రుక్మాపూర్ లో ఓ మహిళ దారుణ హత్య.

రుక్మాపూర్ లో ఓ మహిళ దారుణ హత్య

◆ ఘాతుకానికి పాల్పడ్డ గుర్తుతెలియని దుండగులు..?

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్ కల్ మండల రుక్మాపూర్ గ్రామంలో,గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలం, రుక్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన రాణమ్మ (46)ను ఇంట్లోకి చొరబడి సీసాలతో పొడిచి, గొంతును నొలిపి హత్య చేశారు. ఇంట్లో నుంచి బంగారం, నగదును అపహరించినట్లు సమాచారం. మహిళ హత్య ఘటన తెలుసుకున్న జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు పోలీసుల బృందంతో విచారణ చేపడుతున్నారు.

రెండవసారి మారగాని బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక.

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శిగా రెండవసారి మారగాని బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక

మరిపెడ నేటిధాత్రి:

ఒంటె కొమ్ము లక్ష్మారెడ్డి గార్డెన్ లో మరిపెడ మండలం ఐదవ మహాసభ జరగగా మరిపెడ మండలంలోని నీలికుర్తి గ్రామానికి చెందిన మారగాని బాలకృష్ణ గౌడ్ ఉన్నంత విద్యావంతుడైన మొదటి నుండి వామపక్ష విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేసి బాలకృష్ణ నూ గుర్తించి సిపిఐ పార్టీ మరిపెడ మండలం కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషిచేసిన బాలకృష్ణని తిరిగి 5వ మండల మహాసభలో రెండవసారి సిపిఐ మరిపెడ మండలం కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది
భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలపై కార్మిక శ్రామిక బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరిపెడ మండలంలో పార్టీ సూచించిన విధంగా నిరంతరం పోరాటాలు కొనసాగిస్తానని తెలియజేశాడు ఈ ఎన్నికకు సహకరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారధికి జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి కి సిపిఐ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా.

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా చేపట్టడం జరిగినది. గత కొద్ది కాలం నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి.
రేవంత్ రెడ్డి చిత్రపటం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల,పట్టణ, గ్రామ స్థాయి,నాయకులు సిరిసిల్ల బైపాస్ లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి. చిత్రపటాన్ని పెట్టడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు వెళ్లడం జరిగినది. అక్కడ ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పెట్టడానికి అనుమతించకపోవడంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరిగినది. ఇంతలో పోలీసుల జోక్యంతో ఇరు పార్టీల వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగినది. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నుండిజలగం ప్రవీణ్, మునిగేల్ రాజు,గజ్జల రాజు, గుండెలు శీను, భైరవేణి రాము, భాను,ఆరుట్ల మహేష్, చుక్క శేఖర్, రంజాన్ నరేష్, అభి గౌడ్,నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ సింధూర్ తో దేశ నికి రక్షణ బిజెపి.

ఆపరేషన్ సింధూర్ తో దేశ నికి రక్షణ బిజెపి

వనపర్తిలో బిజెపి తిరంగా ర్యాలీ

బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్

వనపర్తి నేటిధాత్రి:

జమ్మూ కాశ్మీర్ పెహల్గాం మారణకాండకు ప్రతీకారంగా భారత సైన్యం సింధూర్ కు మద్దతుగా తిరంగా ర్యాలీ రాష్ట్ర బిజెపి పిలుపు మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ మాట్లాడుతూ ఇస్లామిక్ టెర్రరిస్ట్ రాజ్యాలు కుట్రపూరితంగా పెహల్గాంలో 26 మందిని ఊచ కోత ఘటనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ టెర్రరిస్టులకు వారికి ఆశ్రయం కల్పిస్తున్న వారిని ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య ద్వారా మే 7 న కేవలం 22 నిమిషాల వ్యవధిలో పౌర సమాజానికి విఘాతం కలగకుండా 9 ఉగ్రస్తావరాలను పూర్తిగా నేలమట్టం చేసి వందలాదిమంది టెర్రరిస్టులను అంతమొందించి భారతదేశ రక్షణ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చెప్పారని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు వారికి మద్దతుగా నిలుస్తున్న బంగ్లాదేశ్ టర్కీ సౌదీ అరేబియా దేశాల వాణిజ్య ఒప్పందాలను పూర్తిగా రద్దుచేసి వారి ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేలా చేశారని అన్నారు. వనపర్తి లో తిరంగా ర్యాలీలో పార్టీలకతీతంగా విద్యార్థి యువజన కుల ప్రజా సంఘాలు రిటైర్డ్ ఆర్మీ జవాన్లు పెద్ద ఎత్తున పాల్గొని దేశ భద్రత విషయంలో దేశ జవాన్లకు నేను సైతం మద్దతుగా రాజకీయ పార్టీల కు అతీతంగా తిరంగా ర్యాలీలో పాల్గొనడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నారాయణ జిల్లా రామన్ గౌడు.పట్టణ ప్రధాన కార్యదర్శి నల్లబోతుల అరవింద్ కుమార్. రాష్ట్ర నాయకులు సబి రెడ్డి వెంకట్ రెడ్డి, లోక్నాథ్ రెడ్డి పురుషోత్తం రెడ్డి బిశ్రీశైలం చిత్తారి ప్రభాకర్, గౌని హేమారెడ్డి , రత్నాకర్ రెడ్డి కృష్ణారెడ్డి తపస్ ఉపాధ్యాయ సంఘం అమరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ చేయూత శ్రీనివాస్ రెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం సూర్యనారాయణ, రామ్మూర్తి హిందూ రాష్ట్ర మహాసభ అధ్యక్షురాలు నారాయణ దాసు జ్యోతి రమణ వనపర్తి పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు బచ్చురాము, కృష్ణ గౌడ్ సామాజిక నాయకులు పోచా రవీందర్ రెడ్డి, బులియన్ మర్చంట్ బంగారు అనిల్ అయ్యప్ప ఆలయ కమిటీ ముత్తు కృష్ణ గురుస్వామి స్నేక్ సొసైటీ చీర్ల కృష్ణసాగర్ మెడికల్ అసోసియేషన్ వినోద్ రామన్ గౌడ్ కుమారస్వామి ఏర్పుల సుమిత్రమ్మ, తిరంగా ర్యాలీ కో కన్వీనర్ కదిరే మధు, ఆగపోగు కుమార్ఎండి ఖలీల్, అశ్విని రాద, వారణాసి కల్పన, మని వర్ధన్, సాగర్, బోయల రాము, రాజశేఖర్, ఎద్దుల రాజు, తదితరులు పాల్గొన్నారు

బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి దగ్గర.

