సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)
సిరిసిల్ల పట్టణం 9వ వార్డు (సర్ధాపూర్, జెగ్గరావుపల్లె) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి గారు గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్ గారు.

బాలకీస్టాయ్య, యాదయ్యా,రాజనర్సు,కనకయ్య,రాములు,ఉపేందర్, షాధుల్, అంజయ్య, తిరుపతి, మోఫిక్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పారు..