రత్నాకర్ రావు 5వ వర్ధంతి.

మెట్ పల్లి మే 10 నేటి ధాత్రి:

మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 5వ వర్ధంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు చేతుల మీదుగా వ్యవసాయ మార్కెట్ అమాలి చాట జాడు కార్మికులకు మజ్జిగ పాకెట్లు కూల్ డ్రింక్ పాకెట్స్ పంపిణీ చేశారు అనంతరం జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ మా నాన్నమంత్రిగా ఉండగా కోరుట్ల నియోజకవర్గంలో అత్యధిక పనులు చేశారని పశు వైద్యశాల ఏర్పాట్లు చేశారని ఆయన కోరుట్ల నియోజకవర్గంలో అన్ని సదుపాయాలు కల్పించాలని ఆయన చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికి నడుస్తున్నాయని అన్నారు .
ఈ కార్యక్రమంలో కొమిరెడ్డి విజయ్ జువ్వాడి చంద్రశేఖర రావు పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మెట్పల్లి మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి పట్టణ యూత్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్ మాజీ జెడ్పిటిసి ఆకుల లింగారెడ్డి ఎర్రోళ్ల హనుమాన్లు యమ రాజయ్య జిల్లా సేవాదళ్ అధ్యక్షులు నాయిని సురేష్ తుమ్మలపల్లి రాంప్రసాద్ పూదారి నర్సాగౌడ్ మర్రి సహదేవ్ పిప్పిర రాజేష్ మోకిం షకీల్ లింగారెడ్డి బుర్ర మహేందర్ అన్నమయ్య నరేష్ జాకీర్ రమేష్ బత్తుల భరత్ పూదారి రాము పుల్ల రాజా గౌడ్ మహేందర్ యూట్యూబ్ రాజు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి .

శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ రజితోత్సవ వేడుకలు.

మందమర్రి నీటి ధాత్రి :

 

 

మందమర్రి పట్టణ అంగడి బజార్ లోని శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ రజితోత్సవ వేడుకలు. మందమర్రి పట్టణంలోని అంగడి బజార్ లో గల శ్రీ శ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ 25వ వార్షికోత్సవ ఉత్సవాలను శుక్రవారం నుండి శనివారం వరకు అత్యంత వైభవంగ నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు దిలీప్ శుక్ల శర్మ తెలిపారు.

Silver Jubilee.

 

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క 25 వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 9వ తేదీ నుంచి పదవ తేదీ వరకు నిర్వహించడం జరిగిందని ప్రతిరోజు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అనంతరం మహా అన్నప్రసాద్ వితరణ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈనాటి.

Silver Jubilee.

ఆలయ రజిత ఉత్సవ వేడుకలకు హాజరైన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన జరిగిందని అలాగే స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని తెలిపారు

లైన్స్ క్లబ్ అధ్యక్షునికి ఘన సన్మానం.

లైన్స్ క్లబ్ అధ్యక్షునికి ఘన సన్మానం.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు లయన్ ఎం. జె.ఎఫ్ కల్మచర్ల రమేష్ ను ఘనంగా సన్మానించారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా.. లైన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి కేకును కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. జన్మదినాన్ని పురస్కరించుకొని కల్మచర్ల రమేష్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎలక్ట్రిక్ డ్రం ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, కోశాధికారి గోవింద శ్రీనివాస్, ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ బచ్చు రామకృష్ణ, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గుబ్బ కిషన్ కుమార్, ఉప్పు ఆంజనేయులు, బాదం రాఘవేందర్, చెదిరే శ్రీనివాస్, నీలా కోటి, మాచిపెద్దిరవి తదితరులున్నారు.

భూ కబ్జాదారుని పై చర్యలు తీసుకోవాలి.

భూ కబ్జాదారుని పై చర్యలు తీసుకోవాలి.

స్థానిక వాసులను భయ భ్రాంతులకు గురిచేస్తున్న బొమ్మినేని తిరుపతిరెడ్డి

హౌసింగ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు.

