30 ఏళ్ల క్రితం అమ్మిన భూమిపై వారసుల దౌర్జన్యం.

30 ఏళ్ల క్రితం అమ్మిన భూమిపై వారసుల దౌర్జన్యం

మందమర్రి నేటి ధాత్రి :

 

 

 

మందమర్రి మండల తుర్కపల్లి గ్రామంలో 30 సంవత్సరాల క్రితం ప్లాటు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్న కుటుంబం పై భూమి అమ్మిన వ్యక్తి వారసులు దౌర్జన్యం చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి భూమి విలువకు అదనంగా డబ్బులు చెల్లించాలంటూ బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ యజమాని మేడి శ్రీమతి భర్త స్వామి కొడుకు శ్రావణ్ లు మీడియా ముందు వాపోయారు. మందమర్రి లో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో బాధిత కుటుంబం మేడి శ్రీమతి కొడుకు శ్రావణ్లు మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం అగ్గు బాలయ్య సారంగపల్లి నివాసి తన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి ప్లాట్లు చేయగా ప్లాటు కొనుక్కొని అందులో ఇల్లు నిర్మించుకొని ఉంటున్నామని గ్రామపంచాయతీ వారు ఇంటికి నెంబర్ కూడా కేటాయించారని ఇల్లు శిధిలమైపోవడంతో నూతనంగా ఇంటిని నిర్మించుకుందామనే ఆలోచనతో ఉండగా అగ్గు బాలయ్య కొడుకు అగ్గు మల్లయ్య భార్య ఆగు లక్ష్మి కూతురు సంధ్య కుటుంబ సభ్యులందరూ కలిసి కుటుంబ సభ్యులపై దాడి చేసి ఇది మా పట్టా భూమిని మీ పేరు పై పట్టాలేదని ప్రస్తుతం ఉన్న భూమి విలువకు తగ్గట్టుగా మరింత అదనంగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దౌర్జన్యానికి దిగారని తెలిపారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి వ్యవసాయతర భూమిగా రికార్డుల్లోకి మార్చకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుందని  .అధికారులు గమనించి మా కుటుంబం పై భూమి అమ్మిన అగ్గు బాలయ్య కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేయడమైనది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version