ఘనంగా సన్నబియ్యం పంపిణి కార్యక్రమం.

ఘనంగా సన్నబియ్యం పంపిణి కార్యక్రమం

గంగారం, నేటిధాత్రి :

 

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ షాప్ లో సన్న బియ్యం పథకం కొత్తగూడ గంగారం మండలాల్లో ఘనంగా ప్రారంభం చేశారు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రేషన్ షాపులో సన్నబియ్యం ఇస్తామన్న హామీని నెరవేర్చిందని.. సన్న చిన్న కారు నిరుపేదలు ప్రతి ఒక్కరూ ఈరోజు నుంచి సన్న బియ్యం తింటారని రేషన్ షాప్ లో సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి ధనసరి సీతక్క కి రెండు మండలాల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు….

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతారు తెరుచుకొని డీలర్ షాపులు

గంగారం మండలంలోని మర్రిగూడ గ్రామ పంచాయతీలోని రేషన్ డీలర్ షాపు మంగళవారం రోజు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపు సన్న బియ్యం ఏప్రిల్ ఒకటవ తారీకున ఇవ్వాలని స్పష్టమైన హామీలు ఉన్నప్పటికీ మండలంలో అన్ని గ్రామాలు రేషన్ షాపులో సన్న బియ్యం వచ్చినప్పటికీ.. మర్రిగూడెం అంధువుల గూడెం మరికొన్ని గ్రామాల్లో రేషన్ షాపులు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించలేదు దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు నిరుత్సాహపడ్డారు…

టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ.

టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలో శాసనసభనియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల టౌన్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా సందర్శించి,తనిఖీ చేశారు.

SI Kashinath Yadav

ఈకార్యక్రమంలో డిఎస్పీ రాంమోహన్ రెడ్డి, పట్టణ సీఐ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్ యాదవ్ ఎస్పీ పరితోష్ పంకజ్ కు రికార్డులను వివరించారు.ఒకే రోజు మూడు పోలీసు స్టేషన్ లను సందర్శించి ఎస్పీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జహిరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని జహిరాబాద్ టౌన్, జహిరాబాద్ రూరల్,కోహీర్ పోలీస్ స్టేషన్ లను సూడిగాలి పర్యాటనతో సందర్శించి, రికార్డు లనుతనిఖీ చేశారు.

సన్నబియ్యం పేదప్రజలకు ఒకవరం.

సన్నబియ్యం పేదప్రజలకు ఒకవరం

జిల్లా కాంగ్రెస్ నాయకుడు సాయిలి ప్రభాకర్

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

 

 

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషమైనదని ఇది పేద ప్రజలకు పెద్దవరం అని జిల్లా కాంగ్రెస్ నాయకుడు సాయిలి ప్రభాకర్ తెలిపారు. దొడ్డుబియ్యం తినలేని ఆబియ్యాన్ని ఎనిమిది రూపాయల కిలో చొప్పున పక్కదారి పడుతున్నాయని గమనించిన ప్రజా ప్రభుత్వం రైతుల వద్ద నుండి సన్న ధాన్యాన్ని కొని క్వింటాకు 500 రూపాయల చొప్పున రైతులకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటూ రాష్ట్ర ప్రజానీకానికి సన్న బియ్యం ఇవ్వడం దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వాలను గుర్తించాలని ఈ సందర్భంగా ప్రభాకర్ ప్రజలను కోరారు.

రూ.54 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత.