కాశిబుగ్గ నేటిధాత్రి :

 

 

 

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధి కీర్తి నగర్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ కు సంబంధించిన భూములను భూ కబ్జాదారుడు బొమ్మనేని తిరుపతిరెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా చేయడం జరుగుతుంది. కబ్జాదారునిపై చర్యలు తీసుకోవాలని హోసింగ్ బోర్డు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కు స్థానిక వాసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం కీర్తి నగర్ మరియు గరీబ్ నగర్ వాసులు మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ కాలనీ కు సంబంధించిన భూములను స్థానికంగా ఉంటున్న బొమ్మినేని తిరుపతి రెడ్డి నేను కీర్తి నగర్ కాలనీ అధ్యక్షుడిని అని స్తానిక వాసులను భయబ్రాంతులకు గురి చేస్తూ, తప్పుడు పత్రాలను సృష్టిస్తూ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎంఐజి,ఎల్ఐజి లోని కొన్ని ఇండ్లకు సంబంధించిన యజమానులు స్థానికంగా లేకపోవడంతో వారి సంతకాలను ఫోర్జరీ చేస్తూ కొంతమంది వ్యక్తులతో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని భూములను మరియు ఇండ్లను ఆక్రమించుకోని లక్షల రూపాయలను సొమ్ము చేసుకోవడం జరుగుతుందన్నారు.ఇదేంటని అని ప్రశ్నిస్తే ఖాళీ స్థలాల దగ్గర రౌడీల సహాయంతో,రాజకీయ అండ దండలతో ప్రశ్నించిన స్థానికులను, మహిళలను అని చూడకుండా, అసభ్య పదజాలంతో దూషిస్తూ, తిరుపతిరెడ్డి అతని అనుచరులు కలిసి స్థానికులను బెదిరించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Corporation.

తిరుపతి రెడ్డి అనే వ్యక్తి అతని ఇంటి వద్ద ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీ కి సంబంధించిన రోడ్డును సైతం కబ్జా చేసి రోడ్డు మూసివేసి ప్రహరీ గోడను నిర్మించుకొని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అతను సొంత స్థలంగా వాడుకోవడం జరుగుతుందన్నారు.అది సుమారు 100 గజాలకు పైనే ఉంటుంది.అంతే కాకుండా పక్క భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో ఉన్న తిరుపతిరెడ్డి ఖాళీ స్థలానికి ప్రహరీ గోడ నిర్మిస్తున్న క్రమంలో స్థానికులు వద్దని ఎంత చెప్పిన వినకుండా ప్రశ్నించే వారిని అతని అనుచరులతో బెదిరించడం జరుగుతుందన్నారు. స్థానికులు అంతా కుల, మతాలకు అతీతంగా కబ్జాకి గురవుతున్న ప్రభుత్వ స్థలం కాలనీ వాసులకు అందరికి ఉపయోగపడే విధంగా చూడాలని సంబంధిత అధికారులను కోరడం జరిగింది . గతంలో కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీ కీర్తి నగర్ నందు తప్పుడు పత్రాలతో, కొంతమంది రౌడీల అండ దండలతో, రాజకీయ బడా బాబులతో చేతులు కలిపిన తిరుపతిరెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని భూములను కబ్జా చేస్తూ హౌసింగ్ బోర్డ్ కాలనీ ని సర్వనాశనం చేస్తున్నారని స్థానిక మహిళలు దుమ్మెతిపోస్తున్నారు.అంతా నేనే ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీకి అధ్యక్షుడనని నాకు ఎదురు చెప్పే వారు లేరని, నాకు ఎదురు చెప్పితే వారు కాలనీ లో ఉండరని,వాళ్ల సంగతి ఎట్లా చెప్పాలో మాకు బాగా తెలుసు అని స్థానికులను, మహిళలను, ఒంటరిగా ఉన్న సమయంలో వారి వద్దకు వచ్చి రౌడీల సహాయంతో వారిని భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బంది పెడుతున్నాడని స్థానికులు వాపోతున్నారు. స్థానికులకు,మహిళలకు ఏదైనా జరిగితే పూర్తిగా తిరుపతి రెడ్డి,అతని అనుచరులే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.వారితో స్థానికులకు ప్రాణభయం ఉందని అన్నారు. తిరుపతి రెడ్డి ఆగడాలు రోజురోజుకీ అత్యంత ప్రమాదకరంగామారుతుందని అన్నారు.హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్న తిరుపతి రెడ్డి, రౌడీ ముకల పై చర్యలు తీసుకోవాలని హౌసింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కు స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

