ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై రసాభాస.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై రసాభాస
పార్టీకి మచ్చ తెస్తున్న ఇందిరమ్మ కమిటీ సభ్యుల తీరు
లబ్ధిదారుల్ని ఎంపిక చేయమంటే వాళ్లే లబ్ధిదారులైన వైనం.
లబ్ధిదారులు ఎంపికపై సొంత పార్టీ నాయకులే విమర్శ
గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందించిన అఖిలపక్ష నాయకులు
నేటి ధాత్రి ఐనఓలు:-

ఐనవోలు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అర్హులైన లబ్ధిదారుల కంటే ఇందిరమ్మ కమిటీ సభ్యుల యొక్క సిఫారసులే ఎక్కువ ఉన్నాయని ప్రజల ఆరోపిస్తున్నారు. శుక్రవారం అయినవోలు గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ సభ్యలు మరియు కాంగ్రెస్ నాయకులు వారి ఇష్ట నుసారంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించుకొని నిజమైన అర్హులను మోసం చేశారని అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు.ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఆదికారుల నుంచి స్పందన కరువైందని ఆరోపించారు.
అఖిలపక్ష నాయకులు అందరు గ్రామ కార్యదర్శి కి ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు అందించాలని వినతిపత్రం అందిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బిఎస్పి, ధర్మసామాజ్, ఎంఆర్పిఎస్ నాయకులు మరియు ఇందిరమ్మ ఇండ్ల ఆశవహులు పాల్గొన్నారు బిఆర్ఎస్ నుంచి టి. కుమార్. కె. అశోక్, గడ్డం రఘువంశీ, టి లక్ష్మణ్,దుపెల్లి రాజు, నాగరాజు, చందు,సంతోష్, సమ్మయ్య, రవి కాంగ్రెస్ నుంచి కొత్తూరి రాజు, కొండేటి దిలీప్, టి ప్రశాంత్, ఏలీయా, కుమార్, అనిల్
బీజేపీ నుంచి బొల్లెపెల్లి మహేష్, పులి సాగర్, బిఎస్పి నుంచి సామ్యాల్ ధర్మసామాజ్ నుంచి విష్ణువర్ధన్ ఎంఆర్పిస్ నుంచి చింత అశోక్ తదితరులు పాల్గొన్నారు..

దేశం విజయం పై ప్రత్యేక పూజలు .

దేశం విజయం పై ప్రత్యేక పూజలు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత త్రివిధ దళాల సైనికుల యోగక్షేమాల కోసం వేలాలలోని మల్లన్న శైవ క్షేత్రంలో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ రక్షణలో పాల్గొన్న సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేయడం పై హర్షం వ్యక్తం చేశారు.అమాయకులైన భారత పర్యాటకులను చంపినందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత్ మరింత దీటైన జవాబు ఇవ్వాలని సంఘీభావం తెలిపారు.దేశ భద్రత,రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్దంగా ఉండాలని దేశ ప్రజలను కోరారు.దేశమంతా ఒకే గళంతో మన సైన్యానికి స్పూర్తిని ఇవ్వాలని పేర్కొన్నారు.

భారత సైన్యానికి మద్దతుగా ప్రత్యేక పూజలు.

భారత సైన్యానికి మద్దతుగా ప్రత్యేక పూజలు

రాయికల్  నేటి దాత్రి:

