భాద్యతలు చేపట్టిన టౌన్ సీఐ రఘు.

భాద్యతలు చేపట్టిన టౌన్ సీఐ రఘు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణ సీఐగా లేతాకుల రఘు బుదవారం నూతనంగా భాద్యతలు చేపట్టారు.నర్సంపేట పట్టణ సీఐగా భాద్యతలు నిర్వర్తించిన సీఐ రమణమూర్తి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీఎస్ కి బదిలీపై వెళ్ళారు.కాగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సీఐ రఘు నర్సంపేట పట్టణం సీఐగా నియమితులను చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.కాగా లేతాకుల రఘు పట్టణ సిఐగా పోలీస్ స్టేషన్ లోని తన కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా సీఐ రఘు మాట్లాడుతూ
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు.లా అండ్‌ ఆర్డర్‌ పై ప్రత్యేకంగా నిఘ ఉంచడం జరుగుతుందని తెలిపారు. మత్తుపదర్థాలు,గంజాయి,గుట్కా,అంబర్ లాంటి నిషేధిత పదార్థాలపై ఎప్పటికప్పుడు అన్వేషణ ఉంటుందని సీఐ రఘు తెలిపారు.ముందుగా భాద్యతలు చెకట్టేందుకు వచ్చిన సీఐ రఘుకు ఎస్సైలు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వరికెల.

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వరికెల

 

నడికూడ,నేటిధాత్రి:

 

తెలంగాణ రైతు రక్షణ సమితి,తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు నడికూడ మండలంలోని గ్రామాలలో యాసంగి కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ రైతుల అకౌంట్లో వెయ్యాలని కోరారు. రైతులను కొనుగోలు కేంద్రాలలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్,జిల్లా నాయకులు చోళ రామారావు మండల నాయకులు వాంకే రాజు, టింకురాల రాజు,సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్: పోరాట ఫలితంగానే.!

జహీరాబాద్: పోరాట ఫలితంగానే అంగన్వాడీల వేతనాల పెంపు.

జహీరాబాద్ నేటి ధాత్రి

పోరాట ఫలితంగానే అంగన్వాడీల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి బుధవారం ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీల సమస్యలపై మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. భవిష్యత్తులను ఇదే స్ఫూర్తితో పోరాటం కొనసాగిద్దామని పేర్కొన్నారు.

జహీరాబాద్: 80 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం.

జహీరాబాద్: 80 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం.

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

జహీరాబాద్ సమీపంలోని మాటికి జాతీయ రహదారిపై 20 లక్షల విలువైన 80 కిలోల నిషేధిత ఎండు గంజాయిని చిరాగ్ పల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి బుధవారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ కారు డిక్కీలో గోధుమ రంగు కవర్లో చుట్టిన 42 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. జహీరాబాద్ మండలం గోవిందా పూర్ కు చెందిన తిరుమలేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

బసవేశ్వర జయంతి వేడుకలలో కలెక్టర్ ఎమ్మెల్యే.

బసవేశ్వర జయంతి వేడుకలలో కలెక్టర్ ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి :

 

బుధవారం నాడు బసవేశ్వర జయంతి వేడుకల సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు.సంఘ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి మాట్లాడుతూ 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుడు మానవులంతా.ఒక్కటే అని కుల మతాలు లేవని ప్రగాఢంగా నమ్మి ప్రజలకు అవగాహన కల్పించారని అన్నారు .మూఢ నమ్మకాలను నమ్మవద్దని, సమానత్వం, శోషలిజం వంటి సిద్ధాంతాలను ప్రచారం చేసి ప్రజలకు దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ బసవేశ్వరుడు శ్రమకు మించిన సౌందర్యం లేదని, ఏ పని చేసిన నిష్టతో అంకిత భావంతో పనిచేయాలని బోధించిన బోధనలు ప్రతి ఒక్కరికి స్పూర్తినిస్తాయని అన్నారు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, డి.సి.డి.బి అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ,ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి.!

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే లక్ష్యం

 

మండల విద్యాశాఖ అధికారి కే.హనుమంతరావు

నడికూడ,నేటిధాత్రి:

 

ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా! గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి హనుమకొండ ఆదేశానుసారం తేదీ 01/05/ 2025 నుండి 15 /05/ 2025 వరకు,జడ్పీహెచ్ఎస్ నడికూడ పాఠశాలలో సమ్మర్ క్యాంపు నిర్వహించబడును, ఈ క్యాంపులో విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ యొక్క,డాన్స్, యోగ,డ్రాయింగ్,మొదలైన అంశాల పైన శిక్షణ ఇవ్వబడును,కావున నడికూడ మండల పరిధిలో గల 6వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరూ ఈ సమ్మర్ క్యాంపునకు హాజరై సద్వినియోగం చేసుకోగలరు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులందరూ సమ్మర్ క్యాంపుకు హాజరయ్యే విధంగా చూడగలరు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయుటకు మరియు విద్యార్థుల సంఖ్యను పెంచుటకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం.కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అందరూ సహకరించవలెనని కోరుచున్నాని మండల విద్యాశాఖ అధికారి కే హనుమంతరావు తెలిపారు.

