ఎంపీ వద్దిరాజుకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది Date 25/08/2025
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు ఆయన సిబ్బంది వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.వినాయక చవితి సందర్భంగా ఎంపీ రవిచంద్ర వ్యక్తిగత సిబ్బంది బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసం వద్ద నవరాత్రోత్సవాలు ఘనంగా జరపాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా వీఆర్సీ యూత్ అసోసియేషన్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముకుంద అనిల్ పటేల్,మల్యాల శేఖర్,ముడ్డంగుల కృష్ణ,గుగులోతు నవీన్,యరగాని పృథ్వీ,అనంతుల శ్రీనివాస్,ధూదిగామ సాత్విక్ తదితరులు ఎంపీ రవిచంద్రను సోమవారం కలిశారు.ఈ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా గణనాథునికి జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కావలసిందిగా కోరుతూ ఎంపీ రవిచంద్రను వారు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు వారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
జాతీయ క్రీడా దినోత్సవం ఉత్సవాలలో భాగంగా కలెక్టర్,క్రీడాశాఖ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా యువజన క్రీడల అధికారిని టీవీఏల్ సత్యవాణి ఆధ్వర్యంలో నర్సంపేట మిని స్టేడియం లో సోమవారం కబడ్డీ రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్జిఎఫ్ఐ సెక్రెటరీ సోనబోయిన సారంగపాణి,రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, నర్సంపేట జోన్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గండి నర్సయ్య గౌడ్,సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు నర్సంపేట మండల కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుల్లూరి స్వామి గౌడ్,డాక్టర్ సాదిక్, కబడ్డీ ఇంచార్జ్ కోచ్ యాట రవికుమార్, రెజ్లింగ్ ఇంచార్జ్ కోచ్ సిరపురపు మహేష్ క్రీడాకారులు పాల్గొన్నారు.
రైతులు పండించే పంటలకు షరతులు లేకుండా యూరియా అందించాలని బిఆర్ఎస్ పార్టీ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు సోమవారం మండల కేంద్రంలో రైతులతో కలిసి ప్రధాన రహదారి పై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంతో రావుల సోమయ్య మాట్లాడుతూ.తప్పుడు హామీలతో గద్దినెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిన రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదం వ్యక్తం చేశారు.రైతులు పండించే పంటలకు సకాలంలో యూరియా కూడా సరఫరా చేయలేని దినస్థితిలో ఈ ప్రభుత్వం కళ్ల మూచుకొనీ ఉందన్నారు.అనంతరం రైతుల సమస్యలను పరిష్కరించి,సకాలంలో ఎరువులు అందించాలని రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ నియోజక వర్గం ఝరాసంగం నుండి మెదవల్లి వెళ్లే రోడ్డు వూర్తిగా గుంతల మయంగా మారిందని, తక్షణమే కొత్త రోడ్డు వేయాలని, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం ఏవో కి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డును కనీసం పట్టించుకున్న నాధుడు లేకపోవడం, అధికారులు ప్రజావ్రతినిధులు ఈ రోడ్డును ఎందుకు వట్టించుకోవడం లేదో సమాధానం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నా వట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఝరాసంగం మండల నాయకులు సురేష్, ఇతరులు నరేష్, శ్రీకాంత్, బాల్ రాజ్, నజీర్, సాయి కిరణ్ గౌడ్, తదితరులున్నారు.
వనపర్తి జిల్లా లోని బందుకు వచ్చే నెల 5 న పిలుపు నిచ్చిన రేషన్ డీలర్ల
వనపర్తి నేటిదాత్రి . ఏప్రిల్ నెల నుండి 5 నెలలుగా ప్రభుత్వం రేషన్ డీలర్లకు కమీషన్ చెల్లించ నందుకు రేషన్ డీలర్లు వచ్చే నెల 5 న బంధు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు నిచ్చారని వనపర్తి జిల్లా లో కూడా రేషన్ డీలర్లు బందు పాటించాలని తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా రేషన్ డీలర్ల సంఘము అధ్యక్షులు బచ్చు రాం డీలర్ల నరేష్ వెంకట్ రెడ్డి ప్రవీణ్ రాఘవేంద్ర నరసింహారెడ్డి సత్య రెడ్డి పాల్గొన్నారు
సంగారెడ్డి జిల్లాలోని 33 సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తుల కోసం రూ.3.30 కోట్ల నిధులు మంజూరు అయినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. ఒక్కో వసతి గృహానికి రూ.10 లక్షల చొప్పున కేటాయించిన ఈ నిధులతో సివిల్ పనులు, ఎలక్ట్రికల్ పనులు, ప్రహరీ గోడల నిర్మాణం, బాత్రూమ్, టాయిలెట్ రిపేరింగ్, పెయింటింగ్ వంటి పనులు చేపడతామని ఆయన వివరించారు.