మే 9.ఆపరేషన్ సిందూర్ లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా రాయికల్ పట్టణంలోని నాగారం హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కశ్మీర్ లో పహాల్గామ్ ఘటన తరువాత ప్రతి భారతీయునిలో ఆవేదనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పైన భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం అనేది భారత్ శక్తి యుక్తులకు నిదర్శనమ‌న్నారు.
భారత సైనిక దళాలు ‘ఆపరేషన్ సిందూర్‌’ పేరిట పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేసిన నేపథ్యంలో వారికి భారతీయులు ప్రతి ఒక్కరు మద్దతు తెలుపాలన్నారు.ఇండియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి, భారత భూభాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని,ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్,కాంగ్రెస్,బిజెపి,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,కుర్మ మల్లారెడ్డి,ఎలిగేటి అనిల్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్, నాయకులు మచ్చ నారాయణ,గాజెంగి అశోక్, వాసం దిలీప్,చింతకుంట సాయికుమార్,బొమ్మకంటి నవీన్, సుమన్,భరత్,మహేష్,పవన్,అశోక్, రంజిత్ అర్చకులు సంతోష్. వాసం ప్రసాద్. తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన
జిల్లా అధికారి వీరునాయక్

నేటిధాత్రి మొగుళ్ల పల్లి:

మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సి పేట వివిధ గ్రామాల్లోఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అధికారి వీరు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు . రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి, వారి నుంచి నేరుగా సమాచారం తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రాల వడ్లు కొనుగోలు చేసేటప్పుడు ఎఫ్ ఎ క్యూ పద్ధతిని పాటించాలని తేమశాతం 17/. దాటి ఉండకూడదని సూచించారు రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రైతులు ఫార్మర్ రిజిస్ట్రే గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులకు చెప్పి ప్రతి ఒక్క రైతు ఫార్మర్ ఫార్మా రిజిస్ట్రచేసుకోవాలని తెలిపారు భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రే చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి ఏఈఓ లు రైతులు పాల్గొన్నారుముఖ్యంగా,

మృతుల కుటుంబాలను పరామర్శించిన .!

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ జెడ్పిటిసి..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇటీవల ఆరోగ్యానికి గురై మృతి చెందగా ఆమె కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య అలాగే బాధిత మహిళ బుడిద పద్మ అనే మహిళ అనారోగ్యంతో మృతిచెందగా ఆరోగ్యం మెరుగుపరచడానికి సుమారు పది లక్షల వరకు ఖర్చుపెట్టి నిరుపేద కుటుంబాలు ప్రభుత్వం. ఎలాగైనా ఆదుకోవాలని పరామర్శిస్తూ మృతురాలికి భర్త లింగం కొడుకు చరణ్ బిడ్డ వైష్ణవి ఉన్నారని లాగైన ప్రభుత్వం స్పందిస్తూ వారికి. కుటుంబానికి ఆదుకోవాలని ఈ సందర్భంగా విన్నవించారుమండల కేంద్రంలో అలాగే గ్రామానికి చెందిన హెల్పుల కర్ణ అనే మహిళ ఇటీవల గుండెపోటుతో చనిపోగా ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించి మనోధైర్యాన్నిచ్చి చనిపోయిన బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు మాజీ జెడ్పిటిసి వెంటా కడారి నవీన్ రెడ్డి. బింద్రం పవన్. బురా సాయి. దోర్నాల నవీన్ రెడ్డి. రంగు మల్లేశం. తదితరులు పాల్గొన్నారు

ముందస్తు బడిబాట అవగాహన సదస్సు.

ముందస్తు బడిబాట అవగాహన సదస్సు

జైపూర్ నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను జాగ్రత్తపరిచి,వారిలో చైతన్యం తీసుకువస్తూ,కుందారం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ ముందస్తు బడిబాట కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలో శుక్రవారం స్థానిక గ్రామ శివారులో ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్న చోట ప్రభుత్వ పాఠశాల ప్రయోజనాల పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా హెచ్ఎం అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకుంటే మంచిది అనే అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు.ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతుందన్నారు.ఉచిత పాఠ్యపుస్తకాలు,డిజిటల్ బోధన,యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం,అటల్ టింకరింగ్,ల్యాబ్ అత్యాధునికమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నట్లు వివరించారు.వేలకు వేల ఫీజులు కట్టి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే బదులు ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించాలని కోరారు.అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా బాత్రూములతో పాటు వివిధ వసతులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాల ప్రయోజనాలను సహా వివరంగా వివరించడంతో పిల్లల తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ప్రకటనల కోసం పచ్చని చెట్లను నరికి వేయడం బాధాకరం.