33 వ వార్డు ప్లా నింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి దగ్గర

సీసీ రోడ్డుకు పూజ చేసిన కాంగ్రెస్ నేతలు

వనపర్తి నేటిధాత్రి:

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు ప్లా నింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఇంటి దగ్గర సిసి రోడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ నేతలు పూజ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ ఎస్ ఎల్ ఎన్ రమేష్ మాజె కౌన్సిలర్ బ్రహ్మం కాంగ్రెస్ నేతలు కూరగాయల రవీందర్ వార్డు ప్రజలు కిరాణాము వ్యాపారి ఆర్యవైశ్యుడు కాలూరు శ్రీనివాసులు శెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు 33 వ వార్డు ప్రజలు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డికి ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డికి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు డిఎస్పి సైదా నాయక్ మరియు ఇన్స్పెక్టర్ శివ లింగం ఆదేశాల మేరకు నేషనల్ హైవే-65 మీద ప్రిన్స్ ధాబ ముందర వాహనాలు తనికి చేస్తుండగా ఒక బ్లూ కలర్ ఆక్టివా మోటార్ సైకిల్ మీద ఇద్దరు వ్యక్తులు బీదర్ వైపు నుండి హైదరాబాద్ కు అక్రమంగా ఎండు గంజాయి ని తరలిస్తుండగా పట్టుకున్నాము ఆ ఇద్దరు వ్యక్తులు పేర్లు తెలుసుకొనగా1) షైక్ సల్మాన్ తండ్రి జబ్బార్ హైదరాబాద్ 2) మహమ్మద్ మొయిజుద్దీన్ తండ్రి సమీఉద్దీన్ హైదరాబాద్ ని తెలిపినారు వీరు ఇద్దరు బీదర్ లో ఇరానీ గల్లీలో గంజాయిని తక్కువ రేట్ కి కొనుగోలు చేసి హైదరాబాద్ లో ఎక్కువరేట్ కు అమ్ముకొనుటకు తీసుకుని వెళ్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తరువాత మెజిస్ట్రేట్ గారి ముందు హాజరు పరిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా అల్లం ఓదెలు ఎన్నిక.

కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా అల్లం ఓదెలు ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి:

 

టేకుమట్ల మండలం అంకుషాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా రెండోసారి అల్లం ఓదెల్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు అనంతరం అల్లం ఓదెలు మాట్లాడుతూ గత ప్రభుత్వం అనేక ఒత్తిడి చేసిన పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసినందుకు గాను నన్ను గుర్తించి నా మీద నమ్మకంతో గ్రామ శాఖ అధ్యక్షుడిగా రెండోసారి నన్ను ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకి మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ కు మండల నాయకులకు అంకుషాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను నిరుపేద లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తానని అల్లం ఓదెలు తెలిపారు

వర్ఫ్ ఆస్తులపై కన్నేసిన బీజేపీ ప్రభుత్వం.

వర్ఫ్ ఆస్తులపై కన్నేసిన బీజేపీ ప్రభుత్వం..

ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్.

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ బహిరంగ సభలో పాల్గొన్న నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన వక్స్ సవరణ బిల్లు ఎక్కువ రోజులు నిలువదని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్, కర్ణాటక రాష్ట్ర మంత్రి మహమ్మద్ రహీం ఖాన్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్ అన్నారు. వర్ఫ్ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు.వర్షంలోనే అతిధులు అదరకుండా బెదరకుండా సమావేశంలో మాట్లాడడం పట్ల ప్రజలు కుర్చీలను తమ నెత్తిపై పెట్టుకుని సభలో పాల్గొన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన అనంతరం కొన్ని వర్గాలపై రోజుకోరకమైన చట్టాలు నియమాలు నిబంధనలు తీసుకువచ్చి అణగదొక్కెందుకు కృషి చేస్తుందన్నారు. రబ్బర్ బాలు గోడకు కొడితే ఆ బాలు తిరిగి అదే వేగంగా వస్తుందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలని అన్నారు.

వక్స్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఉదయం 3 గంటల వరకు పార్లమెంటులో ఉండి ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినానని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు.త్వరలోనే కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తుంది ఈ విధమైన బిల్లులన్నీ చెల్లకుండా పోతాయన్నారు. లౌకికత్వాన్ని పూర్తిస్థాయిలో పాటించేది అన్ని వర్గాలకు సమాన ప్రతిపాదికన గౌరవించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ ముయ్యద్దీన్,ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు తైవుల్లా, లతోపాటు మాజీ టి ఎస్ ఐ డి సి చైర్మన్ మహమ్మద్ తన్వీర్, ఎంఐఎం జహీరాబాద్ అధ్యక్షులు మొహమ్మద్ అత్తర్ అహ్మద్,అశోక్ అప్పారావు, తాసిల్దార్ దశరథ్, మత పెద్దలు పుర ప్రముఖులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వర్షంలోనే కొనసాగిన సదస్సు

జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో ఏర్పాటుచేసిన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు వ్యతిరేక నిరసన సదస్సు వర్షంలోనే కొనసాగింది. వక్తలు వర్షంలో తడుచుకుంటూ ప్రసంగాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సవరణ బిల్లు కంటే ఈ వర్షం కఠినమైంది కాదని ఇలాంటి వర్షాలను తాము ఇలాంటి ఎన్నో కష్టాలు సహిస్తామని వక్తలు ప్రకటించారు.

ఈద్గా మైదానంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.

ఈద్గా మైదానంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం..

గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ..

◆ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్

◆ ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్

◆ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆ -కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం ఉజ్వల్ రెడ్డి

◆ జహీరాబాద్ మాజీ మంత్రివర్యులు డా౹౹ఎ. చంద్రశేఖర్..*

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో పార్లమెంట్ అమోదించిన “వక్స్ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంగా విద్యుత్-దీపాల కమాన్ కూలిపోవడంతో కింద కూర్చున్న 8 మందిపై పడి గాయాలయ్యాయి.తీవ్రంగా గాయపడిన వారికి హైదరాబాద్ తరలించారు.విద్యుత్ సరఫరా అవడంతో వెంటనే అధికారులు విద్యుత్ సరఫరాలను నిలిపివేశారు.దీంతో పెను ప్రమాదం తప్పింది.గాయపడి చికిత్స పొందుతున్న వారిని స్థానిక సన్ రోహి ఆసుపత్రిలో ఆదివారం మహమ్మద్ షబ్బీర్ అలీ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్ ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్ డా౹౹ఎ. చంద్రశేఖర్,మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పరామర్శించారు.వారు వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు.వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,మండల కాంగ్రెస్ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,అక్తర్,హర్షద్ పటేల్,అక్బర్, జుబేర్,జహంగీర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న రైల్వే బోర్డు.!

పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

జహీరాబాద్ నేటి ధాత్రి:

పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న బీ ఆర్ఎస్ నాయకులు, రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ హజ్ యాత్రకు వెళుతున్న శుభసందర్భంగా పూలమాల శాలవాతో సత్కరించి, హజ్ యాత్ర ప్రయాణం సురక్షితంగా సఫలంగా సాగాలని మాజీ మంత్రివర్యులు హరీష్ రావు,డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని పవిత్ర స్థలంలో దేవునితో ప్రార్థించాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.రాష్ట్ర దేశ ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు ఐష్టెశ్వర్యాలతో జీవించాలని మనసారా ప్రార్ధనలు చేయాలని తెలిపారు.

ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కామన్ ఆర్చి ప్రారంభోత్సవం.

ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కామన్ ఆర్చి ప్రారంభోత్సవం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కమాన్ ఆర్చి ప్రారంభోత్సవం జరిగింది. సందర్భంగా నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో అంబేద్కర్ ఇందుకుగాను దాతలు సాయం కమాన్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందని ఎందుకు సహకరించిన దాతలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇట్టి విమానానికి సహకరించిన దాతలకు కమిటీ ఆధ్వర్యంలో జ్ఞాపిక అందజేసి శాలువాలతో సత్కరించడం జరిగింది. ఇందుకుగానుముఖ్య అతిథులుగా గౌరవధాతలు. తుమ్మ రామస్వామి . రిటైర్డ్ సెక్రటేరియట్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రెటరీ. గొట్టే.పద్మారావు రిటైర్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ కరీంనగర్. గొట్టే.జయశ్రీ స్పెషల్ డిస్టిక్ డిప్యూటీ కలెక్టర్ భువనగిరి జిల్లా. గొట్టే.అశోక్. రిటైర్డ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్. గొట్టే సంజీవయ్య ఎస్సార్ మేనేజర్ ఎన్టిపిసి మరియు తుమ్మ శ్రీనివాస్ . టి జి పి డి సి ఎల్ జూనియర్ అసిస్టెంట్.గొట్టే పద్మ. టిఆర్ఎస్ జిహెచ్ఎంసి జనరల్ సెక్రెటరీ హైదరాబాద్ కమిటీ సభ్యులు గట్టేపల్లి రమేష్ .క్యారo పెంటయ్య. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి లింగాల జలంధర్ . గొట్టే కరుణాకర్. నాయకులు గ్రామ మహిళలు తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

హైడ్రాపై నేటిధాత్రి అందించిన కథనం బాగుంది: హైడ్రా కమీషనర్ రంగనాధ్.

హైడ్రాపై ప్రజల్లో వస్తున్న చైతన్యంపై నేటిధాత్రి కథనానికి కమీషనర్ ప్రశంస.

ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కథనాలు ఎంతో అవసరం.

హైడ్రా వల్ల జరగనున్న మంచి పరిణామాలపై మరింత లోతైన విశ్లేషణలు అందించాలని కోరిన రంగనాధ్.

రంగనాధ్ ను కలిసిన నేటిధాత్రి డిజిటల్ మీడియా సిఈఓ కట్టా శివ సుబ్రహ్మణ్యం.

శివ సుబ్రహ్మణ్యంతో అనేక విషయాలు చర్చించిన రంగనాధ్.

హైడ్రాపై మీడియా పరంగా నేటిధాత్రి ఇచ్చిన సపోర్ట్‌కు అభినందనలు చెప్పిన రంగనాధ్.

హైడ్రాపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించే విధంగా నేటిధాత్రి దిన పత్రిక, నేటిధాత్రి డిజిటల్ మీడియాలో వచ్చిన కథనం చాలా బాగుందని కమీషనర్ రంగనాధ్ ప్రశంసించారు. హైడ్రా కమీషనర్ రంగనాధ్‌తో నేటిధాత్రి డిజిటల్ మీడియా సిఈఓ కట్టా శివ సుబ్రహ్మణ్యం శని వారం బుద్ద భవన్‌లో వున్న కార్యాలయంలో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా శివ సుబ్రహ్మణ్యంతో కమీషనర్ మాట్లాడుతూ ప్రజలను సామాజికంగా చైతన్యం చేయడంలో నేటిధాత్రి విశేషంగా కృషి చేస్తోందని అభినందించారు. తాను నిత్యం నేటిధాత్రి దిన పత్రిక‌ను తప్పకుండా చూస్తుంటానని చెప్పారు. హైడ్రా పని తీరు, ప్రజల నుంచి ఇటీవల వస్తున్న స్పందనలను ఎంతో విశ్లేషణాత్మకంగా చెప్పడం జరిగిందన్నారు. అంతే కాకుండా హైడ్రా వల్ల భవిష్యత్తులో హైదరాబాద్ ఎలా వుండబోతోంది, పర్యావరణ పరిరక్షణలో హైడ్రా ఎలాంటి పాత్ర పోషించబోతోందనే విషయాలు ఎంతో స్పష్టత చెప్పారని రంగనాధ్ తెలిపారు. హైడ్రా లాంటి గొప్ప కార్యక్రమం విజయవంతం కావాలంటే నేటిధాత్రి లాంటి మీడియా సపోర్ట్ ఎంతో అవసరమని గుర్తు చేశారు. హైడ్రాపై ఇంకా చైతన్యం తీసుకొచ్చే బాధ్యతను మీడియా పరంగా నేటిధాత్రి తీసుకోవాలని రంగనాధ్ కోరారు. హైడ్రా విషయంలో ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా వుంటామన్నారు. హైడ్రా కార్యాలయం ప్రారంభమైన రోజు నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తమ, తమ కాలనీలలో దశాబ్దాల తరబడి అనుభవిస్తున్న సమస్యలను వివరిస్తూ విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నారని రంగనాధ్ తెలియజేశారు. హైడ్రాతో తాము కొన్ని దశాబ్దాలగా అనుభవిస్తున్న సమస్యలు తీరుతుండడంతో ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని రంగనాధ్ గుర్తు చేశారు. అలాంటి అంశాలతో కూడిన నేటిధాత్రి కథనం కూడా అద్భుతంగా వుందని కమీషనర్ చెప్పారు.

సింధు, సట్లెజ్‌ ప్రవాహాలను చైనా అడ్డుకుంటుందా?

గతంలో నీటిని ఆయుధంగా వాడుకున్న చరిత్ర చైనాది

నీటి వాడకంపై అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేయని చైనా

నీటి వాడకంపై దానికి పూర్తిస్వేచ్ఛ

దౌత్యం తప్ప మరో పరిష్కారం లేదు

కొన్ని పరిమితుల్లో ఈ నదుల నీటిని ఆపగలదు

అయితే భౌగోళిక స్వరూపం చైనాకు పెద్దగా అనుకూలించదు

డెస్క్‌,నేటిధాత్రి: 