11వ మహాసభను జయప్రదం చేయండి .

11వ మహాసభను జయప్రదం చేయండి

మందమర్రి నేటి ధాత్రి :

 

 

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మందమర్రి 11వ మహాసభను జయప్రదం చేయండి..
ఈనెల 18వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ మందమర్రి పట్టణ 11వ మహాసభను విజయవంతం చేయాలని ఈరోజు స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి.. కామెర దుర్గారాజ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భీమనాధుని సుదర్శన్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు శైలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ . దున్నేవాడికే భూమిని అను నినాదంతో పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ.. మందమర్రి ప్రాంతంలో నాడు దొరల భూస్వాములు వారి అనుచరులు గుండాలు ప్రజలను కట్టు బానిసలుగా చేసి చిత్రహింసల గురి చేసినటువంటి సమయంలో కామ్రేడ్ టి వి అబ్రహం
దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదలకు భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఈ కార్యక్రమంలో బండారి రాజేశం బియ్యాల పద్మ ఆంటోని దినేష్. ఆర్ జనార్ధన్. ఉప్పులేటి తిరుపతి.. సుంకర శ్రీనివాస్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప గారు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ
జహీరాబాద్ మండల, వివిధ గ్రామాలకు చెందిన 17 మంది లబ్ధిదారులకు గాను ₹4,87,000 విలువ గల చెక్కులను పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు గోవర్దన్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్,ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ ,మైనార్టీ అధ్యక్షులు వహీద్ , గ్రామాల మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,గ్రామ పార్టీ అధ్యక్షులు,ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది….
లబ్ధిదారుల వివరాలు సత్వార్ గ్రామానికి చెందిన లలిత ₹.25,500/- కృష్ణ ₹.48,000/- లక్ష్మి ₹.17,500/- అనెగుంట గ్రామానికి చెందిన ₹.32,500/- హుగ్గెల్లి గ్రామానికి చెందిన బేబీ లత ₹.22,500/- గౌషియా బి ₹.45,000/- అల్గొల్ గ్రామానికి చెందిన బక్కన్న ₹.21,000/- రయిపల్లి డి గ్రామానికి చెందిన సరిత ₹.15,000/- బాగమ్మ ₹.60,000/- మలచెల్మ తండా కి చెందిన గుని బాయి ₹.22,500/- బుచ్చినెల్లి గ్రామానికి చెందిన శాబుద్దీన్ ₹.37,000/- హోతి బి గ్రామానికి చెందిన మొహియుద్దీన్ ₹.30,000/- మధులై తండా కి చెందిన రాథోడ్ మోహన్ సింగ్ ₹.16,500/- షేకపూర్ గ్రామానికి చెందిన జైపాల్ ₹.36,000/-గోవింద్ పూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ₹.34,000/- కసింపూర్ గ్రామానికి చెందిన గంగమ్మ ₹24,000/-
ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి , మండల పార్టీ అధ్యక్షులు నారాయణ గారికి ,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం.

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం.

