టీ.ఎస్.జె.యు జిల్లా జర్నలిస్ట్ నాయకులను ఘనంగా సన్మానించిన సేవాలాల్ సేన జిల్లా కమిటీ
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:కేంద్రం లోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నూతన జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ లు ఇటీవల ఎన్నిక కావడం జరిగింది ఈ సందర్భంగా బంజారా సేవాలాల్ సేన జిల్లా కమిటీ నాయకులు కాకతీయ ప్రెస్ క్లబ్ లో టీ.ఎస్.జె.యు జిల్లా కమిటీ నాయకులను శాలువాతో ఘనంగా సన్మానించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన టీ.ఎస్.జె.యు జిల్లా కమిటీ ఎన్నిక కావడం వారిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది మరెన్నో ఉన్నంతమైన పదవులు చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అన్నారు బంజారా సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు నాయక్ ముఖ్య రూప్ సింగ్ సేవాలాల్ సేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ రాజు నాయక్ సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షులు నగవత్ రాజేందర్ నాయక్ సేవాలాల్ సేన జిల్లా నాయకులు, ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు బండారి రాజు,సంయుక్త కార్యదర్శి కడపక రవి,ఆర్గనైజ్ సెక్రెటరీ చంద్రమౌళి,జిల్లా నాయకులు బొల్లేపల్లి జగన్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయ పాఠశాల(కేవీ స్కూల్)ని తంగళ్లపల్లి మండలం లోని పద్మనగర్ లో గల సొంత భవనంలోకి మార్చాగ విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు మంగళవారం రోజున సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుండి బస్ ని సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు కొబ్బరికాయ కొట్టి బస్ ని ప్రారంబించారు..సుమారు 180 మంది విద్యార్థులు సిరిసిల్ల పట్టణం నుండి విద్యాభ్యాసం కోసం కేవీ స్కూల్ కి వెళ్లనున్నారు.. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్.టి.సి ని లాభాల్లోకి తీసుకురావాలని కోరారు..విద్యార్థుల కోసం మరో బస్ ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రోజు ఈ బస్ ఉదయం 7:30 నిమిషాలకి కొత్త బస్ స్టాండ్ నుండి ప్రారంభం అయ్యి పాత బస్టాండ్,గాంధీ చౌక్,పోలీస్ స్టేషన్ వద్ద విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుందని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు డిపో మేనేజర్ ని శాలువాతో సత్కరించారు.. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్ వైజర్ వర్జిలాల్, కంట్రోలర్ రామ్ రెడ్డి, కార్గో డి.ఎం. ఈ శేఖర్ రావు, ఆర్. టి. సి సిబ్బంది మరియు విద్యార్థుల తల్లి దండ్రులు పెద్ది నవీన్ కుమార్,బండరాజు, కొండికొప్పుల రవి , తడుకల సురేష్,శ్రీనివాస్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
చిట్యాల మండలం నైన్ పాక గ్రామంలోని రేషన్ షాప్ నెంబర్ : 1 మరియు రేషన్ షాప్ నెంబర్ 2 లో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు ఉచిత సన్న రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి అనంతరం గ్రామ ప్రజలతో కలిసి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి* చిత్రపటానికి మరియు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు* చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు తొట్ల రాజయ్య , కుమ్మరి పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు తానేష్ , కనకనాల శంకర్ , కంచర్ల రాములు , పాలడుగుల రఘుపతి , ఎలావెణ శివకుమార్ , కట్టెకొల్ల మల్లేష్ , చెలుపురి రాజయ్య , జంగ మల్లేష్ , నగునూరి వెంకటేష్ , జంబుల నరసయ్య , రాయరాకుల రమేష్ అందుగుల రాజు , జంగా కుమార్ , కంచర్ల ప్రభాకర్ , మొగిలి , గడ్డి రాములు , శ్యామల శ్రీనివాస్ , రాజు , కుమార్ తదితరులు పాల్గొన్నారు..
రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమం
– అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా పథకాల అమలు
– మంత్రి పొన్నం ప్రభాకర్
– సిరిసిల్లలో సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రారంభించిన మంత్రి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద ఉన్న రేషన్ దుకాణంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని మంత్రి, విప్, కలెక్టర్, ఎస్పీ తదితరులతో కలిసి పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలోని 17,263 రేషన్ దుకాణాల్లో రెండు లక్షల 91 కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. దాదాపు 60 వేల ఉద్యోగాలను తమ ప్రభుత్వం భర్తీ చేసిందని గుర్తు చేశారు. మహిళల అందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు,రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. మహిళా మణులను కోటీశ్వరులుగా చేయాలని సదుద్దేశంతో ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి కింద వివిధ యూనిట్లు ప్రారంభించామని తెలిపారు. అలాగే సోలార్ యూనిట్లు మహిళా సంఘాలకు బస్సులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. సన్న సన్న ధాన్యం పండించే రైతులకు క్వింటాల్కు అదనంగా 500 అందజేస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీకి నూతన బస్సులు అందజేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందజేస్తున్నామని వివరించారు.
జిల్లాలోని 345 రేషన్ దుకాణాలు ద్వారా..
రాష్ట్ర ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వే ను ఇటీవల నిర్వహించిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని నేత కార్మికులకు భరోసా కల్పిస్తూ గత బకాయిలను విడుదల చేసిందని, అలాగే యార్న్ బ్యాంకును ప్రారంభించిందని వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దాదాపు 20వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని వెల్లడించారు. త్వరలో పెన్షన్ పంపిణీ ఇతర కార్యక్రమాలను ప్రారంభించనున్నామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రకటించారు. జిల్లాలోని 345 రేషన్ దుకాణాలు ద్వారా లక్ష 70 వేల రేషన్ కార్డుల లబ్ధిదారులకు 3275 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా లబ్ధిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, పౌర సరఫరాల మేనేజర్ రజిత తదితరులు పాల్గొన్నారు.
మహిళలను దుర్భాషలాడిన విలేఖరి పై చర్య తీసుకోవాలని ధర్నా రాస్తారోకో.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించిన విషయం తెలిసిందే, ఈ ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యేకి మహిళల యొక్క సమస్యలు పరిష్కరించాలని పబ్లిక్ టాయిలెట్స్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉంది ఆ కొరతను తీర్చాలని స్థానిక మహిళలైనా చిదిరాల సరోజన, మైదం కర్ణ, ఇతర మహిళలు ఎమ్మెల్యే ని కోరగా సానుకూలంగా స్పందించి ,మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు, ఎమ్మెల్యే , ప్రోగ్రాం అయి పోయిన తర్వాత వార్త రిపోర్టర్ కటుకూరు మొగిలి తాగిన మైకంలో వచ్చి మహిళలను చూడకుండా నానా బూతులు తిడుతూ దుర్భాషలతో మాట్లాడనారు, ఇట్టి విషయంపై దుర్భాషలాడిన విలేఖరి పై స్థానిక పోలీస్ స్టేషన్లో మూడు రోజుల క్రితం పిటిషన్ ఇవ్వడం జరిగిందని ఇప్పటివరకు పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం నాడు చిధిరాల సరోజన మై దం కరుణ మరికొందరు మహిళతో కలిసి విలేకరిపై చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని చిట్యాల చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేశారు, అనంతరం సరోజన మాట్లాడుతూ మహిళలను దుర్భాషలాడిన వార్త విలేకరిని తొలగించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు . లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మహిళలు రాయమల్లమ్మ శారద కరుణ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలి
నిజాంపేట్, నేటి ధాత్రి
నిజాంపేట మండల కేంద్రంగా మంగళవారం రోజున దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన జరిగిన దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం, తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లాలోని కేటి దొడ్డి మండలం ఇర్కుచెడు గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు దళితులు బహుజనులు కలసి స్టాండ్ నిర్మాణం చేసి విగ్రహం ఏర్పాటు ప్రయత్నంలో అదే గ్రామానికి చెందిన మరో వర్గం వారు అంబేద్కర్ విగ్రహం పెట్టొదని దాని వల్ల మాకు ఇబ్బంది అవుతుందని ఘర్షణకు దిగారు.