రూ.54 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

నర్సంపేట,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలంలోని రేకంపెల్లి బాధిత కుటుంబానికి రూ.54 వేల 500 విలువగల ముఖ్యమంత్రి సహాయ నిది పథకం చెక్కును అందజేసినట్లు కాంగ్రెస్ పార్టీ దుగ్గొండి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలతో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు,దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రల బాబు సారధ్యంలో దుగ్గొండి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు ఆధ్వర్యంలో రేకంపల్లి గ్రామానికి చెందిన మంద పాల్సన్ రూ.54500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ మాదారపు కన్నయ్య, పొన్నం జనార్దన్, ప్రతాప్, రవి, కోటి, ప్రశాంత్, చిరంజీవి, మలాల్ రావు,సుమంత్, రవి, రాజేందర్, బిక్షపతి, కిట్టి రవి, కుమారస్వామి, భగవాన్, రమల్లయ్య,రజినీకాంత్, విజయ్, సునీల్,బిక్షపతి,ప్రవీణ్, రగు అనిల్,మాహబ్, చిన్న జనార్ధన్, రాజేష్,కుమారస్వామి, పవన్, సాంబయ్య, రాజిరెడ్డి,అశోక్, నాగులు, రాజకుమార్,చంటి, భాస్కర్, కోర్నెల్, విజయ్,శరత్ తదితరులు పాల్గొన్నారు.

అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

బి.ఎస్.పి జిల్లా అధ్యక్షులు పొన్నం భిక్షపతి గౌడ్ డిమాండ్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు బొమ్మ సురేందర్ గౌడ్ అధ్యక్షత వహించగా సమావేశానికి విశిష్ట అతిథులుగా జిల్లా ఇన్చార్జ్ వేల్పుగొండ మహేందర్ రాష్ట్ర ఈసీ మెంబర్ సంగీ రవి హాజరవడం జరిగింది
బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో ముదిరాజు కులానికి చెందిన యువతి పైన ఏడుగురు యువకులు అత్యాచారం చేయడం జరిగింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాట్లాడారు ఇందులో భాగంగా మొన్నటికి మొన్న జరిగినటువంటి క్రిస్టియన్ పాస్టర్ పగడాల ప్రవీణ్ ది హత్యగా మేము అనుమానిస్తున్నా ము వెంటనే ఆయన యొక్క పోస్టుమార్టం రిపోర్టును బహిర్గతంగా ప్రజల ముందు పెట్టాలి లేదంటే స్త్రీల పైన జరిగే మానభంగాలు రాష్ట్రంలో జరిగే అటువంటి హత్యలు కు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించవలసిందిగా కోరుచున్నాము రాబోవు రోజులలో మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పొన్నం బిక్షపతి గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకారం తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుని పరామర్శించిన MLA వివేక్.

మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుని పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్

జైపూర్,నేటి ధాత్రి:

 

చెన్నూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనారోగ్యంతో హైదరాబాదులోని బ్రీనోవా ట్రాన్స్లేషన్ కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాస్పటల్ వెళ్లి నల్లాల ఓదెలు నీ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మనోధైర్యాన్ని చేకూర్చారు.

సన్నబియ్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్.

సన్నబియ్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం

పీసీసీ సభ్యులు పెండెం రామానంద్
23వ వార్డులో సన్నబియ్యం పంపిణీ మొదలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నదని
టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ తెలిపారు.రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణి కార్యక్రమాన్ని నర్సంపేట పట్టణంలోని 23 వ వార్డులో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వార్డు ఇంచార్జ్ మాదాసి రవి కుమార్, వార్డు అధ్యక్షులు పెద్దపెల్లి శ్రీనివాస్, 16వ వార్డ్ ఇంచార్జ్ భాణాల శ్రీనివాస్ బైరగొని రవి, మాజీ వార్డు సభ్యులు గండి గిరి, కోమటి సరోజన, సంగెపు తేజ, పెద్దపెల్లి కేదారి, వేముల జంపయ్య, సృజన, ప్రభుదాస్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

21,22 వ వార్డులలో సన్నబియ్యం పంపిణీ..