శంకర్‌పల్లిలోని క్రెస్కో హౌసింగ్ ప్రాజెక్టు కు నలుగురు బాధితులు బలి
పది సంవత్సరాలు గడుస్తున్నా పూర్తికాని ఇండ్ల నిర్మాణం
న్యాయం చేయండి అంటూ మీడియా ముందు బాధితులు
శంకర్‌పల్లి,నేటిధాత్రి : రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని సింగాపూర్ వార్డు సంగారెడ్డి రోడ్డు లో సర్వేనెంబర్ 317, 324 లలో 22 ఎకరాల 31 గుంటలతో 2015 మార్చి 14న క్రెస్కో హౌసింగ్ ప్రాజెక్టు విల్లాల ఏర్పాటుకు భూమి పూజ చేసింది. భూమి యజమాని జీకే రాజు. జీకే రాజు వద్ద క్రెస్కో కంపెనీ యాజమాన్యం అనిల్ కుమార్ సిద్ధూ, శ్యాంసుందర్ బేతి, దొమ్మాట నరసింహారావు అనే ముగ్గురు బిల్డర్లు వెంచర్ ను ఏర్పాటు చేస్తామని భూమిని తీసుకున్నారు. భూమి యజమానికి ఒప్పదం ప్రకారం డబ్బులు ఇవ్వాలని స్థానిక ఇన్వెస్టర్స్ విట్టలయ్య తండ్రి పెంటయ్య, సత్యం రెడ్డి తండ్రి అడివిరెడ్డి, పట్నం యాదయ్య తండ్రి సాంబయ్య, ఎస్ లచ్చయ్య తండ్రి పెంటయ్య వద్ద నుండి కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ గా తీసుకున్నారు. ఆ తర్వాత దొమ్మాట నరసింహారావు తన వాటాలో భాగస్వామిగా స్వాగతిస్తూ ప్రభాకర్ రెడ్డి తండ్రి బుచ్చిరెడ్డి నుండి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారు. అనంతరం ముందుగా ఇచ్చిన చెక్కులు ఫెయిల్ అవ్వడంతో భూమి యజమాని జీకే రాజుతో ల్యాండ్ డెవలప్ మెంట్ కొరకు అగ్రిమెంట్ ఒప్పదం చేసుకున్నారు. ల్యాండ్ దేవలప్ మెంట్ సమయంలో స్థానిక పెట్టుబడి దారులు చెల్లించిన 3 కోట్ల రూపాయలు వారికి చెల్లించారు. అనంతరం 123 విల్లాలుగా చేసి అమ్మకానికి పెట్టారు. మొదటి విడతగా 10% చెల్లిస్తే చాలు అంటూ ఎక్కువ మందిని ఆకర్షించారు. సొంత ఇల్లు కట్టుకోవాలన్న కల నిజం అవుతుందన్న నమ్మకంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు, చిరు వ్యాపారులు క్రెస్కో వెంచర్ లో విల్లాలను తీసుకుందామని అప్పులు చేసి మరి 10% సొమ్ము చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నారు. వెంచర్ యాజమాన్యం మొదటి లైనులో 200 గజాలను 35 లక్షలకు, రెండవ లైనులో 167 గజాలను 23 లక్షలకు, మూడవ లైనులో 2002 గజాలను 41 లక్షలకు అమ్మింది. పది శాతం పోగా మిగిలిన సొమ్మును లోన్ ద్వారా చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పి డాక్యుమెంట్ ప్రాసెస్ కూడా చేసింది. దాని ఫలితంగా విల్లాలు కొన్న యజమానులకు లోన్ అప్రూవల్ లెటర్ కూడా రావడంతో ప్లాట్ యజమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే భూమి యజమాని హఠాత్తుగా