కల్వకుర్తి  నేటి ధాత్రి :

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శివరాం జన్మదినం సందర్బంగా.. శనివారం రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి అని చెప్పారు. రక్తదానము మహాదానం మీరు దానం చేసిన రక్తము ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మనిషిని ప్రాణము పోసి ఆ కుటుంబంలో ఆనందము నింపుతుంది. పరోపకార హృదయంతో మీరు చేసిన ఈ కార్యము ఎందరికో ఆదర్శ ప్రదమైనది. సమాజము పట్ల సేవా భావము కలిగిన మీ మంచి మనసుకు హృదయపూర్వకముగా అభినందనలు తెలియజేస్తున్నాము. మీరు చేసిన మానవ సేవ మానవళికి ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ శివరాం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు యశోద భాయ్, మాజీ కౌన్సిలర్ శానవాజ్ ఖాన్, మాజీ సర్పంచ్ రాములు, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యురాలు రేష్మ, దున్న భాస్కర్, యువ నాయకులు పడకంటి వెంకటేష్, దున్న సురేష్, శ్రీశైలం, శివ, ఆసుపత్రి సిబ్బంది శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట.

ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట.

నాగర్ కర్నూల్  నేటి దాత్రి:

నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో మండలానికి సంభందించిన రైతులకు శనివారం రోజున ప్రభుత్వ సబ్సిడీ కింద మంజూరు అయిన స్ప్రింక్లర్లను ఎమ్మేల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పీట వేస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ కింద 24 వేల కోట్ల రూపాయలు వెచ్చించిందని, సన్న వడ్లకు బోనస్ ఇచ్చిందని, ఎలాంటి షరతులు లేకుండా రైతుల నుండి ధాన్యం కోనుగులు చేసిందని, వ్యవసాయ యాంత్రీకరణను రైతాంగానికి మరింత దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుందని,. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రజా ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని ఎమ్మేల్యే అన్నారు.ఇట్టి కార్యక్రమంలో సంబధిత అధికారులు, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, మండల ప్రెసిడెంట్ కోటయ్య,మాజీ కౌన్సిలర్స్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వినోద్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, పాల్గొన్నారు.

30 ఏళ్ల క్రితం అమ్మిన భూమిపై వారసుల దౌర్జన్యం.

30 ఏళ్ల క్రితం అమ్మిన భూమిపై వారసుల దౌర్జన్యం

మందమర్రి నేటి ధాత్రి :

 

 

 

మందమర్రి మండల తుర్కపల్లి గ్రామంలో 30 సంవత్సరాల క్రితం ప్లాటు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్న కుటుంబం పై భూమి అమ్మిన వ్యక్తి వారసులు దౌర్జన్యం చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి భూమి విలువకు అదనంగా డబ్బులు చెల్లించాలంటూ బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ యజమాని మేడి శ్రీమతి భర్త స్వామి కొడుకు శ్రావణ్ లు మీడియా ముందు వాపోయారు. మందమర్రి లో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో బాధిత కుటుంబం మేడి శ్రీమతి కొడుకు శ్రావణ్లు మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం అగ్గు బాలయ్య సారంగపల్లి నివాసి తన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి ప్లాట్లు చేయగా ప్లాటు కొనుక్కొని అందులో ఇల్లు నిర్మించుకొని ఉంటున్నామని గ్రామపంచాయతీ వారు ఇంటికి నెంబర్ కూడా కేటాయించారని ఇల్లు శిధిలమైపోవడంతో నూతనంగా ఇంటిని నిర్మించుకుందామనే ఆలోచనతో ఉండగా అగ్గు బాలయ్య కొడుకు అగ్గు మల్లయ్య భార్య ఆగు లక్ష్మి కూతురు సంధ్య కుటుంబ సభ్యులందరూ కలిసి కుటుంబ సభ్యులపై దాడి చేసి ఇది మా పట్టా భూమిని మీ పేరు పై పట్టాలేదని ప్రస్తుతం ఉన్న భూమి విలువకు తగ్గట్టుగా మరింత అదనంగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దౌర్జన్యానికి దిగారని తెలిపారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి వ్యవసాయతర భూమిగా రికార్డుల్లోకి మార్చకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుందని  .అధికారులు గమనించి మా కుటుంబం పై భూమి అమ్మిన అగ్గు బాలయ్య కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేయడమైనది.

అప్రమత్తంగా ఉండాలని ప్లాంట్ యాజమాన్యం వెల్లడి.