Congress

 

ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్

నర్సంపేట పట్టణంలోని 21, 22,వ డివిజన్లో 8 నెంబర్ రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నర్సంపేట మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల్లో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నదని పేర్కొన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గతంలో 500 కే గ్యాస్, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు నేడు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలను కూడా విజయవంతంగా అమలు చేస్తుందని చెప్పారు.నర్సంపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం కాకుండా భాగస్వాములై చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు వేముల సారంగం గౌడ్, బాణాల శ్రీనివాసు, దండెం రతన్ కుమార్, ఎన్ ఎస్ యు ఐ పట్టణ అధ్యక్షులు కటారి ఉత్తమ్ కుమార్, పట్టా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సాయి పటేల్, 22వ డివిజన్ మైనార్టీ నాయకులు ఎండి వాజిద్, స్వచ్ఛంద సంస్థల నాయకులు బెజ్జంకి ప్రభాకర్, డీలర్ శశిరేఖ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్..

ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్

@. నాడు ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం

@ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమని పలు గ్రామాలలో ని రేషన్ షాప్ ల వద్ద రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సంపేట టి పి సి సి సభ్యుడు రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఈరోజు నెక్కొండలో మండల వ్యాప్తంగా నెక్కొండ, దిక్షకుంట, చంద్రుగొండ, అలంకానిపేట, అప్పలరావుపేట, గ్రామాలతో పాటు పలు గ్రామాలలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలతో ఉచితంగా పంపిణీ చేసే సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని నాడు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఈ కార్యక్రమంలో నెక్కొండ తాసిల్దార్ రాజకుమార్, డిప్యూటీ తాసిల్దార్ పల్ల కొండ రవి కుమార్, నెక్కొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ హంస నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజీపీ అడ్వకేట్ బండి శివకుమార్, ఈదునూరి సాయి కృష్ణ, మార్కెట్ డైరెక్టర్లు రావుల మైపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగర్ ప్రశాంత్, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పోలిశెట్టి భాను, పలు గ్రామాలకు చెందిన రేషన్ డీలర్లు, రేషన్ వినియోగదారులు, ఆయా గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

MPDOకార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్.

ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించడం జరిగినది.ఈ సందర్శనలో భాగంగా రాజీవ్ యువ వికాసము పథకంలో ఆన్లైన్లో చేసిన దరఖాస్తులు పరిశీలించడం జరిగింది. అలాగే ఎవరైనా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించినచో వాటిని మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా పూర్తి చేసి ఆన్లైన్ చేయవలసినదిగా,ఇప్పటికే ఆన్లైన్ చేసినచో ఆ దరఖాస్తులు కార్యాలయంలో సమర్పించవలసిందిగా తెలియజేశారు.కార్యలయమునకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామాల వారీగా వేరు చేసి తదుపరి కార్యాచరణకు సిద్ధముగా ఉంచవలసినదిగా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంఈఓ శ్రీపతి బాబురావు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణ తో దళితుల ఐక్యత విచ్ఛిన్నం.

ఎస్సీ వర్గీకరణ తో దళితుల ఐక్యత విచ్ఛిన్నం

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. నర్సింగ్

శ్రీరాంపూర్,మంచిర్యాల నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని ఎయిమ్స్ స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం యూత్ విభాగం ముఖ్య నాయకుల సమావేశం బింగి సదానందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.నర్సింగ్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని మతోన్మాద బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారి ఎస్సీ వర్గీకరణ పేరుతో విభజించి పాలిస్తూ దళితుల ఐక్యతను దెబ్బతీస్తూ మనువాదాన్ని ముందుకు తీసుకెళ్తూ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న తరుణంలో ఆర్ఎస్ఎస్ బిజెపి నరేంద్ర మోడీ అడుగులకు, మడుగులకు ఎస్సీ వర్గీకరణ చేయాలని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగని వారి ప్రయోగశాలలో ఒక వస్తువుగా వాడుకుంటున్నారు.అనే నగ్న సత్యాన్ని తెలిసి కూడా వారి స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎస్సీ వర్గీకరణ కావాలని అసెంబ్లీలో బిల్లు పెట్టే విధంగా ఆ బిల్లును ఆమోదించేలా చేయడం దళితుల ఐక్యతను దెబ్బ తీయడమే అని అన్నారు. ముఖ్యంగా మాల ఉపకులాలకు అన్యాయం చేయడమేనని,ఈ రాష్ట్రంలో ఎస్సీ కులాల జనాభా లెక్కలు లేవని 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయడం బీజేపీ రాజకీయంగా కుట్ర చేసిందని రాజ్యాంగాన్ని మార్చి కుట్ర చేయడం లేదని మనువాదాన్ని ముందుకు తీసుకువెళ్లడం లేదని దళితుల ఐక్యతను ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే కుట్రలు చేయకపోతే బిజెపి పాలిత రాష్ట్రాలలో ముందుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం గా ప్రశ్నిస్తున్నాము.ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బిజెపికి మరియు మాదిగ సోదరులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా ఉందని ఇది కేవలం ఓట్ల రాజకీయ కోసం మాత్రమే ఇకనైనా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వర్గీకరణ ఆమోద బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన దాడి.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన దాడిని ఖండిస్తూ భూమి అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలి లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదు- తిరుపతి నాయక్