మరణించారు. ఇదే అదునుగా భావించిన క్రెస్కో హౌసింగ్ ప్రాజెక్టు ఇండియన్ బ్యాంకు యాజమాన్యానికి భూ యజమాని మరణించిన విషయం తెలిపి కొనుగోలుదారుల లోన్ ప్రాసెస్ ను నిలిపివేయించారు. అనంతరం వారిపై వారే ఆరోపనలను చేసుకొని ఒకరిపై ఒకరు కేసు పెట్టుకుని నమ్ముకున్న కొనుగోలు దారులను గందరగోళానికి గురి చేశారు. ఇచ్చిన గడువు లోపల విల్లాలు నిర్మించలేక పోతున్నామని పివిఆర్ కంపెనీతో 50% భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందానికి అడ్వాన్స్ గా 5 కోట్ల రూపాయలు క్రెస్కో హౌసింగ్ ప్రాజెక్టు యాజమాన్యానికి ఇచ్చింది. పనులు ప్రారంభించిన పివిఆర్ కంపెనీ దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి కొంతవరకు భవన నిర్మాణాన్ని కొనసాగించింది. వారితో తగాదా చేసుకుని వారిని భాగస్వామ్యం నుండి తప్పించింది. అనంతరం తర్వాత కొన్ని సంవత్సరాలకు రాధా టిఎంటి వారి దగ్గర కూడా వెంచర్ యాజమాన్యం 6 కోట్ల వరకు డబ్బు తీసుకుని ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. భూ యాజమాన్యానికి అగ్రిమెంట్ డబ్బులు ఇవ్వనందున రాధా టిఎంటి వారికి భూమి రిజిస్ట్రేషన్ చేయలేక ఒప్పందం రద్దుకై 6 కోట్లకు బదులుగా 9 విల్లాలు, 31 గుంటల భూమిని అగ్రిమెంట్ చేసి ఇచ్చింది. ఈ విధంగా వెంచర్ యజమాన్యం 2 కంపెనీల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇద్దరిని క్రెస్కో మోసం చేసింది. 123 విల్లాలను కడతామని చెప్పి, మార్కెట్లో బ్రోచర్లను విడుదల చేసి మార్కెటింగ్ చేయించారు. 106 ఇండ్లు ఇప్పటికీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి.
Cresco Housing Scam: Victims Demand Justice
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు, చిరు వ్యాపారులు 2018లో క్రెస్కో వెంచర్ లో విల్లాలను తీసుకుందామని అప్పులు చేసి మరి కొనుగోలు చేశారు. వెంచర్ యాజమాన్యం ఇండ్లను అసంపూర్తిగా వదిలి వేయడం వల్ల కొనుగోలు చేసిన యజమానులు 5 గురు వారే సొంత డబ్బులతో పనులు పూర్తి చేసుకొని, బయట కిరాయి ఇళ్లల్లో కిరాయి కట్టలేక, వసతులు, అండర్ డ్రైనేజీ సరిగ్గా లేకుండా అందులో నివాసం ఉంటున్నారు. వెంచర్ యాజమాన్యం ఇండియన్ బ్యాంక్ ద్వారా లోన్లు ఇప్పిస్తానని చెప్పి, లక్షల్లో నగదును తీసుకొని మోసం చేసిందని బాధితులు ఆరోపించారు. మూడు దఫాలుగా నగదును కట్టామని తెలిపారు. ఇండ్లు పూర్తికాక ఇప్పటివరకు నలుగురు బలైపోయారు. ఇప్పటికైనా క్రెస్కో వెంచర్ యాజమాన్యం స్పందించాలని, బాధితులకు న్యాయం చేయాలని మీడియా ముందు మొరపెట్టుకున్నారు.
