సబ్జెక్ట్ తప్పడంతో విద్యార్థి ఆత్మహత్య.

సబ్జెక్ట్ తప్పడంతో విద్యార్థి ఆత్మహత్య

మంచిర్యాల, నేటి ధాత్రి:

మంచిర్యాల పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్ డిప్లమా మూడో సంవత్సరం చదువుతున్న అక్షయ్ (20) హనుమకొండలోని రెవెన్యూ కాలనీలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకటఫణి శనివారం తెలిపారు.అక్షయ్ రెండు నెలల కిందట పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు.ఇటీవల పరీక్షల ఫలితాలు విడుదల కాగా అందులో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు.కొద్ది రోజుల నుంచి మానసిక ఆందోళనకు గురైన అక్షయ్ ఓ గదిలో ఫ్యానుకు ఉరేవేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

విద్యార్థులు నచ్చిన సబ్జెక్టు కోరుకోకోవాలి .!

విద్యార్థులు నచ్చిన సబ్జెక్టు కోరుకోకోవాలి
.
విద్యార్థి పరిషత్ జిల్లా కార్యదర్శి కేదార్నాథ్

వనపర్తి నేటిధాత్రి :

 

 

పదవ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులో చేరాలని
మీరు ఎంచుకున్న సబ్జెక్టు మీ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఎంపిక చేసుకోవాలని
టీజీవీపీ వనపర్తి జిల్లా కార్యదర్శి ఉడుత కేదార్నాథ్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు . విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లు తీసుకునేటప్పుడు ఆ కాలేజీ యొక్క ఆధ్యాపక బృందం , వసతి సౌకర్యాలు ,హాస్టల్ సౌకర్యాలు పరిశీలించిన తరువాత కళాశాలల్లో చేరాలని, అసౌకర్యాలు ఉన్నటువంటి కళాశాలలో చేరి న వారికి సర్టిఫికెట్లు ఇచ్చి ఇబ్బందులు పడవద్దని కళాశాల వారికి సూచించారు . విద్యార్థుల సలహాల కోసం తెలంగాణ విద్యార్థి పరిషత్ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశామని అయిన తెలిపారు 7386820819,9959395310 లకు ఫోన్ చేయాలని విద్యార్థులకు సలహాలు ఇస్తామని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version