కరీంనగర్, నేటిధాత్రి:

లంబాడా జేఏసీ చైర్మన్ భూక్య తిరుపతి నాయక్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మీరు వేలం వేస్తున్నది హెచ్సియూ భూములను కాదు, హైదరాబాద్ ఊపిరితిత్తులను. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సియూకి 2300 ఎకరాల భూమిని ఇస్తే, నేడు అదే పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆభూములను అమ్మడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాలన చేతకాక, పన్నులు రాబట్టక, భూములను అమ్మి జీతాలు ఇవ్వాలని చూస్తున్న రేవంత్ రెడ్డి, ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి “ప్రభుత్వ భూమి ఒక గుంట కూడా అమ్మకుండా చూస్తాం” అని చెప్పి, నేడు యూనివర్సిటీ భూములు ఎలా అమ్ముతున్నాడు. ఉద్యోగాలు భర్తీ చేయడం, పథకాలు ప్రజలకు అందించడం చేతగాక, ఈరోజు భూములను కాపాడాలని నిరసన తెలియజేసిన విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి రాష్ట్రంలో ఒక నిర్బంధకాండ కొనసాగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. నాడు యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోతే రెండుసార్లు వచ్చిన రాహుల్ గాంధీ, ఈరోజు విద్యార్థులపై దాడి జరుగుతుంటే కనీసం స్పందించడం లేదేందుకో ప్రజాస్వామ్య వాదులారా, పర్యావరణ రక్షకులారా ఈరోజు యూనివర్సిటీ భూములను కాపాడడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భూముల వేలం ప్రక్రియను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, విద్యార్థుల మీద పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని బంజారా జేఏసీ చైర్మన్ భూక్యా తిరుపతి నాయక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.

సర్వమత సమానత్వం మన దేశం..

సర్వమత సమానత్వం మన దేశం

దళిత ముస్లిం ఇఫ్తార్ విందు

తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 01:

