నియోజకవర్గ ఆయా మండలాలలో ఎండిన మొక్కజొన్న పత్తి పంటలు.

జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాలలో ఎండిన మొక్కజొన్న పత్తి పంటలు

ఖరీఫ్ కన్నీరు పెట్టిస్తోంది.. ఆశలన్నీ సూరీడు ఆవిరి చేస్తున్నాడు..వరుణుడు మొఖం చాటేశాడు.. పంటలన్నీ ఎండిపోతున్నాయి.

◆ జాడలేని వానలు…

◆ ఎండుతున్న పంటలు.. ఆశల్లేని రైతులు…

◆ అడ్డాపై కూలీగా పనుల కోసం పరుగులు…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఖరీఫ్ కన్నీరు పెట్టిస్తోంది ఆశలన్నీ సూరీడు ఆవిరి చేస్తున్నాడు వరుణుడు మొఖం చాటేశాడు పంటలన్నీ ఎండిపోతున్నాయి.

పెట్టుబడులు రాని దుస్థితి అప్పులు మీదపడ్డాయి బతుకు కష్టమవుతోంది మళ్లీ పొట్టచేతపట్టుకుని రైతన్న వలసబాట పడుతున్నాడు.

అన్నదాతను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి సరైన వర్షాలు కురవక ఖరీఫ్ సాగక రైతన్న ఆందోళనకు గురవుతున్నాడు.

వర్షాకాలం ప్రారంభంలో కురిసిన అడపాదడపా వర్షాలకు సాగుచేసిన ఆరుతడి పంటలు కూడా ఎండిపోతున్నాయి.

20 రోజులుగా వేసవిని తలపిస్తున్న ఎండలకు పంటలన్నీ చేతికందకుండా పోతున్నాయి.

బోర్ల ఆధారంగా వేసిన వరిపంటలకూ నీరందక నెర్రలు బారాయి కనీసం పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంది.

దీంతో దిక్కుతోచని స్థితిలో మళ్లీ పొట్టచేతపట్టుకుని వలస బాటపడుతున్నాడు రెండేళ్లుగా కరువు తాండవం చేయడంతో పల్లెలను వదిలి పట్టణాలకు వలస వెళ్లిన అన్నదాతలు ఎంతో ఆశతోఈసారి ఖరీఫ్కు సన్నద్ధమయ్యారు.

ఈయేడు వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయన్న ఆశతో పల్లెలకు తిరిగి చేరుకున్నారు.

వేలాది రూపాయల అప్పులుచేసి పంటలు సాగుచేస్తే వర్షాలు లేక సాగుచేసిన ఆరుతడి పంటలన్నీ ఎండిపోయాయి.

కనీసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి పల్లెల్లో కానరావడం లేదు.

పల్లెల్లో చేసేందుకు పనులు దొరకక సంగారెడ్డి పట్టణంలోని కూలీల అడ్డమీదకు పల్లెల నుంచి తరలివస్తున్నారు. మాకు పనులు చూపాలని వేడుకుంటున్నారు. ఒక్కరిని కూలికి పిలిస్తే నలుగురు ఎగబడుతున్నారజిల్లా అంతటా కరువు పరిస్థితులే కనిపిస్తున్నాయి మురిపించిన వర్షాల ఆధారంగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, మినుములు, పెసర్లు, కందులు, జొన్న పత్తి పంటలను 1.20లక్షల హెక్టార్లలో రైతులు వేసుకున్నారు.

కొద్దోగొప్పో నీరు వచ్చే బోర్ల ఆధారంగా జిల్లా వ్యాప్తంగ పత్తి మినుములు, పెసర్లు, కందులు, పంటను సాగుచేశారు. వర్షాలు పడకపోవడంతో చేతికందే దశలో ఉన్న ఆరుతడి పంటలన్నీ ఎండిపోయ బోరుబావుల్లో సైతం నీటి ఊటలు అడుగంటిపోయి వరి పొలాలు నెర్రలు బారాయి. ఇక చేసేదిలేక అడ్డా మీదకు కూలీ పనులకోసం పరుగులు తీస్తున్నారు.

జహీరాబాద్ కోహిర్ మొగుడంపల్లి న్యాల్కల్ ఝరాసంగం మండలాల నుంచి నిత్యం వెయ్యి మందికిపైగా రైతులు కూలి పనులకు వస్తున్నారు. ఇక్కడ కూడా వారికి పనులు చెప్పేవారు లేకపోవడంతో నిరాశతో వెనక్కి తిరిగిపోతున్నారు.

ఆటో, బస్సుచార్జీలు పెట్టుకొని దూర ప్రాంతాల నుంచి పనికోసం వస్తే పనులు దొరకక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మక్క ఎండిపోయింది సారూ.

రెండెకరాల పొలం ఉంది అందులో రూ. 20వేల అప్పు చేసి పత్తి కందులు పంట వేశాను.

తీరా కంకి దశకు చేరుకున్న దశలో వర్షాలు పడకపోవడంతో పంటంతా ఎండిపోయింది.