బిఆర్ఎస్ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు డిమాండ్
నేటిదాత్రి చర్ల
బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు చర్ల మండల కేంద్రంలోని అగ్రికల్చర్ కార్యాలయం ముందు పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో యూరియా కొరతపై ధర్నా నిర్వహించి అనంతరం అగ్రికల్చర్ ఏఓ లావణ్య కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా దొడ్డి తాతారావు మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెసు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులకు మోసపూరిత హమీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెసు ప్రభుత్వం నట్టేట ముంచుతుంది ప్రభుత్వ ముందు చూపు లేకపోవడం వలన యూరియా సరఫరా సక్రమంగా జరగక పోవడంతో రైతులు రోడ్డుపైకి రావలసిన పరిస్థితి ఏర్పడింది పంటలు పండక పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు కనీసం యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రైతుల పట్ల కాంగ్రెసు ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది రైతు రుణ మాఫీ రైతులందకి చేయలేదు రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు రైతు బీమా లేదు నీళ్ళు లేవు కరెంటు లేదు అనేక సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు కెసిఆర్ 9 సంవత్సరాల పరిపాలనలో ఏనాడు యూరియా ఇబ్బందులు లేవు ఇప్పటికైన ప్రభుత్వం రైతులకు సరిపడే యూరియా అందించాలని లేని ఎడల రేపు రాబోయే ఎన్నికల్లో రైతులు ఓటు ద్వారా బుద్ది చెబుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పంజా రాజు తడికల బుల్లబ్బాయి డివిజన్ యూత్ నాయకులు కాకి అనిల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొంబత్తిని రాము బీసీ సెల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు ఎస్టీ సెల్ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు అంబోజీ సతీష్ కారం కన్నారావు సాదిక్ కట్టం కన్నారావు రత్నాల శ్రీరామ్మూర్తి బట్ట కొమరయ్య తడికల చంద్రశేఖర్ సంతపూరి సతీష్ ఎడ్ల రామదాస్ గాదం శెట్టి కిషోర్ కుక్క డపు సాయి గుమ్మల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు
నాగారం మున్సిపల్ లోని రామకృష్ణ నగర్ కాలనీలో గుడి స్థలం కబ్జా కావడంతో కాలనీవాసులు నాగారం మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డికి సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదంటూ కాలనీవాసులు మున్సిపల్ ఆఫీస్ ముందు మా గుడి స్థలం మాకు ఇప్పించాలని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కబ్జాకోరులను శిక్షించాలని అక్రమ కట్టడాలను తొలగించాలని కాలనీవాసులు ధర్నా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, యువ నాయకులు కౌకుంట్ల రాహుల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.
మట్టి వినాయకులే ముద్దు.., పర్యావరణ ప్రేమికులవుదాం..
డాక్టర్ రతన్ సింగ్ ఠాకుర్.
నేటిధాత్రి, మట్టేవాడ.
వరంగల్ ఏవివి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం “మట్టి ప్రతిమలను పూజిద్దాం – పర్యావరణహిత ప్రేమికులమవుదాం” అనే ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ రతన్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు సందేశమిచ్చారు. వినాయక చవితి సందర్భంగా పిఒపి విగ్రహాల వల్ల కలిగే నీటి కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి వినాయకులే ఉత్తమమైనవి అని ఆయన పేర్కొన్నారు. వినాయకుడు అంటేనే “ప్రకృతి” కాబట్టి మట్టి విగ్రహాలు, సహజ రంగులు వాడటం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ప్రజలను ఆయన ఆహ్వానించారు.
Dr. Ratan Singh Thakur.
ఈ సందర్భంగా ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా తమ విభాగం పర్యావరణ పరిరక్షణపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రస్తుతం మట్టి వినాయకుల వాడకం 25 శాతమే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఇది 40 శాతానికి పెంచే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరించారు. విద్యార్థులు స్వయంగా మట్టి వినాయకులను రూపొందించి ర్యాలీ నిర్వహించడం ఇదే లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. “పిఒపి వద్దు – మట్టి వినాయకులే ముద్దు” అనే నినాదాలతో ర్యాలీ కొనసాగింది. మట్టి వినాయకుల వల్ల పర్యావరణం కాపాడబడటమే కాకుండా గణేశ పూజలో వాడే 21 రకాల పత్రి ఔషధ గుణాలను కూడా ప్రజలకు తెలియజేశారు. అనంతరం శ్రీనివాసరావు రచించిన ఔషధ మొక్కల విలువలపై గోడపత్రిక ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అధ్యాపకుడు సర్వేశ్, సీనియర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రబ్బాని, దేవిశ్రీప్రసాద్, సాకేత్, చిరంజీవి, దస్తగిరి, క్రాంతి, భరత్, శివశంకర్, నమ్రత, చందన, ప్రవళిక, మన్విత, సుహన, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేట మూడవ వార్డులో మురుగు సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి..
రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట పట్టణ మూడవ వార్డులోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి శారద ఫంక్షన్ హాల్ వరకు మురుగు నీరు పారడానికి తగిన మోరీలు,సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గతంలో కొద్ది ఇండ్లు మాత్రమే ఉండడంతో చిన్న చిన్న మోరీలు నిర్మించగా,ప్రస్తుతం ఈ ప్రాంతంలో గృహ నిర్మాణాలు భారీగా పెరగడంతో పాత మోరీలు సరిపోవడం లేదు.దీంతో మురికి నీరు వీధుల్లో నిల్వ అవుతూ దోమల వృద్ధి,దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Sharada function hall.
అదనంగా రాత్రిపూట లైట్లు లేకపోవడం,చెత్త బండి ప్రతి రోజు రాకపోవడం వల్ల చెత్త పేరుకుపోతూ సమస్య మరింత తీవ్రంగా మారింది.ఈ పరిస్థితిని తక్షణమే అధికారులు గమనించి మురుగు నీటి పారుదల సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో హస్నోద్దీన్, జమీర్,సల్మాన్,ఆరిఫ్, సయ్యద్,మొయిన్ తదితరులు పాల్గొన్నారు.
రాబోయే గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మట్టి గణపతులనే పూజిద్దాం పర్యావరణాన్ని పరి రక్షిద్దాం అని వన ప్రేమి గోకా రామస్వామి ఒక ప్రకటనలో పిలుపు నిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుజ్జి బుజ్జి మట్టి గణపతులనే పూజిద్దామని మనల్ని దేవుడు పుట్టిస్తే మనం భగవంతుడిని పుట్టించే ఒక మహా పండుగ వినాయక నవరాత్రుల వేడుక అని పేర్కొన్నారు.
Ganpati Navratri
పార్వతి మట్టి గణపతిని చేసి ప్రాణప్రతిష్ట చేసిన ఒక మహా పండుగ వినాయకచవితి అని మట్టి గణపతులతో పూజిస్తూ నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా జరుపుకుందామని తెలియజేశారు. ధ్వని,రంగులు,నీటి,వాయు,వాతావరణాన్ని కలుషితం చేయకుండా జాగ్రత్త లు పాటిద్దామని వనప్రేమి, పర్యావరణ వేత్త గోకా రామస్వామి తెలియజేశారు.
మండల కేంద్రంలో సోమవారం టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, డీజీ శర్మ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. జర్నలిస్టులో ఇండ్ల స్థలాల సమస్యలను త్వరలోనే పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు డీకే శర్మ, అజ్గర్, బాలరాజ్, శ్రీకాంత్, చంద్రకాంత్, సిద్దారములు, నవీన్ రెడ్డీ, భైరవరెడ్డి తదితరులు ఉన్నారు.
TPCC ఉపాధ్యక్షుడు నమ్మిండ్ల శ్రీను అన్నకు జన్మదిన శుభాకాంక్షలు *బర్ల సహాదేవ్ అడ్వకేట్ వర్దన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి
వర్దన్నపేట (నేటిధాత్రి):
యువతకు మార్గదర్శి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్న అని అంటే కష్ట కాలంలో నేనున్నా అని భరోసా ఇచ్చే నాయకుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు నమ్మిండ్ల శ్రీను అన్న గారు జన్మదిన శుభాకాంక్షలు ప్రజలతో కలసి మమేకమై ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ, ఎప్పుడూ అందరికి అందుబాటులో ఉంటూ, నిజాయితీతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా నిలుస్తూ, సామాజిక న్యాయానికి అండగా నిలుస్తూ ప్రజా హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. నమ్మిండ్ల శ్రీను అన్న గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాకుండా ప్రజల ఆపదలో అండగా నిలిచే సహృదయుడు, యువతకు మార్గదర్శి. ఆయన సేవా తపన, దూరదృష్టి, కష్టసుఖాలలో అందరితో కలసి నిలబడే ధైర్యసాహసాలు ఈనాటి రాజకీయాల్లో అరుదైన లక్షణాలు. ఆయన పాదయాత్రలు, ప్రజల సమస్యలపై పోరాటం, బడుగు బలహీన వర్గాల కోసం చేసే కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఆయనలాంటి నాయకుడు మన వర్ధన్నపేట నియోజకవర్గానికి దక్కడం గర్వకారణం.ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను
కల్వకుర్తి పట్టణ కేంద్రం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్య కార్యకర్తలు,నాయకులు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు నాయకుల సమక్షంలో శాలువాతో సన్మానించి కేకు కట్ చేసి అనంతరం భారీ ఎత్తున టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మామిడిగూడెం ఆదివాసులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి
ఐటీడీఏ పీవో కు వినతి పత్రం అందజేత
న్యూడెమోక్రసీ నేత ముసలి సతీష్
నేటిదాత్రి చర్ల
చర్ల మండలం మామీడిగూడెం చెందిన 50 కుటుంబాలు 1995 నుంచి సర్వేనెంబర్ 62 మరియు 65 లో సాగులో ఉన్నారు ఈ మధ్యకాలంలో దుమ్ముగూడెం కు చెందిన ఫారెస్ట్ అధికారులు అక్రమంగా భూమిలోకి వచ్చి ఆదివాసులను బెదిరించి పంటలు పీకినట్టుగా మొక్కలు తీసేసినట్టుగా కేసులు నమోదు చేశారు తక్షణమే వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆ భూములను ఆదివాసి ప్రజలకు పంచాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు చర్ల వచ్చిన భద్రాచలం ఐటిడిఏ పిఓ కు వినతిపత్రం అందించారు అనంతరం న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ చర్ల మండలంలో ఆదివాసి ప్రజలకు హక్కులు ఉన్న భూమిలోకి పోయే పరిస్థితిని ఫారెస్ట్ వారు కల్పించడం లేదని సాగులో ఉన్న భూములను గుంజుకొని అమాయకులైన ఆదివాసులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం అని అన్నారు గతంలో కూడా ఫారెస్ట్ అధికారులకు గుర్తు చేశాం అయినా మామిడిగూడెం గ్రామానికి చెందిన తొమ్మిది మంది మహిళలని అరెస్టు చేసి ఏడుగురుపై కేసు నమోదు చేసి ఒకరిని వదిలిపెట్టి ఇంకొక మహిళ ఎటుపోయారో తెలవని పరిస్థితిలో ఉన్నదని ఆచూకీ దొరకడం లేదని పిఓ కి గుర్తు చేశారు తక్షణమే ఆ మహిళ ఆచూకీ తెలపాలని సర్వేనెంబర్ 62 65 భూములు ఆదివాసి ప్రజలకు పంచాలని 1/70 యాక్టు ఏజెన్సీ చట్ట ప్రకారం ఇక్కడ ఆదివాసులని అధికారులు గానీ నియమించాలని ఇక్కడ ఫారెస్ట్ వారు సామాజిక వర్గాల తోటి అధికారం చలా ఇస్తున్నారని ఇది మానుకోవాలని వారన్నారు ఏ సామాజిక వర్గమైన పేద ప్రజలకు న్యాయం చేసేటట్టుగా చట్టాలకు అనుకూలంగా లోబడి పని చేయాలని వారు గుర్తు చేశారు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఇంకో మహిళ ఆచూకీ వెల్లడించాలని లేనిపక్షంలో దశల వారి ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా తెలియజేస్తున్నాం అని అన్నారు అనంతరం భద్రాచలం ఐ టి డి ఏ పి ఓ మాట్లాడుతూ ఈ సమస్యని త్వరలోనే పరిష్కరిస్తామని ఫారెస్ట్ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెల్లం రామకృష్ణ తెల్లం పెంటమ్మ కొమరం సమ్మయ్య చల్లం శ్రీను శ్యామల అరుణ తెల్లం వెంకటరమణ కొమరం రామక్క తదితరులు పాల్గొన్నారు
మై రాడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పెదముసిలేరు పంచాయతీకి 450 మొక్కలు అందజేత
ఎమ్ఎస్ కే సంస్థ ప్రతినిధి వీసంపల్లి నాగేశ్వరరావు
నేటి ధాత్రి చర్ల:
ఐటిసి ఎమ్ ఎస్ కే మైరాడ్ సంస్థ ఆధ్వర్యంలో పెదముసిలేరు గ్రామపంచాయతీ క్రీడా మైదానంలో సంస్థ ప్రతినిధి వీసంపల్లి నాగేశ్వరరావు మరియు పంచాయతీ సెక్రెటరీ ప్రశాంత్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది గ్రామంలో జీవవైవిద్యం కొరకు ఐటిసి ఎమ్ ఎస్ కే మైరాడ్ సంస్థ 450 మొక్కలు గ్రామపంచాయతీకి ఇవ్వడం జరిగింది ఈ మొక్కల వలన గాలిని శుభ్రపరచడం స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడం మరియు ఔషధ గుణాలున్న మొక్కల ద్వారా అనేక వ్యాధులకు చికిత్స చేయడం వంటివి ఉన్నాయి మొక్కలు వాతావరణంలోని కార్బన్డయాక్సైడ్ గ్రహించి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తాయి మొక్కలు వాతావరణం వేడెక్కకుండా కాపాడుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఐటిసి ఎమ్ఎస్ కే మై రాడ్ సంస్థ ప్రతినిధి విసంపల్లి నాగేశ్వరరావు పంచాయతీ సెక్రెటరీ ప్రశాంత్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు
స్వసక్తితో చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకొని జీవనోపాధి పెంపొందించుకొని ఉపాధి పొందుతున్న గిరిజన మహిళలకు ఐటీడీఏ మరియు ఐటీసీ ద్వారా చేయూత అందించి వారి పరిశ్రమలను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడానికి
ప్రయత్నిస్తున్నామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు శనివారం నాడు చర్ల మండలం సున్నం గుంపు గ్రామంలోని ముత్యాలమ్మ జాయింట్ లియబిలిటి గిరిజన మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల తినుబండారాల పదార్థాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులలో దొరికే అటవీ
ఉత్పత్తులను సేకరించి నిత్యవసరాలకు వాడుకొనడమే కాక సహజంగా దొరికే ఇప్ప పప్పుతో మంచి ఆరోగ్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు తయారు చేసి వాటిని అమ్మకాలు జరుపుకొని జీవనోపాధి పొందుతున్నరని ఇప్పపువ్వుతో మంచి సహజ గుణాలు కలిగిన డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి ఇప్పపువ్వు లడ్డులు బర్ఫీ చాక్లెట్లు మరియు ఔషధ గుణాలు కలిగిన వనమూలికలతో వివిధ రకాల కారంపొడి పచ్చళ్ళు తయారుచేసి అమ్మకాలు జరుపుకుంటున్నారని అన్నారు వీరు తయారు చేసే ప్రతి తినుబండారాలు నాణ్యతగా ఉంటూ పిల్లలకు పెద్దలకు వారి అభిరుచికి తగ్గట్లు మంచి రుచికరంగా తయారు చేస్తున్నారని ఈ మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో తయారు చేసుకొని జీవనోపాధి కల్పించుకుంటున్నారని అన్నారు ఈ మహిళలు తయారు చేస్తున్న ఆహార పదార్థాల ప్రొడక్ట్స్ మరియు బ్రాండింగ్ ప్యాకింగ్ విషయంలో మహిళలకు చేయూత అందించడానికి ఐటిడిఏ మరియు ఐటిసి ద్వారా సపోర్ట్ చేయడానికి ఒక నాలుగు సంఘాలను గుర్తించామని వారు తయారు చేసే వస్తువులను పరిశీలించిన తర్వాత వారి చిన్న తరహా పరిశ్రమలను మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు గ్రామాలలో నివసించే కుటుంబాలు మరియు చిన్నారుల తల్లిదండ్రులు వీరు తయారు చేసే ప్రతి వస్తువు ఆరోగ్యానికి మరియు నాణ్యతగా రుచికి తగ్గట్లు ఉన్నందున అందరూ కొనుగోలు చేసి ఈ పరిశ్రమలను అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికి మీ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ ఐ టి సి మేనేజర్ చంగల్ రావు ప్యాకింగ్ మరియు డిజైనింగ్ కోఆర్డినేటర్ బేగ్ మహిళా సభ్యులు సమ్మక్క మునెమ్మ శ్రీదేవి రమాదేవి శిరీష ఈశ్వరి స్వాతి తదితరులు పాల్గొన్నారు ముందుగా చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల తో మాట్లాడుతూ వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు u ఉంజుపల్లి వసతి గృహంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు బోదనెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతగుప్ప జీపీఎస్ పాఠశాల ను సందర్శించారు
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన వికలాంగుల సన్నాహక సదస్సు కార్యక్రమం
◆:- పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఆదివారము రాత్రి ఎన్ కన్వెన్షన్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన పెద్దలు, గౌరవనీయులు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారి వికలాంగుల సన్నాహక సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడానికి ఎమ్మార్పీఎస్ ఏ కారణం అని చెప్పడం జరిగింది, అలాగే రేషన్ బియ్యం పంపిణీ నాలుగు కేజీల నుంచి ఆరు కేజీల వరకు పెంచాలని పోరాటం చేసింది కూడా ఎమ్మార్పీఎస్ ఏ అని కూడా వారు సభలో చెప్పడం జరిగింది, అలాగే