రాష్ట్ర కాంగ్రెస్ యువజన విస్తృత స్థాయి సమావేశం.

రాష్ట్ర కాంగ్రెస్ యువజన విస్తృత స్థాయి సమావేశం
పాల్గొన్న జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
బుడిగె శ్రీకాంత్
జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగ శ్రీకాంత్ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జెక్కిడి చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఎస్ వి ఎల్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం రోజు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ రానున్న దేశ భవిష్యత్తు యువతదే అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి యువజన కాంగ్రెస్ కృషి మరువలేనిది అన్నారు దేశంలో బీజేపీ పార్టీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అబద్ధపు ప్రచారాలతో రెచ్చగొడుతూ తమ రాజకీయం పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని దీనివల్ల ఎంతో మంది పేద ప్రజలు అమాయక ప్రజలు బలైపోతున్నారని వాపోయారు మోడీ నిరంకుశ పరిపాలనకు యువత త్వరలోనే చరమగీతం పాడి రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ని ప్రధానిగా చూస్తామని తెలిపారు యువజన కాంగ్రెస్ కు సీనియర్ కాంగ్రెస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని సీనియర్ కాంగ్రెస్కు యువజన కాంగ్రెస్ కుండకాయ లాంటిదని కొనియాడారు . అనంతరం ఉగ్రదాడిలో మరణించిన భారతీయులకు సంతాపం తెలిపారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువజన కాంగ్రెస్ జాతీయ ఇన్చార్జ్ శ్రీ కృష్ణ అల్లవారు యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయభాను మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ ఎంపీపీ సీసీ ప్రచార కమిటీ చైర్మన్ ఎల్బీనగర్ ఇన్చార్జి మధు యాష్ గౌడ్ , రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి శ్రవణ్ రావు, టిపిసిసి ప్రతినిధి జక్కడి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

గంజాయి మత్తు పదార్థాలు వినియోగం వల్ల నష్టాలు.!

గంజాయి, మత్తు పదార్థాలు వినియోగం వల్ల నష్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన

ఎస్ ఐ జి నరేష్

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామం లో నిషేదిత గంజాయి, మత్తుపదార్థాల వినియోగం వలన కలుగు నష్టాలపై, సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ముత్తారం ఎస్ ఐ జి నరేష్ మాట్లాడుతూ ఈ ఆధునిక టెక్నాలజీ కాలంలో సెల్ ఫోన్ వినియోగం పెరిగిపోయిందని అన్నారు. ప్రతినిమిషం సెల్ ఫోన్ లేనిది ఏ పని చేయలేకపోతున్నామని, ప్రతిదీ కూడా సెల్ ఫోన్ తోనే లింక్ ఉండడంతో మన సెల్ ఫోన్ నెంబర్ కూడా మన బ్యాంక్ అకౌంట్, పాన్ కార్ట్, ఆధార్ కార్డు, పెన్షన్, పౌరసరఫరాల వినియోగానికి సంబంధించి అన్ని విధాలుగా మన సెల్ ఫోన్ నెంబర్ అవసరం ఉంటుందని అన్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మనకు ఏదో లేనిపోని ఆశలు చూపించి అదేవిదంగా కొత్తగా పెళ్లి కార్డ్స్ ఏ పి కే ఫైల్స్, డిజిటల్ అరెస్ట్ అని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో మహిళలు పిల్లలను టార్గెట్ చేసుకొని సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. యువత ఇంటర్నెట్ పరిమితికి మించి వాడకూడదని, సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులను కాజేస్తున్నారని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీ ఏటీఎం, పిన్ నెంబర్ , సీవీవీ, బ్యాంకు ఖాతా తదితర వివరాలు కోరితే ఇవ్వరాదన్నారు. ఎవరైనా మీకు లాటరీ తగిలింది, కొంత డబ్బును సూచించిన బ్యాంకు ఖాతాలో జమచేయాలని ఫోన్ కాల్ వచ్చినా, ఏ విధంగా అయినా మీరు మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బును కోల్పోతే వెంటనే సమీప పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎలాంటి ఆపద సమయంలో సైబర్ నేరాల పట్ల గాని టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి లేదా 100 లకు ఫోన్ చేసి పోలీసుల సేవలు పొందాలని
కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం చేడు అలవాటులకు బానిసలుగా మారి భవిష్యత్తు నాశనం చేసుకోవడం జరుగుతుందని
సైబర్ నేరాల పట్ల, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు డ్రగ్స్ వంటి తదితర అంశాల పై యువత, పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ ఐ జి నరేష్ తెలిపారు ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు

ఇన్చార్జి తహసిల్దారుగా బాధ్యతలు.!