దీంతో అడ్డామీదకు కూలీపని కోసం వచ్చినా ఇక్కడ కూడా పనిదొరకడం లేదు ఎట్లా బతకాల్లో అర్థమైతలేదు బొరేగౌ మొహమ్మద్ నవాబ్

రెండెకరాల పత్తి పోయినట్టే

నాకు రెండెకరాల పొలం ఉంది అందులో రెండు బోర్లున్నాయి వాటిల్లో కొద్దిపాటి నీరు వస్తుండటంతో రూ.30వేల అప్పు చేసి పత్తి పంట సాగుచేశాను.

వర్షాలు పడకపోవడంతో బోర్లలో నీటి ఊటలు అడుగంటాయి పంట ఎండిపోతోంది అడ్డమీద పనికొచ్చినా పనిచెప్పేవారే లేరురైతు మాచునూర్ ఖలీల్.

పనులు చూపించాలి

మళ్లీ కరువు మొదలైంది పంటలుఎండిపోయాయి ప్రభుత్వం స్పందించి పల్లెల్లో పనులు చూపించి ఆదుకోవాలి.

బుక్కెడు కూడు కోసం అడ్డమీద పడిగాపులే వారానికి రెండు రోజులైన పని దొరకడం లేదు పల్లెల్లోనే ఉపాధి పనులు చేపట్టి ఆదుకోవాలి.  మేదపల్లి పరమేశ్వర్ పటేల్

పోషణ భారమైంది.

నాకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పత్తి పంట వేసిన. వర్షాలు కురవక ఎండిపోయింది అందుకోసం చేసిన అప్పులు మీద పడ్డాయి.

బతుకు దెరువుకోసం అడ్డామీద కూలీవస్తే పని దొరకుతలేదు.

కన్నబిడ్డలను పోషించుకునేందుకు ఆదేరువులేదు ప్రభుత్వమే పనులు చూపించి తుమ్మనపల్లి మొహమ్మద్ రోషన్.

జహీరాబాద్: 80 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం.

జహీరాబాద్: 80 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం.

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

జహీరాబాద్ సమీపంలోని మాటికి జాతీయ రహదారిపై 20 లక్షల విలువైన 80 కిలోల నిషేధిత ఎండు గంజాయిని చిరాగ్ పల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి బుధవారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ కారు డిక్కీలో గోధుమ రంగు కవర్లో చుట్టిన 42 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. జహీరాబాద్ మండలం గోవిందా పూర్ కు చెందిన తిరుమలేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి.!

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ,కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి.

పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి 27:

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా ,కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలతోపాటు అన్ని కార్మిక సంఘాలు ఎండగట్టి వ్యతిరేకించాలని ఐఎఫ్టియు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పి. ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గురు వారం పలమనేరు పట్టణములో అంబేద్కర్ సర్కిల్ నందు రెండు ఐ ఎఫ్ టి యు విప్లవ కార్మిక సంఘాలు రాష్ట్రస్థాయి విలీన సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించడానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు.
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలై స్కీం వర్కర్లు, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్స్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచకరణ ప్రైవేటీకరణ పేరుతో దేశంలోని ప్రజలు, కార్మికుల కష్టార్జితాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫాసిస్తూ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పడానికి దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా అనేక మంది కార్మికుల ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తూ, పనిగంటలను పెంచి కార్మికుల నడ్డి విరిచి కార్పొరేట్ శక్తులను కోటీశ్వరులు చేస్తున్నదని విమర్శించారు. ప్రపంచ బ్యాంకు షరతులకు తలోగ్గి కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను తాకట్టు పెట్టి ,ప్రజల రక్తాన్ని రాబందుల్లాగా పీల్చి విదేశాల్లో దాచి పెట్టుకుంటున్నారని ఆరోపించారు. మార్చి 2 వ తేదీ రాజమండ్రి వేదికగా పుష్కరాల రేవు వద్ద చందన సత్రం నందు 2 ఐఎఫ్టియు సంఘాలు విలీన సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలు, కార్మికుల బలం కన్నా పాలకులు, కార్పొరేట్ శక్తులు బలం ఎక్కువ కావడంతో చట్టాలను శాసిస్తూ హక్కులను అరిస్తున్నారన్నారు ఘాటుగా విమర్శించారు. ఐఎఫ్టియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ, చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు వి. ఆర్. జ్యోతి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరత్నం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ విభజించు పాలించే విధానాన్ని పాటిస్తున్నదని విమర్శించారు. పాలక పార్టీలు చేస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశంలోని రెండు బలమైన ఐ ఎఫ్ టి సంఘాలు విలీనం అవుతున్నాయని వాటిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. మార్చి 2న రాజమండ్రిలో జరగనున్న రెండు సంఘాల విలీన సభను జయప్రదం చేయడానికి రాష్ట్రంలోని ప్రజలు, అన్ని సంఘాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో యోగేష్ బాబు, వెంకటరమణ, వెంకటరమణారెడ్డి, ఆనంద్, వెంకటేష్ పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version