మద్యం కోసం తాకట్లు….

మద్యం కోసం తాకట్లు….

◆ రూపాయిలు. 200 రూపాయిలు . 2000 వసూలు!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వింత దోపిడీ జరుగుతోంది. మద్యం మత్తులో ఉన్న కొందరు తమ వద్ద డబ్బులు లేకపోతే వాచ్లు, చైన్లు, ఉంగరాలు, మొబైల్ ఫోన్లను తాకట్టుపెడుతున్నారు. అయితే, రెండు రోజుల్లో వాటిని విడిపిం చుకోకపోతే, రూ. 200 విలువైన మద్యం కోసం తాకట్టు పెట్టిన వస్తువుకు ఏకంగా రూ. 2000 డిమాండ్ చేస్తున్నారు. వైన్స్ షాపులకు అనుబంధంగా ఉన్న స్నాక్స్ షాపులు, ఇతర దుకాణాల్లో ఈ తరహా దోపిడీ ఎక్కువగా జరుగుతోందనే ఆరోప ణలు ఉన్నాయి. వైన్స్ పర్మిట్ రూముల్లో కూర్చుని మద్యం తాగిన తర్వాత, మరికొంత మద్యం తాగేందుకు డబ్బులు లేని వారు తమ వస్తువులను తాకట్టు పెడుతున్నారు. మరుసటి రోజు వాటిని విడిపించుకోవడానికి వెళ్లే వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వైన్స్ దుకాణదారుల కనుసన్నల్లోనే ఈ దోపిడీ జరుగుతోందని ప్రచారం సాగుతోంది.

అబ్కారీ సీఐ ఏమన్నారంటే..

CI Srinivas Reddy

 

 

వైన్స్ దుకాణాల్లో నగదు లేదా పేటీఎం ద్వారామాత్రమే మద్యం విక్రయించాలని జహీరాబాద్ అబ్కారీ సీఐ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వైన్లో గానీ, వాటికి అనుబంధంగా ఉన్న షాపుల్లో గానీ వస్తు వులు తాకట్టు పెట్టుకుని మద్యం ఇచ్చిన ట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటా మని ఆయన హెచ్చరించారు.

బక్రీద్ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో “పీస్ మీటింగ్”ఏర్పాటు

బక్రీద్ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో “పీస్ మీటింగ్”ఏర్పాటు

★ఎస్సై నరేష్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రం పోలీస్ స్టేషన్లో ఎస్సై నరేష్, ఆధ్వర్యంలో జరిగిన “పీస్ మీటింగ్”నకు ఝరాసంగం లోని హిందూ,ముస్లిం మతాలకు చెందిన మత పెద్దలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై నరేష్, మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని మతాల పెద్దలు పోలీసువారికి సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా, విషపూరిత పుకార్లను నమ్మవద్దని కోరారు. నిజ నిజాలు తెలియకుండా మీకు వచ్చిన అసత్యపు సోషల్ మీడియా సందేశాలను దాని గురించి నిజామా అబద్దమా అని ఆలోచించకుండా ఇతరులకు షేర్ చేయకుడదన్నారు.దాని వలన ఎలాంటి ప్రమాదమైన జరగవచ్చు కావున ప్రశాంత మైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు పోలీసులకి సహకరించాలని అన్నారు. ప్రజా భద్రత, లా & ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేలా చూడడం పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలు,ప్రజా శాంతి కి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఝరాసంగం ప్రజలు అన్నదమ్ముల వలే కలిసి ఉండి ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా అందరికి,అన్ని ప్రాంతాల వారికీ ఆదర్శంగా నిలివాలని కోరారు.

కులగణనతో ఓబీసీ పార్టీలకు ఇబ్బందులు తప్పవా?

