షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండల కేంద్రంలోని షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని కోరారు. మంగళవారం ముస్లిం షాది ఖానా పెండింగ్‌లో ఉన్న షాదీఖానా భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

 

Congress

షాదీఖానా నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హాయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కోట నుండి 20 లక్షలు మంజూరైన నిధులు మంజూరు చేశారన్నారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా షాదీఖానా పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. కక్ష పూరితంగానే కాంగ్రెస్ లో చేపట్టిన పనులను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. షాదీఖానా పనులు పూర్తి కాకపోవడంతో ముస్లింలు పెళ్లిలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.

కె జి ఎన్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభం.

కె జి ఎన్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభం

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపల్ పట్టణం కేంద్రంలో కేజీఎన్ ఎంటర్ప్రైజెస్ బుధవారం ప్రారంభోత్సవం జరిగింది, కేజియన్ ఎంటర్ప్రైజెస్ యజమాన్యం సాన్ ఉల్ఖాన్, ఇస్రార్ ఖాన్, కేసముద్రం పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటు ధరలలో ఇంటీరియర్ డెకరేషన్ ఫాల్ సీలింగ్ వినియోగదారులకు అతి తక్కువ ధరలలో ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ డెకరేటర్ చేసి అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకు కేసముద్రం పట్టణంలో ఫాల్స్ సీలింగ్ మెటీరియల్ తో ఫిట్టింగ్ చేసేవారు అందుబాటులో లేరని ఇకనుండి కేసముద్రం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని అందరికీ సరైన అందుబాటు ధరల్లో సౌలభ్యం ఉంటుందని అన్నారు. వినియోగదారులు ఎవరైనా పాల్ సీలింగ్ డిజైన్ చేయించుకోవాలనుకునేవారు కేజీఎన్ ఎంటర్ప్రైజెస్ పట్టణ కేంద్రంలో పొట్టి శ్రీరాములు సెంటర్ కూడలిలో షాప్ నూతనంగా ప్రారంభించామని వినియోగదారులు నేరుగా మమ్మల్ని సంప్రదించి మీకు అందుబాటు ధరల్లో పాల్ సీలింగ్ మెటీరియల్ తో మీకు నచ్చిన డిజైన్ లో ఫిటింగ్ చేసి అనుకున్న టైంలో అందిస్తామని పేర్కొన్నారు.

అభ్యుదయ కవితా పతాక శ్రీ శ్రీ.

అభ్యుదయ కవితా పతాక శ్రీ శ్రీ

తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 30:

 

 

సమాజంలోని అసమానతలపై తన రచనలతో అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ, శ్రామిక జీవన సౌందర్యాన్ని ఎలుగెత్తి చాటిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు అని కొనియాడారు.
బుధవారం తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రం మరియు అభ్యుదయ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శ్రీ జయంతి నిర్వహించారు.
ఈ సందర్భంగా
తిరుపతిబాలోత్సవం అధ్యక్షులు
నడ్డి నారాయణ అధ్యక్షతన
శ్రీ శ్రీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన రచనలను చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో వేమన విజ్ఞాన కేంద్రం ప్రధానకార్యదర్శి మల్లారపు నాగార్జున, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు యువశ్రీ మురళి, డాక్టర్ నెమిలేటి కిట్టన్న,తిరుపతి జిల్లా రచయితల సంఘం కార్యదర్శులు మన్నవ గంగాధర ప్రసాద్,పేరూరు బాలసుబ్రమణ్యం
సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ ఓ.వెంకటరమణ,
తదితరులు పాల్గొన్నారు.

కె జి ఎన్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభం.!

