వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన.!   

వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన ఆదర్శ మోడల్ స్కూల్ యాజమాన్యం.  

మందమర్రి నీటి ధాత్రి

మందమర్రి పట్టణం లోని తెలంగాణ ఆదర్శమోడల్ పాఠశాల లో జూనియర్ కాలేజీ విద్యార్థుల తో వార్షికోత్సవ (అనివార్సరీ) వేడుకలు ఘనంగా నిర్వహించరు ముందుగా సరస్వతి పూజ జ్యోతిప్రజ్వాల వెలిగించి వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించిన మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్లిమా
ప్రిన్సిపాల్ మాట్లాడుతూ

Adarsh ​​Model School.

మీ తల్లిదండ్రులు కష్టాన్ని మీరు గమనించి జీవితంలో మంచి స్థాయి కి ఎదిగి వారిని సంతోషపెట్టాలని ఆ దిశ గా లక్ష్యాన్ని ఏర్పార్చుకోవాలని కోరారు

Adarsh ​​Model School.

విద్యార్థులు చేసిన జానపద నృత్యలు, యోగ విన్యాసాలు,వివిధ పాటలు లంబాడి నృత్యంలు పలువురు ని అలరించాయి ఈ కార్యక్రమం లోప్రిన్సిపాల్ సారా తస్లిమ్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయలు విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అనారోగ్యానికి గురైన వృద్ధురాలికి సంజీవని అందజేత.

అనారోగ్యానికి గురైన వృద్ధురాలికి సంజీవని అందజేత

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

కేంద్ర హోం శాఖా మంత్రి బండి సంజయ్ ఎల్లారెడ్డిపేట మండలంలో వృద్ధురాలికి సంజీవని అందజేసి ఔదార్యాన్ని చాటాడు. వివరాల్లోకెళితే ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆకుల రమేష్ తల్లి వజ్రమ్మ కి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉండడంతో ఇబ్బంది పడుతున్న వారి సమాచారం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ సంజీవని అందజేశారు. ఈ కార్యక్రమంలో దాసరి గణేష్, పిట్ల శ్రీశైలం, నంది నరేష్, కిరణ్ నాయక్, చేవూరి మధు, శాగ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

జై బాబు జై భీమ్ జై సంవిధన జోరుగా సాగిన.

జై బాబు జై భీమ్ జై సంవిధన జోరుగా సాగిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర….

పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం….

పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు…

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు,జై భీమ్,జై సంవీదాన్ నినాదంతో ఉద్యమిద్దామని అన్న గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు గారు..

హాసన్పర్తి( నేటిదాత్రి ):

రాజ్యంగ పరిరక్షణ లో భాగంగా జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో
జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు లోకసభ సభ్యులు శ్రీ.రాహూల్ గాంధీ గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే మరియు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు హాసన్పర్తి మండల పరిధిలోని కొత్తపల్లి, మల్లారెడ్డి పల్లె అర్వపల్లి గ్రామాలలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర లో ముఖ్య అతిథులుగా పాల్గొని డప్పు సప్పుడు కొడుతూ నాయకులను కార్యకర్తలను ఉత్తేజపరిచిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించి పరిరక్షణ యాత్ర ను ప్రారంభించి సుమారు 5 కిలోమీటర్ల వరకు ప్రజలకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ముఖ్య ఉదేశం ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.నేడు పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని,ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యం అన్నారు.రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు,అంబెడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు.
పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా గారు అంబెడ్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు.గ్రామ మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కోరారు.గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఒక్కొకటి అమలుపరుస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన పథకాలను కూడా కొనసాగిస్తుందన్నారు. కానీ టిఆర్ఎస్ నాయకులు పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న పనులను ఓర్వలేక వ్యతిరేకమైన అంశాలను సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతుందని అన్నారు.గత పదేళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యంగాన్నీ అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ అప్రజాస్వామ్య పాలన సాగిస్తుంది,ప్రజల సమాన హక్కులు,సమ న్యాయం కల్పించాల్సిన పాలకులు రాజ్యాంగo ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తూన్న తీరు తీవ్ర ఆక్షేపనియంగా ఉంది ఇలాంటి తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు..అందుకే రాజ్యoగాన్ని రచించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు,జై భీమ్,జై సంవీదాన్ నినాదంతో ఉద్యమిద్దామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కేతపాక సునీత, మహిళా అధ్యక్షురాలు జోరికపుల, నాయకులు వీసం సురేందర్ రెడ్డి, రామంచ ఐలయ్య, యూత్ నాయకులు జట్టి యుగేందర్, మంద రాజు, నితిన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, డివిజన్ నాయకులు, కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు…

జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం మండలం లోని దూత్ పెల్లి గ్రామంలో ఇన్చార్జి బానోత్ కిషన్ నాయక్* ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది…. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల ఇన్చార్జి బానోత్ కిషన్ నాయక్ మరియు మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి మాట్లాడుతూ ఈ దేశంలో మతోన్మాద బిజెపి పార్టీ భారత రాజ్యాంగాన్ని కూనిచేస్తూ రాజ్యాంగ విలువలను మంట కలుపుతూ దళితులు ,అట్టడుగు వర్గాలపై దాడులు ,దౌర్జన్యాలు చేస్తూ అధికారంలోకి వచ్చి నిండు పార్లమెంట్ సభలో అమిత్ షా రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని భారత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ఆర్థిక అభివృద్ధి కోసం 75 సంవత్సరాల స్వాతంత్రం సిద్ధించిన తరుణంలో అనేక మార్పులు తీసుకొచ్చి ఈ దేశానికి ఎన్నో సేవలు కాంగ్రెస్ పార్టీ మహా నాయకులు అందించారుఅని స్వాతంత్రం తీసుకొచ్చినదేశ పరిపాలనలో అసువులు బాసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటివారు ప్రజల కోసం ప్రజాసేవలో కొనసాగుతూ అమరులైనటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఘనత సోనియాగాంధీ కి దక్కింది 10 సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనను తుంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి అనేక సంక్షేమ పథకాలను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటిలన్నింటిని అమలు చేసి రాష్ట్ర ప్రజల మన్నలను పొందుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం జై బాబు జై భీమ్ జై సౌంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ప్రతి గడపగడపకు కాంగ్రెస్ పార్టీ బాపు వారసుల త్యాగ ఫలితాలను అంబేడ్కర్ వాదాన్ని ప్రజల్లోకి ప్రతి కార్యకర్త నాయకులు తీసుకెళ్లి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి గారు,చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధుర వంశీ కృష్ణ , జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,కార్యదర్శి రాయకమురు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్లకొండ కుమార్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు ఏకు రవీందర్ ,ఎస్సీ ఎస్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు బొట్ల రవి ,నందరాజు, బుర్ర శ్రీనివాస్ గౌడ్ , యూత్ నాయకులు గోపగాని శివ, నాగరాజు, శ్రీకాంత్, ముష్కే నాగరాజు యూత్ నాయకులు, మహిళా కార్యకర్తలు, పాల్గొన్నారు.

జిల్లా మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన.

జిల్లా మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఐదు కోట్ల విధులతో నూతనంగా నిర్మించనున్న జిల్లా మహిళా సమైక్య భవనానికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ సమీపంలో అధునాతన పద్ధతుల్లో నూతనంగా భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని వివరించారు.
మహిళాసంఘాలకుచేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహిళలు ఆర్థికంగా ఎదిగిన అప్పుడే ఆ కుటుంబం ఉన్నత శిఖరాలకుచేరుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య సభ్యులు అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం.

వర్ధన్నపేట మండలంలోని,కడారిగూడెం గ్రామ రేషన్ షాప్స్ నందు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన…వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య

తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకంగా చరిత్రలో నిలిచిపోతుంది.

దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం పంపిణీ చేయడం లేదు.

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం

–ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.

వర్దన్నపేట (నేటిదాత్రి ):

ఈరోజు…వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే సన్న బియ్యం పంపిణీని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు మాట్లాడుతూ…గౌరవనీయులు పెద్దలు వర్ధన్నపేట శాసనసభ్యులు కె.ఆర్.నాగరాజు ఆదేశానుసారం వారు కల్పించిన అవకాశం మేరకు ఈరోజు కడారిగూడెంలో రేషన్ షాప్ నందు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

రాష్ట్రంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు దేశంలోనే మొట్ట మొదటిసారిగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందున సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని తెలిపారు.