అప్రమత్తంగా ఉండాలని ప్లాంట్ యాజమాన్యం వెల్లడి

జైపూర్ నేటి ధాత్రి:

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పోలీసులతో పాటు సింగరేణి యాజమాన్యం సూచనల మేరకు జైపూర్ ఎస్టిపిపి ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం వెల్లడించారు.ప్లాంట్ లో సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నత అధికారులతో కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ప్లాంట్ ఉద్యోగులంతా పరిస్థితులకు తగిన విధంగా తగిన జాగ్రత్త వహించాలని వివిధ అంశాలను పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిఎం కే. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఐడి కార్డు వెంట ఉంచుకోవాలన్నారు.అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయట ప్రాంతాలకు వెళ్లరాదని తెలిపారు.తెలియని వ్యక్తుల నుంచి ఏవైనా వస్తువులు గాని,పార్సిల్స్ గానీ వస్తే తీసుకోరాదని కోరారు.అందరూ విధిగా. ఈ ఆదేశాలను పాటించాలని, అప్రమత్తంగా మెదలాలని తెలిపారు.అలాగే నివాస ప్రాంతాల్లో గాని,ప్లాంట్ పరిసరాల్లో గాని అనుమానితులు కనిపిస్తే వెంటనే సిఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్.8332974224 కీ సమాచారం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ (ఓ&ఎం) జే.ఎన్.సింగ్,ఏజీఎం (ఈ అండ్ ఎం) మదన్మోహన్,సిఐఎస్ఎఫ్ కమాండెంట్ చంచల్ సర్కార్,పీఎంపిఎల్ ప్లాంట్ హెడ్ అఖిల్ కపూర్,పీఈఎస్ ప్లాంట్ హెడ్ రమేష్ చంద్ర ,డీజీఎం (సివిల్) శ్రీ అజాజుల్లా ఖాన్,డిజీఏం పర్సనల్ శ్రీ అజ్మీరా తుకారాం, ఎస్ అండ్ పిసి ఇన్స్పెక్టర్ ఎం. సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

విద్యార్థులు నచ్చిన సబ్జెక్టు కోరుకోకోవాలి .!

విద్యార్థులు నచ్చిన సబ్జెక్టు కోరుకోకోవాలి
.
విద్యార్థి పరిషత్ జిల్లా కార్యదర్శి కేదార్నాథ్

వనపర్తి నేటిధాత్రి :

 

 

పదవ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులో చేరాలని
మీరు ఎంచుకున్న సబ్జెక్టు మీ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఎంపిక చేసుకోవాలని
టీజీవీపీ వనపర్తి జిల్లా కార్యదర్శి ఉడుత కేదార్నాథ్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు . విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లు తీసుకునేటప్పుడు ఆ కాలేజీ యొక్క ఆధ్యాపక బృందం , వసతి సౌకర్యాలు ,హాస్టల్ సౌకర్యాలు పరిశీలించిన తరువాత కళాశాలల్లో చేరాలని, అసౌకర్యాలు ఉన్నటువంటి కళాశాలలో చేరి న వారికి సర్టిఫికెట్లు ఇచ్చి ఇబ్బందులు పడవద్దని కళాశాల వారికి సూచించారు . విద్యార్థుల సలహాల కోసం తెలంగాణ విద్యార్థి పరిషత్ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశామని అయిన తెలిపారు 7386820819,9959395310 లకు ఫోన్ చేయాలని విద్యార్థులకు సలహాలు ఇస్తామని అన్నారు.

దేశం విజయం పై ప్రత్యేక పూజలు .

దేశం విజయం పై ప్రత్యేక పూజలు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత త్రివిధ దళాల సైనికుల యోగక్షేమాల కోసం వేలాలలోని మల్లన్న దైవ క్షేత్రంలో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ రక్షణలో పాల్గొన్న సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేయడం పై హర్షం వ్యక్తం చేశారు.అమాయకులైన భారత పర్యాటకులను చంపినందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత్ మరింత దీటైన జవాబు ఇవ్వాలని సంఘీభావం తెలిపారు.దేశ భద్రత,రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్దంగా ఉండాలని దేశ ప్రజలను కోరారు.దేశమంతా ఒకే గళంతో మన సైన్యానికి స్పూర్తిని ఇవ్వాలని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన రాజా గౌడ్.!