ఆధిపత్య ధోరణి వీడకపోతే ఓబీసీ పార్టీల మనుగడ కష్టం
ఓబీసీల్లో ప్రయోజనం పొందుతున్నది కొన్ని కులాలే
అగ్రవర్ణాలకు మించిన స్థాయిలో కొనాగుతున్న ఆధిపత్యం
ఎదుగుదల లేని అణగారిన కులాలు
ఓబీసీ ఆధిపత్య కులాల మెడకు కులగణన
కులం పేరుతో రాజకీయాలు నడపడం కష్టం కావచ్చు
అల్పజనసంఖ్య కలిగిన కులాల మనుగడ కష్టం
సామాజిక సమతుల్యతను సమూలంగా మార్చేసే కులగణన
డెస్క్‌ ,నేటిధాత్రి: 
కాంగ్రెస్‌ సహా విపక్షాలు కులగణన చేపట్టాల్సిందేనని పట్టుపట్టడం మాత్రమే కాదు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన పూర్తిచేశాయి. ఇక జనతాదళ్‌ (యు) బిహార్‌లో దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన పూర్తిచేసింది. కులగణనలో సశాస్త్రీతను ప్రశ్నించినవారు లేకపోలేదు. అంతేకాదు వివిధ రాష్ట్రాల్లో ప్రాబల్యాన్ని కలిగివున్న కులాలు తమ ఆధిపత్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో ఈ కులగణను వ్యతిరేకించడాన్ని కూడా మనం చూశాం. బీజేపీ మొదట్నుంచీ కులగణను వ్యతిరేకిస్తోంది. ఓట్లకోసం హిందువులను విభజించి ప బ్బం గడుపుకోవాలన్న దురాశతోనే విపక్షాలు కులగణనను డిమాండ్‌ చేస్తున్నాయంటూ వాదించినా, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తదితర విపక్షాలు దీన్ని ప్రధానాస్త్రంగా ఉపయోగించడంతో తప్పనిపరిస్థితుల్లో కేంద్రం వచ్చే జనగణనతోపాటు కులగణన కూడా చేపడతామని ప్రకటించింది. విచిత్రమేమంటే విపక్షాలు దేన్నయితే తమ ప్రధాన అస్త్రంగా మలచుకోవాలనుకుంటున్నాయో అది బూమరాంగ్‌ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రా ల్లో బలీయంగా వున్న కొన్ని ప్రాంతీయ పార్టీలకు ఈ కులగణన ఫలితాలు ఇబ్బంది కలిగించేవి గా వున్నాయనేది ఇప్పుడిప్పుడే వెల్లడవుతుండటం తాజా పరిణామం. ముఖ్యంగా రాష్ట్రీయ జనతాదళ్‌, సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్‌ (యునైటెట్‌) పార్టీల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓబీసీ కులాలకు చెందిన నాయకులకు కొత్త సమస్యలు పుట్టుకొచ్చే పరిస్థితి ఏర్పడిరది. అదెట్లాగో పరిశీలి ద్దాం.
మింగుడుపడని సమస్య
ఎస్సీ వర్గాలను ఉపకులాలుగా వర్గీకరించమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇది ఆవర్గాల్లో సమస్యాత్మకంగా మారినట్టే, ఇప్పుడు కులగణన ఓబీసీ (ఇతర వెనుకబడిన కులా లు) రాజకీయాలపై ఆధారపడిన పార్టీలకు మింగుడు పడటంలేదు. పైకి కులగణన వల్ల అధిక జనాభా కలిగిన ఓబీసీ కులాలవారికి ప్రయోజనం కలుగుతుందని పైకి ఎంతగా విపక్షాలు వా  దించినా, ఓబీసీల్లోని కొన్ని కులాలు మాత్రమే ఆధిపత్యం వహిస్తున్న సంగతి ఇప్పుడు మరింత   ప్రస్ఫుటం కానుంది. అంటే ఓబీసీకులాల్లోనే అసమానతలు బహిర్గతమవుతున్నాయి. రాజ్యాం  గం ప్రసాదిస్తున్న రిజర్వేషన్ల ఫలాలను కూడా వీటిల్లోని కొన్ని కులాలుమాత్రమే అనుభవించడమేకాకుండా మరోపక్క రాజకీయ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని అగ్రవర్ణాలను తలదన్నే రీతిలో  కొన్ని రాష్ట్రాల్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వైనం కులగణన పుణ్యమాని మరింత స్పష్టంగా వెల్లడి కానుంది. ఇప్పటివరకు ఓబీసీ భజన చేస్తున్న విపక్షాలకు ఇదొక విరోధాభాస వంటిదేనని చెప్పాలి. 
కొన్ని కులాలదే ఆధిపత్యం
1931లో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం దేశంలో కులగణన నిర్వహించిన తర్వాత, మళ్లీ దాన్ని చేపట్టడం ఇదే ప్రథమం. కేంద్రం నిర్ణయాన్ని ఎస్‌.పి, ఆర్‌జేడీ, జెడీ(యు), కాంగ్రెస్‌ పార్టీలు స్వాగతిం చాయి. కేంద్రం నిర్ణయం తీసుకోవడం తన ఘనతేనని జేడీ(యు) చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. కాకపోతే ఇప్పుడు ఎస్‌.పి, ఆర్‌జేడీలు కూడా ఈ అంశాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం తాజా పరిణామం. ఈ మూడు పార్టీలు జయ ప్రకాష్‌ నారాయణ్‌ యుగం, మండల్‌ కమిషన్‌ కాలం తర్వాత వెలుగులోకి వచ్చినవే. ఎందుకంటే ఈ మూడు పార్టీలకు నాయకత్వం వహిస్తున్న ఓబీసీలకు చెందిన కొన్ని కులాల నాయకులు మాత్రమే! ఓబీసీల ఐక్యతారాగం వెనుక ఆయా కులాల ‘సామాజిక`ఆర్థిక వెనుకబాటు’ అనే ని నాదం ప్రధాన పాత్ర పోషించిందనేది కీలక సత్యం. ఇందులో భాగంగానే ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న అఖిలేష్‌ యాదవ్‌ తండ్రి, ములాయంసింగ్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణ`క్షత్రియ ఆధిపత్యాన్ని దెబ్బతీసి ఓబీసీల పాలనను అందుబాటులోకి తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇక లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా ‘ఓబీసీ’ కులంకార్డుతో రాజకీ  యాలు నడిపి ఆర్‌జేడీ పాలనను తీసుకొచ్చారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని అణగదొక్కామని ప్రచారం చేసుకున్న లాలూప్రసాద్‌ యాదవ్‌, వారిని తలదన్నే రీతిలో తన కుటుంబ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, ఓబీసీల్లో ఎవరినీ పైకి రానీయకుండా అప్రతిహతంగా బిహార్‌ను పాలించారు. ఇక నితీష్‌ కుమార్‌ విషయానికి వస్తే, ఆయన పై ఇద్దరు నాయకులంత దూకుడుగా కాకుండా, మధ్యేమా ర్గంలో తన ఓబీసీ రాజకీయాన్ని కొనసాగించారు.బిహార్‌ రాజకీయాల్లో యాదవుల (ఓబీసీలు) వెన్నుదన్నుతోనే ఆర్‌జేడీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది. రాష్ట్రంలో వీరి జనాభా     14% కావడం ఇక్కడ కీలకం. 
ఇక ఉత్తరప్రదేశ్‌ విషయానికి వస్తే యాదవుల జనాభా 8 నుంచి 10శాతం వరకు వుంటుంది. సమాజ్‌వాదీ పార్టీ ఓబీసీల్లోని ఇతర ఉపకులాలు, ముస్లింల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. బిహార్‌లో నితిష్‌కుమార్‌ ప్రధానంగా కూర్మీలు (ఇది ఆయన కులం) మరియు కోయిర్లపై ఆధారపడి తన రాజకీయాన్ని నడిపారు. ఈ రెండుకులాలు కలిపితే 7 నుంచి 10శాతం వరకు వుంటారు. అయితే తీవ్రంగా వెనుకబడిన కులాల్లో (ఈబీసీ) ఆయన గట్టి పట్టును సంపాదించడం కూడా జేడీయూ అధికారంలోకి రావడానికి మరో కారణం. ఎందుకంటే ఈబీసీల జనాభా రాష్ట్రంలో36% వరకు వుంది. 
ఇక ఓబీసీ పల్లవి కష్టం
ఈవిధంగా ములాయంసింగ్‌ యాదవ్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌కుమార్‌లు ఓబీసీ రాజకీ యాల నేపథ్యంలో ఎదిగినా, చివరకు ఈ వర్గాల్లో కేవలం ఒక్క కులం మాత్రమే ఆధితపత్యం వహించడం చివరకు చోటుచేసుకున్న పరిణామం. ఇప్పుడు చేపట్టిన కులగణన వల్ల, ఓబీసీల్లో ఎవరు ఆధిపత్యం వహిస్తున్నారన్న నిజం బయటకు రావడం ఈ నాయకులకు మింగుడుపడటం లేదు. అంటే ఓబీసీల్లో ఎన్నో కులాలున్నప్పటికీ కేవలం ఒకే ఒక కులం అగ్రవర్ణాలను తలదన్నే రీతిలో ఆధిపత్యం వహిస్తున్నదన్న సత్యం బహిర్గతం కావడంతో ఇప్పుడు ఆయా నాయకులకు ఓబీసీ పల్లవిని అందుకోవడం కష్టంగా మారింది. అంతా ఓబీసీలే అనేది ఒక సత్యమైతే, వీరిలో ఒక కులం మాత్రమే ఆధిపత్యం వహిస్తున్నదనేది మరో సత్యం. ఈవిధంగా కులగణనలో ఓబీసీ అనేది ఒక విరోధాభాసగా తయారైంది! దేశ జనాబాలో ఓబీసీలదే సింహభాగమని పై మూడు రాజకీయ పార్టీల వాదన. అందుకనే కులగణ చేపడితే ఓబీసీ వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీ యపరంగా న్యాయం జరుగుతుందని వీరు చేస్తున్న వాదన కూడా సహేతుకమే. అయితే ఉద్యోగ, ఉపాధి, రిజర్వేషన్‌ ప్రయోజనాలు, రాజకీయ ఆధిపత్యం ఓబీసీల్లో ఏదో ఒక కులం చేతిలోనే వున్నదనేది ఈ కులగణనద్వారా స్పష్టమవుతోంది. అంటే ఎస్సీ రిజర్వేషన్లలో మాలలు ప్రయోజ నం పొందినట్లుగానే, ఓబీసీల్లో యాదవుల వంటి కొన్ని కులాలు మాత్రమే ప్రయోజనం పొందుతున్నాయని చెప్పవచ్చు. 
‘యాదవీకరణ’
