మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన లైన్స్ క్లబ్..
రామాయంపేట, సెప్టెంబర్ 4 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు విశేష సన్మానం లభించింది. గురువారం ఉదయం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బందికి ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు ఎనర్జీ డ్రింక్స్‌ను అందజేశారు.
లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దేమే యాదగిరి, జిల్లా అధ్యక్షుడు పోదేండ్ల లక్ష్మణ్ యాదవ్, సభ్యులు వంగరి కైలాస్, దోమకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ దేవేందర్ మాట్లాడుతూ – “పట్టణం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటానికి పారిశుధ్య కార్మికుల కృషి అత్యంత కీలకం. ఇలాంటి సేవా కార్యక్రమాలు వారికి ప్రోత్సాహం కలిగిస్తాయని తెలిపారు.
కార్మికులు తమ భావాలను వ్యక్తం చేస్తూ, శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – “మేము ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమిస్తాం.
ఇలాంటి గుర్తింపు మా కష్టానికి నిజమైన గౌరవం” అన్నారు.
పోచమ్మ శంకర్ మాట్లాడుతూ “ఇంతవరకు ఎవరు మాపై ఇంత శ్రద్ధ చూపలేదు. లైన్స్ క్లబ్ చేసిన సత్కారం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది”.
లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దేమే యాదగిరి మాట్లాడుతూ – “సమాజానికి మూలస్తంభాలుగా నిలుస్తున్న పారిశుధ్య కార్మికులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పోదేండ్ల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ – “ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తాం” అని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దేమే యాదగిరి. లక్ష్మణ్ యాదవ్. వంగరి కైలాస్. దోమకొండ శ్రీనివాస్. శ్రీధర్ రెడ్డి. చల్ మెడ ప్రసాద్ పోచమ్మ శంకర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