ప్రకటనల కోసం పచ్చని చెట్లను నరికి వేయడం బాధాకరం

మందమర్రి నేటి ధాత్రి:

మందమరి మార్కెట్ బస్టాండ్ చౌరస్తాలో ప్రకృతిని నాలుగోసారి బలిచేశారు. ప్రకటనల ప్రాధాన్యతకి ప్రకృతి విలువ తక్కువ అన్నట్లు, ఈ ఎండాకాలంలో పదిమందికి నీడనిచ్చే రాళ్ల చెట్టును రాత్రికి రాత్రే కోమ్మలు నరికి వేశారు. ఈ చెట్టు కొమ్మలను కనీస ఆనవాళ్లు కనిపించకుండా చెట్టు ఉన్న ప్రాంగణాన్ని శుభ్రంగా చేసి వేయడం వెనుక చెట్టును మళ్లీ ఎదగకుండా తుదిముట్ట ఇవ్వాలన్న ఉద్దేశమే ఉన్నట్లు ప్రత్యక్షదర్శులు చెబుతున్నారు.

Trees

ఈ చెట్టు వయస్సు సుమారు 20 సంవత్సరాలు. మున్సిపాలిటీ పరిధిలో పని చేసే కొందరి మాటల ప్రకారం… ఇదే చెట్టును గతంలో మూడు సార్లు కోసి గాయపర్చారు. కానీ ప్రతిసారీ అది మళ్లీ కోల్పోయిన కొమ్మలను పుట్టించుకుంటూ నిలబడింది. ఈసారి మాత్రం నిండా నీడాను అందించే కొమ్మలానే నరికి వేసినట్లు ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యం గా ఆటో డ్రైవర్లు మాట్లాడుతు”మేము ఆటోలో రోజంతా తిరిగి వేసవి వేడిలో అలసిపోయి ఇక్కడే ఆగుతాం. ఇప్పుడు ఆ నీడ కూడా పోయింది” అంటూ కొందరు ఆటో డ్రైవర్స్ బాధతో చెప్పుకొచ్చారు. “అదే చెట్టుకింద మా సోడాబండి పెట్టుకుంటే కాస్త నీడలో పనిచేస్తాం. ఇప్పుడు మేము ఎండల్లో కాలిపోతున్నాం” అంటూ ఓ చిన్న వ్యాపారి వాపోయాడు.ప్రత్యక్షంగా చూసినవారూ, చెట్టు నీడను అనుభవించినవారూ ఆ కోపం, బాధ, అసహనం కలగలిపిన మాటలతో చెట్టు గాయాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు.

ఝరాసంగం మండల కేంద్రంలో లీగల్ అవేర్నెస్ క్యాంపు .

ఝరాసంగం మండల కేంద్రంలో లీగల్ అవేర్నెస్ క్యాంపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలో గల ఎంపిడిఓ కార్యాలయంలో లీగల్ అవేర్నెస్ క్యాంపును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ శ్రీమతి కవిత దేవి నిర్వహించి మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించి, తగు సూచనలు చేశారు. న్యాయమూర్తి మరియు న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతీ మహిళ సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నిత్యజీవితంలో మహిళలు ఎన్నో కష్టాలకు గురివుతున్నారని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురుకాకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలువస్తే వాటిని.

Camp

అధిగమించడానికి చట్టాలు తొడ్పాడుతాయని సూచించారు. కార్యక్రమంలో నిజజీవితంలో మహిళల పాత్ర, గృహహింస నిరోధకత, మహిళా సాధికారత, పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, బాల్య వివాహ నిరోధక చట్టం, ఉచిత న్యాయసేవా సహాయంపై క్షుణ్ణంగా వివరించారు. ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బార్ వైస్ ప్రెసిడెంట్ మానెన్న, ప్యానెల్ న్యాయ వాదులు రుద్రయ్య స్వామి, సామజిక కార్యకర్త కోట ధనరాజ్ గారు, ఎంపిడిఓ సుధాకర్, తహసీల్దార్ తిరుమల రావు, ఎస్సై సాయి తేజ, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు  పాల్గొన్నారు.