పహల్గామ్‌ దాడుల తర్వాత మనదేశం పాకిస్తాన్‌తో కొనసాగుతున్న సింధూనదీ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడం, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేవరకు ఈ ఒప్పందంపై మాట్లాడే ప్రసక్తే లేదని భారత్‌ తెగేసి చెప్పింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్‌లోని పంజాబ్‌, సింధ్‌ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిరది. సింధ్‌లో నీటికోసం ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఏకంగా ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఇంటిపై దాడిచేశారు. తగులబెట్టారు. అడ్డుకున్న పోలీసుల్ని చితకబాదారు. సింధ్‌ రాష్ట్రానికి నీరు రాకుండా, పంజాబ్‌ అడ్డుకుంటుండటం సింధ్‌ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహానికి ప్రధాన కారణం. ఇదిలావుండగా ‘మాకు సింధూజలాలను ఆపితే భారత్‌ ప్రజల ఊపిరి ఆపేస్తామంటూ’ పాకిస్తాన్‌ సైనిక ప్రతినిధి లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరి తాజాగా చేసిన వ్యాఖ్యలు వారిలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. గతంలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ కూడా సరిగ్గా ఇవే వ్యాఖ్య లు చేయడం గమనార్హం. ఇటువంటి దుస్థితికి ప్రధాన కారణం పాకిస్తాన్‌ పాలకుల వైఖరే! పహల్గామ్‌లో ఉగ్ర దాడులకు పాల్పడి వుండకపోతే ఈ దుస్థితి ఏర్పడివుండేది కాదు. పాక్‌ను శిక్షించడానికి భారత్‌సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత కూడా మనదేశాన్ని బెదిరిస్తున్నది తప్ప, ఉగ్రవాదులను శిక్షిస్తామని కాని లేదా ఉగ్రవాదం నుంచి వైదొలగుతామని గాని చెప్ప డంలేదు. ఎందుకంటే అదొక ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రం. అటువంటి ధూర్త దేశానికి ఈ శిక్ష సరైందే! ఇక మరో దౌర్భాగ్యదేశం చైనా. ఎంతసేపూ ఎప్పుడో శతాబ్దాలనాటి లెక్కలు చెబుతూ, ఇతర దేశాల భూభాగాలన్నీ తమవేనని వాదించే ఒక మూర్ఖ దేశం! నిరంతర కాలగమనంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వీటికి అనుగుణంగా మనల్ని మనం మలచుకొని జీవించడమే ఉత్తమ మార్గం! దీన్ని వదిలేసి ఇతరదేశాల భూభాగాలను తమవేనంటూ కాలగతిలో కలిసిపోయిన చరిత్రను చూపుతూ వర్తమానాన్ని అశాంతిమయం చేసుకుంటున్న దేశం ఒక్క చైనా మాత్రమే! దాని పాలకుల సిద్ధాంతాలు అటువంటివి!!

అసలు విషయానికి వస్తే ప్రస్తుతం సింధూనది ఒప్పందాన్ని మనదేశం నిలిపేయడం వల్ల, పాకి స్తాన్‌లోకి సింధూనది దాని ఉపనదుల ప్రవాహం నిలిచిపోయింది. నిజానికి ఈ సింధూ, సట్లెజ్‌ నదుల పుట్టుక స్థానాలు చైనా ఆధీనంలోని టిబెట్‌లో వుండటంతో ఈ సమస్య ఒక సంక్లిష్ట కో ణంలోకి మారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింధూనదీ జలాల ఒప్పందం ప్రకారం తూర్పున ప్రవహించే సట్లెజ్‌, బీయాస్‌, రావి నదుల నీటిని మనం వాడుకోవచ్చు. అదే పశ్చిమాన ప్రవహించే సింధూ, జీలం, చీనాబ్‌ నదుల నీటిని పాక్‌ వినియోగించుకోవాలి. పహల్గామ్‌ దాడితో ఈ ఒప్పందాన్ని మనదేశం నిలిపేసింది. ఈ చర్యవల్ల పాకిస్తాన్‌కు చుక్కనీరు పోవడంలేదు. ఇందుకు ప్రతీకారంగా టిబెట్‌లో జన్మించిన సింధూ, సట్లెజ్‌ నదీ ప్రవాహాలను మనదేశంలోకి రాకుండా చైనా అడ్డుకునే అవకాశముందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ రెండు ధూర్త దేశాల మధ్య స్నేహం ‘తేనెకంటే తియ్యనైనది’ కాబట్టి!

ఈ నదుల పుట్టుక స్థానాలు

మానససరోవరం సరస్సుకు సమీపంలోని సెంగ్‌ ఖబాబ్‌ హిమానీనదం సింధూనదికి జన్మస్థానం.ఇది కైలాస పర్వతానికి కూడా దగ్గరిగానే వుంటుంది. ఐదువేల మీటర్ల ఎత్తులో జన్మించిన ఈ నది టిబెట్‌ గుండా ప్రవహించి మనదేశంలోని లద్దాఖ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ జన్‌స్కర్‌, సయోక్‌ఉపనదులు ఇందులో కలుస్తాయి. ఆ తర్వాత మనదేశంగుండా ప్రవహించి, పాక్‌లోకి ప్రవేశి స్తుంది. ఆవిధంగా సుమారు 3180 కిలోమీటర్ల దూరం ప్రవహించిన సింధూనది చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుంది. ప్రాచీన సింధూ నాగరికత ఈ నదీ పరీవాహక ప్రాంతంలోనే పరిఢవిల్లింది. ప్రస్తుతం ఈ నది భారత్‌, పాకిస్తాన్‌లకు జీవనాడి వంటిది. ఎన్నో జలవిద్యుత్‌ కేంద్రాలు దీనిపై నిర్మించారు. కొన్ని లక్షల ఎకరాల సాగుకు ఈ నది నీరే ఆధారం. 

ఇక సట్లెజ్‌ నది, రాక్షస్‌తాల్‌కు సమీపంలోని లంగ్‌ఛన్‌ ఖబాబ్‌ హిమానీనదంలో పుడుతుంది. 4600 నుంచి 5వేల మీటర్ల ఎత్తున వుండే ఈ గ్లేసియర్‌ నుంచి టిబెట్‌ గుండా ప్రవహిస్తుంది. భారత్‌లోని హిమాచల్‌ ప్రదేశ్‌లోని షిప్కిలా పాస్‌ గుండా ప్రవేశించడానికి ముందు ఈ నదిలో స్పిటీ ఉపనది ఇందులో కలుస్తుంది. తర్వాత ఇది కిన్నర్‌ కైలాష్‌ ప్రాంతం గుండా ప్రవహించి పంజాబ్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ రాష్ట్రంలోనే భక్రా ప్రాజెక్టును మనదేశం నిర్మించింది. ఈ ప్రాజ ెక్టుకు ప్రదాన నీటివనరు సట్లెజ్‌! చివరకు పాక్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇది సింధూనదిలో కలుస్తుంది. మొత్తం 1450 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది పంజాబ్‌కు గుండె వంటిదని చెప్పడంలో సందేహం లేదు. 

ఈ నదుల ప్రవాహాన్ని చైనా ఆపగలదా?