ఓబీసీ రాగం ఎత్తుకొని అధికారంలోకి వచ్చిన ములాయంసింగ్‌ యాదవ్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌లు ఓబీసీల్లోని ‘యాదవ’ కులానికి చెందినవారు. ఎప్పుడైతే సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌లు అధికారంలోకి వచ్చాయో అప్పుడు ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయాల్లో కేవలం ఈ కులానికి చెందినవారే ఎక్కువగా ప్రయోజనం పొందడం మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పూర్తిగా ‘యాదవీకరణ’ జరిగిందనేది ప్రధానంగా వచ్చిన ఆ రోపణ. ఎస్‌.పి. ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు యు.పి.లోని 1526 పోలీస్‌ స్టేషన్లలో,    600 యాదవ్‌ కులానికి చెందిన పోలీసు అధికార్ల ఆధిపత్యంలో వుండేవని ఒక నివేదిక వెల్లడిరచింది. లక్నో, మధుర, కాన్పూర్‌, ఘజియాబాద్‌, సంభాల్‌, బడౌన్‌ వంటి నగరాల్లోని పోలీస్‌ స్టేషన్లలో 40శాతం వరకు యాదవుల ఆధిపత్యంలోనే వుండేవి. సీనియర్‌ అధికార్ల అంచనా ప్రకారం 50శాతం పోస్ట్‌లను అనధికారికంగా యాదవ్‌లకు రిజర్వ్‌ చేసి వుంచేవారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా ఇదే పద్ధతి కొనసాగింది. కేవలం ఎస్‌.పి. ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడే ఇట్లా జరిగిందా అంటే, బీఎస్‌పీ అధికారంలో వున్న 2011వ సంవత్సరంలో కూడా ఇదే తంతు  కొనసాగడం విశేషం. బీఎస్‌పీ కాలంలో ప్రావెన్షియల్‌ సివిల్‌ సర్వీసెస్‌ (పీసీఎస్‌) పరీక్షా ఫలితాల్లో 176 మంది ఓబీసీలు ఉత్తీర్ణులైతే వీరిలో 147మంది యాదవులు! దీంతో రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగడంతో ప్రభుత్వం మరో 86మంది అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో 54 మంది మళ్లీ యాదవులే వుండటం గమనార్హం! ఈ 54 మందిలో చివరకు   ఇంటర్వ్యూలో 50 మంది ఎంపికయ్యారు. 2011 నుంచి 2014 వరకు వివిధ రకాల పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో ఎక్కువ మంది యాదవ కులానికి చెందిన అభ్యర్థులే ఎంపికవడం గమ నార్హం. తర్వాతి కాలంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 8 నుంచి 14 టిక్కెట్ల ను యాదవులకే కేటాయించింది. 2024లో అఖిలేష్‌ యాదవ్‌ తమ కులానికి కేవలం నాలుగు టిక్కెట్లు మాత్రమే ఇచ్చారు. ఆ నలుగురూ కూడా ఆయన కుటుంబసభ్యులే! నెల క్రితం వరకు యు.పి.లోని 22 జిల్లాల్లో పార్టీ ఆధిపత్యం యాదవుల చేతుల్లోనే కొనసాగింది.
బిహార్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ
ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఐదేళ్లపాటు బిహార్‌ను పాలించారు. ఆయన పాలన దేశంలోనే గొప్ప అవినీతి, అరాచకాలకు బ్రాండ్‌గా మారిపోయింది. వివిధ శాఖలకు చెందిన అధికార్లు వేధింపుల భయంతో బదిలీలు చేయించుకున్నారు. కొద్దో గొప్పో సంపద కూడబెట్టుకున్న వారు దాన్ని బయటపెట్టడానికి భయపడ్డారు. భద్రతకోసం మహిళలు, పురుషులపై మరింతగా ఆధారపడాల్సి వచ్చింది. ఓబీసీ కులాల్లో పేదలు మరింత పేదలుగా మారగా, ధనికులు మరింతధనికులయ్యారు. లాలూ కాలంలో భూమి లావాదేవీలు, ప్రభుత్వ కాంట్రాక్టులు మొదలైన వాటి ల్లో ఎక్కువ ప్రయోజనం పొందింది యాదవులే. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, సురేంద్రయాదవ్‌, సాధుయాదవ్‌, సుభాష్‌ యాదవ్‌ వంటివారు రాష్ట్ర యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఏకఛ  త్రాధిపత్యంగా అధికారాన్ని చెలాయించారు. బిహార్‌లో 2023లో నిర్వహించిన కులగణన ప్రకారం, ప్రభుత్వ సర్వీసుల్లో 6,21,4811 మంది ఓబీసీలుండగా వీరిలో 2,89,538 (46.59%) మంది యాదవులే! ఆవిధంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఓబీసీల్లో యాదవులను ఎంతగా పైకి తీసుకొచ్చారో మిగిలినవారిని అంతగా నిర్లక్ష్యం చేశారు. ఉదాహరణకు 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 33శాతం టిక్కెట్లను కేవలం యాదవులకే ఇచ్చిన ఘనత లాలూది. 2023లో 15 జిల్లాల్లో పార్టీకి నాయకత్వం వహించింది యాదవులే! లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కులపిచ్చి ఎంతగా ముదిరిపో యిందంటే ఆఖరుకు ముస్లింలు ఆధిపత్యం వహించే స్థానాల్లో కూడా యాదవులకే టిక్కెట్లు ఇచ్చేస్థాయికి చేరుకుంది. 
కూర్మీ కోయిర్లు మరియు లవ్‌కుశ్‌ ఐకమత్యం
నితిష్‌కుమార్‌ కూర్మీ`కోయిర్‌ కులాలను ఒకే విధంగా చూస్తారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సమతు ల్యాభివృద్ధి వుండాలనేది ఆయన అభిమతం. అందుకనుగుణంగానే ఆయన విధానాలు కొనసా గుతాయి. ఉపేంద్ర కుశావహ, శకుని చౌదరి (బిహార్‌ ఉపముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి తండ్రి) నితిష్‌కు గట్టి మద్దతుదార్లుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కూర్మీ`కోయిరీ సంయోజనను లవ్‌`కుశ్‌గా రాష్ట్ర ప్రజలు పరిగణిస్తారు. భూకమతాలను కలిగివుండి వ్యవసాయంపై ఆధారపడే ఈ వర్గాలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశాలను నితిష్‌ ప్రభుత్వం క ల్పించింది. ప్రస్తుతం బిహార్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీల రిజర్వేషన్‌లో 46.6% యాదవులే వున్నారు. అదే లవ్‌`కుశ్‌వర్గం ఓబీసీ రిజర్వేషన్లలో 36.9% కొనసాగుతున్నారు. మరి రాష్ట్ర జనా భాలో యాదవులు 14.27% కాగా కోయిరీ`కూర్మీ ప్రజలు 7.09%. ఇప్పుడు మొత్తం ఉద్యోగాల్లో కోయిరీ`కూర్మీ ప్రజలు కేవలం 2.47పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. అంటే ఇక్కడ జనాభా సంఖ్యకు, పొందుతున్న ఉద్యోగాలకు పొంతన వుండటంలేదనే అర్థం! ఎందుకంటే ప్రభుత్వ ఉ ద్యోగాల్లో యాదవుల ప్రాతినిధ్యం 1.55గా వుంది మరి!!
ఇతర రాష్ట్రాల్లో కూడా
ఈవిధంగా జనాభా సంఖ్యకు, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యానికి పొంతనలేకపోవడం కేవలం బిహార్‌కు మాత్రమే పరిమితం కాదు. జార్కండ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అంటే ఓబీసీ వర్గాల్లోని ఆధిపత్య కులాలు మాత్రమే ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతుండగా, మిగిలినవారికి అవి అందుబాటులో లేవు. ఆర్‌జేడీ, ఎస్‌.పి., జెడీ(యు) వంటి ప్రాంతీయ పార్టీలు అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని తొలగించి వెనుకబడిన తరగతులకు అధికారాన్ని కట్టబెట్టాయని కొందరు ప్రచారం చేస్తున్నప్పటికీ, వెనుకబడిన కులాల్లో అట్టడుగున వున్న కులాల స్థితిగతుల్లో ఏవిధమైన మార్పు లేదన్నది అక్షరసత్యం. అందువల్ల కులగణన అనేది కేవలం  సంఖ్యకు మాత్రమే పరిమితం కాకుండా, సామాజిక, ఆర్థికాభివృద్ధిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీనివల్ల ఓబీసీ వర్గాల్లోని కొన్ని కులాలు అగ్రవర్ణాలను మించిన స్థాయిలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అన్ని రంగాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. జనాభాపరంగా తక్కువగా వున్న కులాలు, తమ అస్తిత్వంకోసం ఒక ఆధిపత్య కులానికి మద్దతు పలకాల్సి వస్తుండటంకూడా గమనించాలి. ఇప్పుడు బిహార్‌లో తేజస్వీ యాదవ్‌ను చాలామంది యాదవులు అనుమాన దృక్కులతో చూస్తున్నారు. కుశావహలకు అనుకూలంగా ఆయన మెలగడమే కారణం. జార్ఖండ్‌ లో గత ఎన్నికల్లో సురేష్‌ మెహతో నేతృత్వంలో ఆల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పార్టీ (ఏజేఎస్‌యూపీ) ఏర్పాటైంది. సురేష్‌ మెహతోను తరచుగా కూర్మీ మెహతోగా పిలిచేవారు. అయితే 2024 అ సెంబ్లీ ఎన్నికల్లో జైరామ్‌ మెహతో నాయకత్వంలోని జార్ఖండ్‌ లోక్‌తాంత్రిక్‌ క్రాంతికారి మోర్చా కూర్మీల్లో ఎక్కువ మద్దతును సాధించింది. అంటే కూర్మీలు జైరామ్‌ మెహతా పార్టీపైనే విశ్వాసం వుంచారు.ఏతావాతా చెప్పొచ్చేదేమంటే కులగణన ఓబీసీ పార్టీల్లో కొనసాగుతున్న సమతుల్యతను దెబ్బతీయవచ్చు. తమకు సంద్రాయంగా విధేయులుగా వున్న వర్గాల్లో తమ బలాన్ని నిలుపుకుంటూనే, త మను తాము మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మలచుకుంటే తప్ప ఓబీసీ పార్టీల మనుగ డ కష్టం.

