గిరిజన మహిళలు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయండి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T123130.070.wav?_=1

 

గిరిజన మహిళలు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయండి

ఐటీడీఏ మరియు ఐటిసి అండగా ఉంటుంది

భద్రాచలం పీవో బి రాహుల్

నేటి ధాత్రి చర్ల

 

స్వసక్తితో చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకొని జీవనోపాధి పెంపొందించుకొని ఉపాధి పొందుతున్న గిరిజన మహిళలకు ఐటీడీఏ మరియు ఐటీసీ ద్వారా చేయూత అందించి వారి పరిశ్రమలను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడానికి

 

ప్రయత్నిస్తున్నామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు శనివారం నాడు చర్ల మండలం సున్నం గుంపు గ్రామంలోని ముత్యాలమ్మ జాయింట్ లియబిలిటి గిరిజన మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల తినుబండారాల పదార్థాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులలో దొరికే అటవీ

 

ఉత్పత్తులను సేకరించి నిత్యవసరాలకు వాడుకొనడమే కాక సహజంగా దొరికే ఇప్ప పప్పుతో మంచి ఆరోగ్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు తయారు చేసి వాటిని అమ్మకాలు జరుపుకొని జీవనోపాధి పొందుతున్నరని ఇప్పపువ్వుతో మంచి సహజ గుణాలు కలిగిన డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి ఇప్పపువ్వు లడ్డులు బర్ఫీ చాక్లెట్లు మరియు ఔషధ గుణాలు కలిగిన వనమూలికలతో వివిధ రకాల కారంపొడి పచ్చళ్ళు తయారుచేసి అమ్మకాలు జరుపుకుంటున్నారని అన్నారు వీరు తయారు చేసే ప్రతి తినుబండారాలు నాణ్యతగా ఉంటూ పిల్లలకు పెద్దలకు వారి అభిరుచికి తగ్గట్లు మంచి రుచికరంగా తయారు చేస్తున్నారని ఈ మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో తయారు చేసుకొని జీవనోపాధి కల్పించుకుంటున్నారని అన్నారు ఈ మహిళలు తయారు చేస్తున్న ఆహార పదార్థాల ప్రొడక్ట్స్ మరియు బ్రాండింగ్ ప్యాకింగ్ విషయంలో మహిళలకు చేయూత అందించడానికి ఐటిడిఏ మరియు ఐటిసి ద్వారా సపోర్ట్ చేయడానికి ఒక నాలుగు సంఘాలను గుర్తించామని వారు తయారు చేసే వస్తువులను పరిశీలించిన తర్వాత వారి చిన్న తరహా పరిశ్రమలను మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు గ్రామాలలో నివసించే కుటుంబాలు మరియు చిన్నారుల తల్లిదండ్రులు వీరు తయారు చేసే ప్రతి వస్తువు ఆరోగ్యానికి మరియు నాణ్యతగా రుచికి తగ్గట్లు ఉన్నందున అందరూ కొనుగోలు చేసి ఈ పరిశ్రమలను అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికి మీ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ ఐ టి సి మేనేజర్ చంగల్ రావు ప్యాకింగ్ మరియు డిజైనింగ్ కోఆర్డినేటర్ బేగ్ మహిళా సభ్యులు సమ్మక్క మునెమ్మ శ్రీదేవి రమాదేవి శిరీష ఈశ్వరి స్వాతి తదితరులు పాల్గొన్నారు
ముందుగా చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించారు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల తో మాట్లాడుతూ వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు u
ఉంజుపల్లి వసతి గృహంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు
బోదనెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతగుప్ప జీపీఎస్ పాఠశాల ను సందర్శించారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version