సాంకేతికంగా చెప్పాలంటే ఈ రెండు నదుల నీటిని చైనా ఆపగలదు. సెంగే త్సాంగ్‌పో, నగరి షికాన్వే జలవిద్యుత్‌ కేంద్రాలను, సింధూనది జన్మస్థానం వద్ద నిర్మించింది. ఇక సట్లెజ్‌ నదిపై జడా గోర్జ్‌ బ్యారేజ్‌ను కూడా నిర్మించింది. ఈ నిర్మాణాల ద్వారా చైనా మనదేశంలోకి ఈ రెండు నదుల నీటి ప్రవాహాన్ని నియంత్రించగలదు. ఇప్పటికే చైనా తమదేశంలోని నదులపై ఎన్నో ప్రాజెక్టులు నిర్మించింది. ముఖ్యంగా ‘సౌత్‌`నార్త్‌ వాటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్టు’ ద్వారా ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది, ఇంకా చేపడుతోంది. ఈ ప్రాజెక్టుకింద నదీ జాలాలను తమదేశంలోని నీటి ఎద్దడి ప్రాంతాలకు తరలిస్తోంది. అయితే ఇప్పటివరకు సింధు, సట్లెజ్‌ నదులపై ఇటువంటి నీటి తరలింపు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టలేదు. 2017లో బ్రహ్మపుత్రానదికి సంబంధించిన వరద సమాచారాన్ని భారత్‌ అందించని రీతిలో, ఈ నదుల ప్రవాహ సమాచారాన్ని మనదేశంతో పం చుకోకపోవచ్చు. ఈ రెండు నదుల విషయంలో ఇప్పటివరకు ఆటువంటి చర్యకు పూను కోలేదు. నీటిని భౌగోళిక రాజకీయ ఉపకరణంగా గతంలో చైనా కొన్నిసార్లు మనదేశంపై ప్రయోగించింది. 2016లో బ్రహ్మపుత్ర ఉపనది షియాకు ప్రవాహాన్ని నిలిపేసి, మనదేశానికి ఒక హెచ్చరికను పంపింది. 2020లో గల్వాన్‌ సంఘటన తర్వాత ఈ నదినీటి ప్రవాహాన్ని నిలిపేసింది. పలితంగా ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడిరది. గల్వాన్‌ నది సింధూనదికి ఉపనది. 2004లో పరెచునదిపై ఒక కృత్రిమ సరస్సును సృష్టించింది. పరెచు నది సట్లెజ్‌కు ఉపనది. ఈ కృత్రిమసరస్సు ను ‘నీటిబాంబు’గా చైనా ఉపయోగించవచ్చునని భయాందోళనలు వ్యక్తమయ్యాయి కూడా. అ యితే ఇక్కడి నీటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత్‌కు అందిస్తూ పరిస్థితి చేజారిపోకుండా చైనా జాగ్రత్తపడటం విశేషం!

ప్రస్తుతం భారత్‌ సింధూనదీ జలాల ఒప్పందాన్ని నిలిపేసిన నేపథ్యంలో, ఇందుకు ప్రతీకారంగా టిబెట్‌లోని సింధు, సట్లెజ్‌ ప్రవాహాలను చైనా నియంత్రించే అవకాశముందని కొందరు నిపుణుల అభిప్రాయం. ఇదే సమయంలో తమదేశంలో పెరుగుతున్న నీరు, విద్యుత్‌ డిమాండ్‌ నేపథ్యంలో ఈ నదీ జలాలను ఆయా ప్రాంతాలకు తరలించకూడదనేంలేదని కూడా ఈ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కొన్ని పరిమితుల్లో మాత్రమే చేయగలదు

ఈ నదుల నీటిని భౌగోళిక రాజకీయ ఆయుధంగా ఉపయోగించాలంటే చైనాకు కొన్ని పరిమితులున్నాయి. సింధు, సట్లెజ్‌ నదుల నీటిలో వరుసగా 10%`15% మరియు 20% మాత్రమే టిబెట్‌లో ప్రవహిస్తాయి. ఈ ప్రాంతం భూకంపాలకు ఆలవాలం కనుక, పెద్దఎత్తున డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడం, పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుంది. అంతేకాకుండా నీటిని ఆవిధంగా నిలిపేయడం ‘హిల్సింకి’ వంటి అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం. చైనా తీవ్ర విమర్శలకు గురికాకతప్పదు. అయితే యునైటెడ్‌ నేషన్స్‌ వాటర్‌కోర్సెస్‌ కన్వెన్షన్‌ను ఇప్పటివరకు చైనా అంగీక రించలేదు. చైనా తన నీటివనరులపై సార్వభౌమాధికారం విషయంలో ఎంతమాత్రం పట్టు సడ లించడంలేదు. దీన్ని ఆమోదించనంతవరకు నీటి ప్రవాహానికి దిగువన ఉండే దేశాలకు చట్టబ ద్ధంగా అడిగే హక్కు వుండదు. అప్పుడు దౌత్యం, ప్రపంచదేశాలు కలుగజేసుకోవడం వంటి ప్రక్రియల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సి వుంటుంది. ప్రస్తుతానికి భారత్‌ చైనాల మధ్య 2002 మరియు 2018 సంవత్సరాల్లో బ్రహ్మపుత్ర, సట్లెజ్‌ నదీ ప్రవాహాలకు సంబంధించిన స మాచారం ఇచ్చిపుచ్చుకోవడంపై ఒప్పందాలు కుదిరాయి. అయితే ఈ ఒప్పందాల కాలపరిమితి 2023తో ముగిసినా, చైనా సమాచారాన్ని పంచుకోవడాన్ని మాత్రం ఇప్పటివరకు ఆపలేదు. అదీకాకుండా రెండు దేశాల మధ్య ప్రత్యేకించి నదీజలాల ఒప్పందాలేవీ లేనందువల్ల, తమదేశంలో ప్రవహించే నదుల విషయంలో చైనా తనకు అనుకూలంగా పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించే అవ కాశాలే నూటికి నూరుశాతం వున్నాయి.

