గంజాయి, మత్తు పదార్థాలు వినియోగం వల్ల నష్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన
ఎస్ ఐ జి నరేష్
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామం లో నిషేదిత గంజాయి, మత్తుపదార్థాల వినియోగం వలన కలుగు నష్టాలపై, సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ముత్తారం ఎస్ ఐ జి నరేష్ మాట్లాడుతూ ఈ ఆధునిక టెక్నాలజీ కాలంలో సెల్ ఫోన్ వినియోగం పెరిగిపోయిందని అన్నారు. ప్రతినిమిషం సెల్ ఫోన్ లేనిది ఏ పని చేయలేకపోతున్నామని, ప్రతిదీ కూడా సెల్ ఫోన్ తోనే లింక్ ఉండడంతో మన సెల్ ఫోన్ నెంబర్ కూడా మన బ్యాంక్ అకౌంట్, పాన్ కార్ట్, ఆధార్ కార్డు, పెన్షన్, పౌరసరఫరాల వినియోగానికి సంబంధించి అన్ని విధాలుగా మన సెల్ ఫోన్ నెంబర్ అవసరం ఉంటుందని అన్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మనకు ఏదో లేనిపోని ఆశలు చూపించి అదేవిదంగా కొత్తగా పెళ్లి కార్డ్స్ ఏ పి కే ఫైల్స్, డిజిటల్ అరెస్ట్ అని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో మహిళలు పిల్లలను టార్గెట్ చేసుకొని సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. యువత ఇంటర్నెట్ పరిమితికి మించి వాడకూడదని, సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులను కాజేస్తున్నారని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీ ఏటీఎం, పిన్ నెంబర్ , సీవీవీ, బ్యాంకు ఖాతా తదితర వివరాలు కోరితే ఇవ్వరాదన్నారు. ఎవరైనా మీకు లాటరీ తగిలింది, కొంత డబ్బును సూచించిన బ్యాంకు ఖాతాలో జమచేయాలని ఫోన్ కాల్ వచ్చినా, ఏ విధంగా అయినా మీరు మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బును కోల్పోతే వెంటనే సమీప పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎలాంటి ఆపద సమయంలో సైబర్ నేరాల పట్ల గాని టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి లేదా 100 లకు ఫోన్ చేసి పోలీసుల సేవలు పొందాలని
కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం చేడు అలవాటులకు బానిసలుగా మారి భవిష్యత్తు నాశనం చేసుకోవడం జరుగుతుందని
సైబర్ నేరాల పట్ల, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు డ్రగ్స్ వంటి తదితర అంశాల పై యువత, పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ ఐ జి నరేష్ తెలిపారు ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు