టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి…

టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సంపూర్ణ మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జాతీయ పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, పాఠశాలల విలీనం, మూసివేతను వ్యతిరేకించడం జరిగిందాన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తూముకుంట ఉపాధ్యాయులు, లాల్ గడి మలక్ పేట్ ఉపాధ్యాయులు తో పాటు వివిధ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ షామీర్పేట్ మండల అధ్యక్షులు పి తిరుమలేష్, ప్రధాన కార్యదర్శి యు కుమార్, జిల్లా పరిషత్ హై స్కూల్ తూముకుంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, లాల్ గాడి మలక్ పేట్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస ప్రభాకర్, పిఈటీఏ టీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ సత్తిరెడ్డి, ఉపాధ్యాయులు అన్నపూర్ణ, నాగ శారద, శ్రీనివాస్ రెడ్డి, వనజ, రజిని, వరలక్ష్మి, పద్మ , శ్రీదేవి, మహేష్ భాగ్యరేఖ పాల్గొన్నారు.

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన…

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

జాతీయ పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి…

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఏ ఐ జె ఏ సి టి ఓ, ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణ’ పోరాటానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ( యు.ఎస్.పి.సి) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ పోరాటంలో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో కేసముద్రం మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు కూడా నేడు తమ తమ పాఠశాలల్లో జేబుకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా విధానాలపై తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా చేసిన విద్యా ప్రయోగాలు భవిష్యత్తు తరాలకు తీవ్రమైన అన్యాయం చేస్తాయనీ, ఉపాధ్యాయుల ఆత్మగౌరవం, హక్కులు, రిటైర్మెంట్ భద్రత, విద్యార్థుల భవిష్యత్తు అన్నీ ఒక్కటే నని, వీటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందనీ అన్నారు.
సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని,
జాతీయ పెన్షన్ పథకం (ఎన్ పి ఎస్) ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని( ఓ పి ఎస్) పునరుద్ధరించాలని,
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమికోపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలనీ,
జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పి) ను రద్దు చేయాలనీ,
పాఠశాలల విలీనం, మూసివేతలను వెంటనే నిలిపివేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. అనంతరం డిటిఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్య మాట్లాడుతూ
ఉపాధ్యాయులు పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని,రాష్ట్ర-జిల్లా-మండల శాఖలు ఇచ్చే పిలుపులకు తక్షణమే స్పందిస్తూ, రాబోయే కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ఉద్యోగ ఉపాధ్యాయులందరికి సూచించారు. తదుపరి డ్యూటీ ఉపాధ్యక్షులు భూక్య శ్రీను మాట్లాడుతూ
ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ సమస్యలను చర్చకు తీసుకుని నిర్ణయాత్మక చర్యలు తీసుకోకపోతే, పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయడం తప్ప మరో మార్గం లేదనీ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ అధ్యక్షులు గుండు సురేందర్ తో పాటు, యుటిఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీనివాస్, డిటిఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్య, టి పి టి ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, మండల కార్యదర్శి మోహన్ కృష్ణ, వీసం నర్సయ్య, ఊటుకూరి ప్రణయ్ కుమార్, ఉపాధ్యాయులు వెలమాల భాస్కర్, అప్పాల నాగరాజు, ఉప్పరపల్లి పి జి హెచ్ ఎం చంద్రశేఖర్, దురేష్, వినోద్ రాజ్, సంపత్, సురేష్, బిజయ్,తండా సదానందం,యం .యాకాంబ్రం కె. రాములు ,రాము , అలీ ,శ్రీనివాస్, బాలాషౌరెడ్డి బిక్షపతి , లింగయ్య, నాగరాజు, నాగేందర్,హరికృష్ణ, ,కృష్ణ ,గోపి, రవీందర్,సూర్యనారాయణ శివ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

కస్తూర్భా గాంధీ విద్యాలయంను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర..

కస్తూర్భా గాంధీ విద్యాలయంను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

అస్వస్థతకు గురైన వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు.

ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

నాణ్యత లేని కూరగాయలు, ఫుడ్ తో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం.

:- మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్ళపల్లి మండలం, కొరికిశాల గ్రామంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయం లో పురుగుల అన్నం తిని వాంతులు, వీరేచనాలు, కడుపునొప్పితో దాదాపు 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన్నారు.
విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి నేడు బిఆర్ఎస్ నాయకులతో కలిసి కస్తూర్భా గాంధీ విద్యాలయంను సందర్శించి, విద్యార్థుల సమస్యను అడిగి తెలుసుకున్నారు.
ఏదైనా సమస్య ఉంటే నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వండి అని తన ఫోన్ నెంబర్ ఇచ్చారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ…
విద్యార్థులు తినే ఆహారాన్ని విషంగా మార్చేస్తున్నారు.
కస్తూర్భా గాంధీ కళాశాలలో కలుషితమైన ఆహారం తిని 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన్నారు.
ఈ సంఘటన ఉదయమే జరిగింది కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికి విద్యార్థుల పరిస్థితి విషమించటంతో మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి వారికీ చికిత్స అందించడం జరిగింది.
నేను గత శుక్రవారం రోజున ఇదే కస్తూర్భా స్కూల్ సందర్శించడం జరిగింది.
ఆ రోజు కుళ్ళిపోయిన కూరగాయలు, సొరకాయలు ఇవన్నీ కూడా బాగాలేవు వాళ్లకు మెనూ ప్రకారం పెట్టాల్సినటువంటి కూడా ఫుడ్ పెట్టడం లేదు, పప్పు ఒక చెంచా,ఉల్లిగడ్డ పులుసు చేసి పెట్టడం జరిగింది. చాలామంది విద్యార్థులు చాలా తక్కువ కూర తక్కువ కలుపుకుని తింటా ఉన్నారు. కొంచెం ఎక్కువ వీళ్లకు క్వాంటిటీ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది.ఆ రోజు మండలానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఏఈ ఈ స్కూల్ కి స్పెషల్ ఆఫీసర్ గా ఇక్కడకు రావడం జరిగింది, వారికీ కూడా విషయం చెప్పడం జరిగింది. ఆయన కూడా విద్యార్థులను కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను తెలుసుకొని, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి, విద్యావ్యవస్థ సక్రమంగా నడిచేలా మీరు స్పెషలాఫీసర్ దృష్టి పెట్టాలి.

రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంత నిర్లక్ష్యంగా ఉందనడానికి నిన్నోక్కటే రోజు మూడు స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలు. మొన్నటి రోజున విద్యార్థులు రోడ్డెక్కి నడుచుకుంటూ పోయి కలెక్టర్ కార్యాలయం పోయి తమ సమస్యలు చెప్పుకునే స్థితిని చూస్తే మరి ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కనపడతా ఉన్నది.

మేము కూడా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వానికి తెలిసేలా ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం కొరకు కార్యక్రమాన్ని మేము చేస్తే ఇక్కడ ఉండేటువంటి నాయకులు మేము కమిట్మెంట్ తో చేస్తా ఉంటే మాపై విమర్శలు చేస్తున్నారు. నేను రాకుండా మీరు ఈ సమస్యలు రాకుండా చూసుకుంటే మిమ్మల్ని ప్రజలు అభినందిస్తారు.

ఈ రోజు విమర్శలు చేయడం వల్ల సమస్య నుంచి తప్పించుకోలేరని, ఈరోజు మీకు అర్థమైంది.

కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉండేటువంటి విద్యా వ్యవస్థ అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ రెండు కూడా నిర్లక్ష్య ధోరణి లో ఉన్నాయి. మరీ జిల్లా జనరల్ అసుపత్రిలోని కింది స్టాప్ అంతా కూడా మరి రాజకీయ ప్రమేయం తోటి నియమించబడ్డాయి. కాబట్టి అక్కడ ఎవరు కూడా సరిగా కో ఆపరేట్ చేయడం లేదు ఇక్కడ వంట వండే వాళ్ళలో ఏదో నిర్లక్ష్యం ఉందని చెప్పి మరి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునఃరావృత్తి కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిని చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం.

విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ఇక్కడ జరుగుతున్నట్టువంటి పరిణామాలను మీ పిల్లలు ఉన్నారు కాబట్టి వారి ద్వారా తెలుసుకుని మీరు ఇక్కడ మా దృష్టికి తీసుకురావాలని, ఎందుకంటే పిల్లలు చెప్పడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మేము ఉంటాము, మాకు ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో అని భయపడుతున్నారు.
కాబట్టి మీరే పిల్లలు నుంచి సమాచారం సేకరించి మా దృష్టి తీసుకెళ్తే తప్పకుండా వీటిని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తెలియజేస్తూ.
ఇప్పటికైనా స్పెషల్ కమిటీ నియమించి కనీసం వారంలో ఒకరోజు సర్ప్రైజ్ విజిట్ చేసి ఫుడ్ క్వాలిటీ ఎట్లుంది, ఎంత క్వాంటిటీ ఇస్తా ఉన్నారు, ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది అనే విషయాలపై దృష్టి పెట్టాలనికోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచులు బి ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి….

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి….

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర యు ఎస్ పిసి ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నకు సిపిఐ ఎం ఎల్ పార్టీ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మాట్లాడుతూ జీఓ నo 25 ను సవరించాలి ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి 40 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలో తరగతికొక టీచర్ ఉండాలి ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ వర్క్ లోడ్ కు అనుగుణంగా టీచర్ పోస్టులు కేటాయించాలి సిపిఎస్ రద్దుచేసి ఓ పి ఎస్ పునరుద్దించాలి నూతన జిల్లాలకు డివిజన్ మండలాల వారిగా ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలి మెడల్ స్కూల్స్ గురుకుల సిబ్బందికి010.. పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలి ఉపాధ్యా యులు ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్స్ తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం . ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్ సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి మండల కార్యదర్శి బుర్రి కుమార్ స్వామి రాజు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version