కాల్పుల హోరు నుంచి ప్రగతి కాంతులవైపు

అభివృద్ధి వైపు అడుగులేస్తున్న ఛత్తీస్‌గఢ్‌
హైదరాబాద్‌,నేటిధాత్రి:
వామపక్ష తీవ్రవాద పీడిత రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ కూడా ఒకటి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పుల సంఘటనలతో ఎప్పటికప్పుడు పతాకశీర్షికల్లో నిలిచే రాష్ట్రంగా పేరుపడిరది. అందువల్ల చత్తీస్‌గఢ్‌ అంటేనే నక్సల్స్‌ మరియు ఎన్‌కౌంటర్‌ వార్తలు తప్ప మరే యితర సమాచారం మనలకు పెద్దగా లభ్యమయ్యేది కాదు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదనేది కాదు ప్రశ్న, అభివృద్ధి పథంలో ఏవిధంగా ముందుకెళుతున్నదనేది ప్రధానం! వామపక్ష తీవ్ర వాదం వల్ల చోటుచేసుకున్న హింసాకాండ నేపథ్యంలో అభివృద్ధి మసకబారినట్టు కనిపించిన నేపథ్యంలో ఇక్కడి ప్రగతి ఉషోదయ కాంతులు, ఇతర రాష్ట్రాలకు తెలియకపోవడం సహజమే. ఈ నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌ అభివృద్ధి కోణాన్ని స్పృజిస్తే మనకు తెలియని ఎన్నో విషయాలు అవగాహనకు వస్తాయనేది మాత్రం సుస్పష్టం. ఒక్కసారి ఈ కోణంలో చత్తీస్‌గఢ్‌ను పరిశీలిద్దాం.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల నేపథ్యంలో క్రమంగా మావోయిస్టుల ప్రభావం తగ్గుతున్న క్రమంలో, మరోవైపు రాష్ట్రంలో తయారీ, సేవా రంగాలు క్రమంగా ఊపందుకోవడం వర్తమాన పరిణామం. రాష్ట్రంలో రూ.4.5లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులకు రంగం సిద్ధమైంది. మేనెల మొదట్లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి రాష్ట్రంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డే టా పార్క్‌కు శంకుస్థాపన చేయడంతో, దేశంలోనే మొట్టమొదటి ఏఐ సెంట్రల్‌ పార్క్‌ ఏర్పాటు చేసిన రాష్ట్రంగా నిలిచింది. అంతకు ముందు అంటే గత ఏప్రిల్‌ నెలలో సెమికండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గాలియం నైట్రైడ్‌ ఆధారిత చిప్‌ల తయారీకేంద్రం. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించి ఆ దిశగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం ముమ్మరమైంది. కేంద్రం ఒకపక్క రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పే దిశగా చర్యలు తీసుకుంటుండగా, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చర్యలు చేపడుతుండటం గమనార్హం.
ప్రస్తుతం రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం 2024 నవంబర్‌ 1నుంచి అమల్లో వుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన కేవలం ఆర్నెల్ల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.4.5లక్షల కోట్ల వి లువైన పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.5.09లక్షల కోట్లుగా నమోదైంది. ఈ అవగాహనా ఒప్పందాల మొత్తం జీఎస్‌డీపీలో సింహభాగమనదగ్గ స్థాయిలో వుండటం విశేషం. నిజానికి ఈ అవగాహనా ఒప్పందాలన్నీ వాస్తవరూపం దాలిస్తే రాష్ట్ర జీఎస్‌డీపీ దాదాపు రెట్టింపు అవుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. కానీ అవగాహనా ఒప్పందాలు కుదరడం మొదటిదశ అయితే, వీటి అమలు రెండోదశగా భావించాల్సి వుంటుంది.
గత ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచడంపై దృష్టి కేంద్రీకరించారు. ఇందుకోసం అప్పటివరకు అమల్లో వున్న పారిశ్రామిక విధానంలో ఏఏ మార్పులు తీసుకురావాలో నిర్ణయించేందుకు ఒక కమిటీని ఏ ర్పాటు చేసి మేధోమధనం జరిపారు. అంతేకాదు నూతన పారిశ్రామిక విధానానికి తుదిరూపం ఇవ్వడానికి ముందు, దీనికి సంబంధించిన భాగస్వాములు, పారిశ్రామికవేత్తల సలహాలను, సూ చనలను పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక ముసాయిదాను రూపొందించే స మయంలో రాష్ట్ర భౌగోళిక, ఆర్థిక మరియు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు. రాష్ట్రం లో బాక్సైట్‌, బగ్గు నిక్షేపాలు అపరిమితంగా వున్న నేపథ్యంలో, ఈ రెండిరటిని కీలక పరిశ్రమ లుగా అభివృద్ధి చేయాలన్న దృష్టితో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. ఇదే సమయంలో కేవలం బాక్సైట్‌, బగ్గు నిక్షేపాలే రాష్ట్రానికి బ్రాండ్‌ ఇమేజ్‌గా స్థిరపడకుండా, ఇతర రంగాలు ముఖ్యంగా సేవారంగానికి ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాదు ఔషధాలు, వస్త్రపరిశ్రమ, వ్యవసాయ ఆధారిత ఆహార పరిశ్రమలు, విద్యుత్‌ మరియు ఎలక్ట్రానిక్‌ రంగాలపై కూడా ఈ విధాన రూపకల్పనలో దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం నవ రాయ్‌పూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా రూపొందిన నేపథ్యంలో దీన్ని ఐ.టి. హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలోని బస్తర్‌, సర్గూజా జిల్లాల్లో ఒక్క పరిశ్రమ స్థాపన ఇప్పటివరకు జరగలేదు. ఈ ప్రాంతా ల్లో కూడా పారిశ్రామికాభివృద్ధికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలోకి పరిశ్రమలు రాకపోవడానికి ప్రధాన కారణం రెడ్‌టేపిజం. అనుమతులు రావాలంటే ఒక ప్రభుత్వ శాఖనుంచి మరో శాఖకు తిరగడం తప్ప ఫలితం వుండని పరిస్థితి నెలకొంది. అంతేకాదు అనేక శాఖల అనుమతులు తీసుకోవాల్సి రావడం ప్రధాన అడ్డంకిగా మారింది. రాష్ట్రం లో భూమి కొనుగోలు చేయాలన్నా, లీజుకు తీసుకోవాలన్నా కఠిన నిబంధనలు అమల్లో వున్నా యి. పరిశ్రమలు రాకపోవడానికి ఇదికూడా ఒక కారణం. ఇదేసమయంలో ఎవరైనా పరిశ్రమ లు పెట్టాలనుకున్నా, ప్రభుత్వం తరపున ఎటువంటి ప్రోత్సాహకాలు అందవు! రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇండస్ట్రియల్‌ పార్క్‌లు లేవు. అసలు కొత్త తరహా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు అనుగుణమైన నిబంధనలే లేవు. ఈ ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన నూతన పారిశ్రామిక విధానానికి 2024, అక్టోబర్‌ నెలలో మంత్రివర్గ ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్ల కాలానికి అనుగుణంగా ఈ ముసాయిదా రూపకల్పన చేసింది. అంటే 2030 మార్చి 31 వరకు ఈ విధానం అమల్లో వుంటుంది.
ఈ నూతన పారిశ్రామిక విధానం అమలుకోసం ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపును అనేకరెట్టు పెంచింది. పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేందుకు కేటాయింపులను మూడురెట్లు పెంచింది. ఈ నేపథ్యంలోనే 2025`26 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక`వాణిజ్య శాఖకు ఏకంగా రూ.709.87 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రంలో 34 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసివున్నందున, వీటిల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన మద్దతు ఇవ్వనుంది. అనుమతుల సమస్యను అధిగమించేందుకు ‘సింగిల్‌ విండో’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం ఇ ప్పుటికు అమల్లో వున్న నిబంధనల్లో 350 మార్పులు చేశారు. కొత్తతరం పరిశ్రమలకు అనుకూ లంగా కొత్త నిబంధనలను చేర్చారు.
