లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి లయన్స్.!

మెట్ పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి లయన్స్

 

 

 

మెట్ పల్లి జూన్ 20 నేటి దాత్రి

 

 

 

 

మెట్ పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి లయన్స్ క్లబ్ నూతన అధ్యక్ష కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు లయన్స్ సెకండ్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ గుంటుక చంద్ర ప్రకాష్ లయన్ పి డి జి అనంతుల శివప్రసాద్ , రీజనల్ చైర్మన్ గుంటుక సురేష్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగారావు పాల్గొన్నారు.

 

లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా వెల్మల శ్రీనివాసరావు
సెక్రెటరీగా సురకంటి జైపాల్ రెడ్డి ట్రెజరర్ గా వేములవాడ చంద్రశేఖర్
ఈ ప్రమాణ స్వీకారం చేశారు.

వీరిచే ముఖ్యఅతిథిగా లయన్స్ సెకండ్ డిస్టిక్ గవర్నర్ గుంటుక చంద్ర ప్రకాష్ లయన్స్ పి డి జి అనంతులశివప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించి మెట్పల్లి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

అనంతరం లయన్స్ గుంటుక చంద్రప్రకాష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలో ముందుంటుందని ప్రపంచంలో 210 దేశాలకు పైగా లయన్స్ క్లబ్ సేవలు చేస్తున్నారని ఇది పేదలకు ఉచిత కంటి శిబిరాలు వైద్య శిబిరాలు చేస్తూ ఉచిత సహాయాలు అందజేస్తుందని అన్నారు.

పి డి జి అనంతల శివప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో సేవా భావంతో పనిచేసే సంస్థ మన లయన్స్ క్లబ్ ఇంట్రర్నేషనల్ అని మన తెలంగాణలో మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఉత్తమ సేవ కార్యక్రమంలో ముందుంటుందని ఇది సంతోషకరమైనదని వారు చేస్తున్న సేవకు లయన్స్ క్లబ్ తరఫున నేను వారిని అభినందిస్తున్నానని అన్నారు.

నూతన అధ్యక్షులు వెల్మల శ్రీనివాసరావు మాట్లాడుతూ 17 సంవత్సరాల నుండి లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుందని దీనికి ప్రభుత్వ పరంగా స్థలము కేటాయించాలని నర్సింగరావు కు వినతి పత్రం అందించామని దానికి వారు సానుకూల స్పందన తెలియజేశారని అన్నారు.

ముఖ్యఅతిథి జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ నేను కోరుట్ల మెట్పల్లి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలు తిరగానని అందులో లయన్స్ క్లబ్ సేవలు బాగున్నాయని చాలామంది చెప్పారని వారి సేవలను పేద ప్రజలు మరవరని ఇటువంటి సేవ చేయడం లయన్స్ క్లబ్ వారికి చెందిందని ఉచిత వైద్య శిబిరాలు ఉచిత కంటి శిబిరాలు పేద విద్యార్థులకు నోట్ బుక్కులు పంపిణీ పేదలకు చలికాలంలో చద్దర్లు పంపిణీ హాస్టల్లో వారి సదుపాయ ఫ్యాన్లు గాని ఇతర సామగ్రిని ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని వారికి నా సహాయం ఎప్పుడు కావాలన్నా అందిస్తానని అన్నారు .

ఈ కార్యక్రమంలో జెడ్ సి గడ్డం శంకర్ రెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్, సెక్రెటరీ గూండా రాకేష్, క్యాషియర్ నాంపల్లి వేణు గోపాల్, 2025-26 జోన్ చైర్మన్ లయన్ పోలీస్ శ్రీనివాస్,పాస్ట్ ప్రెసిడెంట్లు లయన్ డొంతుల ఆంజనేయులు,గంగుల మురళి,పోహార్ తుకారాం పాల్గొన్నారు.

లైన్స్ క్లబ్ అధ్యక్షునికి ఘన సన్మానం.

లైన్స్ క్లబ్ అధ్యక్షునికి ఘన సన్మానం.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు లయన్ ఎం. జె.ఎఫ్ కల్మచర్ల రమేష్ ను ఘనంగా సన్మానించారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా.. లైన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి కేకును కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. జన్మదినాన్ని పురస్కరించుకొని కల్మచర్ల రమేష్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎలక్ట్రిక్ డ్రం ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, కోశాధికారి గోవింద శ్రీనివాస్, ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ బచ్చు రామకృష్ణ, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గుబ్బ కిషన్ కుమార్, ఉప్పు ఆంజనేయులు, బాదం రాఘవేందర్, చెదిరే శ్రీనివాస్, నీలా కోటి, మాచిపెద్దిరవి తదితరులున్నారు.

లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి కి లయన్స్.

లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి కి లయన్స్
అంతర్జాతీయ అవార్డు..

రామాయంపేట ఏప్రిల్ 28 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

లయన్స్ క్లబ్ రామాయంపేట చార్టర్ సభ్యుడిగా 35 సంవత్సరాలుగా ఆర్తుల సేవయే పరమావధిగా ఆర్తులకు అన్ని రకాలుగా సేవలందిస్తూ గత రెండున్నర దశాబ్దాలుగా రక్త అవయవ దానాలకు కృషి చేస్తూ, అత్య వసర పరిస్థితులలో
అవసరము ఉన్నవారికి సేవలందిస్తూ, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ, రక్త అవయవ దానాల ప్రచారానికి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా యువతి యువకులకు అవగాహన కల్పిస్తూ, వృద్ధులకు ఆపదలో ఉన్నవారికి అన్ని రంగాలలో సేవలందిస్తున్న లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి కి లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షులు లయన్
ఫిబ్రయిషీయో అలివేరా అభినందిస్తూ **లయన్స్ అత్యంత ప్రతిష్టాకరమైన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లీడర్షిప్ మెడల్ను.

లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ జి. బాబురావు కానిస్టిట్యూషనల్ ఏరియా లీడర్ ఆర్ సునీల్ కుమార్ అభినందిస్తూ ఆదివారం సాయంత్రం హైదరాబాదు, షామీర్పేట్ లోని
ఎస్.ఎన్.ఆర్ పుష్ప కన్వెన్షన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్రంలోని 8 లైన్స్ జిల్లాల నుండి పాల్గొన్న లయన్స్ ప్రతినిధులు పాల్గొన్న “మల్టీకాన్ కన్వెన్షన్” లో అవార్డును ప్రధానం చేశారు. కాగా రాజశేఖర్ రెడ్డి 54 మార్లు రక్తదానం చేసి ప్రాణాపాయకర స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం చేస్తున్నారని, రక్తదాన శిబిరంలను నిర్వహిస్తూ, అవయవ దానం ల గురించి విస్తృత
ప్రచారం నిర్వహిస్తూ, మారుమూల గ్రామాలలో సైతం అవయవ దానానికి ప్రజలను సంసిద్ధం చేస్తున్నారని అన్నారు. లయన్స్ ఏరియా కాన్స్టిట్యూషనల్ లీడర్ లయన్
రుమాళ్ళ సునీల్ కుమార్ మాట్లాడుతూ రక్త అవయవదానాలపై రాజశేఖర్ రెడ్డి కృషి అభినందనీయమని, గతంలో కూడా ఉత్తమ సేవలు అందించి నందులకు రాజశేఖర్ రెడ్డి కి పలుమార్లు అవార్డులు అందుకున్నట్లు గుర్తు చేశారు.మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ హనుమాన్ల రాజారెడ్డి మాట్లాడుతూ ప్రతి మాసం గోడపత్రిక, కరపత్రంల ద్వారా రక్త అవయవ దానాల ప్రచారానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు రాజశేఖర్ రెడ్డి రూపొందించిన గోడపత్రికల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని లోని ఎనిమిది లయన్స్ జిల్లాలలో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ, యువతి యువకులను ప్రోత్సాహ పరుస్తున్నారని గవర్నర్ లయన్
నగేష్ పంపాటి అన్నారు… లయన్స్ జిల్లా 320-డి గతంలో కూడా రక్త, అవయవ దానాలపై విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించి రక్తా, నేత్ర అవయవ దానాలకు, కరపత్రంల ద్వారా గోడపత్రికల ద్వారా యువతి యువకులకు, ప్రజలకు అవయవాల ప్రాముఖ్యత, ఆవశ్యకతపైన అవగాహన ఏర్పడిందని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా రక్త అవయవ దానాలకు ప్రజలు ముందుకు వస్తున్నారని లయన్ ఏ. అమర్నాథ్ రావు అన్నారు… లయన్ ఎమ్. విజయలక్ష్మి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ రామాయంపేట. రెడ్ క్రాస్ మెదక్ శాఖ సభ్యులు,మరియు రాజశేఖర్ రెడ్డి గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాల ద్వారా రోగులకు, వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ఆర్తులకు అన్ని రంగాలలో సేవలందిస్తున్నాయని అన్నారు, సేవలను ఇంకా విస్తృత పరిచి ప్రజలకు సేవా కార్యక్రమాలను అధికంగానిర్వహించాలని లయన్ డి. నరసింహారాజు తెలిపారు. 2024 -25 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో లయన్స్ ఉత్తమ సేవలందించారని ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి కి అప్పగించిన రక్త అవయవ దానం లపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని లయన్స్ నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ 2024- 25 లయన్స్ సంవత్సరం జిల్లా 320-డి లోని లయన్స్ సభ్యులు “ఎంపవర్” నినాదంతో కార్యక్రమాలను నిర్వహిస్తూ, 35 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్, రామాయంపేట, రెడ్ క్రాస్ మెదక్ సంస్థల ద్వారా పరిసర ప్రాంతాలలో అన్ని విషయాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ముఖ్యంగా రక్త, అవయవదానాల అవగాహనకు యువతి యువకులకు, మారుమూల గ్రామస్తులకు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తు, లయన్స్ జిల్లా 320-డి లోని నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ ,సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలలో సామాజిక మాధ్యమాలలో మరియు పత్రికలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించి నందులకు లయన్స్ నాయకులు బీ.వి బన్సల్, జి. ఆర్ సూర్య రాజ్ సి. ప్రకాశరావు, గంప రమేష్
ఎం.నాగరాజు, ఆసపల్లి శ్రీధర్, వెంపటి మధు, కే. సూర్యనారాయణ ఇవి రమణ, రామ్ ఫనిధర్ రావు, కరుణాకర్, జనార్దన్ రెడ్డి, ప్రఫుల్ కుమార్, రమణారెడ్డి, తో పాటు పలువురు నాయకులు కొనియాడారు