ఇన్చార్జి తహసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన ఇమామ్ బాబా.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల ఇన్చార్జి తహసిల్దార్ గా బుధవారం రోజున ఎండి ఇమామ్ బాబా బాధ్యతలు స్వీకరించడం జరిగింది, ఇక్కడ తహ సిల్దారుగా పనిచేసిన నల్లబెల్లి హేమా దీర్ఘకాల సెలవు పెట్టడంతో కలెక్టర్ ఆఫీసులో ఎలక్షన్ డిటిగా విధులు నిర్వహిస్తున్న ఎండి ఇమాము బాబాను చిట్యాల ఇన్చార్జి తహసిల్దారుగా నియమించడం జరిగింది.

జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన సంఘటన.

జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన సంఘటనను నిరసిస్తూ

స్వచ్ఛందంగా మంచిర్యాల పట్టణ బందుకు అన్ని సంఘాల ఆమోదం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై పాకిస్తాన్ టెర్రరిస్టు లు దాడులను నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలో మే 3 న బంద్,ర్యాలీని విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులు,హిందూ సంఘాలు,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని సంఘాలు సంఘీభావంతో బంద్ లో పాల్గొని విజయవంతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ పర్వతాల నరసయ్య,సహా కార్యవర్గం, హిందూ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డేగ రవీందర్, కార్యదర్శి కర్ణ గంటిరవీందర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, తపస్సు టిపిఎస్,భవన నిర్మాణ సంఘం,హమాలి సంఘం, పెయింటర్స్ అసోసియేషన్,ఎలక్ట్రిషన్ అసోసియేషన్, బీసీ సమాజ్ సంఘం,బీఆర్ఎస్,బిజెపి వివిధ సంఘాలు సంఘీభావం తెలుపుతూ బందులో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

(TEOBDA) తెలంగాణ ఐ ఆర్గాన్ బాడీ డోనర్స్.!

(TEOBDA) తెలంగాణ ఐ ఆర్గాన్ బాడీ డోనర్స్ అసోసియేషన్ కన్వీనర్ గా గోనె ఎల్లప్ప

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

అవయవ దానం అత్యున్నత మైన దానమని, మానవత్వంతో అమరత్వం పొందవచ్చునని, మరణానంతర జీవం మరణించి జీవించవచ్చని తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిరిసిల్ల వాసి గోనె ఎల్లప్పను తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల(TEOBDA) సంఘం జిల్లా కన్వీనర్ గా డాక్టర్ అశోక్ నియమించారు. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో గోనె ఎల్లప్పకు సిరిసిల్ల జిల్లా కన్వీనర్ గా నియామక పత్రాన్ని అందజేశారు, వారు సిరిసిల్ల జిల్లాలో అవయవదానంపై అవగాహన, నేత్రదానాలు, దేహదానాలు ప్రోత్సహించవలసి ఉంటుందని, ఈ పదవి మూడు సంవత్సర కాలం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా పనిచేయవలసి ఉంటుందని డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉడ్ క్రాఫ్ట్ షాప్ ను ప్రారంభిస్తున్న నవీన్ రావు.

మరిపెడలో ఉడ్ క్రాఫ్ట్ షాప్ ను ప్రారంభిస్తున్న నవీన్ రావు

యువత ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలి

– చేతి వృత్తులవారు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.

– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు

మరిపెడ నేటిధాత్రి.

 

