రామాయంపేట మూడవ వార్డులో మురుగు సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి..
రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట పట్టణ మూడవ వార్డులోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి శారద ఫంక్షన్ హాల్ వరకు మురుగు నీరు పారడానికి తగిన మోరీలు,సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గతంలో కొద్ది ఇండ్లు మాత్రమే ఉండడంతో చిన్న చిన్న మోరీలు నిర్మించగా,ప్రస్తుతం ఈ ప్రాంతంలో గృహ నిర్మాణాలు భారీగా పెరగడంతో పాత మోరీలు సరిపోవడం లేదు.దీంతో మురికి నీరు వీధుల్లో నిల్వ అవుతూ దోమల వృద్ధి,దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అదనంగా రాత్రిపూట లైట్లు లేకపోవడం,చెత్త బండి ప్రతి రోజు రాకపోవడం వల్ల చెత్త పేరుకుపోతూ సమస్య మరింత తీవ్రంగా మారింది.ఈ పరిస్థితిని తక్షణమే అధికారులు గమనించి మురుగు నీటి పారుదల సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో హస్నోద్దీన్, జమీర్,సల్మాన్,ఆరిఫ్, సయ్యద్,మొయిన్ తదితరులు పాల్గొన్నారు.