రంజాన్ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందు కు విచ్చేసిన డాక్టర్ వై .ప్రవీణ్ సర్వమత సమానమైన మన భారతదేశంలో 1949 నాటి నుంచే ఆనవాయితీగా దళిత ముస్లిం క్రైస్తవ లు కలిసి భోజనం చేయడం అన్నదికాలంగా జరుగుతుందని తెలిపారు.
ఆదివారం సాయంత్రం 6 గంటలకు తిజీవకోన మజీద్ ఏ మహమ్మదీయ లో దళిత ముస్లిం ఇఫ్తార్ విందు కు ముఖ్య అతిథులుగా పాల్గొన్న
ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ చైర్మన్
ఎలమంచిలి ప్రవీణ్,
భారతీయ దళిత సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు ధర శేఖర్, బీసీ కే పార్టీ జిల్లా అధ్యక్షులు బోకం రమేష్ ,ఏంజెఏసీ జాతీయ అధ్యక్షులు రఫీ హిందుస్తానీ ఈ మహమ్మద్ అలీ తిరుపతి ఈద్గా వైస్ చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హజ్రత్ మొహమ్మద్ మొహాని 1949లో మొట్టమొదట దళిత ముస్లిం ఇఫ్తార్ విందు ప్రారంభించారు ,వారినీ అనుసరిస్తూ తిరుపతిలోని జీవకోనలో మసీద్ ఏ మహమ్మదీయులో ప్రతి సంవత్సరం రంజాన్ చివరి వారంలో దళిత ముస్లింల ఇఫ్తార్ విందు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ,దీని ముఖ్య ఉద్దేశం కులం మతం జాతి వివక్ష లేకుండా మానవత్వంతో ప్రతి ఒక్కరు సోదర భావంతో సమానత్వంతో మెలగాలని కులాలు కూడు పెట్టవని మతాలు మానవత్వం చూపవని కులాన్ని మతాన్ని ఏ విధంగా అయితే మనం మందిరానికి మసీదుకు వెళ్లేటప్పుడు చెప్పులు బయట వదిలేస్తామో అదేవిధంగా కులాన్ని మతాన్ని మన ఇంటి వరకు వదిలేసి సమాజంలో మనమంతా మానవత్వంతో మెలగాలని తద్వారా మన దేశ ప్రగతిని ప్రపంచ దేశాలకు చాటాలని ప్రపంచ దేశాలు మన దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం సర్వమత సమానత్వమైన భారతదేశాన్ని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా మెలగాలని దీని ముఖ్య ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమంలో మసీద్ ఏ మహమ్మదీయ కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.అనంతరం తిరుపతి ముస్లిం ఈద్గా వైస్ చైర్మన్ గా ఎన్నికైన జీవకోనకు చెందిన
ఈ మహమ్మద్ అలీ ని
ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్
దళిత సాహిత్య అకాడమీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ధనశేఖర్
ఏ ఎం జేఏసీ జాతీయ అధ్యక్షులు రఫీ హిందుస్తానీ ముస్లిం సహోదరులు దుస్సాలవాతో సన్మానించడం జరిగిందని హిందుస్తానీ ఆల్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ
(ఏ,యం జే ఏసి)
జాతీయ అధ్యక్షులు రఫీ ఆ ప్రకటనలో తెలిపారు .

లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ.

లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ

జైపూర్,నేటి ధాత్రి:

 

చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఆదేశాల మేరకు మంగళవారం జైపూర్ మండలం మిట్టపెల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సన్నబియ్యం పంపిణీ రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.పేదల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పటికీ ప్రజలు ఎవరు తినలేని పరిస్థితి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజల సమస్య ను గుర్తించి నేడు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలుపరచడం జరిగిందని,అదేవిధంగా ప్రజలందరూ కూడా సన్నబియ్యం పంపిణీతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.అలాగే చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి కొరకు మిట్టపల్లి గ్రామంలో 35 లక్షల అంతర్గత సీసీ డ్రైనేజీలు,ఈజిఎస్ నిధుల నుండి 15 లక్షలు,రెండు కోట్ల రూపాయలతో నర్వ నుండి మిట్టపల్లి వరకు రోడ్డు నిర్మాణం,వ్యవసాయ రైతులకు ఇబ్బంది పడుతున్నారనీ 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు,ప్రజలు త్రాగునీరుకి ఇబ్బంది కలుగకూడదని ఐదు బోర్లుమంజూరు చేయడం జరిగిందనీ తెలిపారు.ప్రజల సమస్యలను క్షణక్షణం పరిశీలిస్తూ పేద నిరుపేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి ఏ కష్టం వచ్చినా సమస్యను తీర్చుకుంటూ వారికి అండదండ నిలుస్తున్న ఎమ్మెల్యే కి కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం లింగయ్య,కామెర మనోహర్,అల్లూరి స్వామి,జంబిడి కిష్టయ్య,దూట శీను, చంద్రయ్య,మల్లేష్,గోదారి తిరుపతి,భిమిని తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలందరికీ సన్నబియ్యం.

ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలందరికీ సన్నబియ్యం
… సన్న బియ్యం పథకం నిరుపేదలకు ఒక వరం*

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాసిల్దార్ సునీత డి ఎం ఎం ఓ డి సి ఎస్ ఓ తో కలిసి ప్రారంభించారు ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

MLA Gandra Satyanarayana Rao.

రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ను అందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంవత్సరంన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని ఎమ్మెల్యే అన్నారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీ మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు.అనంతరం మండలంలోని సిఎం రిలీఫ్ ఫండ్ 63 మంది లబ్దిదారులకు రూ.17,63,500/చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఆసుపత్రిలో వైద్యము చేయించుకొని డబ్బు లేక అవస్థలు పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి కాంగ్రెస ప్రభుత్వం సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తుందని ఎమ్మెల్యే గారు అన్నారు.ఈ కార్యక్రమములో సొసైటీ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ సీనియర్ నాయకులు మోటే ధర్మారావు తక్కలపల్లి రాజు క్యాథరాజు రమేష్ నీరటి మహేందర్ మండల కాంగ్రెస్ నేతలు, అధికారులు రేషన్ షాప్ డీలర్లు పాల్గొన్నారు

ఎమ్మెల్యే దొంతికి మంత్రిపదవి ఇవ్వాలి.

ఎమ్మెల్యే దొంతికి మంత్రిపదవి ఇవ్వాలి

ఎన్ఎస్ యుఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఎన్ఎస్ యుఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా చిలుపూరి భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నర్సంపేట నియోజకవర్గ పరిధిలో పార్టీని బలోపేతం చేసి మొదటి నుండి ఎన్ని అవకాశాలు వచ్చినా వదులుకొని కాంగ్రెస్ పార్టీ వీడకుండా ఉన్నారని చెప్పారు.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నర్సంపేటను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మాధవ రెడ్డికి క్యాబినెట్ లో మంత్రి స్థానం కల్పించాలని పార్టీ అధిష్టానన్నీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మేకల వీరన్న యాదవ్.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మేకల వీరన్న యాదవ్

రాష్ట్ర టి పి సి సి, ఓ బి సి వర్కింగ్ ప్రెసిడెంట్

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి దాత్రి

 

కేసముద్రం మున్సిపాలిటీ పరిధి కేసముద్రం విలేజిలో ఇటీవల అకాల మరణం చెందిన పశువుల పేద్దులు కుటుంబానికి రాష్ట్ర టిపిసిసి ఓబిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ 50 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసముద్రం గ్రామ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాసాడి శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్, మాజీ వార్డ్ మెంబర్ గుండు లక్ష్మీనారాయణ ,బోళ్ల కట్టయ్య ,బోళ్ల అశోక్, పెండ్యాల లక్ష్మణ్, ఉల్లి వెంకటేశ్వర్లు ,బొమ్మరబోయిన సతీష్, జీలకర్ర బాబు ,ఎస్కే యాకోబు, పశువుల సమ్మయ్య ,మరియు మృతుడి కూతుర్లు అల్లుళ్లు బోళ్ల ఉప్పలయ్య గుండు అశోక్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

అన్ని విధాలా గ్రామాల అభివృద్ధి.

అన్ని విధాలా గ్రామాల అభివృద్ధి

ఉపాధి హామీతో మెండైన అవకాశాలు

నియోజకవర్గంలో 63 లక్షలతో 187 పశువుల తొట్టెల నిర్మాణానికి భూమి పూజ చేపట్టిన ఎమ్మెల్యే అమర్

పలమనేరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 01:

 

గ్రామాల సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని కీలపల్లి పంచాయతీ జే.ఆర్. కొత్తపల్లిలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువులకు నీటి తొట్టెల నిర్మాణ భూమీ పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన పూజలు చేసి పనులను ప్రారంభించారు.అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గంలో 62 లక్షల రూపాయలతో 187 నీటి తొట్టెలను నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