యువత ఉద్యోగాల సాధన పైనే కాకుండా వ్యాపారాల నిర్వహణపై కూడా దృష్టి సారించి, ఆర్థికంగా పరిపుష్టి సాధించాలని జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు.బుధవారం మరిపెడ పట్టణ కేంద్రంలో చోడోజు వీరభద్రా చారి నూతనంగా ఏర్పాటుచేసుకున్న ఉడ్ క్రాఫ్ట్ ఫర్నిచర్ షాప్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు జిల్లాల సరిహద్దు కేంద్రమైన మరిపెడ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందనన్నారు. పట్టణంలో యువత సరైన ప్రణాళికతో వ్యాపార రంగంలోకి దిగితే సులువుగా విజయం సాధించవచ్చని తెలిపారు.వ్యాపారాల నిర్వహణతోనే త్వరగా ఆర్థిక అభివృద్ధి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే అనేక రకాలైన వ్యాపార సంస్థలు పట్టణంలో నెలకొని ఉన్నాయని,నూతనంగా ఏర్పాటైన శ్రీ వీరభద్ర ఉడ్ క్రాఫ్ట్ వర్క్ షాప్ వినియోగదారుల ఆదరణ పొంది వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.మారుతున్న కాలానికి అనుగుణంగా చేతి వృత్తుల వారు టెక్నాలజీ ని అందిపుచ్చుకొని వృద్ధిలోకి రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న,బీఆర్ ఎస్ జిల్లా నాయకులు తేజావత్ రవీందర్, మాసబత్తిని సతీష్,రేఖ వెంకటేశ్వర్లు,పానుగోతు వెంకన్న, కత్రోజు వెంకటాచారి,మాజీ ఎంపీటీసీ శ్రీరాముల రాములు,కట్టోజు అంజయ్య,రాగి సైదాచారి,బుచ్చయ్య,సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.

సిట్టింగ్ సక్సెస్..?

సిట్టింగ్ సక్సెస్..?

ఐదు ఆరు లోజుల మకాం,లో అంత సెటిల్.!?

ఆ హోటల్ లో అధికారికి కలిసిన కాంట్రాక్టర్లు.!?

ఇక మండలంలో ఇసుక క్వారీలో అక్రమ వసూళ్లకు గ్రీన్ సిగ్నల్.

పలుగుల 8, 9, మరో రెండు ఇసుక రీచ్ లో పెంచిన అక్రమ వసూళ్ల రూపాలు.

ఆగని కుంట్లం గోదావరి నుండి పక్క జిల్లా క్వారీకు ఇసుక రవాణా.

నేటి ధాత్రి చెప్తూనే వస్తుంది, అక్రమాలకు సూత్రధారి టిజిఎండిసి.

ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇసుక అక్రమాల పై విచారణకు అదేశిచాలి.

మహదేవపూర్- నేటి ధాత్రి:

 

 

మండలంలో అక్రమ వసూళ్ల వ్యవహారం టి జి ఎం డి సి చీకటి ఒప్పందాలతో, అక్రమ వసూళ్లలో ఇసుక రీచులు రెట్టింపు ఉత్సాహం కనబరుస్తూ, లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలను టీజీఎండిసి అధికారులు, కాసులకు కక్కుర్తి పడి, సీక్రెట్ సెట్టింగ్ ల వ్యవహారాలను కొనసాగిస్తూ, అక్రమ ఇసుక రవాణా అక్రమ వసూళ్ల వ్యవహారం, దర్జాగా కొనసాగేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అనేక ఇసుక రీచ్ లో అక్రమాల సాక్షాలు తెరపైకి వచ్చిన, చర్యలు తీసుకోవాల్సిన టిజిఎండిసి, గుట్టుచప్పుడు కాకుండా కాంట్రాక్టర్లకు మూలాఖాత్ అయి, చీకటి ఒప్పందాలతో ఇసుక రీచుల్లో ఇసుక క్వాంటిటీ పూర్తయ్యే వరకు, చూసి చూడనట్టుగా ఉండి అక్రమ వసూళ్లకు పరోక్షంగా మద్దతు తెలపడం, ఇప్పటికీ అక్రమ వ్యవహారాలు అదనపు ఇసుక రవాణా చేసిన ఉసుక్ పల్లి ఒకటి, పలుగుల పుసుపల్లి 6, పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లు జరిపి తమ క్వాంటిటీని సమాప్తం చేసుకున్నారు, కానీ టి జి ఎం డి సి మాత్రం చర్యలకు శశి మీరా అంది. ఓ అధికారి మండలంలో గుట్టుచప్పుడు కాకుండా సెట్టింగులు నిర్వహించుకొని, పక్క జిల్లా కు సంబంధించిన, రీచులు కూడా గోదావరిలో అక్రమ రోడ్డును నిర్మించి, హద్దులు దాటి ఇసుక రవాణా చేస్తుంటే, పీజీఎండిసి నిశ్శబ్దం, కేవలం అధికారులు సెట్టింగులు కొరకే పరిమితం కావడంతో, మండలంలో ఇసుక క్వారీల అక్రమాలు మరింత పెరగడానికి ప్రధాన కారణం.

సిట్టింగ్ సక్సెస్..?