కె జి ఎన్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపల్ పట్టణం కేంద్రంలో కేజీఎన్ ఎంటర్ప్రైజెస్ బుధవారం ప్రారంభోత్సవం జరిగింది, కేజియన్ ఎంటర్ప్రైజెస్ యజమాన్యం సాన్ ఉల్ఖాన్, ఇస్రార్ ఖాన్, కేసముద్రం పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటు ధరలలో ఇంటీరియర్ డెకరేషన్ ఫాల్ సీలింగ్ వినియోగదారులకు అతి తక్కువ ధరలలో ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ డెకరేటర్ చేసి అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకు కేసముద్రం పట్టణంలో ఫాల్స్ సీలింగ్ మెటీరియల్ తో ఫిట్టింగ్ చేసేవారు అందుబాటులో లేరని ఇకనుండి కేసముద్రం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని అందరికీ సరైన అందుబాటు ధరల్లో సౌలభ్యం ఉంటుందని అన్నారు. వినియోగదారులు ఎవరైనా పాల్ సీలింగ్ డిజైన్ చేయించుకోవాలనుకునేవారు కేజీఎన్ ఎంటర్ప్రైజెస్ పట్టణ కేంద్రంలో పొట్టి శ్రీరాములు సెంటర్ కూడలిలో షాప్ నూతనంగా ప్రారంభించామని వినియోగదారులు నేరుగా మమ్మల్ని సంప్రదించి మీకు అందుబాటు ధరల్లో పాల్ సీలింగ్ మెటీరియల్ తో మీకు నచ్చిన డిజైన్ లో ఫిటింగ్ చేసి అనుకున్న టైంలో అందిస్తామని పేర్కొన్నారు.

తిప్పనగుల్లలో పౌర హక్కుల దినోత్సవం.

తిప్పనగుల్లలో పౌర హక్కుల దినోత్సవం

నిజాంపేట్, నేటి ధాత్రి

నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగుళ్ల గ్రామంలో బుధవారం రోజున పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎస్ఐ జైపాల్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని ఉద్దేశాలను తెలుపడం జరిగింది. గ్రామంలో ఎస్సీ ఎస్టీలను కులం పేరుతో ఎవరైనా దూషిస్తే మా దృష్టికి తీసుకురావాలని గుడిలోకి, బడిలోకి, రానివ్వకుండా కులం పేరుతో మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, హోటళ్లల్లో అందరికీ ఒకేలాగా ఒకే తీరు గ్లాసులల్లో చాయ్ ఇవ్వాలని మీకు వేరు మాకు వేరు అనే పద్ధతిని ఉంటే అటువంటి అంశాలపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని కోనేరు రంగారావు సిఫారసుల మేరకు ప్రతినెల చివరి రోజున మండలంలోని ఏదో ఒక గ్రామంలో ఇలాంటి పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం చేపడతామని, ఆ గ్రామాలలో ఏవైనా కులాల వారీగా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో జీవించాలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులు సమాన అవకాశాలు సమాన విద్య అందరికీ అందించే విధంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇమాద్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి శ్యామల పోలీస్ సిబ్బంది గ్రామస్తులు చంద్రం, యాదగిరి, రాజు, నవీన్, గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.

కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్స్ ను తిప్పికోట్టండి.

కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్స్ ను తిప్పికోట్టండి

గుండాల(టీయూసిఐ)మేడే పిలుపు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

ట్రేడ్ యూనియన్ సెంట్రల్ ఆఫ్ ఇండియా (టీయూసిఐ)
139 వ మేడే, పోస్టర్లను గుండాల మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ పార్టీ కార్యాలయం లో పోస్టర్లు
ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వెల్డింగ్ ఆటో అండ్ మోటర్ మెకానిక్ వర్కర్స్(టీయూసిఐ)
మండల నాయకులు మొక్క మరీ అధ్యక్షతన వహించగా
గుండాల మండల కమిటీ కార్యదర్శి గడ్డం రమేష్ మాట్లాడుతూ ప్రియమైన
కార్మికులారా 1886 మే ఒకటి పాలక వర్గాల ధమాకాండలో చికాగో (అమెరికా)
కార్మికవర్గం రక్తం చిందించి ఉరికంబాలను
సైతం లెక్కచేయక సాధించిన పోరాట ఫలితమే 8 గంటాల పనిని ప్రపంచం ఆమోదించాల్సి వచ్చింది,
139 సంవత్సరం ల క్రింద ఇంతగా శాస్త్ర సంకేతిక పరిజ్ఞానం రవాణా అభివృద్ధి చెందని కాలం మన దేశంలో ఆనాడు మనిషి సాగటు అయుర్దాయం 40 సం,రాలు
నేడు 70 సంవత్సరాల మానవ జాతినే నాశనం చేసిన కాలర మాసుచీ క్షయ
గత్తరలాంటి వ్యాధులను
తరిమి ఏసిన వైద్య విజ్ఞానం ఒక్కనాడు కరువుతో అల్లాడి లక్షలాది మంది తిండి లేక అమానుషంగా మరణించారు.కనీసం మంచినీరు కూడా అందించని
దురావస్థ నుండి తాగు నీరందించడంతో వ్యవసాయరంగం విప్లవాత్మక మార్పులతో ప్రపంచానికే తిండి గింజలు అందించే శక్తి వచ్చింది కరువు కాటకాల నుండి బయట పడ్డారు.కానీ పాలకుల చర్యల ఫలితంగా తిండి లేక అలమటించే స్థితి అవడం సిగ్గుచేటు.
నేడు యాంత్రీకరణతో
శ్రామికుడు 8.గం„ల పనిని 4.గం„లు కూడా చేసిన సరిపోతుంది పెట్టుబడిదారులు నేడు కార్మిక రక్తాన్ని మరింతగా పిల్సిపిప్పి చేసి సంపద పోగేసుకోవడానికి
12 గం„ల పని పెంపుదల ముందుకు తీసుకొస్తున్నారు.ఇన్పోసిస్ అధినేత నారాయణమూర్తి వారానికి 70 గం„లు పనిచేయాలని ఆదివారం కూడా పనిచేయాలని
ఎల్, టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వారానికి 90 గం„లు పని చేసి ప్రపంచంలోనే
అగ్రగామిగా నిలవాలని చీలుక పలుకులు వల్లిస్తున్నారు.దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ లో పని గంటల పెంపు ప్రతిపాదించారు. దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకున్నట్లు
అధిక పనిగంటలతో శ్రమజీవుల రక్తాన్ని పీల్చిపిప్పి చేసే లక్ష్యం తప్ప మరొకటి కాదు 8 గంటల పనితోనే పారిశ్రామక వేతనాలు గణనీయంగా అభివృద్ధి అయ్యరు ప్రపంచంలోనే ఆదాని మూడవ స్థానానికి దేశంలో అంబానీలు అత్యంత సంపదగల వారిగా నిలిచారు
12 గంటాల పనితో ఎంతో అభివృద్ధి కావాలనుకున్నారు.
ఇప్పటికే 70 శాతం దేశ సంపద కేవలం ఐదు శాతం గల ధనికుల చేతుల్లో ఉందని 30 శాతం సంపద 95 శాతం గల ప్రజల చేతుల్లో ఉందని సర్వేలు ఘాోషిస్తున్నాయి.ఈ స్థితిలో పని గంటల పెంపును మే డే స్ఫూర్తితో తిప్పి కొట్టాలని పిలుపుని ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీయూసి ఐ నాయకులు మాచర్ల కోటేష్, మహేష్, తరుణ్, కార్తీక్, ఎస్.కె యాకూబ్, తదితరులు పాల్గొన్నారు,

భూభారతి రైతులకు ఒక వరం.