‘‘అణువంత రూపం’’ కాదు…’’హనుమంతుడి స్వరూపం’’!

`ఒడిదొడుకులెన్ని వున్నా ఒకే ఒక్కడు రేవంత్‌!

`కాంగ్రెస్‌ ను కష్టకాలంలో ఆదుకున్నాడు.

`రవ్వంత అన్న కళ్ల ముందు కొండంత ఎదిగాడు.

revanth reddy

`అణువంత అనుకున్న వారి ముందు హనుమంతుడై దడ పుట్టిస్తున్నాడు.

`కాంగ్రెస్‌ కు సంజీవనీ అయ్యాడు.

`కేసీఆర్‌ కు ఎదురు తిరిగాడు.

`కేసీఆర్‌ ను ఎదిరించి నిలిచాడు.

`కేసులకు వెరవలేదు. జైలుకు భయపడలేదు.

`లక్ష్యం ముందు సమస్యలను చీపురుపుల్లలనుకున్నాడు.

`చిందరవందర రాజకీయాన్ని చక్కదిద్దాడు.

`తెలంగాణ రాజకీయాలలో ఎదురులేని స్థాయికి ఎదిగాడు.

`ఎవరినైనా ఎదిరించి నిలబడి తొడగొట్టాడు.

`కేసీఆర్‌ ను పడగొడతానని మీసం మెలేశాడు.

`ఏడాదిన్నర పాలన కూల్‌గా నడిపించాడు.

`బీఆర్‌ఎస్‌ కు సున్నం పెట్టి, సున్నా చుట్టించాడు.

`బీఆర్‌ఎస్‌ రాజకీయాన్ని నిలువునా మింగేశాడు.

`తెలంగాణ రాజకీయాలలో బీఆర్‌ఎస్‌ ఉనికి ప్రశ్నార్థకం చేశాడు.

`కారులో కుదుపులు కాంగ్రెస్‌ కు కలిసొచ్చేలా చేశాడు.

`కేసీఆర్‌ లాంటి నాయకుడిని కేసులతో వణికిస్తున్నాడు.

`కేసీఆర్‌ కు భయం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు.

`పార్టీని మొత్తం తన కంట్రోల్‌ లోకి తెచ్చుకున్నాడు.

`సమిష్టి ప్రభుత్వానికి కొత్త నిర్వచనం చెబుతున్నాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయమంటే మాటలు కాదు. ఎదురీతలు. నిలదీతలు. పడిగాపులతో కూడిన ఎదురుచూపులు. ఎవరు ఎప్పుడు ఎంత ఎదుగుతారో..ఎవరు ఎక్కడ ఆగిపోతారో అన్నది తెలిసే ముచ్చట కాదు. కాకపోతే రాజకీయం అంటే కాలం కలిసి రానప్పుడు రాజీ పడాలి. కాలాన్ని తనవైపు తిప్పుకొని ఎగిరిపడాలి. తనంతటి వారు లేరని నిరూపించుకోవాలి. నాయకులకు ఆశలుండాలి. లక్ష్యాలుండాలి. తాను ఎమ్మెల్యే కావాలనుకంటే సరిపోదు. అయినా అవకాశాలు రాకపోవచ్చు. అందుకే రాజకీయాల్లో అవకాశాల కోసం ఎంత వెంపర్లాడాలో..అంతే వాసిగా కొట్లాడి కూడా సాదించాలి. అప్పుడు నాయకుడు, మహా నాయకుడౌతారు. రాజ్యం ఏలే శక్తిని కూడగట్టుకుంటాడు. పాలకుడై పాలిస్తాడు. అలాంటి వారిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకరు. మహా సముద్రం లాంటి కాంగ్రెస్‌ పార్టీలో నాయకుడు కావడం అంటే ఏటికి ఎదురీదడమే..గెలిచి నిలవాటంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొవాలి. అందర్ని కలుపుకుపోవాలి. అందరి చేత నాయకుడని జేజేలు కొట్టించుకోగలగాలి. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ. ఎదిగేవారిని ఎవరు లాగుతారో తెలియదు. నిచ్చెన మీద వున్నవారిని ఎవరు కిందకు తోస్తారో తెలియదు. అలాంటి పార్టీలో అందర్నీ దాటుకొని ముందుకు వెళ్లడం అంటే పరుగుపందెం కన్నా పెద్ద ప్రయత్నమే చేయాలి. అందర్నీ నెట్టేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే కాంగ్రెస్‌లో గెలుపు. అప్పుడే కాంగ్రెస్‌లో పదవులు. నాయకుడి విలువ ప్రతిపక్షంలో వున్నప్పుడు తెలుస్తుందని అంటారు. నాయకుడు కావాలనుకున్నప్పటి నుంచి అలుపెరగని పోరాటం చేసే వారు మాత్రమే ముఖ్యమంత్రి స్దాయికి చేరుకుంటారు. అలాంటి వారిలో కీలకంగా చెప్పుకోవాల్సిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఒక్కడుగా రాజకీయం మొదలు పెట్టారు. ఒక్కడుగా అడుగులేశాడు. ఒక్కడుగానే విజయాలు సొంతం చేసుకున్నాడు. ఒంటి చేత్తో కాంగ్రెస్‌ను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వానికి ఎంతో తేడావుంది. సిఎం. రేవంత్‌ రెడ్డి, మూడు దశాబ్ధాల క్రితం ఈ స్దాయి నాయకుడై వుంటే, ఇప్పటికే దేశ ప్రధాని అయ్యేవారు. ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా పని చేసిన వారికి పెద్ద చాలెంజ్‌లు లేవు. ఇప్పుడున్న పధకాల గోల లేదు. ప్రభుత్వమంటే పని చేసుకుంటూ పోవడం తప్ప, ప్రజలకు ఇప్పుడిస్తున్న సంక్షేమ పధకాలతో కూడిన పూర్తి స్ధాయి మ్యానిపెస్టోలు వుండేవి కాదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి ఏదో ఒకరకమైన ప్రభుత్వ పధకం అందాల్సిందే. అందని వారిని వాటిని అర్హులను చేయాల్సిందే. వారికి కూడా ప్రభుత్వ పధకాలు అందేందుకు కృషి చేయాల్సిందే. కాని గతంలో ఒకటో, రెండో పధకాలు మాత్రమే వుండేది. అందులో రేషన్‌ తప్ప మరే పథకాలు కనిపించేవి కాదు. ప్రతిపక్షాల నుంచి పెద్దగా ఒత్తిడి వుండేది కాదు. కాని రాజకీయాలు మాత్రం ఎప్పుడూ ఎండాకాలంలో ఉక్కపోతలా వుండేది. ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి కావాలనుకునేంత రాజకీయం నెరిపేవారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఏడాది కాలం కూడా సరిగ్గా పాలన సాగించలేని ఉద్దండ నాయకులు కూడా వున్నారు. అందులో మర్రి చెన్నారెడ్డి, మాజీ ప్రధాని పవి. నర్సింహారావు లాంటి వారు కూడా వున్నారు. కాంగ్రెస్‌ రాజకీయ చరిత్రలో అత్యధిక సీట్లు సాధించిన పి.