ఘర్షణలో భాగంగా కొంతమంది దుండగులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పై పెట్రోల్ పోసి నిప్పంటించారు, అట్టి మంటలు ఆర్పే క్రమంలో విగ్రహంతో పాటు ఎస్ఐకి కూడా నిప్పు అంటుకుంది.
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్న భారత రాజ్యాంగాన్ని రాసి భారతదేశానికి దిక్సూచిగా నిలిచిన రాజ్యాంగ నిర్మాత మహనీయుడు అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం దురదృష్టకరమని దళిత ప్రజా సంఘాలు మండిపడ్డాయి ఇలాంటి సంఘటనలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఏప్రిల్ మాసం మొత్తం మహనీయుల మాసంగా దేశం రాష్ట్రం మహనీయుల జయంతులు చేస్తున్న క్రమంలో ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమని ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన జీవోలు తెచ్చి రక్షణ కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిపిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాసి సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ కొమ్మట బాబు, మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు బండారి ఎల్లం, ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షులు జనగామ స్వామి, డొక్కా రామస్వామి, కాకి బాలరాజ్, బ్యాగరి రాజు, గుడ్ల బాబు, కొమ్మాట ఎల్లం, తదితరులు పాల్గొన్నారు.
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి సి గ్రామంలో ఏర్పాటుచేసిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంగళవారం రోజున భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొ హాజరై, ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ను అందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంవత్సరంన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని. గతంలో రేషన్ బియ్యం పంపిణీ మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగ నిర్మూలించామని అన్నారు, ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హేమ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ, చిలుకల రాయకుమురు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు దబ్బట అనిల్ బుర్ర శ్రీనివాసు, చిలుముల రాజమౌళి ,అల్ల కొండ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలు దితరులు పాల్గొన్నారు.
మండలం లోని రాంపూర్ గ్రామానికి చెందిన అతిగం స్వామి గౌడ్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠ తిరుపతి రెడ్డి బాధిత కుటుంబ నీకి 5,000 వేల రూపాయలు తన అనుచరులతో అందజేశారు. ఈ కార్యక్రమం లో మండల మాజీ కో అప్షన్ మెంబర్ మహమ్మద్ గౌస్, సీనియర్ నాయకులు దుబ్బరాజా గౌడ్, గ్రామ నాయకులు అంజా గౌడ్, రాజు, పర్శ గౌడ్, ఫిరోజ్ లు ఉన్నారు.
డి.ఓ వెంకటయ్య టీమ్ ఆధ్వర్యంలో గజమాలతో ఘన సన్మానం..
నర్సంపేట,నేటిధాత్రి:
విధి నిర్వహణలో ప్రతీ ఉద్యోగికి పదవీవిరమణ తప్పనిసరి అని నర్సంపేట బ్రాంచ్ సీనియర్ మేనేజర్ వెంకట్ రెడ్డి అన్నారు.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నర్సంపేట బ్రాంచ్ లో బానోతు శాంత వెంకటయ్య డెవలప్ మెంట్ ఆఫీసర్ గత 34 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం డి.ఓ వెంకటయ్య పదవీవిరమణ పొందారు.ఈ సందర్భంగా నర్సంపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో పదవీవిరమణ కార్యక్రమాన్ని చేపట్టారు.నర్సంపేట బ్రాంచ్ తో వరంగల్ డివిజన్ పరిధిలోని పలువురు అధికారులు, డి.ఓలు హాజరయ్యారు.బ్రాంచ్ సీనియర్ మేనేజర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఐసి వికాస అధికారి నిరంతరం పనిచేసే వ్యక్తి అని పేర్కొన్నారు.గత 34 సంవత్సరాలుగా నర్సంపేట బ్రాంచ్ కు ఒక ఫిల్లర్ గా సేవలు అందించారని వెంకటయ్య పట్ల కొనియాడారు.అనంతరం శాలువాలతో సన్మానం చేసి జ్ఞాపికలు అందజేశారు.అలాగే వరంగల్ జిల్లా ఎల్ఐసి ఉద్యోగుల ఎస్సి ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.
