిన కవర్‌డ్ షెడ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.75 కోట్ల నిధులను ఈరోజు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరుకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రత్యేక కృషి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నూతన కవర్ షెడ్ నిర్మాణం ద్వారా రైతులకు వర్షాలు, ఎండల సమయంలో కూడా మద్దతు ధరపై ధాన్యం అమ్మే అవకాశాలు మెరుగవుతాయని మార్కెట్ యార్డ్ సిబ్బంది తెలిపారు. మార్కెట్ యార్డ్ పరిధిలో వృద్ధి చెందుతున్న వ్యవసాయ లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణం కీలకంగా మారనుంది.
ఈ సందర్భంగా AMC చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్, కార్యవర్గం సభ్యులు,రైతులు, మార్కెట్ యార్డ్ ఉద్యోగులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.