చిన్నపిల్లల గుండె సమస్యలకి ఉచిత వైద్యం చేయించాలని కూడా ఎమ్మార్పీఎస్ ఏ పోరాటం చేసిందని మరియు ఇప్పుడు వికలాంగుల పెన్షన్ 200 నాటి నుండి 2000 వరకు పెరిగేంత వరకు ఎమ్మార్పీఎస్ పోరాటం చేసింది అని మరియు 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ 4000 నుండి 6000 వరకు పెంచడం జరుగుతుందని అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని లేనిపక్షంలో రేవంత్ రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని సెప్టెంబర్ 9 వ తేదీన మహా గర్జన పేరుతో భారీ బహిరంగ సభ ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులైన మందకృష్ణ మాదిగ గారు వికలాంగులకు పిలుపునివ్వడం జరిగింది. వారు మాట్లాడిన తర్వాత జ్యోతి పండాల్ మందకృష్ణ మాదిగ గారికి సన్మానం చేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ ద్వారా వివిధ అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులైన గౌరవనీయులు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారికి సన్మానం చేయడానికి అవకాశం ఇచ్చిన ఎమ్మార్పీఎస్ డిస్టిక్ జనరల్ సెక్రెటరీ అబ్రహం మాదిగ మరియు మండల అధ్యక్షులకి, వారి టీమ్ అందరికీ మరియు రాయికోటి నరసింహులు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వికలాంగులు వృద్ధులు, ఒంటరి మహిళలు ఎంఆర్పిఎస్ టీం మరియు తదితరులు పాల్గొన్నారు,
మోసం చేసిన సర్కారు.. తాడోపేడో తెల్చుకుందాం: మందకృష్ణ మాదిగ,
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: రాష్ట్రంలోని 50 లక్షల పెన్షనర్లకు 20 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అధికారం చేపట్టి 20 నెలలవుతున్న ఇచ్చిన హామీ అమలు చేయకుండా పెన్షనర్లను మోసం చేస్తున్న ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామని ఆయన హెచ్చరించారు. సెప్టెంబర్ 9న హైదరాబాదులో నిర్వహించ పెన్షనర్ల బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన పెన్షనర్ల బహిరంగ నియోజకవర్గ సన్నాహక సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.20 నెలల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ, పెన్షన్ల పెంపు, రేషన్ బియ్యం పెంపు తదితర సంక్షేమ పథకాల కోసం తాను చేసిన పోరాటం, దాని నేపథ్యాలను పేపర్, ఆడియో క్లిప్పింగ్స్ లతో సభకు వివరించి తన పోరాటపటీమను వివరించారు. విపక్షాల అసమర్థత, అధికార కరపక్షం నిర్లక్ష్యంతో పేదల సమస్యలు గుర్తు రావని, హామీలను పట్టించుకోరని మండిపడ్డారు. తను ఎప్పుడూ.. అణగారిన వర్గాల పక్షంలోనే పోరాడుతానన్నారు. ఇక్కడ అన్ని వర్గాల వారికి సేవ చేసే అవకాశం తనకు కలుగుతుందన్నారు. ఎమ్మార్పీఎస్ అందరికీ భరోసానిచ్చే బ్రాండ్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం పెన్షనర్ల పట్ల చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకే బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తున్నామన్నారు.వికలాంగులకు రూ.6000తో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు ఇతర పెన్షన్లన్ని డబుల్ చేసేంతవరకు పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వికలాంగులు, పెన్షనర్లందరూ భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీ నేతలు, పనులు, పెన్షనర్లు మందకృష్ణ మాదిగను మాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, ఎమ్మార్పీఎస్, పెన్షనర్లు సంఘం నేతలు అబ్రహం మాదిగ ఉల్లాస్ మాదిగ జయరాజ్, నర్సింలు, రామరవి కిరణ్, జ్యోతి, నారాయణ, విశ్వనాథ్ యాదవ్, జైరాజ్ మాదిగ, మైకల్ మాదిగ, రవికుమార్, నిర్మల్ మాదిగ, రాజు, మనోజ్, నగేష్, యేసప్ప, రాజేందర్, సింగితం రాజు, తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.