మండలంలో ఇసుక క్వారీల అక్రమాలు హద్దు అదుపు లేకుండా కొనసాగుతున్న క్రమంలో, టీజీఎండిసి అధికారులు, ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా అక్రమాలను అడ్డుకట్ట వేయాల్సిన టీజీఎండిసి, ఇసుక కాంట్రాక్టర్ల తో సెట్టింగులు జరుపుకొని ఇసుక రీచ్ లో అక్రమాలకు పోస్ట్చాయిస్తున్నారని అధికారి వారం రోజులపాటు “గ్రీన్ ప్రాంతం” ముఖం వేసి కాంట్రాక్టర్లకు తమ వద్దకు పిలుచుకొని సెట్టింగ్ సక్సెస్ చేసుకోవడం జరిగిందని మండలంలో ప్రస్తుతం ఆ అధికారి గ్రీన్ ప్రాంతంలో వారం రోజుల మాఖామ్ చర్చనీయంగా మారింది. ప్రస్తుతం మండలంలో పెద్ద మొత్తంలో కొనసాగుతూ భారీ ఇసుక లారీల్లో ఇసుక రవాణా చేస్తున్న క్వారీల కాంట్రాక్టర్లు అధికారికి వద్దకు వెళ్లి సెట్టింగులు సక్సెస్ చేసుకున్నట్లు సమాచారం, సెట్టింగ్ సక్సెస్ కావడంతో అధికారి తిరిగి వెళ్లిపోవడం జరిగిందని తెలుస్తుంది.

ఐదు ఆరు లోజుల మకాం,లో అంత సెటిల్.!?

టీజీఎండిసి ఉన్నత అధికారి మండలంలో గ్రీన్ ప్రాంతం వద్ద, సుమారు ఐదు నుండి ఆరు రోజుల ముఖం వేసి పలు ఇసుక క్వారీలకు సంబంధించి కాంట్రాక్టర్లతో సెట్టింగ్ చేసుకున్నట్లు సమాచారం, ఐదు రోజుల మాఖం లో అంత సెట్టింగ్ కావడంతో ఆ అధికారి, ఇసుక క్వారీల పై చర్యలు విచారణ లాంటి ఏమీ చేయకుండా, వెళ్లిపోవడం జరిగిందని విశ్వ నీయ సమాచారం. టీజీఎండిసి అధికారి ఇసుక అక్రమాలు చేపడుతున్న ఇసుక క్వారీలను సందర్శించి, లారీల డ్రైవర్ల తో అదనపు వసూళ్లపై వివరాలు సేకరించడం, ఇసుక రీచ్ ల వద్ద కాంటాలను పరిశీలించడం, వి విల్ పై ఉన్న ఇసుక టన్నులు, లారీలకు కాంట ఇచ్చిన రసీదులు ఇలాంటివి పరిశీలించాల్సిన అవసరం బాధ్యత ఆ అధికారి చేయవలసి ఉంటుంది, కానీ నామమాత్రంగా ఒకరోజు దగ్గర్లోని రెండు ఇసుక క్వారీలకు వెళ్లి తిరిగి తమ గ్రీన్ ప్రాంతానికి వచ్చి, సుమారు ఐదు నుండి ఆరు రోజుల ముఖంలో అంత సెట్టింగ్ చేసుకొని వెళ్లిపోవడం జరగడంతో, టి జి ఎం డి సి అధికారుల ప్రోత్సాహంతోనే, ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారం కొనసాగుతుందని స్పష్టం అవుతుంది.

 

TGMDC

ఆ హోటల్ లో అధికారికి కలిసిన కాంట్రాక్టర్లు.!?

ప్రస్తుతం మండలంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా లో తమ సత్తా చాటుతున్న పలువుల 8, 9, మహాదేవపూర్పుచుపల్లి 1, తోపాటు మరికొన్ని ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు, ఆ అధికారి ఉన్న గ్రీన్ ప్రాంతానికి వెళ్లి, కలవడం జరిగిందని సమాచారం. ఇక టీజీఎండిసి ఉన్నత అధికారి, విధులు ఎక్కడ నిర్వహించాడు, ఆ హోటల్ విధులు నిర్వహించే కేంద్రం, ఇసుక రీచులను తనిఖీ చేయాల్సిన ఆ అధికారి, ఆ గ్రీన్ ప్రాంతంలో, ఎందుకు మఖాం వేసినట్టు, వారం రోజులపాటు అధికారి మాఖామ్, ఇసుక క్వారీల అక్రమాలకు స్థిరపడిందా, అలాంటి వ్యవహారం ఏమీ కొనసాగలేదు. కానీ కాంట్రాక్టర్లు మాత్రం అందరూ ఆ హోటల్లో అధికారిని కలవడం ఎందుకు జరిగింది. ఏదైనా అధికారి వస్తే కార్యాలయంలో, విధి నిర్వహణ చేయడం జరుగుతుంది కానీ గ్రీన్ ప్రాంతంలో, కాంట్రాక్టర్లను పీల్చుకోవడం, టీజీఎండిసి గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం కొనసాగిస్తూ, అక్రమాలకు ప్రోత్సహిస్తూ నుండి అనడానికి దీనికంటే పెద్ద సాక్ష్యం మరిన్ని ఉండదు.