ఆత్మగౌర పరిరక్షణ కై మాలల సింహ గర్జన.

*23న ఆత్మగౌర పరిరక్షణ కై మాలల సింహ గర్జన..

*రిజర్వేషన్లు రద్దు కోసం ప్రభుత్వాల కుట్ర..

*ఎస్సీ వర్గీకరణతో మాలల వంచనకు ప్రయత్నం…

*సింహగర్జనతో మాలల సత్తా చాటుదాం…

*వ్యతిరేక ప్రభుత్వాలకు గుణపాఠం చెబుదాం…

*రాయలసీమ మాలల జేఏసీ నేతల పిలుపు…

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 19:

అనగారిన బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడే రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో రద్దు చేయాలని కుట్రతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ తెరపైకి తెచ్చి మాలలను దగా చేసేందుకు ప్రయత్నిస్తోందని రాయలసీమ మాలల జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. బుధవారం బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాయలసీమ మాలల జేఏసీ గౌరవ అధ్యక్షుడు అశోకరత్న మాట్లాడారు.2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకొని మాలలను తక్కువగా చూపిస్తూ మాదిగలకు ఉపకరించేలా వర్గీకరణను ఆమోదానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదికను అడ్డుపెట్టుకుని అసెంబ్లీలో వర్గీకరణ ఆమోదం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. యావత్తు దళిత జాతి ఓట్లతో గద్దెనెక్కి ఆ జాతి అణిచివేతకు పాలకులు ప్రయత్నించడం అత్యంత హేమమైన చర్య అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణ పై ప్రశ్నించకుండా అచేతనంగా నిలబడడం దుర్మార్గమన్నారు. రాజకీయ లబ్ధి కోసం పాలకులు చేసే కుయుక్తులను అడ్డుకోకపోతే యావత్ దళిత జాతి రాజ్యాంగబద్ధంగా సిద్ధించిన రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో కోల్పోయే పరిస్థితి దాపురుస్తుందన్నారు. ఇప్పటికీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మాలలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దళిత జాతి వ్యతిరేక పవిత్రమైన కూటమికి గుణపాఠం చెప్పేందుకు యావత్ మాల జాతి సన్నిద్ధం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందులో భాగంగానే రాయలసీమ మాలల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖున భారీ స్థాయిలో తిరుగుతూనే నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో 23వ తేదీ సాయంత్రం మూడు గంటలకు మాలల సింహగర్జన సభను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సింహగర్జన సభకు రాయలసీమలోని యావత్ మాల జాతి తో పాటు దళిత మేధావులు ఉద్యోగులు, పెద్ద ఎత్తున తరలివచ్చి మాలల ఐక్యతతో తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాయలసీమ మాలల జేఏసీ ప్రతినిధులు మల్లారపు మధు. సుదర్శనం. ఏ ఆర్ అజయ్ కుమార్. ధన శేఖర్. కే మురళి. అనిల్ కుమార్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version