భూభారతి రైతులకు ఒక వరం

ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్య శారదా

#నెక్కొండ,

నేటి ధాత్రి;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిని దరిదాపుల్లో లేకుండా చేసి భూభారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ భూభారతి రైతుకు ఒక వరం రైతులు ఈ భూభారతిని సరైన విధంగా వినియోగించుకోవాలని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి బుధవారం అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భూభారతి రికార్డుల్లో తప్పులు సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సెక్షన్ 5, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యుటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పట్టాదారు పాసు పుస్తకాలు, ఆపిల్ వ్యవస్థ రివిజన్ అధికారాలు, గ్రామ రెవెన్యూ రికార్డులు, రికార్డుల నకలు పొందడం ఎలా, తదితర అంశాలపై రైతులకు ఒక అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తున్నదని, అధికారులు గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలకు భూభారతి విధివిధానాల కరపత్రాలు గ్రామాల్లో పంపిణీ చేయాలని, ఆయన అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, 39 గ్రామపంచాయతీలు ఉన్నాయని, మండలంలో మొత్తం విస్తీర్ణం 49,466 ఎకరాల భూమి ఉందని, 33,250 ఎకరాల పట్టా భూములు ఉన్నాయని, అలాగే 6862 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, 25491.36 ఎకరాల భూమికి పట్టాదారు పాస్బుక్కులు ఇప్పటివరకు ప్రభుత్వం సరఫరా చేసిందని,6293 ఎకరాల భూములపై వివాదాస్పదమైన ఆరోపణలతో కేసులు ఉన్నాయని అలాగే 4120, వివిధ కారణాలతో పట్టా భూములకు ఇంకా పట్టాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి మాట్లాడుతూ గతంలో మాదిరిగా కాకుండా రైతుకు సులభమైన మార్గంలో మీ భూ సమస్యలు పరిష్కారానికై ఈ భూభారతి విధానం వచ్చిందని అన్నారు. నెక్కొండ మండలంలో భూ యజమానులు 15145 ఉన్నారని, 15145 ఖాతా నెంబర్లు కలిగి ఉన్నారని, ఇప్పటివరకు మండలంలో ఆర్ఓఆర్ కంప్యూటర్ లో నిక్షిప్తం అయినావి 15145, ఇవి కాక 6293 పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు ఉన్నాయని ఆమె అన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డిఓ ఉమారాణి, ఏ డి ఏ దామోదర్ రెడ్డి, నెక్కొండ తహసిల్దార్ వేముల రాజ్ కుమార్, నెక్కొండ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి ,నర్సంపేట వ్యవసాయ మార్కెట్ఠ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కీ అశోక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, పలు గ్రామాల మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు మహిళా సంఘ ప్రతినిధులు మహిళ సంఘల మహిళలు, రైతులు, మహిళ రైతులు,లతోపాటు సిఐ సన్నాయిల శ్రీనివాస్, ఎస్ఐ మహేందర్లు, బందోబస్తు నిర్వహించారు.

ఉపాధి హామీ సిబ్బంది పెండింగ్ వేతనాలు చెల్లించాలి.

ఉపాధి హామీ సిబ్బంది పెండింగ్ వేతనాలు చెల్లించాలి

నిజాంపేట్, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు గత మూడు నెలలుగా రావడం లేదని ఎంపీడీవోకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ ఏపీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ ఉద్యోగుల పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేసి పేస్కేల్ అమలు చేయాలి అని ఎం పి డి ఓ రాజి రెడ్డి కి లెటర్ ఇవ్వడం జరిగిందన్నారు. గత మూడు నెలలుగా వేతనాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని వారు అన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలతో పాటు పేస్కేల్ ను అమలు చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ టి ఏలు రవితేజ, మమత, సి ఓ లు అనిల్, శ్రీధర్, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న టీజీఐడిసి.!

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల్ ఎస్ ఆర్ కె గార్డెన్లో మాజీ ఎంపీటీసీ దేశెట్టి గారి సోదరి వివాహ వేడుక లో పాల్గొని మరియు సదాశివపేట్ పట్టణంలోని ఎస్ వి ఎస్ కన్వెన్షన్ హాల్లో ముంగి నరసింహారెడ్డి బావమరిది వివాహ వేడుక లో పాల్గొని అక్షింతలు వేసి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారు వారితో పాటు మాజీ సర్పంచ్ మల్ రెడ్డి మాజీ సర్పంచ్ అమీర్ శివకుమార్ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వీధిశునకం సైరవిహారం*

వీధిశునకం సైరవిహారం*
ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామంలో బాలుడిపై దాడి
ఇల్లందకుంట: నేటిధాత్రి

 

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామంలో బాలుడు రామంచ అయాన్ రెండు సంవత్సరాల బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేయగా తీవ్ర గాయాలైనట్లు తెలిపారు హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం గతంలో కూడా పలుమార్లు వీధి కుక్కలు దాడి చేశాయని అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని గ్రామస్తులు బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉగ్రవాదుల దాడి అమానుషం.

ఉగ్రవాదుల దాడి అమానుషం

సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గంలో సామాన్యులపై ఉగ్రదాడిని ఖండిస్తున్నామని, ఈ సంఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరిపి ఉగ్ర మూకలను కఠినంగా శిక్షించాలని సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ డిమాండ్ చేశారు.నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో జాతీయ అవార్డు గ్రహీత గోకా రామస్వామి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో డాక్టర్ పరికిపండ్ల అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, స్థానికులు జెండాలు, కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జం ప్రభాకర్, భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడేపూ రాజేంద్రప్రసాద్, వారణాసి మోహన్, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ,శుభ లతోపాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

10 వ తరగతి ఫలితాలలో ఐలోని.!