ఇక మండలంలో ఇసుక క్వారీలో అక్రమ వసూళ్లకు గ్రీన్ సిగ్నల్.

ఇక మండలంలో ఇసుక క్వారీల అక్రమాలకు గ్రీన్ సిగ్నల్ దొరికినట్టే, దానికి మరో సాక్ష్యం ఉన్నత అధికారి కాంట్రాక్టర్లకు ఓ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా పిలుచుకొని తమ సెట్టింగులు సక్సెస్ చేసుకోవడం జరిగిందన్న సమాచారమే సాక్ష్యం. ఆ అధికారితో సెట్టింగ్ అనంతరం, మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి ఇసుక క్వారీలో గతంలో 700 రూపాయలు వసూలు చేసే ఈ క్వారీ గత రెండు రోజుల నుండి వెయ్యి రూపాయలు సీరియల్ పేరుతో వసూలు చేస్తుంది. ఇక ఇదే క్రమంలో పలువుల 8 ,9, గత వారం రోజులుగా 100 నుండి 150 లారీల వరకు ఈ రెండు క్వారీలు పెద్ద మొత్తంలో లారీలు ఇసుక రవాణా చేయడం జరిగింది. ప్రస్తుతం మండలంలో 11 క్వారీలు నిర్వహణలో ఉన్నప్పటికీ వీటిలో, పలువుల 8 ,9, మహాదేవపూర్ పుసుపుపల్లి వన్, రీచ్ ల్లో అక్రమ వసూళ్లకు మరింత రెట్టింపు ఉత్సాహంతో వసూళ్ల పరంపరను సాగిస్తున్న సాగిస్తున్నాయి.

 

TGMDC

 

ఆగని కుంట్లం గోదావరి నుండి పక్క జిల్లా క్వారీకు ఇసుక రవాణా.

టి జి ఎం డి సి ఇసుక అక్రమాల వ్యవహారం పై కనీస చర్యలు తీసుకోకపోవడం, అందిస్తాయి అధికారులు కాంట్రాక్టర్లకు వత్తాసు పలకడం, టీజీఎండిసి నిబంధనలకు తుంగలో తొక్కి అక్రమ వ్యవహారాలను టీజీఎండిసి అధికారులు ప్రోత్సహిస్తున్నారని సాక్షాలు తెరపైకి వచ్చిన కూడా చర్యలు తీసుకోకపోవడమే, ఇసుక కాంట్రాక్టర్లు ఇసుక క్వారీలో అక్రమాలు, మైనింగ్ శాఖ క్వారీలకు ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రీచుల నిర్వహణ కొనసాగించడం జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు, తాజాగా మంచిర్యాల జిల్లా ఎర్రయిపేట పేరుతో నిర్వహించబడుతున్న ఇసుక కాంట్రాక్టర్, టీజీఎండిసి నిబంధనలను తుంగలో తొక్కి, నడి గోదావరిలో అక్రమంగా రోడ్డు నిర్మించి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కుంట్లం గ్రామ శివారు వద్ద ఉన్న గోదావరి నుండి ఇసుకను రవాణా, చేయడం జరుగుతుంటే టీజీఎండిసి అధికార యంత్రాంగం, గోదావరిలో అక్రమ రోడ్డు నిర్మిస్తే రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ ఏలాంటి చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టుగా వివరించడం, ఇసుక క్వారీ అంటేనే అధికారులకు ,”కన్ఫామ్ కమిట్మెంట్” అనే విధంగా మారింది. అందుకే ఏమో ఇసుక క్వారీల్లో అక్రమాలు, సరిహద్దులు దాటి ఇసుక తోడుతున్న ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకపోయింది.

నేటి ధాత్రి చెప్తూనే వస్తుంది, అక్రమాలకు సూత్రధారి టిజిఎండిసి.