ఈ నూతన పారిశ్రామిక విధానం పారిశ్రామిక రంగాన్ని రెండు కీలక సెక్టార్లుగా విభజించింది. మొదటిది ‘చోదక రంగం’ కాగా రెండవది ‘ముఖ్యమైనవి లేదా కీలకమైనవి’. ఔషధాలు, వస్త్రపరి శ్రమ, వ్యవసాయం మరియు ఆహారశుద్ధి, ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌, ఏఐ, రోబోటిక్స్‌, కంప్యూటింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డేటా సెంటర్లను ‘చోదక’ విభాగంలో చేర్చారు. ఈ విభాగం కింద పెట్టు బడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి పెద్దమొత్తంలో ప్రోత్సాహకాలను అందిస్తారు. అంతేకాదు ఈ విభాగంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చే మొదటి ఐదు పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సా హకాలు అందిస్తారు. ఇక సంప్రదాయిక పరిశ్రమలైన స్టీల్‌, సిమెంట్‌, అల్యూమినియం, థర్మల్‌, సోలార్‌ ప్లాంట్లను ప్రభుత్వం విస్మరించలేదు. ఈరంగంలో ఫిక్స్‌డ్‌ కేపిట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో నూటికి నూరుశాతం జీఎస్టీ ని మినహాయించారు. దీంతో పాటు ఇతర మినహాయింపులు కూడా ప్ర భుత్వం కల్పిస్తుంది.
రాష్ట్రంలో సమానంగా పారిశ్రామికాభివృద్ధి సాధనకు, జిల్లాలను మూడు గ్రూపులుగా ప్రభుత్వం విడగొట్టింది. వెనుకబడిన జిల్లాల్లో నెలకొల్పే పరిశ్రమలకు మరింత ఎక్కువ రాయితీలు మరియు ప్రోత్సాహకాలు లభిసాయి. ఇందుకోసం 2006లో కేంద్రం తీసుకొచ్చిన ఎంఎస్‌ఎంఈ చట్టం లో కేంద్రం 2020లో తీసుకొచ్చిన సవరణలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ముఖ్యంగా చిన్న, మధ్య, భారీ పరిశ్రమలకు ఇచ్చిన నిర్వచనాల్లో కేంద్రం తీసుకొన్ని సవరణలనే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ప్రమాణంగా తీసుకోవడం గమనార్హం. ఇందులో భాగంగా రూ.వెయ్యికోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా వెయ్యిమంది స్థానికులు ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఆకర్షణీయ ప్రోత్సాహాకాలను ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిల్లో రూ.1లక్ష కోట్లు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల స్థాపనకు సంబంధించినవి. ఇందులో రూ.40వేల కోట్లు ప్రభుత్వ రంగ పరిశ్రమలుకాగా, ఆదానీ వంటి ప్రైవేటు రంగ పరిశ్రమలు రూ.48వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఇక జిందాల్‌ పవర్‌ రాష్ట్రంలో థర్మల్‌, సౌర విద్యుత్‌ పరిశ్రమలను స్థాపించడానికి ముందుకొచ్చింది. వీటిల్లో రాయగఢ్‌లో 1600 మెగావాట్ల సామర్థ్యమున్న థర్మల్‌ ప్లాంట్‌కు రూ.12,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. అదేవిధంగా ఎన్టీపీసీ భాగస్వామ్యంతో 2500 మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్‌ ప్లాంట్‌పై రూ.10వేలు పెట్టుబడి పెట్టనుంది. గత మార్చిలో రాయపూర్‌లో జరిగిన ‘చత్తీస్‌గడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌`2025’లో ఈ పెట్టుబడులకు హామీ లభించింది. గత ఏడాది డి సెంబర్‌ నెలలో రెన్యూ పవర్‌ లిమిటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు కింద రూ.11500 కోట్లు పె ట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇక ఉక్కుపరిశ్రమ విషయానికి వస్తే నవీన్‌ జిందాల్‌ నేతృత్వంలోని ‘జిందాల్‌ స్టీల్‌’ రాయ్‌పూర్‌ బ్రాంచ్‌లో ఏటా 3.6మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నది. ఈ సంస్థ విస్తరణ కార్యక్రమం 2027 నాటికి పూర్తికాగలదు. ఇదే ఉక్కురం గంలో చిన్నతరహా పరిశ్రమల విషయానికి వస్తే గ్రీన్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.1245 కోట్లమేర పెట్టుబడులు పెట్టనుండగా, 500 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదికి 46వేల మిలియన్‌ టన్నుల ఉక్కుఉత్పత్తి అవుతుండగా 2030 నాటికి దీన్ని 65వేల మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెంచాలని ప్ర భుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఢల్లీి, ముంబయి, బెంగళూరుల్లో ఎనర్జీ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లు నిర్వహించింది. వీటిల్లో ఢల్లీి సదస్సులో రూ.15వేలకోట్లు, ముంబయి సదస్సులో రూ.6వేల కోట్లు, బెంగళూరు సదస్సులో రూ.3700 కోట్ల మేర పెట్టుబడులకు హామీలు లభించాయి.
వచ్చిన పెట్టుబడుల హామీలు ఇప్పుడిప్పుడే వాస్తవరూపం దాలుస్తున్నాయి. నవ రాయ్‌పూర్‌లో సెమికండక్టర్‌ ప్యాబ్రికేషన్‌ యూనిట్‌కు శంకుస్థాపన జరగడం ఇందుకు ఉదాహరణ. చెన్నైకు చెందిన ఒక కంపెనీ చిప్‌ తయారీకి సంబంధించి రూ.1143 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 5జి, 6జి టెలికమ్యూనికేషన్‌ మౌలిక సదుపాయాలకు అవసరమైన హై ఫ్రీక్వెన్సీ చిప్‌లను ఈ కంపెనీ తయారుచేయనుంది. ఇందుకోసం ఈ కంపెనీ అదనంగా రూ.10వేల కోట్లు పెట్టుబడి పెట్టను న్నట్టు ప్రకటించింది. సెమికండక్టర్‌ ప్యాబ్రికేషన్‌ యూనిట్‌తో పాటు రానున్న నెలల్లో కృత్రిమ మేధ ఆదారిత డేటా పార్క్‌కు వచ్చే నెలల్లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ పార్ట్‌ మొత్తం 5.5 హెక్టార్ల విస్తీర్ణంలో వుండగా, 500 ప్రత్యక్ష, 1500 పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. తొలిదశలో ఈ యూనిట్‌ను రాక్‌ బ్యాంక్‌ డేటా సెంటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 5మెగావాట్ల సామర్థ్యంతో ని ర్వహించనుంది. దీన్ని మరో రూ.2వేల కోట్ల పెట్టుబడితో 150 మెగావాట్ల సామర్థ్యానికి పెంచ నుంది.
ఇక రక్షణరంగానికి సంబందించిన భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈఎంఎల్‌) జాంజ్‌గిర్‌` చంపా జిల్లాలో తయారీ యూనిట్‌కోసం వంద ఎకరాల భూమిని సేకరించింది. ఇదిలావుండగా నవ రాయ్‌పూర్‌లో ప్లాంట్‌ నెలకొల్పేందుకు యాష్‌ ఫాన్‌ అప్లయెన్సెస్‌కు, ముంగెలీలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఆదిత్య బిర్లా రినీవబుల్‌ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీకి సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు కు ప్రభుత్వం భూమిని కేటాయించింది. నవ రాయ్‌పూర్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ ఏర్పాటుకు మంత్రి మండలి గత నెలలో ఆమోదం తెలిపింది. పరిశీలిస్తే 2000 సంవత్సరం తర్వాత ప్రభుత్వం ఇంత ధైర్యంగా ముందుకు వెళుతుండటం ఇదే మొదటిసారని చెప్పక తప్పదు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం మండల కేంద్రంలోని వెంకట లక్ష్మీ గార్డెన్ లో ప్రవళిక – శివ కుమార్ వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి
విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి

మొగులపల్లి నేటి ధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యా ప్రమాణాలు పెంపొందించాలని మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి అన్నారు.

శనివారం మండలంలోని మొట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఐదు రోజులుగా నిర్వహించబడుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ శిక్షణలో నూతనంగా పరిసరాల విజ్ఞానాన్ని చేర్చడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత మరింతగా పెరుగుతుందన్నారు.

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులకు వివరించి విద్యార్థులు నమోదు పెంచుటకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన కోరారు.

గ్రామ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులను, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, అంగన్వాడి సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో బడిబాట కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల సంఖ్య పెంచడానికి భాగస్వాములను చేయాలన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్దిష్టమైన చదువు హామీ ఇచ్చి నెరవేర్చేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.

Students Education Officer

 

ఉపాధ్యాయులు శిక్షణలో పొందిన విధంగా విద్యార్థులను ఆకట్టుకునేలా, ఆసక్తిని పెంచేలా బోధన ప్రక్రియ కొనసాగాలన్నారు.

అనంతరం బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు పొందిన ఉపాధ్యాయులు కోటేశ్వర్లు, సునీతా దేవినీ ఎమ్మార్పీలు వ్యవహరించిన వేణుమాధవ్, నాగరాజు, రామకృష్ణ, రాజ్ కుమార్, స్వామి, రాము, చంద్రయ్యలకు పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎం ఆర్ సి సిబ్బంది, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు.

అగ్రికల్చర్ అధికారి శ్రీనివాస్ రెడ్డి.

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజున మండల అగ్రికల్చర్ అధికారి మాట్లాడుతూ మండలంలోని రైతులు పంట సీజన్ కాలం ప్రారంభమైనందున నాణ్యమైన విత్తనాలను సంబంధిత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంట పద్ధతులు పాటించాలని, మండల కేంద్రంలోని కొన్ని షాపుల వారు నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చిందని వారు నకిలీ విత్తనాలను ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు రైతుల ముఖ్యంగా విత్తనాలను మరియు పురుగుల మందులు కొనేటప్పుడు షాపు యొక్క బిల్లును తప్పకుండా తీసుకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు కార్డు కోసం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులు తమ ఆధార్ కార్డు ను పట్టా పాస్ బుక్కులు తీసుకొని సంబంధిత ఫోన్ నెంబర్ ఇచ్చి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

గ్రామీణ సడక్ యోజన నిధులు ఎటుపాయను.

గ్రామీణ సడక్ యోజన నిధులు ఎటుపాయను

కోట్ల రూపాయల నిధులను స్వాహా చేసిన కాంట్రాక్టర్ మరియు అధికారుల ఇళ్లపై ఏసీబీ విచారణ చేపట్టాలి

సీనియర్ జర్నలిస్ట్ నరసింహ

చర్ల నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

చర్ల మండలంలోని దండుపేట ప్రధాన రహదారి నుండి కొత్తపల్లి లింగాపురం గొంపల్లి మొగలపల్లి సి కత్తి గూడెం మరియు కత్తిగూడెం మీదుగా వేసిన గ్రామీణ సడక్ యోజన నిధులు సుమారు 54 కోట్ల రూపాయల నుంచి 58 కోట్ల వరకు సగం రోడ్లు వేసి పూర్తిగా కాకుండానే అధికారులు కాంట్రాక్టర్లు పూర్తిగా స్వాహా చేశారు సుమారు నాలుగు సంవత్సరాలు గడిచిన ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కావడం లేదు కేంద్రం నిధులు అంటే అంతా చులకన అని సీనియర్ జర్నలిస్టు నరసింహా అన్నారు ప్రధాన రహదారి నుండి గోదావరి పరివాహక గ్రామపంచాయతీల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించుట కొరకు కేంద్రం ఎంతో దూర దృష్టితో ఆ నిధులను సమీకరిస్తే సదరు కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం వలన రహదారి పూర్తికాలేదు గోదావరి వరదలు సమీపిస్తున్నందున ఇకనైనా జిల్లా విజిలెన్స్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ పీవో రాష్ట్ర ఆర్ అండ్ బి అధికారులు పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యుల దగ్గర నుండి నగదును రికవరీ చేపించి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన నూతన రహదారి నిర్మాణం చేపట్టాలి చర్ల మండల కేంద్రంలో పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ రహదారిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని త్వరలో ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు

విరాజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

విరాజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం మండలం పోతారం గ్రామం లో శ్రీ విరాజ్ హస్పిటల్ పేద్దపల్లి అద్వర్యం లో ఉచ్చిత వైద్య శిబిరం నిర్వయించారు
ఈ వైద్య శిబిరం లో డాక్టర్ రాజ్ కుమార్ దంత వైద్యులు ( మేనేజింగ్ డైరేక్టర్ ) డాక్టర్ చంద్రకుమార్ జనరల్ పిజిషన్
సదానందం మేనేజ్ మేంట్
రాజు మేనేజ్ మేంట్ మరియు మార్కేటింగ్ పాల్గోని గ్రామస్తులకు వైద్య పరిక్షలు నిర్వయించి ఉచితంగా మందులు పంపిణి చేసారు వైద్యులను మాజీ సర్పంచ్ నేత్తేట్ల మహేందర్ మరియు గ్రామస్తులు షాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బందీ గ్రామస్తులు యూత్ సబ్యులు పాల్గోన్నారు

బిఎస్పి చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్.

నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మొదటి లిస్టులో మంజూరు చేయకపోతే ఉద్యమం తప్పదు

బిఎస్పి చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్

నేటి ధాత్రి చర్ల

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

చర్ల మండల కేంద్రంలో బిఎస్పి పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నియామకం లో గ్రామ కమిటీలు ఇచ్చిన లిస్టు అన్యాయమని అన్నారు చర్ల మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు మూడో దఫాలో కేటాయించవలసిన వ్యక్తులను మొదటి దశలోనే కేటాయించడం సరైంది కాదని అన్నారు రాజకీయ కుట్రలో భాగంగా పేదలకు అన్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గుర్తించాలని కోరారు తక్షణమే రాజకీయాలకతీతంగా నిరుపేదలను గుర్తించి న్యాయం చేయాలని తెలియజేశారు లేకుంటే బీఎస్పీ ఆధ్వర్యంలో అర్హులైన వారిని గుర్తించి ఉద్యమిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు సామల ప్రవీణ్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నం మోహన్ పార్టీ కోశాధికారి పంబి కుమారి పార్టీ మండల ఈసీ మెంబర్ ఏకుల వెంకటేశ్వర్లు పార్టీ మండల ఈసీ మెంబర్ గుర్రాల విజయ్ కుమార్ ఉప్పరిగుడం సెక్టార్ అధ్యక్షులు రాజు కుదునూరు సెక్టార్ అధ్యక్షులు వర్షిక త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version