తెల్ల రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలని అలాగే పేద ప్రజల కడుపు నింపాలనే ఉద్దేశ్యంతో పేద ప్రజలకు రేషన్ షాప్ ల ద్వారా ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చరిత్రత్మాకమని కొనియాడారు.

ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని వెల్లడించారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా సన్న బియ్యం పంపిణీ జరగడం లేదని పేర్కొన్నారు.

ఇంత గొప్ప పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్చిపోకూడదని అన్నారు.

రాష్ట్ర ప్రజలందరి ఆదరణ, ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వంపై ఎల్లవేళలా ఉండాలని కోరారు. సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, సజావుగా సన్న బియ్యం పంపిణీ జరిగే విధంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలని అధికారులను కోరుతున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పింగిలి రాజ్ మల్లారెడ్డి, నాయకులు, వంగాల రామచంద్రా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నాంపెల్లి రవీందర్,కాంగ్రెస్ పార్టీ మహిళా మండల నాయకురాలు తీగల సునీత గౌడ్, కుందూరు యాకూబ్ రెడ్డి,ఏలపాటి పెద్ద తిరుపతి రెడ్డి కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు

మాదిగ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

మాదిగ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
◆ – అబ్రహం మాదిగ

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో దండోర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి అమరులైన మాదిగ అమరవీరులకు జహీరాబాద్ లోని స్థానిక అతిథి గృహంలో ‘ఉల్లాస్ మాదిగ’ ఎమ్మార్పిఎస్ జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఆద్వర్యంలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.

అబ్రహం మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సాగిన ముప్పై యేండ్ల ఎమ్మార్పీఎస్ పోరాటం ఫలితంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించడం హర్షనీయమన్నారు. యావత్ మాదిగ జాతి మందకృష్ణ మాదిగ గారికి ఋణపడి ఉంటుందని అన్నారు. మాదిగ జాతి విజయం సాధించిన ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేస్తూ అమరులైన (అమృత్,ప్రకాష్,రవీందర్, బాలరాజ్,మొల్లప్ప,భూమన్ మధు,పద్మారావు) ఉద్యమ వీరులకు నివాళులు అర్పించడం మాదిగ బిడ్డలుగా మన నైతిక బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. ఎంతో మంది త్యాగాలు ఉద్యమాన్ని విజయ తీరాలకు నడిపించాయని అన్నారు. వారు ఉద్యమమే ఊపిరిగా జీవించారని వారి స్ఫూర్తి, త్యాగం, అమరత్వం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని కొనియాడారు.
ఈ ముప్పై యేండ్ల కాలంలో ఎమ్మార్పిఎస్ ఉద్యమంలో జహీరాబాద్ నియోజకవర్గంలో పనిచేస్తూ చనిపోయిన మాదిగ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.జిల్లా వ్యాప్తంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంలో పనిచేస్తూ అమరులైన కుటుంబాల వివరాలు సేకరిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు చొరవ తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో..నవీన్ కూమార్ ఎంజేఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి,అరుంధతి సంఘం నాయకులు రాంచందర్, జె జైరాజ్  ఎమ్మెఎస్పి నాయకులు జైరాజ్,పద్మారావు
ఆయా మండలాల అధ్యక్షులు టీంకు మాదిగ,మైకల్ రాజ్, రవికుమార్, నిర్మల్,మాదిగలు మరియు నాయాకులు సుకుమార్, శ్రీనివాస్,అజయ్, సుధాకర్,సునీల్,కిట్టు,అనిల్,పవన్,దయానంద్,ప్రశాంత్, రమేష్,షాలేం,సుదీష్  మాదిగలు తదితరులు పాల్గొన్నారు.

నా పాక ఆలయ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు.