వి. నర్సింహారావు కూడా పదమూడు నెలలు పాలన సాగించేందుకు ఆపసోపాలు పడ్డారు. మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు కూడా దినదిన గండంగానే పాలన సాగించారు. వారందరితో పోలిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాజకీయం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. ప్రతిపక్షంలో వున్నప్పుడు రేవంత్‌ రెడ్డి పడినన్ని రాజకీయ కష్టాలు, కక్షలు ఏ నాయకుడు అనుభవించలేదు. నిత్యం నరకం చూశారు. అయినా కేసిఆర్‌ను ఎదరించి నిలిచారు. పోరాడి ప్రజా క్షేత్రంలో కేసిఆర్‌ను మట్టి కరింపించారు. రాజకీయాల్లో ఆరోపణలు మరీ దారుణమైన స్ధితికి బిఆర్‌ఎస్‌ నాయకులు దిగజార్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిత్వ హననం చేసేవారు. ఆయన ఆహార్యం మీద ఆరోపణలు చేసేవారు. అయినా రేవంత్‌ రెడ్డి చిరునవ్వుతో వాటిని స్వీకరించేవారు. అంతే దాటిగా విమర్శలు చేసిన వారిని కూడా మాటలతో తూటాలు పేల్చేవారు. చాల మంది బిఆర్‌ఎస్‌ నాయకులు అధికారంలో వున్నప్పుడు రేవంత్‌ రెడ్డి మీద చేసిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. పైగా అణవంత రెడ్డి, రవ్వంత రెడ్డి అంటూ హేళన చేసేవారు. ఇప్పుడు ఆ నాయకుడు రేవంత్‌ రెడ్డి కొండంత కనిపిస్తున్నాడు. ఒక్కక్కరి వెన్నులు వణకు పుట్టిస్తున్నాడు. ఎన్ని ఒడుదొడుకులైనా ఆనాడు ఎదుర్కొన్నాడు. ఇప్పుడూ ఎదురీదుతూనే వున్నారు. సహజంగా ఏ నాయకుడైనా అధికార పార్టీలో చేరి పదవులు పొందాలనుకుంటారు. నాయకుడిగా ఒక్కొ మెట్టు ఎదుగాలనుకుంటారు. అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాజకీయం విభిన్నం. ఆయన రాజకీయం ప్రత్యేకం. అందుకే తన మొదటి ఎంపిక ప్రతిపక్షంలో వున్న పార్టీనే ఎంచుకున్నారు. ఇండిపెండెంటుగానే జడ్పీటీసి అయ్యారు. ఇండిపెండెంటుగానే ఎమ్మెల్సీ అయ్యారు. 2007 ప్రతిపక్షంలో వున్న తెలుగుదేశంలో చేరారు. 2009లో ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలోనే వుంది. 2014లో తెలుగుదేశంలోనే వున్నాడు. అప్పుడూ ప్రతిపక్ష పాత్రనే పోషించారు. ఎందుకంటే ఆయన పదవులు ఎవరి దయాదాక్షిణ్యాల మీద పొందాలనుకోలేదు. కాంగ్రెస్‌లో చేరినా ఆ పార్టీ ప్రతిపక్షంలోనే వుంది. ఆ పార్టీ అప్పుడు నిజానికి కాంగ్రెస్‌ పార్టీ కష్టకాలంలోనే వుంది. భవిష్యత్తులో పుంజుకుంటుందన్న నమ్మకం లేని స్దితిలోనే వుంది. అలాంటి సమయంలోనే కాంగ్రెస్‌లో అడుగుపెట్టారు. పార్టీకి కొండంత అండగా నిలిచారు. పార్టీలో ఎదురయ్యే సమస్యలనే కాదు, అప్పటి పాలకపక్షం నుంచి ఎదురైన ఇబ్బందులను గుండె ధైర్యంతో ఎదుర్కొన్నారు. పాలమూరు పులి బిడ్డ అని నిరూపించుకున్నారు. ఒకనాడు అణువంత అన్నవారి ముందు హనుమంతుడంతై, వారికి దడి దడ పుట్టిస్తున్నాడు. కాంగ్రెస్‌కు సంజీవని అయ్యారు. పార్టీని నిలబెట్టేందుకు అనేక కష్టాలు పడ్డారు. ఆఖరుకు తన కూతురు పెళ్లిని కూడా కళ్ల నిండా చూడలేనంత కష్టాన్ని అనుభవించాడు. పదే పదే కేసిఆర్‌ పాలనలో జైలు జీవితాన్ని అనేక సార్లు భరించారు. కేసులకు ఏనాడు భయపడలేదు. జైలు జీవితం గురించి చింత చెందలేదు. ఎన్ని నిర్భంధాలనైనా సరే అవలీలగా ఎదుర్కొన్నాడు. ప్రజల హృదయాలను గెల్చుకున్నాడు. కాంగ్రెస్‌ పెద్దల నమ్మకం చూరగొన్నాడు. బలమైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ అని ప్రచారం సాగుతున్న వేళ కేసిఆర్‌కు ఎదరించి నిలిచాడు. ప్రతి పధకాన్ని ఎండగట్టాడు. కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు , అక్రమాలు జరుగుతున్నాయని ఆనాడే గొంతెత్తి నినదించాడు. తెలంగాణ సొమ్మును బిఆర్‌ఎస్‌ నాయకులు నీళ్లలా కొల్లగొడతున్నారని ప్రజలను చైతన్యం చేశారు. మల్లన్న సాగర్‌ ప్రాంతాల్లో నిర్వాసితులకు అండగా వున్నారు. ప్రభుత్వంతో కొట్లాడి వారికి పరిహారం అందేందుకు కృషి చేశారు. ఎన్ని అవాంతరాలెదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ప్రతి సమస్యను పూచిక పుల్లతో సమానమనుకున్నాడు. తాను ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం వైపు వడివడిగా అడుగులు వేశాడు. ఓ వైపు కేసిఆర్‌ను ఎదుర్కొంటూనే, మరో వైపు కాంగ్రెస్‌లో వున్న చిందర వందర రాజకీయాన్ని చక్కదిద్దారు. ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల్లో ఎదురులేని నేతగా ఎదిగారు. తిరుగులేని శక్తిగా మారారు. తన రాజకీయం ముందుకు కేసిఆర్‌ లాంటి నాయకుడి నాయకత్వాన్నే తుత్తునీయం చేశాడు. తనకు ఎదురు వచ్చే వారందరినీ ఎదరించాడు. కేసిఆర్‌ను ఒక దశలో తొడగొట్టి సవాలు చేశాడు. కేసిఆర్‌ ను పడగొడతానని మీసం మెలేశాడు. జైలుకెళ్లిన సమయంలో కూడా బెబ్బులిలా గర్జించాడు. ఎన్ని సవాళ్లు ఎదురౌతున్నా ఏడాదిన్న కాలం పాటు కూల్‌గా పాలన సాగిస్తున్నాడు. బిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల చేత సున్నం పెట్టించి, సున్నా చుట్టేలా చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బిఆర్‌ఎస్‌ను నిలువునా మింగేశాడు. తెలంగాణ దాటి దేశ రాజకీయాలను ఏలుతామని ప్రగల్భాలు పలికిన వారి రాజకీయ ఉనికినే ప్రశ్నార్ధం చేశాడు. ఇల్లు దాటలేని పరిస్దితి తెచ్చాడు. కేసిఆర్‌ లాంటి నాయకుడిని కూడా కేసులతో వణికిస్తున్నాడు. ఎవరికీ భయపడడని గొప్పలు చెప్పుకునే కేసిఆర్‌కు భయం ఏమిటో రుచి చూపిస్తున్నాడు. దినదినం వణుకు అంటే ఎలా వుంటుందో చూపిస్తున్నాడు. పార్టీని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. ప్రజా ప్రభుత్వానికి నిజమైన నిర్వచనం చెబుతున్నాడు.

