కేతకి ఆలయ ఈవో పై ఎండోమెంట్ కమిషనర్ కు ఫిర్యాదు.

కేతకి ఆలయ ఈవో పై ఎండోమెంట్ కమిషనర్ కు ఫిర్యాదు.

◆-: కేతకి ఆలయానికి రెగ్యులర్ ఈవోను నియమించాలి.

◆-: కేతకిలో ఉన్నత అధికారుల అనుమతి లేకుండానే ఉద్యోగాల నియామకము.

◆-: కేతకిలో అక్రమాలు జరుగుతున్న పట్టించుకోని ఉన్నతాధికారులు.

◆-: మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు బొగ్గుల జగదీశ్వర్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్పపై సర్పంచుల ఫోరం ఝరాసంగం మండల మాజీ అధ్యక్షుడు బొగ్గుల జగదీశ్వర్ హైదరాబాదులోని దేవాదాయ,ధర్మాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కేతకి ఆలయానికి ఇన్చార్జి ఈవో గా కొనసాగుతున్న ఆయన ఉన్నతాధికారుల ఉత్తర్వు లు సైతం లెక్కచేయకుండా పనిచేయడంతో ఆలయ ఆదాయానికి గండి పడుతుందన్నారు.

ఉన్నత అధికారులు నుండి ఎలాంటి ఆదేశాలు లేకున్నా తాత్కాలిక నియామకాలు చేపట్టి కొందరికి ఉద్యోగ అవకాశం కల్పించారని ఆయన వివరించారు. కేతకి ఆలయ ఈవో భక్తుల నుండి అధిక మొత్తంలో డొనేషన్లు వసూలు చేసిన వారికి ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. కేతకి ఆలయ గోశాల పేరిట అధిక మొత్తంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆలయంలో ప్రవేటు ఉద్యోగులు, ప్రైవేట్ పూజారులు, ప్రజా ప్రతినిధుల లపై , భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.

గత రెండు రోజుల క్రితం ఆలయ ఈవో ముందే కేతకి ఆలయ చైర్మన్ పట్ల ప్రవేట్ పూజారి దురుసుగా మాట్లాడిన ఆలయ ఈవో ఏమి అనకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆలయానికి ఈవో గా ఉన్న ఆయనను దాదాపు 20 ఆలయాలకు ఇన్చార్జి ఈవోగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత కేతకి ఆలయ ఈవో మూలంగా కేతకి ఆలయ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. స్థానికేతురుడైన శాశ్వత ఈఓ ను నియమించి కేతకి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బొగ్గుల జగదీశ్వర్ పేర్కొన్నారు.

భక్తులతో కిటకిటలాడిన కేతకి ఆలయం…

భక్తులతో కిటకిటలాడిన కేతకి ఆలయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. గురువారం కార్తీక మాసం చివరి అమావాస్య, సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి తెల్లవారు జాము నుంచి చేరుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కార్తీక మాసం చివరి అమావాస్య సందర్భంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ, మేల్కొల్పు సేవ, మహా రుద్రాభిషేకం, మహా మంగళ హారతి నిర్వహించిన అనంతరం రాత్రి 4 :30 నుండి భక్తులకు ప్రవేశాన్ని దర్శనానికి అనుమతించారు.

ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఓం నమశ్శివాయ పంచాక్షరి నామం తో మార్మోగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ

ఈవో మహా రుద్రయ్య చైర్మన్ శేఖర్ పటేల్ ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, దేవస్థానానికి వచ్చిన భక్తులకు అన్నదాన సౌకర్యంతో పాటు త్రాగే నీరు సౌకర్యాలు చేశారు,

7న కేతకి ఆలయ పాలక మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం.

7న కేతకి ఆలయ పాలక మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం

జహీరాబాద్ నేటివ్ ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం లోని ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారం ఈనెల 7న నిర్వహించనున్నట్టు తెలిపారు గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న పాలకమండలి ప్రమాణ స్వీకారం ఈనెల 7తో జరగనుంది అని తెలిసింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version