నా పాక ఆలయ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో గల అతి ప్రాచీన గల నాపాక దేవాలయ ప్రాంగణంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ యాదడ్ల రాజయ్య తెలిపారు ఈ కార్యక్రమానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పలువురు రాజకీయ నాయకులు హాజరవుతారని తెలిపారు, ఈ ప్రాచీన ఆలయం రాష్ట్రంలో ఎక్కడ లేని విధానం ఒకే శిలపై నాలుగు ద్వారాలకు నాలుగు విగ్రహాలను రూపొందించి ఏకశిలపై గుడిని ప్రాచీన కట్టడాలతో నిర్మించి ఉన్న విశిష్ట గల దేవాలయం అని తెలిపారు ఈ ఆలయంలో రానున్న రోజుల్లో భూపాలపల్లి శాసనసభ్యుడు సహకారంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి జరిగేలా ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు సీతారాముల కళ్యాణం అనంతరం నృత్య రవళి కళాక్షేత్రం హనుమకొండ 40 మంది కళాకారులచే కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని మండలాల్లోని వివిధ గ్రామాల భక్తుల ప్రజలు సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు కృతజ్ఞతలు కాగలరని తెలిపారు.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/నేటి ధాత్రి

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం మాదాయ పల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప్పలా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ఉప్పల వెంకటేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. రూ. 3 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ హైమావతి రామస్వామి, యాదయ్య, సుధాకర్, దశరథం, లక్ష్మీనారాయణ, పరంజ్యోతి, యాదయ్య, శేఖర్, యాదయ్య, పెంటయ్య, రామస్వామి, మైసయ్య, జంగయ్య, మైసయ్య, లక్ష్మయ్య, మల్లేష్, పరుశరాములు, పర్వతాలు, సత్యం, రాజు, రవి, కుమార్, భగవంతు, రమేష్, శ్రీశైలం, అశోక్, వినోద్, సతీష్, ప్రశాంత్, గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పైసా వసూల్.  

మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పైసా వసూల్.  

• కంప్యూటర్ ఆపరేటరే బాస్

• సైకం పదందే ఫైల్ కదలదు

• ప్రతి పనికో రేటు లేదంటే పని లేటు

• కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు

జహీరాబాద్. నేటి ధాత్రి:

ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు దాన్ని లంచంతో కొనొద్దు..’అంటూ రాగూర్ సినిమాలోని ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ సినిమా చూసినంత వరకే అవినీతిపై పోరాడాలనే భావన ప్రజల్లో ఉంటుంది. ఆ తర్వాత షరా మామూలే. లంచం తీసుకోవడం ఎంత నేరమో… లంచం ఇవ్వడం అంతకన్నా పెద్ద నేరం. అభివృద్ధికి, మంచి పరిపాలనకు ప్రధాన శత్రువు ఎవరో కాదు.. అవినీతి. అలాంటి అవినీతిని నిరోధిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. ఎంత చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మారడం లేదు.

డబ్బులు ఇస్తే కానీ కార్యాలయాల్లో పనులు జరగడం లేదు. ప్రతీ పనికి ఒక రేటు రెడ్డి డబ్బు ముట్టేవరకు బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు.

మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వసూళ్ల దందా..

