కబ్జా కోరల్లో గార్ల పెద్ద చెరువు శిఖం భూములు…

కబ్జా కోరల్లో గార్ల పెద్ద చెరువు శిఖం భూములు…

నేటి ధాత్రి -గార్ల :-3

 

 

 

భూస్వాములు,బడా రైతులు గార్ల పెద్ద చెరువు శిఖం భూములను దర్జాగా కబ్జా చేశారని, అక్రమంగా భూములు కబ్జా చేసిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్ -ఎల్ న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జడ సత్యనారాయణ డిమాండ్ చేశారుపెద్ద చెరువు భూములు కబ్జా చేసిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని శనివారం మండల కేంద్రంలోని స్థానిక న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా సత్యనారాయణ మాట్లాడుతూ, చెరువు భూములు కబ్జా చేయడంతో చెరువు విస్తీరం తగ్గిపోవడం మూలంగా నీటి నీల్వ లేకపోవడంతో చిన్న, సన్నకారు రైతుల పంటలు ఎండిపోతున్నాయని అన్నారు.కబ్జాదారులు చెరువులో ఎక్కువ లోతులో బావులు, బోర్లు, కరెంటు స్థంబాలు ఏర్పాటు చేసుకొని అక్రమంగా నీటిని వాడుకుంటున్నారని తెలిపారు. ఒక్కసారి చెరువు నిండితే పంటలు పండే గార్ల చెరువు, రెండుసార్లు నిండి అలుగు పోసినప్పటికీ పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గార్ల పెద్ద చెరువు శిఖం భూములపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆక్రమించుకున్న భూమిని చెరువులో కలపాలని, ఇప్పటికే తప్పుడు పత్రాలు సృష్టించే పట్టాలు చేయించుకున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ ఎమ్ ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జి. సక్రు, మాన్య, యాకయ్య, సైదులు, వెంకన్న, వీరన్న, సురేష్, పద్మ తదితరులు పాల్గొన్నారు.

అధికారులు మారుతున్న ఆగని కబ్జా.

శిఖం భూమి కబ్జా

సాగుచేసిన పట్టించుకోని అధికారులు

అధికారులు మారుతున్న ఆగని కబ్జా

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి:

పచ్చని పంట పొలాలకు సాగునీరు అందించే ఆ చెరువు నేడు కబ్జాకు గురవుతుంది. దీంతో చెరువు పరిధిలోని పంట భూములు పచ్చని పైరులతో కళకళలాడే పరిస్థితులు క్రమంగా కనమరుగయ్యే దుస్థితి నెలకొంటుంది. రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల ధరలు రోజు రోజుకు పెరగుతుండడంతో సులభంగా సంపాదించడానికి అలవాటు పడిన కొంతమంది దళారులు ప్రభుత్వ భూములను కూడా యధేచ్చగా కబ్జా చేస్తున్నారు. కాగా ప్రభుత్వ భూములను కాపాడడానికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు శిఖం భూమిని ఒక రైతు తన ఇష్టారీతిగా కబ్జా చేస్తున్నట్లు పరిసర ప్రాంతాల రైతులు ఆరోపిస్తున్నారు. చెరువులో మునిగిన పట్టా భూములు కూడా తేలిన తర్వాతనే సాగు చేసుకునే హక్కుకలిగినవి. అయితే గిద్ద చెరువు సమీపంలోని ఒక సర్వే నంబర్ లో దాదాపు 2 ఎకరాలకు పైగా చెరువు శిఖం భూమిని కబ్జా చేసి సాగు చేస్తున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. శిఖం భూమి కబ్జాకు గురైందని గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం.చెరువు శిఖం భూములు కబ్జాలకు గురవుతుంటే భవిష్యత్తులో చెరువులు మాయమయ్యే పరిస్థితులు సంభవిస్తాయని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి మండల కేంద్రంలో చెరువు శిఖం భూమి కబ్జాకు గురవుతుండగా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో అధికారులు ఇప్పటికైనా స్పందించి గిద్ద చెరువు కబ్జాదారుల కబందహస్తాల నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version