గత నెల ఏప్రిల్ 4వ తేదీ నుండి నేటి ధాత్రి వరుస కథనాలతో పి జి ఎం డి సి కింది స్థాయి అధికారి నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు, ఇసుక వారిల్లో జరుగుతున్న అక్రమాలకు క్రియాశీలక పాత్ర పోషిస్తూ, సూత్రధారి టీజీఎండిసి శాఖ అని సాక్షాలతో పైకి తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ ఉన్నత అధికారులు టి జి ఎం డి సి మేనేజింగ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్, దృష్టి సాధించకపోవడం కిందిస్థాయి అధికారులకు మరింత బలాన్ని చేకూర్చి, టి జి ఎం డి సి ఇసుక రీచ్ ల వద్ద ఉన్న సిబ్బంది నుండి మొదలుకొని ఉన్నత అధికారుల వరకు, చీకటి ఒప్పందాలు విచారణ పేరుతో హోటల్లో ముఖం వేసి కాంట్రాక్టర్లను పిలిపించుకొని సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది అన్నా తాజా సమాచారం, వీటిని పరిగణంలోకి తీసుకుంటే టీజీఎండిసి ఇసుక రీచుల అక్రమాలకు సూత్రధారి అని చెప్పడానికి సందేహ పడాల్సిన అవసరం లేదు.

 

TGMDC

ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇసుక అక్రమాల పై విచారణకు అదేశిచాలి.మండల ప్రజలు.

ఇసుక అక్రమ వ్యవహారాలపై చర్యలు తీసుకోవడంలో టి జి ఎం డి సి విఫలం కావడం జరిగింది. అక్రమ వ్యవహారాలపై అనేక సాక్షాలతో, తేరపై కి తీసుకువచ్చిన అధికార యంత్రాంగం, టీజీఎండిసి ఉన్నత అధికారులు స్పందించకపోవడం, ఇసుక కాంట్రాక్టర్లు అక్రమాల్లో మరింత రెట్టింపు ఉత్సాహం కొనసాగించడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనలకు ఇసుక రీచుల్లో నేటికీ అమలు కాకుండా, ఇసుక రీచుల్ల క్వాంటిటీ అయ్యేవరకు టీజీఎండిసి చీకటి ఒప్పందంతో, కాంట్రాక్టర్లకు శాఖ సిబ్బంది ద్వారా వసూలు చేయించి ఇవ్వడం లాంటి కొనసాగించడం తో రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక వ్యవహారంపై ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేలా ఇప్పటికే టీజీఎండిసి వివరించడం జరిగింది. టి జి ఎం డి సి ఇసుక అక్రమాలపై ఇక చర్యలు తీసుకునే పరిస్థితి లేదని ప్రజలకు కూడా స్పష్టం కావడం జరిగింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇసుక అక్రమాల వ్యవహారంపై దృష్టి సాధించి, రెవెన్యూ విజిలెన్స్ శాఖలను ఆదేశించి విచారణ చేపట్టి, ఇప్పటికీ పెద్ద మొత్తంలో అక్రమాలు చేపట్టిన క్వారీలపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం.

వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం.

మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్
వనపర్తి నేటిదాత్రి :

రాష్ట్రంలో
రైతులు పండిచి న వడ్లు కొనుగోలులో
రాష్ట్ర ప్రభుత్వ రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ సాగునీళ్ళు రావడం లేదని రాకున్నా రైతులు కష్టపడి పండించుకున్న వడ్లు వెంటనే కొనుగోలు జరగక రైతులు ఐ.కే.పి,పి.ఏ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని నిరంజన్ అన్నారు యాసంగి పంటలో ఎటువంటి తేమగాని,తరుగుకాని ఉండదు అధికారులు తేమ ఉందని కొన్నిరోజులు,తాలు ఉందని గన్ని బ్యాగులు లేవని ,లారీలు రాలేదని రైతులను ఇబ్బందిపెట్ట డమూ పై మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం కొత్త గన్ని బ్యాగులు కొనుగోలు చేశామని చెబుతున్న క్షేత్రస్థాయిలో నాసిరకం బ్యాగుల వాడకం వల్ల అక్కడ కూడా రైతులు తరుగు కోల్పోవడం తో పాటు తేమ,తాళ్ళు అంటూ తరుగు కోల్పోవడంతో రైతులు తీవ్ర నష్టం ఎదురుకుంటున్నారని అన్నారు. రైతులు తూకం అయిపోగానే వాళ్ల పని అయిపోతలేదని బ్యాగులు నింపి ట్రాన్స్పోర్ట్ వరకు ఆగాలివస్తుందని వారికి సరిఅయిన సమయం అధికారులు చెప్పకపోవడం వల్ల రైతులు అన్ని పనులు వదులుకొని అక్కడ ఉండాల్సి వస్తుందని అన్నారు
మంత్రులు,అధికారులు వెంటనే స్పందించి మద్దతు ధరతో వడ్లను కొనుగోలు చేయాలని మాజి మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.రైతులకు అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను రైతులు వదులు కొని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోసా పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు.
జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,ఇమ్రాన్,నారాయణ నాయక్, మాజీద్,శ్రీనివాసులు ,తదితరులు పాల్గొన్నారు.