భగీరథుడి పట్టుదల అందరిలో ఉండాలి

*”నేటిధాత్రి”,వనపర్తి.*

*గంగను దివి నుంచి భూమికి దింపిన మహా తపస్వి భగీరథుడని భగీరథుడి సహనం పట్టుదల ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం వనపర్తి పట్టణంలోని మర్రికుంటలో నూతనంగా ఏర్పాటుచేసిన ఏకశిల భగీరథ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భగీరథుడి పట్టుదల మనందరిలోన ఉండాలని మనం చేపట్టే పనులను పూర్తి చేసే వరకు వదిలిపెట్టకూడదని ఎమ్మెల్యే సూచించారు

తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించబోతుందని అందులో సగరులకు సైతం రాజకీయపరమైన అవకాశాలు రాబోతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వనపర్తి నియోజకవర్గంలో జిల్లా స్థాయి నామినేటెడ్ పదవికి మన సగర సోదరుడైన గోవర్ధన్ సాగర్ ను నియమించామని ఎమ్మెల్యే తెలిపారు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ YS రాజశేఖర్ రెడ్డి హయాంలోని సగరులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించిన ప్రభుత్వం ఏకైక కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే గుర్తులు చేశారు సగరుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందామని మీ సంఘంలోని ముఖ్యులు మాట్లాడుకునే సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు వనపర్తి పట్టణంలోని సగరుల కోసం కళ్యాణ మండపాన్ని సంబంధించి నివేదికలు తయారు చేయాలని ఎమ్మెల్యే సంఘం నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర సంగం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, జిల్లా అడక్ కమిటీ కన్వీనర్ మోడల తిరుపతయ్య సాగర్ , జిల్లా గ్రంధాల అధ్యక్షుడు గోవర్ధన్ సగర, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం సాగర్ , రాష్ట్ర గౌరవ అధ్యక్షులు హరికిషన్ సాగర్ , రాష్ట్ర గౌరవ సలహాదారులు ఆర్బి ఆంజనేయులు, రాష్ట్ర సగర సంగం ఉపాధ్యక్షులు చిలుక సత్యం సాగర్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, మరికుంట సగర అధ్యక్షులు చీర్ల ఆంజనేయులు ,రాష్ట్ర మహిళా మాజీ అధ్యక్షురాలు మహేశ్వరి సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షులు మోడల రవి సగర,ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకట్రాములు సగర,కోశాధికారి దిండి రామస్వామి సగర,గ్రేటర్ హైదరాబాద్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రంశెట్టి సీతారాం సగర,నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు సగర, గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ సగర, వనపర్తి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పల్లె సత్యనారాయణ సాగర రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చీర్ల విష్ణు సగర, మాజీ కౌన్సిలర్ చీర్ల సత్యం సగర, వనపర్తి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు చీర్ల జనార్ధన్ సగర, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రావుల నాగరాజు సాగర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు చిలుక జ్యోతి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి చీర్ల జ్యోతి,గొబ్బూరి చంద్రాయుడు సగర ఛీర్ల నాగేంద్రం సగర, టౌన్ యూత్ అధ్యక్షులు చీర్ల మహేష్ సాగర్, మర్రికుంట ప్రధాన కార్యదర్శి చీర్ల రాజు సగర కోశాధికారి మో డల శివసాగర్ ఉపాధ్యక్షులు యాదగిరి సాగర్ పట్టణ మాజీ అధ్యక్షులు చీర్ల పెదనాగులు సగర,. ప్రధాన కార్యదర్శి చీర్ల రాజు. గౌరవ అధ్యక్షులు చీర్ల నాగేంద్రం. కోశాధికారి మోడల్ శివ. ఉపాధ్యక్షులు మోడల్ యాదగిరి. చీర్లనాగ స్వామి. చీర్ల జనార్ధన్. చీర్ల శ్రీనివాసులు. చీర్ల అయ్యన్న చీర్ల సత్యం చీర్ల నాగరాజు. మహేష్. గుంటి సుధాకర్. గుంటి మహేష్. రాజు.ఛీర్ల శాంతన్న సగర, తదితరులు పాల్గొన్నారు.*

వ్యాప్తంగా నూతన మండల కమిటీని ఎన్నుకోవాలి.

నియోజకవర్గం వ్యాప్తంగా నూతన మండల కమిటీని ఎన్నుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా,నియోజకవర్గం, మండల,గ్రామల నూతన కమిటీ నియమించాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు జహీరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల, గ్రామ అధ్యక్షులకు నియమించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డిను సంగారెడ్డిలో కలసి వినతిపత్రం సమర్పించారు. అదేవిదంగా వివిధ మండలలాల నుండి నూతన కమిటీకి దరఖాస్తు చేసుకొన్నారు.ఈ సందర్బంగా జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల క్రితం నుండి జహీరాబాద్ లో నూతన అధ్యక్షులకు మార్చిన దాఖలాలు లేవన్నారు. అందుకే 2018- 2023 అసంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందామని ఆమెకు తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..తప్పకుండ నూతన మండల కమిటీని వేయడం జరుగుతుంది అన్నారు. త్వరలో జహీరాబాద్ లో సమావేశం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ ముల్తాని మక్సుదలిసాబ్ హదునూర్ మస్తాన్ అలీ హదునూర్ సమీబాయి మిర్జాపూర్ నరసింహులు మలిగి రియాజ్ భాయ్ చాలు కి కోయిరు మండల్ మొగుడంపల్లి మండల్ న్యాల్కల్ మండల్ జైరాబాద్ టౌన్ నుంచి తదితరాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఘనంగా మచ్చలేని మహనీయులు పుస్తకావిష్కరణ.

ఘనంగా మచ్చలేని మహనీయులు పుస్తకావిష్కరణ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజున ఉదయం చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో డాక్టర్ జనపాల శంకరయ్య విరచితమైన (మచ్చలేని మహనీయులు పుస్తక ఆవిష్కరణ )ఘనంగా జరిగినది ఈ సందర్భంగా ఆకునూరి పూర్వ గ్రంథాలయ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ పిల్లల కోసం మహనీయుల చరిత్రలు రాయడం శుభదాయకం అన్నారు ముఖ్యఅతిథి మాట్లాడుతూ పిల్లలు కేవలం సెల్లుకు బానిసలు అవుతున్న నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు కోసం మార్గదర్శకంగా చిన్న చిన్న పదాలతో రాయడం సృజనాత్మకవుకు నిదర్శనం అన్నారు అంతేకాకుండా చందమామ కోరస్ లో చక్కని కథా గేయంగా మలచడం భవిష్యత్తులో మంచి పేరు ఉంటుందని ఆశించారు.

 

Book launch

 

 

 

పేర్కొన్నారు.ముఖ్య అతిథిగా ఆకునూరి శంకరయ్య ,జిందం చక్రపాణి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడెపు రవీందర్, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపూరు బుచ్చయ్య ,గీతా ప్రచార సమితి అధ్యక్షులు కోడం నారాయణ, వ్యాపార సంఘం అధ్యక్షులు పాములకు పత్తి దామోదర్ , కార్యదర్శి గౌడ రాజు ,ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, జిల్లా కవులు, రచయితలు బూర దేవానందం, అంకారపు రవి, మల్లేష్ చక్రాల,సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య, కోశాధికారి దొంత దేవదాసు బంధు వర్గం ఎందరో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి 50 సంవత్సరాల పెళ్లి వేడుక కూడా ఘనంగా జరిగినది

సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అవార్డు.

సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అవార్డు

చిన్నతనం నుండే ఫిమేల్ వాయిస్ తో రాణింపు

దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బొటికే సుదర్శన్..

నర్సంపేట నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన బొటికే సుదర్శన్ కు ఎన్టీఆర్ అవార్డు వరించింది.ఈనెల 28న నిర్వహించిన ఖమ్మం వారి సర్వమాలిక కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నందమూరి తారక రామారావు 102 వ జయంతి సందర్భంగా దుగ్గొండి మండలానికి చెందిన బోటికే సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అచీవ్మెంట్ 2025 అవార్డు దక్కింది. ఈ అవార్డును తుమ్మలపల్లి నాగేశ్వరరావు తనయుడు తుమ్మలపల్లి యుగేందర్ చేతుల మీదుగా తీసుకున్నాడు.తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల నుండి ఈ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది అని సుదర్శన్ తెలియజేశ

అలాగే గత ఏప్రిల్ 13 న ఉగాది పురస్కార్ నంది అవార్డు తీసుకోవడం జరిగిందని సుదర్శన్ పేర్కొన్నారు.కాగా విశాఖపట్నంలోని డాలి ఫంక్షన్ హాల్ లో సినీ హీరో నరేన్ తేజ్,పబ్లిక్ ఫైటర్ మహేష్ యాదవ్ చేతుల మీదగా ఉగాది పురస్కార్ నంది అవార్డు తీసుకున్నాడు.గత ఫిబ్రవరి 27 న కరీంనగర్ లో జరిగిన వెంకట్ మ్యూజికల్ తరపున ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ ఫిమేల్ అవార్డు ఏసిపి విజయ్ కుమార్ చేతుల మీదగా తీసుకున్నాడు.   చిన్నతనం నుండి సుదర్శన్ ఫిమేల్ వాయిస్ లో పాట పాడడం అలవాటు చేసుకున్నాడు. 2025 సంవత్సరంలో ఇన్ని అవార్డులు రావడం చాలా గౌరవంగా ఉందని సుదర్శన్ తెలియజేశారు.ఈ సందర్భంగా సుదర్శన్ కు కుటుంబ సభ్యులు,గ్రామస్తులు పలువిధాల సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాగే ముందు ముందు మంచి అవార్డులు తీసుకొని దుగ్గొండి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.

రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన.

రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు.

◆ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో గుంతలమైన అల్గొల్ బైపాస్ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

జహీరాబాద్ నుండి భరత్ నగర్ ,అల్గోల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు శుక్రవారం స్థానిక నాయకులు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి రోడ్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్ & అండ్ బి ఈఈ , సీఈ తో ఫోన్లో సంభాషిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు . గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ రోడ్డు సమస్య పరిష్కారానికి 80 లక్షల రూపాయలు మంజూరు చేశామని , కాంట్రాక్టర్ కేవలం బ్రిడ్జ్ మాత్రమే నిర్మించి అప్ప్రోచ్ రోడ్డు నిర్మించకుండా వదిలేసాడని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని తొందరగా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని లేనియెడల ధర్నాకు దిగుతామని హెచ్చరించారు, ఈ రోడ్డు ద్వారా వెళ్లే వాహనదారులు క్షేమంగా వెళ్లే విధంగా తక్షణమే తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని ఎమ్మెల్యే స్థానిక అధికారులకు ఆదేశించారు ,కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్, యువ నాయకులు మిథున్ రాజ్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్పా,నాయకులు పురుషోత్తం రెడ్డి,దీపక్ ,నరేష్ రెడ్డి,సందీప్,ఫయాజ్,అశోక్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, అనిల్ ,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.

విత్తన దుకాణాల్లో తనిఖీలు.

విత్తన దుకాణాల్లో తనిఖీలు

ఏవో గంగాజమున

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని గల సాయి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపును మండల వ్యవసాయ అధికారి గంగా జమున తనిఖీ చేయడం జరిగింది. అందులో లైసెన్స్ మరియు పలు రికార్డులను తనిఖీ చేయడం జరిగింది. నకిలీ విత్తనాలు, లూజుగా అమ్మే విత్తనాలను వ్యాపారం చేయకూడదని సూచించడం జరిగింది, రిజిస్టర్లు బిల్లు బుక్కులను మరియు రైతు వారిగా విక్రయాల వివరాల తోకూ డినటువంటి రిజిస్టర్లను తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని సూచించడం జరిగింది, రైతులు అధికృత డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి,బిల్లు రసీదులను కచ్చితంగా తీసుకోవాలి, రసీదుల మీద షాపు యజమాని మరియు రైతు యొక్క సంతకం తప్పని సరిగా ఉండాలి. ఈ యొక్క బిల్లును రైతులు పంట కాలం అయిపోయే వరకు కూడా భద్రపరుచుకోవాలని సూచిం చడం జరిగింది. రైతులు తమకు నచ్చిన రకాన్ని ఎంచుకొని సాగుచేసుకొ నవచ్చు, మంచి యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లాలో జూన్ 2న నిర్వహించు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి జెండా ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్దం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల డయాస్, సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, అన్నారు.

Collector

 

వేడుకల వద్ద వైద్య బృందాలచే వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మేర త్రాగు నీటి సరఫరా పనులు మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. వేడుకలకు ఆహ్వాన పత్రాలు ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరికీ అందాలని అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్య అతిథి అందించే సందేశం రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా తయారు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ముఖ్య అతిథి గౌరవ వందనం, ఇతర బందోబస్తు ఏర్పాటు పకడ్బందిగా చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు కలెక్టరేట్ ఏ ఓ రామ్ రెడ్డి, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు.

ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి:

టేకుమట్ల మండల కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్.ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్,కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ,మృదుస్వభావి, తన తండ్రి ఆశయ సాధన కోసం పరితపించే నాయకుడు,కక్ష సాధింపు రాజకీయాలు చేయకుండా,ప్రజాసేవ లక్ష్యoగా కొన్ని దశాబ్దాలుగా ప్రజా సేవ చేస్తున్న దుదిల్ల కుటుంబం.మంత్రి శ్రీధర్ బాబు భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తరింప చేస్తూ రాజకీయంగా ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ మనస్పూర్తిగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో.జిల్లా మండల నాయకులు యువజన కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు.గ్రామ శాఖ అధ్యక్షులు.సోషల్ మీడియా కోఆర్డినేటర్.కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్మీ జవాన్ ను సన్మానించి ఫర్టిలైజర్ యాజమాన్యం.

ఆర్మీ జవాన్ ను సన్మానించి ఫర్టిలైజర్ యాజమాన్యం

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

 

సబ్ స్టేషన్ తండా వాస్తవ్యులు మలోత్ రాజు ఇటీవల జరిగిన
పాకిస్తాన్ మరియు ఇండియ సిందూరు ఆపరేషన్ యుద్ధంలో
కేసముద్రం మున్సిపాలిటీ పరిది లోని సబ్ స్టేషన్ తండా కూ చెందిన మలోత్ రాజు పాల్గొనడం గర్వకారణమని, అగ్రోస్ రైతు సేవ కేంద్రం దన్నసరి క్రాస్ రోఢ్ యజమానులు ధారావత్ రాజు వారిని శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ కేసముద్రం మండల అధ్యక్షులు ననబల రమేష్ ఏఎంసి కేసముద్రం మాజీ డైరెక్టర్ ధారావత్ రమారవిందర్ నాయక్,
బనోత్ నాగ ,మాలోత్ బాలాజీ, బానోత్ రాజు, బనోత్ సురేష్, బానోత్ వీరన్న తదితరులు పాల్గోన్నారు

పంచాయితీ కార్యదర్శులకు పలు సూచనలు.

పంచాయితీ కార్యదర్శులకు పలు సూచనలు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)నేటిధాత్రి:

 

భద్రాద్రి కొత్తగూడెం ముఖ్య కార్య నిర్వహణాధి కారి నాగలక్ష్మి మండల ప్రజా పరిషత్ గుండాల ను శుక్రవారం సందర్శిం చారు.అనంతరం గుండాల గ్రామములోని వేపలగడ్డ గ్రామం నందు మెయిన్ రోడ్డు ప్రక్కన ఇంకుడు గుంతను పరిశీలించారు. గుండాల గ్రామ పంచాయతి లోని నర్సరి ని సందర్శించి పంచాయతీ కార్య దర్శులకు పలు సూచనలు జారీ చేశారు. అందరూ పంచాయతి కార్య దర్శుల తో ఈజిఎస్. సిబ్బంది తో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశములో ఈజిఎస్,ఎఫ్టీఓ ల జనరేషన్ లో 100 శాతము సాదించాలని సూచించారు. వర్షాకాలంలో నీరు వృధాగా పోకుండా ఇంకుడు గుంతలు ప్రతి గ్రామ పంచాయతి లో ని గ్రామాలకు విరివిగా నిర్మించి అందరూ భూగర్భ జలాలను పెంచాలని సూచించారు.

ప్రభుత్వ పథకాలపై మంత్రుల సమీక్ష.

ప్రభుత్వ పథకాలపై మంత్రుల సమీక్ష

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

 

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధ్యక్షతన మహబూబ్ నగర్ మరియు నారాయణపేట జిల్లాల అధికారులతో వ్యవసాయ కార్యాచరణ వడ్ల కొనుగోలు, సీజనల్ అంటు వ్యాధులు, భూభారతి రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్లు మరియు రాజీవ్ యువ వికాసం పథకాల అమలుపై గౌరవనీయులు జిల్లా ఇన్చార్జి మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, శ్రీ దామోదర్ రాజనర్సింహ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంత్రులతో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాకు వచ్చిన ఇంచార్జీ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు.

 

MLA Yennam Srinivas Reddy

 

ఈ కార్యక్రమంలో నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుద్ రెడ్డి, డాక్టర్ పర్ణికా రెడ్డి, మక్తల్ శాసనసభ్యులు శ్రీ వాకిటి శ్రీహరి, నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు అధికారులు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అదనపు కలెక్టర్ మోహన్ రావు , మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లుకు సంబంధించి శుక్రవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సమాచార, డిఆర్డీఏ, సంక్షేమ, అటవీ, ఉద్యాన, వ్యవసాయ తదితర శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అమరవీరుల స్తూపం, డా బిఆర్ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను పూలతో అందంగా ముస్తాబు చేయాలని సూచించారు. వేడుకలకు సంబంధించి ప్రోటోకాల్ పాటిస్తూ అతిధులు కూర్చోడానికి షామియానాలు, కుర్చీలు, సురక్షిత మంచినీరు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యాన, ఆర్ అండ్ బి శాఖల అధికారులు స్టేజ్ ఏర్పాట్లు చేయాలన్నారు, జిల్లా ప్రగతి సందేశాన్ని తయారు చేయాలని డిపిఆర్వోను ఆదేశించారు. అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని డిపిఆర్వో ను, డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. వేడుకల సందర్భంగా అంబులెన్సులు, అత్యవసర వైద్య కేంద్రం, అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచాలని అన్నారు. మైదానంలో పారిశుద్ధ్య.కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. వేడుకలకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్డిఓ కార్యక్రమాలు ఆసాంతం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డిఓ రవి, అన్ని శాఖల అధికారులు
తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ పట్టణ మూడో మహాసభలను జయప్రదం చేయండి.

సిపిఐ పట్టణ మూడో మహాసభలను జయప్రదం చేయండి..

పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ సిపిఐ పార్టీ కార్యాలయం లో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయాల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ లు హాజరై మాట్లాడారు. సిపిఐ పట్టణ మూడో మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. మున్సిపాలిటీలోని 22 బస్తి శాఖల సమావేశాలు నిర్వహించి అన్నీ బస్తి శాఖల నూతన కమిటీ లను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.ఈ కమిటీ మూడు సంవత్సరాలు కొనసాగుతుందన్నారు. జూన్ 1 న జరిగే పట్టణ మహాసభలో పట్టణ కమిటీ నీ ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ఆవిర్భవించినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాటి నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కార్మిక కర్షకుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి అనేక హక్కులు సాధించింది అని గుర్తు చేశారు.ఈ మహాసభలకు ముఖ్య అతిథిలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లు పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మిట్టపల్లి పౌలు, పెర్క సంపత్, పెండ్యాల కమలమ్మ, గాజుల మణెమ్మ, మరపెల్లి రవి, కుక్క దేవానంద్, గోడిసెల గురవయ్య, ఎగుడ మొండి, మాదాస్ శంకర్, షేకీర్, కౌడగని సాంబయ్య తదితరులు పాల్గోన్నారు.

అక్రమ ఇసుక డంపులు విక్రయాలు.

అక్రమ ఇసుక డంపులు విక్రయాలు

పగలు రాత్రి జోరుగా నడుస్తున్న ఇసుక దందాలు

అధికారుల పట్టింపు లేకనే జోరందుకున్న జీరో ఇసుక దందాలు

గోదావరి ఇసుక చాటున ఏటి ఇసుక దందాలు

కేసముద్రం నేటి ధాత్రి:

 

రోజురోజుకు పెరిగిపోతున్న ఇస్కాసురుల ఆగడాలు అంతా కాదు ప్రతిరోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఏటి ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కేసముద్రం మండల పరిసర ప్రాంతాలలో ఉన్న వాగుల లో లభ్యమయ్యే ఇసుకను రాత్రి పగలు అని తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలించడమే కాకుండా చుట్టుపక్కల మండలాలలోని ఏటి ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఇసుక ట్రాక్టర్ 5000 వేలు మరియు ప్రభుత్వ చాలా నుకు డబ్బులు కడితేనే ఇసుక ఇంటి ముందరికి వస్తుంది మరి ఇసుకసురులు ఏ ప్రభుత్వ కార్యాలయానికి పన్ను చెల్లించకుండా ఇంత భారీగా అక్రమం ఇసుక రవాణా జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇసుక లభ్యం అయ్యే ఏరు కానీ వాగు కానీ ప్రాంతాలలో సంబంధిత కార్యాలయ సిబ్బందికి ముడుపులు చెల్లిస్తూ అక్రమ ఇసుక రావణా చేస్తున్నారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కొంతమంది ప్రత్యేకంగా ఇసుక దందాల కోసం ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వ ఆర్టిఏ నిబంధనలు పాటించకుండా నెంబర్ ప్లేట్లు లేకుండా ప్రభుత్వ ఆర్టిఏ నిబంధనలు తుంగలో తొక్కుతూ లైసెన్స్ లేని డ్రైవర్లను నియమిస్తూ దందాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ఇసుక దందాలు మూడు పూలు ఆరు కాయలు కన్నా ఎక్కువ లాభసాటిగా ఉండడంతో రాత్రి పగలు అని తేడా లేకుండా పట్ట పగలు కూడా రవాణా చేస్తున్నారంటే వీరికి ఎవరి అండదండలు లేనిదే చేయరు అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ మైనింగ్ అధికారులు ఇసుక మాఫియాకు అడ్డుకట్టు వేయాలని ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నందున ఇకనైనా అధికారులు స్పందించి ఇలాంటి ఇసుక సురుల ఆగడాలకు అడ్డుకట్టు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

రోడ్ల విస్తరణ జరుగుతుంది యజమానులు సహకరించాలి ఎమ్మెల్యే కలెక్టర్.

వనపర్తి లో రోడ్ల విస్తరణ జరుగుతుంది యజమానులు సహకరించాలి ఎమ్మెల్యే కలెక్టర్

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

వనపర్తి పట్టణము అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రోడ్డు విస్తరణకు సహకరించాలని ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి కోరారు
రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వ్యాపార సంస్థల యజమానులతో శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేగారెడ్డి మాట్లాడుతూ వనపర్తి పట్టణం నుంచి పెబ్బేరు రహదారి పానగల్ రహదారి విస్తరణకు సంబంధించి వ్యాపారస్తులను ఇళ్ల యజమానులను ఇబ్బంది పెట్టి రోడ్డు విస్తరణ చేపట్టదలుచుకోలేదని.

రోడ్డు విస్తరణను యజమానులను ఒప్పించి తగిన నష్ట పరిహారం ఇచ్చి విస్తరణ మాత్రం తప్పకుండా జరుగుతుందన్నారు.

పానగల్ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించడం లేదా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం వంటి సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారుపట్టణంలోని ప్రధాన రహదారి వనపర్తి -పెబ్బేరు రోడ్డు విస్తరణ అనేది భావి తరాలకు, వనపర్తి గౌరవాన్ని కాపాడటానికి చాలా ముఖ్యమని అందువల్ల వ్యాపారస్తులు రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు
వనపర్తికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, ఎక్కడ లేనివిధంగా సైఫాన్ డ్యామ్, చారిత్రాత్మక పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడే ఉన్నాయన్నారు రోడ్డు ఎన్ని ఫీట్లలో ఉండాలి అనేది ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ద్వారా రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా ఒకటి రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ తో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.

రోడ్డు ఒకే ప్లాట్ ఫాం పద్ధతిలో వంకరలు లేకుండా అలన్మెంట్ ఉంటుందన్నారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గత పదేళ్లలో వనపర్తి పట్టణ జనాభా రెండింతలు అయ్యాయని, రాబోయే రోజుల్లో నాలుగింతలు కావచ్చన్నారు.

జనాభాకు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు ఉండాలని అన్నారు పట్టణాల్లో కనీసం వంద ఫీట్ల రోడ్డు ఉండాలని,అప్పుడే పట్టణం అభివృద్ధి చెంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

ప్రతి పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుందని, వనపర్తి పట్టణానికి 2000 సంవత్సరంలోనే ప్లాన్ తయారు చేసి 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదించడం జరిగిందన్నారు.

రోడ్డు విస్తరణ ప్రజలకు చాలా అవసరమని, విస్తరణ వల్ల ఎక్కువ లాభం రోడ్డు పక్కన ఉన్న వ్యాపారస్తులకు కలుగుతుందన్నారు.

కొంత స్థలం కోల్పోతున్న వారికి టి.డి.ఆర్ ఇవ్వడం, పూర్తిగా స్థలం కోల్పోయే వారికి నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు
రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వారికి ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం టి.డి.ఆర్ తీసుకోవడం చాలా లాభదాయకమని వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు.

భవిష్యత్తులో డెవలపర్స్ కు అమ్ముకొని నాలుగింతల లాభం పొందవచ్చు అన్నారు.

రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న యజమానులు వారి వాదనలు, అభ్యర్థనలు తెలిపారు.

ముందుగా రోడ్డు మధ్యభాగం ఎక్కడి నుంచి కొలతలు చేస్తారో నిర్ణయించాలని అదేవిధంగా రోడ్డు విస్తరణ వంద ఫీట్లు కాకుండా 70 నుంచి 80 ఫీట్ల కు కుదించాలని కోరారు. వ్యాపారస్తుల తరపున అడ్వకేట్ నిరంజన్ పాషా తమ వాదనలు వినిపించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుమార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు .

మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత.

మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. శ్రీరాంపూర్ బస్టాండ్ లోని సింగరేణి కార్మికుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం తీగల్ పహాడ్ లోని జాగృతి కార్యకర్తలు కందుల ప్రశాంత్, నస్పూర్ తోళ్లవాగు సమీపంలోని శశి ఇళ్లకు వెళ్లారు.గౌతమి నగర్ లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు మునీర్ కుటుం బాన్ని పరామర్శించారు.అదేవిధంగా లక్షేట్ పెట్,పట్టణములో జాగృతి సోషల్ మీడియా కార్యకర్త నిశా,ఇంటికి వెళ్లడం జరిగింది.ఈ పర్యటనలో ఎమ్మెల్సీ కవితతో పాటు తన అనుచరులు కూడా ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version