10 వ తరగతి ఫలితాలలో ఐలోని పాత్ ఫైండర్ ప్రభంజనం

నేటిధాత్రి ఐనవోలు :-

పదవ తరగతి ఫలితాలలో అయినవోలు పాత్ ఫైండర్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షలలో ఐలోని ఫాత్ ఫైండర్ విద్యార్థినిలు ఆర్ జ్యోతి 600 మార్కులకు గాను 572 ఈ అక్షిత 567 జి సంజయ్ 563 మార్కులతో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. 13 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. ఈ ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సుభానొద్దీన్ మాట్లాడుతూ సంవత్సరము ఈ
పాఠశాల నుండి మొత్తం 31 మంది విద్యార్థులు హాజరై అందరూ ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉంది. ఈ పరీక్షల్లో పాఠశాల మొత్తం ఉత్తీర్ణత శాతం 100% సాధించి పాఠశాల ఖ్యాతిని మరింత పెంచారు. ఈ విజయానికి పాఠశాల ఉపాధ్యాయుల నిరంతర శ్రమ విద్యార్థుల కృషి మరియు తల్లితండ్రుల సహకారం ప్రధాన కారణాలుగా నిలిచాయి. పాఠశాల యాజమాన్యం డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వర రావు వైస్ ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్, ఉపాధ్యాయిని ఉపాధ్యాలు.విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలియచేస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

పదో తరగతి ఫలితాల్లో.. సత్తా చాటిన గురుకుల విద్యార్థులు.

పదో తరగతి ఫలితాల్లో.. సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో జనరల్ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో 10వ తరగతి విద్యార్థులు సత్తా చాటారు. అమృత 576/600, స్పందన 571/ 600, నందిని 571/600, జోత్స్న 569/600, మౌనిక 569/600 మార్కులు సాధించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కష్టించి వ్యవసాయం చేసి జీవిస్తున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి అత్యధిక మార్పులు సాధించటంతో పాఠశాల ప్రిన్సిపల్ అంజన్ రెడ్డి, మరియు అధ్యాపక బృందం సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలని అధ్యాపక బృందం ఆకాంక్షించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 55 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 5 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 42 మంది విద్యార్థులకు గాను 40 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. సింధు 503/600 మార్కులు సాధించింది. మండలంలోని 10 పాఠశాలల్లో.. మొత్తం 528 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 477 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

కర్రెగుట్టలలో కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలి.

కర్రెగుట్టలలో కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలి

ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ లు ముంజాల బిక్షపతి గౌడ్, మాదాసి సురేష్.

ములుగు జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల బారీ ర్యాలీ..

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్.

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తి.

వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి/ ములుగు,నేటిధాత్రి:

 

 

కర్రెగుట్టలలో మోహరించిన కేంద్ర ప్రభుత్వ పోలీసు బలగాలను వెనక్కి రప్పించి శాంతియుత వాతావరణం కల్పించాలని ప్రజాసంఘాల జేఏసీ ములుగు జిల్లా చైర్మన్ ముంజాల బిక్షపతి గౌడ్, హనుమకొండ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు.ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా బుధవారం దళిత,గిరిజన,ఆదివాసి,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వేలాదిమందితో భారీ ఎత్తున శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులను చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విలువైన కనజ సంపదను సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసమే ఆపరేషన్ కాగలరు కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని వారు విమర్శించారు.తక్షణమే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు సోమ రామ్మూర్తి, సాయిని నరేందర్,వట్టంఉపేందర్, బొట్ల బిక్షపతి,జై సింగ్ రాథోడ్,తెలంగాణ కొమురయ్య, కర్ణాటకపు వావిలాల లక్ష్మణ్, మోరే ఐలయ్య, అమ్ముల అశోక్,మాదాసు జితేందర్ తదితరులు పాల్గోన్నారు.

వివాహా వేడుకల్లో పాల్గొన్న.!

వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి

మొగుడంపల్లి మండల కేంద్రంలోని ఎస్.వి.కె.గార్డెన్స్ లో ఈ రోజు జరిగిన గుడుపల్లి గ్రామం కాల్వ ముత్యాల్ రెడ్డి కుమారుని వివాహా వేడుకల్లో టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం పాల్గొని నూతన వదువరు లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ వివాహా వేడుకల్లో సుదర్శన్ రెడ్డి,రాజేందర్ రెడ్డి,వినాయక్ రెడ్డి,చెంగల్ జైపాల్,విజయ్, సి.యం.అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

పేదల కాలనీలో కనీస సదుపాయాలు కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి

ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతికి వినతి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అర్హులైన నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి మంజూరు చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలో పేదలను నివసించే కాలనీలకు ప్రత్యేక నిధులు కేటాయించి కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.బుదవారం ఎంసిపిఐ (యు) ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం స్థానిక నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలిసి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చెంది జనాభాపరంగా విపరీతంగా పెరుగుతున్నదని అదే స్థాయిలో కనీస వసతులు లేవని అందులో ముఖ్యంగా పేదల నివసించే కారల్ మార్క్స్ కాలనీ జ్యోతి బస్ నగర్ తదితర ఏరియాల్లో అంతర్గత రోడ్లు డ్రైనేజీ కాలువలు మంచినీటి నల్లాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పేదల కాలనీలో ఈ ప్రభుత్వంలోనైనా మెరుగుపడతాయని ఆశపడితే ఇంతవరకు కనీస దృష్టి పెట్టకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో సైతం పారదర్శకత లోపించిందని అర్హులైన నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా తమ ఇష్టానుసారంగా ప్రక్రియ చేపట్టారని ఇది సరైన చర్య కాదని ఆరోపించారు. ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి ప్రాధాన్యత క్రమంలో నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, యుపిఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, పట్టణ నాయకులు ముప్పారపు రాజేందర్, బైరబోయిన నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

అడవులలో పచ్చదనాన్ని.!

అడవులలో పచ్చదనాన్ని సంరక్షించుకుందాం….. పర్యావరణాన్ని కాపాడుదాం…

చిత్తూరు డీఎఫ్ఓ భరణి

అడవుల్లో మొక్కలు ఏర్పాటు చేయడం అభినందనీయం= సీఈఓ నరేంద్రన్.

రామచంద్రాపురం(నేటి ధాత్రి) ఏప్రిల్ 30:

 

అటవీ శాఖకు చెందిన అడవులలో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించి. పర్యావరణాన్ని కాపాడాలని చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారిణి భరణి అన్నారు. మండలంలోని కొత్త కండ్రిగ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని పచ్చదనంగా మార్చేందుకు ప్రాణ యోగ ఆశ్రమం అటవీ ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన చిత్తూరు అటవీ శాఖ అధికారిణి భరణి, తిరుపతి బయో ట్రీమ్ సీఈవో నరేంద్రన్లకు ప్రాణ యోగ ఆశ్రమ వ్యవస్థాపకులు సి.కైలాస్ కుమార్తె కృపారాణి, సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవుల సంరక్షణతోనే మానవ మనుగడ, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఆశ్రమం పక్కనున్న అటవీ భూమిలో ప్రాణ యోగ ఆశ్రమ నిర్వాహకులు 250 మర్రి,వేప, రావి చెట్లను నాటి సంరక్షించడం అభినందినీయమని ఆమె తెలిపారు. తిరుపతి బయోట్రీమ్ సీఈఓ నరేంద్రన్ మాట్లాడుతూ అటవీ భూముల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రాణ యోగ ఆశ్రమం వ్యవస్థాపకులు కైలాష్, కృపారాణిలు పెద్ద మొక్కలు నాటించి సంరక్షించడం హర్షినియమన్నారు.మొక్కల సంరక్షణకు ఆశ్రమ యాజమాన్యానికి ప్రత్యేక సూచనలు సలహాలు అందజేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ వన సంరక్షణే… మానసంరక్షణ నినాదాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆశ్రమంలోని ప్రకృతి వనం, పరిశుభ్రత… పచ్చదనం. యోగశాల, వసతులను పరిశీలించి ఆశ్రమ నిర్వాహకులకు శభాష్ అని కితాబు ఇచ్చారు. మొక్కల పెంపకానికి ముందుకొచ్చినందుకు ప్రాణ యోగ ఆశ్రమ నిర్వాహకులను అటవీ శాఖ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటసుబ్బయ్యడిఆర్ఓ కారన్ సింగ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కుమార్, సిబ్బంది పద్మనాభం,ప్రాణ యోగ ఆశ్రమ ప్రతినిధులు మురళి,శివ యాదవ్, లక్ష్మయ్య, ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి.