MLA Amar

ఉపాధి హామీ పథకంలో రైతులకు ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసుకునేందుకు అవకాశం ఉందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని గ్రామాలలో రోడ్లు, మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డ్రామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ రవికుమార్, అసిస్టెంట్ పిడి ఎస్ రవికుమార్, ఎంపీడీవో సురేష్ కుమార్, తహసిల్దార్ మాధవరాజు, ఏపీవో శ్రీనివాసులు, ఏపీఎం హరినాథ్ లతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాపరెడ్డి,నాగరాజు రెడ్డి, ఆల్ కుప్పం రాజన్న, మునస్వామి రెడ్డి, గిరిధర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు..

సన్న బియ్యం కలను సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.

సన్న బియ్యం కలను సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ

ధనవంతులే కాదు… పేదలు సన్న బియ్యం తినాలి

ముదిగుంట గ్రామంలో సన్న బియ్యం పంపిణీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు

జైపూర్,నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో ఉగాది కానుకగా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దుగుట జ్యోతి మాట్లాడుతూ ఇప్పటివరకు ధనవంతులు తినే సన్నబియ్యం ఇకపై ప్రతి పేద కుటుంబానికి అందుబాటులోకి వస్తుంది.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని,పోషక విలువలతో కూడిన సన్న బియ్యం అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.అలాగే సన్న బియ్యం పథకం ప్రారంభించడం పేదలు అదృష్టంగా భావిస్తున్నారు.సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల రైతులకు కూడా మేలు జరుగుతుందని సరైన గిట్టుబాటు ధరలు కూడా వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దుగుట జ్యోతి పాండరి, మాజీ ఎంపీపీ గోదారి రమాదేవి లక్ష్మణ్ కాంగ్రెస్ నాయకులు చేలుకల పోశం,గుండా సురేష్ గౌడ్, కొట్టాల మల్లయ్య పోతుగంటి సుమన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

షీ టీం అవగాహన సదస్సు ఏర్పాటుచేసిన.!

సిరిసిల్ల జిల్లాలో షీ టీం అవగాహన సదస్సు ఏర్పాటుచేసిన జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే

మహిళలకు రక్షణగా షీ టీం

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల జిల్లాలో మహిళల, విద్యార్థుల రక్షణయే లక్ష్యంగా ఏర్పాటు చేసిన షీ టీం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహిళ చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పొక్సో, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, వేధింపులకు గురైతే ఎవరిని సంప్రదించాలి అనే మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తూ మహిళల,విద్యార్థినీల భద్రతకు భరోసా కల్పించడం జరుగుతుంది.గడిచిన నెల రోజుల వ్యవధిలో జిల్లాలో విద్యార్థినిలను, మహిళలను వేధిస్తున్న ఆకతాయిలపై 02 కేసులు, 07 పెట్టి కేసులు నమోదు చేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే మాట్లాడుతూ..విద్యార్థినులు,
మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని,ధైర్యంగా ముందుకు వచ్చి షీ.టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ తెలిపారు.

భక్తాంజనేయ స్వామి ఆలయకమిటీ చైర్మన్ గా.!

భక్తాంజనేయ స్వామి ఆలయకమిటీ చైర్మన్ గా అంబీరు మహేందర్ ప్రమాణ స్వీకారం

 

పరకాల నేటిధాత్రి

మండల పరిధిలోని మల్లక్కపేట గ్రామంలో బుధవారం రోజున ఉదయం 9:45 నిమిషాలకు శ్రీ భక్తాంజనేయ స్వామి పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మల్లక్కపేట గ్రామానికి చెందిన అంబీరు మహేందర్ ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పరకాల మండల మరియు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు,జడ్పిటిసిలు,ఎంపీపీలు,ఎంపీటీసీలు సర్పంచులు,వార్డ్ మెంబర్లు మరియు పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్,డైరెక్టర్స్, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్,కౌన్సిలర్స్ పరకాల మండల మరియు పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు,కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావలని అంబీరు మహేందర్ కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version