గణపురం లో బాల్ బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్.

గణపురం లో బాల్ బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్

నేడే సమ్మర్ కోచింగ్ ప్రారంభం

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు సమ్మర్ కోచింగ్ గా సీనియర్ కోచ్ మామిడి శెట్టి రవీందర్ ను నియమించినట్లు వారు తెలిపారు రవీందర్ మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు ఆదేశాల మేరకు గణపురం జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల ఆవరణంలో కోచింగ్ ఇవ్వబడుతుంది మే నెల ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుందని ఎండ తగలకుండా ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పిల్లలకు మే ఒకటో తారీకు నుండి 6- 6 -2025 వరకు బాల్ బాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ ఇవ్వబడుతుంది వారు అన్నారు అండర్ 14 పిల్లలు ఆసక్తి గలవారు సెల్ నెంబర్ 9030936615 ను సంప్రదించగలరు

ఘనంగా జరుపుకున్న బసవ జయంతి.

ఘనంగా జరుపుకున్న బసవ జయంతి…

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

బసవ జయంతి సందర్భంగా లింగాయత్ సమాజ్ ఝరాసంగం వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ మాలిపటల్ గారి అధ్యక్షతన బసవేశ్వరుడికి పూలమాలలు వేసి పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గాలప్ప పటేల్ మాలి పటేల్ సంతోష్ పటేల్ బొగ్గుల గాలెప్ప గారు నాగేశ్వర్ సర్జన్ శెట్టి, కంటాణం మల్లికార్జున స్వామి,బొగ్గుల నాగేశ్వర్ తమ్మలి రేవన సిద్దేశ్వర మడపతి నాగేశ్వర్ స్వామి గడ్డం మల్లన్న పటేల్ మరియు ఆలయ అర్చక సిబ్బంది మడుపతి నాగయ్య స్వామి మరియు తదితరులు పాల్గొని పూజలు చేయడం జరిగింది.

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ.

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ

పరకాల నేటిధాత్రి

పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో వేసవికాలం దృష్టిలో ఉంచుకొని అక్షయ తృతీయ సందర్భంగా డిపో మేనేజర్ రవిచంద్ర తో పాటు అరుణ ఫర్టిలైజర్ యజమాని మాజీ ఛైర్మెన్ శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం గందె వెంకటేశ్వర్లు,సంజయ్ మెడికల్ స్టోర్ యజమాని సంజయ్,గంగా వాటర్ ప్లాంట్ యజమాని లక్ష్మణ్ లు ప్రారంభించి మజ్జిగ ప్యాకెట్లు ప్రయాణికులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో సిబ్బంది,ప్రయాణికులు, తదితరులు పాల్గొన్నారు.

నాటుసారాతో పట్టుబడిన వ్యక్తులను బైండొవర్ చేసిన.

నాటుసారాతో పట్టుబడిన వ్యక్తులను బైండొవర్ చేసిన

ఎక్సైజ్ ఎస్ ఐ సాయి కుమార్

ముత్తారం :- నేటి ధాత్రి

 

ముత్తరం మండలంలో గతంలో నాటు సారాయి కేసులలో పట్టుబడిన పారుపల్లి లక్కారం మచ్చుపేట ఖమ్మం పల్లి అడవి శ్రీరాంపూర్ గ్రామాలలోని వ్యక్తులను ఇకమీదట నాటు సారాయి అమ్మకుండా ఉండటానికి ఒక సంవత్సర కాలం పాటు ఒక లక్ష రూపాయల జరిమానతో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి దగ్గర బైండోవర్ చేయడం జరిగిందని ఎక్సైజ్ ఎస్ ఐ సాయి కుమార్ తెలిపారు ఈ కార్యక్రమం లో ఎక్సైజ్ సిబ్బంది నిరంజన్ శ్రీనివాస్ రవి పాల్గొన్నారు

నూతన వధూవరులను ఆశీర్వదించిన.

నూతన వధూవరులను ఆశీర్వదించిన

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

మంథని :- నేటి ధాత్రి

 

 

మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలోనీ శివసాయి ఫంక్షన్ హాల్ లో గోపాల్ పూర్ గ్రామానికి చెందిన మేడ శైలజ – రవి పుత్రిక ప్రవళిక – నరేష్ వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వధించారు

జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను.!

జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల రాఘవ పూర్ గ్రామానికి నూతనంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ రావు బుధవారం ఉదయం స్వయంగా సందర్శించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్ కౌలాస్ ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version