DO Venkataiah’s
డి.ఓ వెంకటయ్య టీమ్ ఆధ్వర్యంలో గజమాలతో ఘన సన్మానం..
DO Venkataiah’s
ఎల్ఐసి నర్సంపేట బ్రాంచ్ లో గత 34 సంవత్సరాలుగా వికాస అధికారిగా విధులు నిర్వర్తించిన బానోతు శాంతవెంకటయ్య సోమవారం పదవీవిరమణ నేపథ్యంలో బ్రాంచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకటయ్య టీమ్ ఏజెంట్లు గజమాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు,బహుమతులు అందజేశారు.ఏజెంట్లు పడిదం కట్టస్వామి,రాక రాజలింగంలు మాట్లాడుతూ జీవితభీమా పాలసీల అమ్మకంలో ఏజెంట్లకు వెంకటయ్య ఇచ్చే ప్లానింగ్స్ పట్ల కొనియాడారు.ఈ కార్యక్రమంలో పెండ్లి రవి,శంకరయ్య,మర్థ గణేష్ గౌడ్,కందుల శ్రీనివాస్ గౌడ్,రఘుపతి,అనంతగిరి స్వామి,దాసరి కుమారస్వామి,రాజేందర్, పోశాల శ్రీనివాస్,చందు తదితరులు పాల్గొన్నారు.
ఎల్ఐసి యూనియన్స్ ఆధ్వర్యంలో…
DO Venkataiah’s
ఎల్ఐసి ఏ.ఓ.ఐ రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య,వరంగల్ డివిజన్ కోశాధికారి మొద్దు రమేష్,నర్సంపేట బ్రాంచ్ గౌరవ అధ్యక్షులు ఆర్.చంద్రమౌళి,బ్రాంచ్ అధ్యక్షుడు పెండ్లి రవి,ప్రధాన కార్యదర్శి పడిదం కట్టస్వామి అలాగే ఎల్ఐసి ఎల్.ఐ.ఏ.ఎఫ్.ఐ డివిజన్ అధ్యక్షుడు పులి సుధాకర్, బ్రాంచ్ అధ్యక్షుడు వల్లాల శ్రీహరి,వైస్ ప్రెసిడెంట్ రాక రాజలింగం ఆధ్వర్యంలో పదవీవిరమణ పొందిన వికాస అధికారి బానోతు వెంకటయ్యకు శాలువాలతో ఘనంగా సన్మనించారు.ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ యూనియన్ వరంగల్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ ,బ్రాంచ్ ఏఓ లచ్మ,ఏ.ఏ.ఓ శ్యాంసింగ్,హెచ్ జి.ఏ నిఖిల్,సుబ్బారావు,వికాస అధికారులు సురేందర్ రావు,శ్రీనివాస్,రాజు,ఐశ్వర్య,వినయ్ కుమార్,వినోద్ కుమార్,రమేష్,పలువురు అధికారులు,కార్యాలయ సిబ్బంది యునియన్ నాయకులు,ఏజెంట్లు పాల్గొన్నారు.