వరంగల్ తూర్పు జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి.

బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్.

వరంగల్, నేటిధాత్రి

 

భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి ఆడేపు వెంకటేష్ అధ్యక్షతన బుధవారం నాడు ఏకశిలా పార్క్ బాలసముద్రం వద్ద వరంగల్ తూర్పు జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ కొరకై మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ముందుండి పోరాడిన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని కోరుతూ దేశాయిపేట ఇండ్ల ముందు నిరాహార దీక్ష చేపట్టిన వారికి మద్దతుగా బీజేపీ మద్దతు ప్రకటించి ఈరోజు ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు చేయాలనీ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కలలను నిజం చేస్తూ డబుల్ బెడ్ రూమ్ లను గత బిఅర్ఎస్ కేటాయించినా ఇండ్లు ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు కావస్తున్న జర్నలిస్టులకు నీడ లేకపోయిందని విమర్శించారు.

BJP

ప్రభుత్వానికి, ప్రజలకు ప్రతినిధులగా వారి మధ్య జరిగే సమాచారాన్ని తెలియపర్చే వారు జర్నలిస్టులు. వారికి పేపర్ సంస్థ నుండి చాలీచాలని వేతనాలతో కుటుంబంతో జీవనాన్ని గడుపుతున్నారు. ఇంటి అద్దె కట్టలేక నాన అవస్థలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

అప్పుడున్న రాజకీయ పరిణామాలు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం వలన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.

ప్రభుత్వాలు ఏవి ఉన్నా జర్నలిస్టులను వాడుకోవడం, ప్రభుత్వం పోయాక మళ్ళీ వచ్చిన ప్రభుత్వం అదే తరహా జర్నలిస్టులను వాడుకుంటూ, గత ప్రభుత్వాల మాదిరిగానే చేస్తూ ఉండడం అనవాయితిగా మారింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్న గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వం చేస్తోంది.

ఇప్పడి లబ్ధి దారులకు ఇండ్లు ఇయ్యక పొవడం వలన శిథిలావస్థకు చేరుతుతున్నాయి. అసాంఘిక కర్యకలాపాలకు అడ్డాగా మారి జూదాలకి, వ్యభిచారులకు ఆశ్రయం ఐపోయి, తలుపులు, కిటికీలు, కరెంటు వైర్లు,నీటి పైపు లైను, ట్యాంకులు అన్ని ధ్వంసం చేశారు.

తూర్పులో శాసనసభ్యులుగా ఉన్న మంత్రి కొండా సురేఖ ఎన్నోసార్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ల దగ్గర పర్యటించినప్పటికీ జర్నలిస్టులపై అనుకూల భావన లేనట్లు కనిపిస్తుంది.

అదే నిజమైతే గత ప్రభుత్వంలో భూమి కేటాయింపు నిధుల కేటాయింపు శంకుస్థాపన ప్రారంభోత్సవం ఏ రకంగా చేశారు. దీనిని ప్రభుత్వాలు దేనికోసం నిర్మించాయి. సదరు పాలకులు గమనించాలి.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం సబబేనా అంటూ వరంగల్ తూర్పులో వర్కింగ్ జర్నలిస్టులు నిరాహార దీక్షలు చేపట్టారు.

సమస్య శాంతియుతంగా పరిష్కారం కాకపోతే నగర నడిబొడ్డున తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామన్నారు తెలిపారు.

ఇప్పటికైనా ప్రజాపాలన ప్రభుత్వం స్పందించి తూర్పు వర్కింగ్ జర్నలిస్టులకు త్వరగా కేటాయించాలని కోరారు.