జహీరాబాద్ నియోజకవర్గం మండల కేంద్రమైన మొగుడంపల్లి తహసీల్దార్ కార్యలయంలో ముడుపులు లేనిదే ఎటువంటి మండల కేంద్రమైన మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సవీస్ రెడ్డి మధ్యవర్తిత్వం (మీడియడటర్ ‘గా నడిపిస్తున్నారు. రేషన్ కార్డు లో పేరు తొలగించలన్న, ఓటరు ఐడి నమోదు చేయాలన్న, భూముల రిజిస్ట్రేషన్లు చేయాలన్న ముందుగా కంప్యూటర్ ఆపరేటర్ ను సంప్రదించాల్సి తాహసిల్దార్ కార్యాలయంలో పని కావాలంటే ముందుగా కంప్యూటర్ ఆపరేటర్ ను సంప్రదించి ఏ పనికి ఎంత లంచం ఇ్యూలో మాట్లాడిన తర్వాత ఆపరేటర్ తాహల్దారును .సంప్రదించి రేటు ఓకే అయితే వసులు ప్రారంభిస్తారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. 2024 మొగుడంపల్లి శివారులో ఉన్నా ఆరు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయనుంటే భూమి కోర్టు కేసులో ఉందని రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి ఆఫీస్ సమయం అయిపోగానే రూ.20 వేలు బందం తీసుకొని వని పూర్తి చేసినట్లు బాధితుడు నెప్తున్నాడు. ఈమధ్య రేషన్ కార్డు లోని పేరు. తొలగించడానికి రూ.2 వెలు తీసుకున్నట్లు మరో బాధితుడు ఆరోపిస్తున్నారు. రూ.3 వేలు తీసుకున్నట్లు తన దగ్గర ఆధారం ఉందని నరదు బాధితుడు తెలిపాడు. కార్యాలయంలో ఎ రికార్డ్ అవసరం ఉన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ రెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదు తహసిల్దార్ వెవితనే. చేస్తున్నానని చెబుతున్నట్లు సంబంధిత బాధితులు ఆరోపించాడు. దాలాకాలంగా తహసిల్దార్ కార్యాలయంలో ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నట్లు మొగుడంపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి బంచాల బారి నుంచి తమసు రక్షించాలని మొగుడం పల్లి మండల వాడితులు కోరుతున్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో ఆపరేటరే బాస్..

పనులు జరగడం లేదని కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొగుడంపల్లీ తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్లు ఇవ్వనిదే అక్కడ ఏ పసులు జరగవని ఆవేదన వ్యక్షం చేస్తున్నారు. దీంతో కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. అటెండర్ నుంచి మొదలు పెడితే అధికారులు వరకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలల పరిధిలో ధనిసి౦ గ్రామంలో ఉన్న ఆహార భద్రతా కార్డులో నుండి పేరును తొలగించటానికి వెయ్యి నుండి అయిదు వేల వరకు దందుకున్నట్లు ప్రజల ఆరోపిస్తున్నారు. మరో అధికారి కిందిస్థాయి అధికారైనప్పటికీ అంతే కానే వడిపిస్తున్నట్టు ప్రతి పనికి రేటు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు.

మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పైసా వసూల్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

జైబాపు, జై భీమ్, జైసం విధాన్ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు

శాయంపేట నేటిధాత్రి:

MLA lays foundation stone for construction of Indiramma’s houses

శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు పాల్గొన్నారు. రైస్ మిల్లు నుండి అంబేద్కర్ కూడలి వరకు పాదయాత్రగా చేరుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మనదేశ రాజ్యాంగం అమలు లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాం క్షలు నెరవేరటంలేదని, ప్రధా నికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్,గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్రగ్రంథమన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగా న్ని బీజేపీపార్టీ అనగాదొక్కా లని చూస్తుందని అన్నారు అమిత్ షా అంబెడ్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించాలని అన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీ అంబెడ్కర్ ఆశయాల ను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు

సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. గట్లకానిపర్తి గ్రామంలో ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ నేతలు, అధికారులతో కలిసి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు న్న పథకాలలో ఒకటి ఇందిర మ్మ ఇండ్లు అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఉన్నవా రికి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకం ఉపయోగిం చుకోవాలని అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. గత పదేళ్ల నుండి నిరుపేదలకు గత ప్రభుత్వం ఇళ్లను ఇవ్వకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమా లల్లో వివిధ శాఖల అధికా రులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

7న కేతకి ఆలయ పాలక మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం.

7న కేతకి ఆలయ పాలక మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం

జహీరాబాద్ నేటివ్ ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం లోని ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారం ఈనెల 7న నిర్వహించనున్నట్టు తెలిపారు గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న పాలకమండలి ప్రమాణ స్వీకారం ఈనెల 7తో జరగనుంది అని తెలిసింది.

సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి.

సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

సిరిసిల్ల పట్టణం 9వ వార్డు (సర్ధాపూర్, జెగ్గరావుపల్లె) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి గారు గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్ గారు.

Ration shop.

బాలకీస్టాయ్య, యాదయ్యా,రాజనర్సు,కనకయ్య,రాములు,ఉపేందర్, షాధుల్, అంజయ్య, తిరుపతి, మోఫిక్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పారు..

రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి.

రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి

★గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించిన జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

టీపీసీసీ ఏక్సిక్యూటివ్ మెంబెర్ ధనాలక్మి
కోహిర్ మండలంలోని పిచరాగాడి గ్రామంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ” రాజ్యాంగ పరిరక్షణ సన్నాక సమావేశం మరియు పాదయాత్ర నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్. మరియు టిపిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ ధనలక్ష్మి కోహిర్ మండల పార్టీ అధ్యక్షులు రామలింగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుని హక్కు అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానిస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నామని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క విలువలు రాజ్యాంగ స్ఫూర్తిని గ్రామ ప్రజలకు వివరించారు. యాత్రలో పాల్గొన్న ప్రజలందరికీ మాజీ మంత్రి గారు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్షద్ గ్రామ పార్టీ అధ్యక్షులు వీర రెడ్డి,కోహిర్ టౌన్ అధ్యక్షులు.శంషీర్,మాజీ ఎంపిపి షౌకత్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముజమ్మిల్,బాడంపేట్ ఆలయ కమిటీ చైర్మన్ దయానంద పాటిల్, మాజీ సర్పంచ్ అంజయ్య ,మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సన్న బియ్యం పథకాన్ని వినియోగించుకోవాలి.

సన్న బియ్యం పథకాన్ని వినియోగించుకోవాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని జహీరాబాద్ లోని ఫరీద్ నగర్ కాలనీలో రేషన్ షాప్ నెంబర్ 46 వాడు ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇస్మాయిల్ ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశ్యం, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమే అన్నారు. ఈ పథకం ద్వారా అర్హత గల కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా, పోషకాహారాన్ని సమృద్ధిగా అందుకునేలా ఈ పథకం రూపొందించబడిందని తెలిపారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా అమలు చేస్తామని తెలిపారు. బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రమేష్ బాబు అజీమ్ రాజు ఉస్మాన్ రబ్బానీ డీలర్ అధికారులు, మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మూడు నెలలుగా జీతాలు ల్లేవ్….

మూడు నెలలుగా జీతాలు ల్లేవ్….

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల అవస్థలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో మూడు నెలలుగా జీతాలు లేక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్నో అవ స్థలు పడుతున్నారు. ఉగాది పండుగ జరుపుకోవడా నికి కూడా చేతిలో రూపాయి లేకుండా పోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. పండగ రోజున భార్య పిల్లలకు ఏమీ కొనివ్వలేని పరిస్థితులు ఎదు ర్కుంటున్నామని వాపోతున్నారు. పని దగ్గరికి వెళ్తే అక్కడ కూలీలతో ఎన్నో అవస్థలు ఉంటున్నాయని. సమయానికి సర్వర్ రాదు ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని చెప్తున్నారు. రోజురోజుకు పెరుగుతు. న్న ఎండ తీవ్రత కూడా సమస్యగా మారిందన్నారు. ఒకే వ్యవస్థలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు ఆఫీసులో పని చేసే వారికి, ప్రతి నెల జీతాలు ఇస్తు న్నారు కానీ ఎండలో కూలీలతో కలిసి పనిచేస్తున్న తమకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గత ప్రభుత్వంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు అన్యాయ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మూడు నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

పంటల కోతలు వాయిదా వేసుకోవాలి.

పంటల కోతలు వాయిదా వేసుకోవాలి.

మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం.

నర్సంపేట ఏ.డీ.ఏ దామోదర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

Crop harvesting should be postponed.

వాతావరణంలో వచ్చిన మార్పులు నేపథ్యంలో మొక్కజొన్న, ఎండుమిర్చి, ఇతర పంటల కోతల నిర్వహణ పనులను వాయిదా వేసుకోవాలని నర్సంపేట డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కే. దామోదర్ రెడ్డి రైతులను కోరారు. ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ అకస్మాత్తుగా వచ్చిన వాతావరణ మార్పుల్లో మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

వరంగల్ జిల్లా పరిధి పలు ప్రాంతాలతో పాటు నర్సంపేట డివిజన్ లోని 6 మండలాలకు మూడు రోజులపాటు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.కోత దశలో ఉన్న మొక్కజొన్న,ఎండుమిర్చి, ఇతర పంటల కోత మరొక రెండు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.ఇప్పటికే కోసిన మొక్కజొన్న,ఎండుమిర్చి పంట ఇతర ఉత్పత్తుల పట్ల అప్రమత్తమై ఇళ్లల్లో జాగ్రత్తగా తడవకుండా భద్రపరచుకోవాలని అన్నారు.ఒకవేళ కల్లాలలో ఉన్నచో వాటినిటార్పాలిన్లతో తగువిధంగా భద్రపరచుకొనుటకు పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకోవాలని ఏటియ దామోదర్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.

జిల్లా ఎస్పీ ని కలిసిన పెబ్బేరు నూతన ఎస్సై.

జిల్లా ఎస్పీ ని కలిసిన పెబ్బేరు నూతన ఎస్సై గంగిరెడ్డి యుగంధర్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి :

గురువారం నూతన పెబ్బేరు ఎస్సై గంగిరెడ్డి యుగంధర్ రెడ్డివనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలోజిల్లాఎస్పీ రావుల గిరిధర్నుమర్యాదపూర్వకంగాకలిస పుష్పగుచ్చం అందజేశారురు ఈ సందర్భంగ ఎస్పీ మాట్లాడుతూవిధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు
జి,యుగంధర్ రెడ్డి వనపర్తి జిల్లా పెద్దమందడి పోలీస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ పెబ్బేరుకు బదిలీపై వచ్చారు.పెబ్బేరు ఎస్సైగా పనిచేసిన హరిప్రసాద్ రెడ్డి వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయానికి బదిలీపై వెళ్ళారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పెబ్బేరు ప్రజలు సహకరించాలని నూతన ఎస్సై యుగందర్ రెడ్డి  ప్రజలను కోరారు.

ఉచిత మెగా వైద్య శిబిరం.

ఉచిత మెగా వైద్య శిబిరం

నిజాంపేట, నేటి ధాత్రి

నిజాంపేట మండల పరిధిలోని బచ్చరాజ్ పల్లి గ్రామంలో గురువారం మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రముఖ సంఘ సేవకుడు గట్టు ప్రశాంత్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ,షుగర్, థైరాయిడ్, మొదలగు వైద్య పరీక్షలు నిర్వహించి గ్రామంలోని సుమారు 200 మందికి ఉచిత టాబ్లెట్లు అందించారు. అవసరమైన వారికి 60 మందికి పైగా చెవి ముక్కు,గొంతు,థైరాయిడ్, గర్భసంచి, శరీర సంబంధ వ్యాధులకు గాను ఉచితంగా ఆపరేషన్ చేయించడానికి వీలుగా మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత బస్సు ప్రయాణం ఉచిత ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.క్రమంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుకు గట్టు ప్రశాంత్,ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాములు, మల్లారెడ్డి హాస్పిటల్ బృందం డాక్టర్ అఖిలేష్,భవ్య,స్టాఫ్ నర్స్ లు అరుణ,ప్రవణి,ఫార్మా అంకిత,మార్కెటింగ్ మేనేజర్ ఎండి.మహమ్మద్,నాగప్ప, గ్రామస్తులు అంజయ్య,నక్క రవి,బోడపట్ల శ్రీనివాస్, హంసమ్మ,పాల్గొన్నారు.

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టులు.

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టులు

నిజాంపేట, నేటి ధాత్రి

చలో HCU కార్యక్రమానికి తరలిన ఏబీవీపీ విద్యార్థి నాయకులను నిజాంపేట పోలీసులు ముందస్తుగా అక్రమ అరెస్టులుచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) భూములను కాపాడేందుకు పోరాడుతున్న విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయడం దారుణమన్నారు.
క్యాంపస్‌లో 400 ఎకరాల భూమిని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఇందిరమ్మ పాలనలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై దమనకాండ ఆపాలని
HCU భూములను రక్షించాలన్నారు.
విద్యార్థుల గొంతును నొక్కాలని చూస్తే, తెలంగాణలో ఆత్మగౌరవ ఉద్యమం మరింత మిన్నంటుతుంది! రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువత ఏకమై ప్రభుత్వంపై ప్రతిఘటన తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version