భారతదేశపు తొలి మహిళా లోకసభ స్పీకర్ మీరాకుమార్ ని ఢిల్లీలోని ఆమె నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అబ్రహం మాదిగ. భారతీయ సామాజిక దార్శనికుడు, సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు డా. బాబూ జగ్జీవన్ రామ్ కూతురుగా ఆయన రాజకీయ వారసురాలిగా ఎన్నో పదవులను అధిరోహించారు. పలుమార్లు కేంద్ర మంత్రిగా, భారతదేశపు తొలి మహిళా లోకసభ స్పీకర్ గా భారతదేశానికి ఎనలేని సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ఆమోదం తెలిపిన ధీరవనితగా అభివర్ణించారు. రావి ఆకుపై వేసిన మీరాకుమార్ చిత్రాన్ని ఆమెకు బహుకరించారు. ప్రముఖ కవి రచయిత డప్పోల్ల రమేష్ రచించిన డా. బాబూ జగ్జీవన్ రామ్ సంక్షిప్త జీవిత చరిత్ర ఆంగ్లానువాదం డాక్టర్. బాబు జగ్జీవన్ రామ్, విషనరీ ఆఫ్ ఇండియా సొసైటీ “ పుస్తకాన్ని అందజేసి ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. మీరాకుమార్ ను కలిసిన వారిలో ఆయనతో పాటు ఉల్లాస్ మాదిగ ఉన్నారు.
న్యాల్కల్ మండలం రేజింతల్ లోని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామికి మంగళవారం ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో స్వామి వారికి పూజా కార్యక్రమాలను జరిపించారు. అనంతరం వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు సంగారెడ్డి తో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట 2025-2026 సంవత్సరానికి గాను అధ్యక్షుడిగా మూడవసారి దేమే యాదగిరి, సెక్రటరీగా తిరుపతి, ట్రెజరర్ గా జిపి స్వామి లను పివిపి చారి మాజీ గవర్నర్ సమక్షంలో స్థానిక మెహర్ సాయి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
Ramayampet
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ సేవలను విస్తృత పరిచి గ్రామాలలో చక్కటి కార్యక్రమాలు చేపడతామని మొక్కల పంపకం,నీటి సంరక్షణ, అవయవదానం,ఉచిత కంటి మరియు దంత వైద్య ఆరోగ్య శిబిరాలు విరివిగా నిర్వహిస్తామని స్కూల్ లలో విద్యార్థులకు వ్యాస రచన,కెపాసిటీ బిల్డింగ్ గురించి సమావేశాలు ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. తమను ఎన్నుకున్నందుకు రీజియనల్ చైర్మన సంజయ్ గుప్తా, జోన్ చైర్ పర్సన్ సుఖేందర్, ఏరియా కోఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి,డిసీలు లక్ష్మణ్ యాదవ్, కైలాసం, దారం రమేష్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రమైన తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన రాయికోడ్ గ్రామంలో ప్రసిద్ది చెందిన భద్రకాళి సమేత వీరభద్రేశ్వర జాతర. మహోత్సవం ఏప్రిల్ 17వ తేదీ గురువారం నుండి 22వ తేదీ మంగళవారం వరకు నిర్వహించునున్న శుభ సందర్భంగా సోమవారం నాడు ఏర్పాటుచేసిన అనే చైర్మన్ కులకర్ణి ప్రభాకర్ రావు (సతీష్) ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప. అధ్యక్షతన ధర్మకర్త మండలి సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ కార్య నిర్వాణ అధికారి వారు మాట్లాడుతూ ఆలయంలో చలువ పందిళువిద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని భోజనాలు ఏర్పాటుకై జాతర మహోత్సవం గురించి గ్రామ గ్రామాన తెలియపరచాలని జాతరకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తదితర అంశాలపై వాటి నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం ఆలయ చైర్మన్ కార్యనిర్మాణ అధికారి శివ రుద్రప్ప ఆధ్వర్యంలో ఆదివారం జాతర మహోత్సవ కార్యక్రమం వివరాల ఆహ్వాన పత్రిక గోడ పత్రికను ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో. ఆలయ చైర్మన్ కులకర్ణి ప్రభాకర్ రావు (సతీష్) కార్యనిర్వాన అధికారి శివ రుద్రప్ప. మాజీ చైర్మన్ నట్కరి మావయ్య. గ్రామ పెద్దలు యువకులు ఆలయ సిబ్బందులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలు నర్సంపేట డివిజన్ పరిధిలోని సోమవారం ఘనంగా నిర్వహించారు. నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు ఈద్గా స్థలంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రత్యేక నమాజ్ ముస్లిం ప్రజలు జరుపుకున్నారు.మత పెద్ద జామీ మజీద్ ఇమామ్ మహబూబ్ నమాజ్ ను చదివారు. అనంతరం రంజాన్ పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ మాట్లాడుతూ భారత దేశ ముస్లింలు రంజాన్ మాసంలో లోనే పవిత్ర గ్రంథం ఖురాన్ ఆర్బించడం జరిగిందన్నారు. 30 రోజులు కఠోర ఉపవాస దీక్షలు పాటించి ప్రతిరోజు ప్రత్యేక తరాబి నమాజు పటించి అనంతరం జకాత్ ఫిత్రాలు మరియు హదీయాలు డబ్బు రూపాన పేదలకు అనాధలకు వితంతువులకు దానం చేస్తారన్నారు. ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగ ప్రత్యేక నమాజుకై ఈద్గాకు మండల స్థాయి ముస్లిం చదువుతారని పేర్కొన్నారు. అనంతరం ఒకరికి ఒకరు అలింగనం చేసుకొని కులమతాల అతీతంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ముస్లిం ఖబురస్థాన్లోకు వెళ్లి చనిపోయిన బంధువుల సమాధులపై పూలతో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రముఖ నాయకులు జామి మసీద్ అధ్యక్షులు మహమ్మద్ నబీ, మహమ్మద్ హబీబ్, మహమ్మద్ అయుబ్, మీర్జా మసూద్, అలీబేగ్, మహమ్మద్ రబ్బాని, మహమ్మద్ ఆఫీస్,ఇర్ఫాన్ మహమ్మద్, అన్వర్ సయ్యద్ జావేద్ ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు.
పత్తి పువ్వమ్మ పాట ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
చిట్యాల, నేటిధాత్రి :
ఉగాది పండుగ పర్వదినాన పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా జరిగిన శ్రీ వివేకానంద సేవా సమితి ఫౌండర్ కే సంజీవరావు అధ్యక్షతన పుష్ప గ్రాండ్ పంక్షన్ హాల్ లో అవార్డ్ కవుల, కళాకారులుకు అవార్డు ప్రదానోత్సవం జరిగినది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధి గా భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొని పత్తి పువ్వు పాట ఆవిష్కరణ చేయడం జరిగింది సమాజంలో మేలుకొలిపే పాటలు రాయాలని పేర్కొన్నారు పాట రచయిత దాసారపు నరేష్ బాగా రాసారని అభినందించారు ఈ కార్యక్రమంలో సినీ నటులు ఆర్ఎస్ నంద గాయకులు మధు రోజా సంధ్య మ్యూజిక్ డైరెక్టర్ కిట్టు ఎన్ఎస్ఆర్ ఫౌండర్ సంపత్ రావు , కవులు గాయకులు పాల్గొన్నారు.