BJP

 

12 ఏప్రిల్, 2021 రోజున వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం డబల్ బెడ్రూంలు భూమి పూజ చేసిన అప్పటి మంత్రివర్యులు కేటీఆర్..

రెండు ఏండ్లలో 12 కోట్లు ఖర్చు పెట్టి, మొత్తం మూడు ఎకరాల భూమిలో, రెండు ఎకరాల్లో మొత్తం 9 బ్లాకులు కలిపి 200 డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పూర్తి చేసిన అప్పటి తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, తేదీ 17 జూన్, 2023 నాడు నిర్మాణం పూర్తి చేసిన డబల్ బెడ్ రూం లు, అట్టహాసంగా ప్రారంభం చేసి, ఆరుగురు జర్నలిస్టులకు గృహ ప్రవేశం, జర్నలిస్ట్ ల కాలనీ, జర్నలిస్టుల కొరకు అని పేర్కొన్న అప్పటి ప్రభుత్వం.

రెండు ఏండ్లుగా నిరుపయోగంగా ఉండటం వలన చాలా వరకు కిటికీలు, ఎలెక్ట్రిక్ పరికరాలు, డోర్ లు, పైపులు ధ్వంసం అయ్యాయి.

వాటర్ ఇంటెక్స్ ట్యాంక్ లు మాయమయ్యాయి, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన తీరు కనిపిస్తుందని అన్నారు.

వరంగల్ జర్నలిస్ట్ ఐకాస ప్రధాన డిమాండ్లు

 

అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించాలి.

 

జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ( జేహెచ్ఎస్) పరిమితి రెండు లక్షల నుండి 10 లక్షలకు పెంచాలి.

 

అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో (జేహెచ్ఎస్) పనిచేయడంతో పాటు అన్ని వ్యాధులకు వర్తింపజేయాలి.

 

వరంగల్ ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించాలని, అలాగే పలు డిమాండ్లతో వరంగల్ జిల్లా రెవెన్యూ అధికారికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెమొరండం ఇవ్వడం జరిగింది.

BJP

 

 

 

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా మిత్రులు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు మార్తీనేని ధర్మారావు, మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీర సీతారాం నాయక్, మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు, మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, మాజీ పూర్వ జిల్లా అధ్యక్షులు చాడ శ్రీనివాసరెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ , గురుమూర్తి శివకుమార్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, కార్పొరేటర్ చాడ స్వాతి, కాసు శిల్పా, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చా నాయకులు, బిజెపి జిల్లా నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

రిజల్ట్స్ లో ఫ్రోబెల్ మోడల్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ.

ఎస్ఎస్సి రిజల్ట్స్ లో ఫ్రోబెల్ మోడల్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని ప్రోబెల్ మోడల్ హైస్కూల్ వెల్లడించిన ఎస్ఎస్సి రిజల్ట్ లో విద్యార్థుల మార్కులు 561 బి సిరిచందన 550 డి దీపాన్విత 541 బి దీక్ష 532 కె నిహారిక 521 జి వైష్ణవి మార్కులు సాధించారు
500 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 10 మంది.
100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల
గత 20 సంవత్సరాల నుండి మండలంలో కార్పొరేట్ కు దీటుగా అగ్రగామిగా నిలుస్తున్న ఏకైక పాఠశాల ప్రొబెల్ మోడల్ హై స్కూల్ అధిక మార్కులు సాధించిన భాష బోయిన సిరి చందనను సన్మానించిన ప్రొఫైల్ మోడల్ యజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు

Good Morning SSC Miracle Marks for Miruthula.

Good Morning SSC Miracle Marks for Miruthula.

Miruthula as the school SSC topper student.

Student who scored 545 marks in class 10.

Mahadevpur – NETI DHATRI:

In the 10th class results of Good Morning Grammar High School in Miruthula
Hed quater, Lakmi Miruthula
Murugan became the school SSC topper, scoring 545 marks. In the 10th class examination results released across the state today, Lakmi Miruthula Murugan became the topper of Good Morning Grammar High School by scoring the highest marks and upholding the name of the school. The school management, teachers and students congratulated Lakshmi Miruthula
Murugan. The school management, teachers and students thanked the school management, teachers and students for providing valuable education to their daughter and helping her achieve the best marks in class 10th.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version