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన

ముదిగుంట మాజీ సర్పంచ్ రాజా గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మొగిలి పాక రాజా గౌడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించారు. వివరాల్లోకి వెళితే కొన్ని రోజులుగా మంచిర్యాలలో నివాసం ఉంటూ పని నిమిత్తం ఇంటి నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్తున్న సమయంలో మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో టూ వీలర్ పై వచ్చిన వ్యక్తి వెనుక నుంచి ఢీకొనగా మొగిలి పాక రాజా గౌడ్ తలకి త్రీవ గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఆస్పత్రి తరలించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లాలని ఇక్కడి వైద్యులు సూచించగా కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ లోని వజ్ర హాస్పిటల్ తరలించగా అక్కడి వైద్యులు వెంటనే గుర్తించి తలకు శాస్త్ర చికిత్స చేయాలని తెలిపారు. వెంటనే వైద్యుల సూచనలు మేరకు శాస్త్ర చికిత్స చేపించినప్పటికీ కూడా 20 రోజులుగా చికిత్స పోదుతూ శనివారం తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.సర్పంచి పదవి కాలంలో గ్రామానికి చేసిన సేవలను గ్రామస్తులు స్మరించుకుంటూ కన్నీటి పర్వతం అయ్యారు.

పాకిస్థాన్ పై భారత సైన్యం విజయం సాధించాలని.!

సంగారెడ్డి: పాకిస్థాన్ పై భారత సైన్యం విజయం సాధించాలని ప్రత్యేక పూజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం మధ్యాహ్నం స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన మహా మంగళ హారతి ఇచ్చి మహా నివేదన చేయడం జరిగింది.
భారత్ త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని,మన సైనికులు క్షేమంగా యుద్ధరంగం నందు విజయం సాధించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ తరపున దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించడం జరిగింది.

పశువులు రోడ్లపై సంచరిస్తే గోశాలలకు తరలిస్తాం.

పశువులు రోడ్లపై సంచరిస్తే గోశాలలకు తరలిస్తాం..

మున్సిపల్ కమీషనర్ గద్దె రాజు, పట్టణ ఎస్సై రాజశేఖర్

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలో పశువుల యజమానులు పశువులను యదేచ్చగా వదలడంతో రోడ్లపై సంచరిస్తున్నాయని, వాహనదారులకు,పాదాచారులకు ప్రమాదాలు జరిగి గాయాల పాలవుతున్నారని తమ దృష్టికి వచ్చిందని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ లు అన్నారు. పత్రిక ప్రకటన వెలువడిన 48 గంటలలోగా పశువులను వారి యజమానులు ఇంటికి తీసుకువెళ్లాలని, లేనియెడల పశువులను గోశాలలకు తరలిస్తామని అన్నారు.పట్టణ ప్రజలను ఇబ్బందిపెడుతున్న పశువులపై మున్సిపాలిటీ, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో తీసుకునే చర్యలకు పశువుల యజమానులు పూర్తి బాధ్యులవుతారని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఎస్సై రాజశేఖర్ లు పట్టణ పశు యజమానులకు సూచించారు.

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి.!

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి..

ఆర్కేపి ఎస్ఐ రాజశేఖర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ అన్నారు.పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తున్ను నేపథ్యంలో రోడ్డుకు వ్యతిరేక దిశలో నడుపుతున్న వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగిందని ఎస్సై తెలిపారు. అనంతరం ఎస్సై రాజశేఖర్ వాహనదారులకి కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అన్నారు.

దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెను కార్మికులంతా విజయవంతం.

దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెను కార్మికులంతా విజయవంతం చేయాలి…

ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ ఆలీ

రామకృష్ణాపూర్  నేటిధాత్రి:

ఈనెల 20వ తారీకు తలపెట్టిన దేశవ్యాప్త ఒక్క రోజు సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మికులను ఏఐటియుసి సంఘం సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ కోరారు. శుక్రవారం మందమర్రి ఏరియాలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సిహెచ్పీ లో ఫిట్ సెక్రటరీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏఐటియుసి యూనియన్ ద్వార సమావేశం ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథులుగా ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ లు సుదర్శన్, ఇప్పకాయల లింగయ్య లు హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్ చేయడం కార్మికులకు నష్టమని, కార్మికుల హక్కులు కోల్పోతామని, కార్మిక చట్టాలను నీరుగార్చే విధానం అని అన్నారు.

workers

కార్మిక లోకానికి తోడుగా ఏఐటియుసి ఉంటుందని తెలిపారు. అనేక సమస్యలతో ఉన్న కార్మికులకు ఈనెల 20న జరిగే దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెలో పాల్గొనాలని కార్మికులను కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి ఫిట్ సెక్రటరీ నాగేంద్ర బట్టు, దినేష్, వేణుగోపాల్, సిరాజ్ ,నరేంద్ర, అబ్బాస్, స్వామి, శ్రీనివాస్, రాజమౌళి, ఏఐటీయూసీ సంఘ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు.

జాతర ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే .

మెథడిస్ట్ 95వ జాతర ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని గార్డెన్ నగర్, ఆల్లిపుర్ రెవ. జి బి గార్డెన్ మెమోరియల్ మెథడిస్ట్ సెంట్రల్ చర్చ అవరణంలో నిర్వహిస్తున్న మెథడిస్ట్ 95వ ఉజ్జివ సభల జాతరకి డి.ఎస్. సుకుమార్ గారితో, డిస్ట్రిక్ట్ లే లీడర్ సరీన్ జాన్ గారితో,జనరల్ సెక్రటరీ రవికుమార్ గార్లతో మరియు పాస్టర్ లతో కలిసి రిబ్బన్ కట్ చేసి జండా ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డీసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
అనంతరం ఎమ్మెల్యే , చైర్మన్ గార్లు మాట్లాడుతూ గత 95 సంవత్సరాలుగా ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది అన్నారు. 3 రోజుల పాటు ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది అని ,ఇట్టి జాతరకు జహీరాబాద్. నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుండి జండా ఊరేగింపు తో వచ్చి దేవుణ్ణి మహిమ పరచడం జరుగుతుందని అన్నారు.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో ఏపీఓ.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో ఏపీఓ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో సుధాకర్ ఏపీఓ రాజ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు చేసిన పనులకు సంబంధించిన కొలతలను పరిశీలించారు. ఎంపీడీవో సుధాకర్ మాట్లాడుతూ. ఎండాకాలం కావున ఉపాధి హామీ కూలీలు ఉదయం తొందరగా రావాలని, ఎండలు ముదురుతున్న కొద్ది పనుల వద్ద జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. అలాగే పని ప్రదేశంలో నీటి సౌకర్యం కూడా కల్పించాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ మల్లప్ప ఫీల్డ్ అసిస్టెంట్ శశి కూలీలు పాల్గొన్నారు.

ఆంజనేయ స్వామి విగ్రహానికి సూర్య చక్రం .

ఆంజనేయ స్వామి విగ్రహానికి సూర్య చక్రం అలంకరణ…

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామి విగ్రహానికి హనుమాన్ భక్తులు గోవిందుల రమేష్, వెంకట నరసింహ స్వామి ఇద్దరు కలిసి సూర్య చక్రం రూపకల్పన చేయించి ఆంజనేయ స్వామికి అలంకరించారు. నిత్యం తిరుగుతూ ఉండే సూర్య చక్రం ఆంజనేయ స్వామికి అలంకరించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి సతీష్ శర్మ, ప్రవీణ్ శర్మ,హనుమాన్ భక్తులు రవి, ముద్దసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version