ముస్లింల పవిత్ర పండుగ అయినా రంజాన్ పండుగను పురస్కరించుకొని చిట్యాల మండల కేంద్రంలోని కౌసర్ మజీద్ ఆవరణలోని ఈద్గాలో మండలంలోని ముస్లిం సోదరులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో నమాజ్ చేసుకుని ఒకరికొకరు అలై బాలాఈ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ సమావేశంలో మండల కో ఆప్షన్ మాజీ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్ నెల ఈ నెలలో ప్రతి ఒక్క ముస్లిం 30 రోజులు కఠోర ఉపవాస దీక్ష లో ఉండి సోమవారం.రోజున ఉపవాస దీక్షను విరమించి రంజాన్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అలాగే సమాజంలో గంగ జమున తహసీబ్ కే జైస హిందూ ముస్లింలు అనే భేదం లేకుండా అందరు కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఈ సమావేశంలో మసీదు కమిటీ అధ్యక్షలు అజ్మత్ మియా కార్యదర్శిహైదర్ పాషా వైస్ ప్రెసిడెంట్ షఫీ జాయింట్ సెక్రెటరీ అక్బర్ ట్రెజరర్ షేక్ హుస్సేన్ వివిధ గ్రామాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
నిజాంపేట మండల కేంద్రంలో కమ్మరి నరసింహ చారి (20) మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మెదక్ బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంట తిరుపతిరెడ్డి అంత్య క్రియల నిమిత్తం 5000 రూపాయలు తన అనుచరులతో అందించారు ఇందులో నర్సింలు, మావురం రాజు, తాడం మల్లేశం, నాయిని లక్ష్మణ్, తిరుమల గౌడ్ తదితరులు ఉన్నారు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో పట్టణానికి చెందిన మారం రాకేష్ కంప్యూటర్,ఆయిల్ షాపులు కరెంటు షాక్ తో దగ్ధమయ్యాయి.
Electric shock
ఈ ప్రమాదంలోభారీగా ఆస్తి నష్టం జరిగింది. సుమారుగా రూ.50 లక్షల అస్థి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాలిపోయిన షాపుని పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఎమ్మెల్యేను కోరాడు. ఈ విషయం తెలుసుకున్న కల్వకుర్తి వర్తక, వ్యాపారస్తులు పలువురు ఆర్థిక సహాయాన్ని అందించారు.
మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోన ముస్లిం ప్రార్థన మందిరంలో రంజాన్ వేడుకలు
*పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన గొప్ప మాసంలో కఠోర ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని ముస్లిం పెద్దలు అన్నారు *
Ramadan
*ఈద్-ఉల్-ఫీతర్ (పవిత్ర రంజాన్) పర్వదినం పురస్కరించుకొని ఈరోజు జెడ్పీఎస్ఎస్ పాఠశాల నందు మైదానంలో ముస్లిం సోదర అందరూ ప్రార్థనలు చేశారు ముస్లిం ప్రార్థన గురువు మసీద్ సదర్ ఎండి యూసుఫ్ పాషా ముఖ్య అతిథులుగా చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ *వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద గొప్ప పండుగలో ఒకటి రంజాన్ అని కొనియాడుతూ చెడు భావాలని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ పండుగని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ, సౌబ్రతృత్వ గుణాలు పంచుతుందని పేర్కొన్నారు. మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ముస్లింలకు పెద్దపేట వేస్తుందని అన్నారు. అల్లా దయతో ఈ పండుగ మానవాళికిచ్చే గొప్ప సందేశమని అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరానని వెల్లడించారు. ఊర్కొండలోని ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో ఆరుగురు యువకులు ఒక వివాహిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తో ఫోన్లో మాట్లాడిన అనిరుద్ రెడ్డి పవిత్ర ప్రదేశంలో ఈ దురాగతానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. అత్యాచారానికి పాల్పడిన వారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారని తన దృష్టికి వచ్చిందని అయితే ఈ సంఘటనకు పాల్పడింది ఎవరైనాప్పటికీ తాను రాజకీయాలు చేయదలుచుకోలేదని బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. ఈ సంఘటనలో బాధిత యువతికి అండగా ఉంటానని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సంఘటన నేపథ్యంలోని ఊర్కొండ పోలీసులతో కూడా మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కల్పించాలని కోరారు. గ్రామంలోనీ యువతులు కూడా జరిగిన సంఘటన పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కూడా అనిరుధ్ రెడ్డి ఆదేశించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.