భూ కబ్జాదారుడు పై చర్యలు తీసుకోవాలి.

భూ కబ్జాదారుడు పై చర్యలు తీసుకోవాలి.

స్థానిక వాసులను భయ భ్రాంతులకు గురిచేస్తున్న బొమ్మినేని తిరుపతిరెడ్డి

హౌసింగ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు.

కాశిబుగ్గ నేటిధాత్రి:

 

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధి కీర్తి నగర్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ కు సంబంధించిన భూములను భూ కబ్జాదారుడు బొమ్మనేని తిరుపతిరెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా చేయడం జరుగుతుంది. కబ్జాదారునిపై చర్యలు తీసుకోవాలని హోసింగ్ బోర్డు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కు స్థానిక వాసులు విద్యార్థు చేయడం జరిగింది. అనంతరం కీర్తి నగర్ మరియు గరీబ్ నగర్ వాసులు మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ కాలనీ కు సంబంధించిన భూములను స్థానికంగా ఉంటున్న బొమ్మినేని తిరుపతి రెడ్డి నేను కీర్తి నగర్ కాలనీ అధ్యక్షుడిని అని స్తానిక వాసులను భయబ్రాంతులకు గురి చేస్తూ, తప్పుడు పత్రాలను సృష్టిస్తూ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎంఐజి,ఎల్ఐజి లోని కొన్ని ఇండ్లకు సంబంధించిన యజమానులు స్థానికంగా లేకపోవడంతో వారి సంతకాలను ఫోర్జరీ చేస్తూ కొంతమంది వ్యక్తులతో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని భూములను మరియు ఇండ్లను ఆక్రమించుకోని లక్షల రూపాయలను సొమ్ము చేసుకోవడం జరుగుతుందన్నారు.ఇదేంటని అని ప్రశ్నిస్తే ఖాళీ స్థలాల దగ్గర రౌడీల సహాయంతో,రాజకీయ అండ దండలతో ప్రశ్నించిన స్థానికులను, మహిళలను అని చూడకుండా, అసభ్య పదజాలంతో దూషిస్తూ, తిరుపతిరెడ్డి అతని అనుచరులు కలిసి స్థానికులను బెదిరించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి అతని ఇంటి వద్ద ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీ కి సంబంధించిన రోడ్డును సైతం కబ్జా చేసి రోడ్డు మూసివేసి ప్రహరీ గోడను నిర్మించుకొని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అతను సొంత స్థలంగా వాడుకోవడం జరుగుతుందన్నారు.

land grabber

అది సుమారు 100 గజాలకు పైనే ఉంటుంది.అంతే కాకుండా పక్క భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో ఉన్న తిరుపతిరెడ్డి ఖాళీ స్థలానికి ప్రహరీ గోడ నిర్మిస్తున్న క్రమంలో స్థానికులు వద్దని ఎంత చెప్పిన వినకుండా ప్రశ్నించే వారిని అతని అనుచరులతో బెదిరించడం జరుగుతుందన్నారు. స్థానికులు అంతా కుల, మతాలకు అతీతంగా కబ్జాకి గురవుతున్న ప్రభుత్వ స్థలం కాలనీ వాసులకు అందరికి ఉపయోగపడే విధంగా చూడాలని సంబంధిత అధికారులను కోరడం జరిగింది . గతంలో కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీ కీర్తి నగర్ నందు తప్పుడు పత్రాలతో, కొంతమంది రౌడీల అండ దండలతో, రాజకీయ బడా బాబులతో చేతులు కలిపిన తిరుపతిరెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని భూములను కబ్జా చేస్తూ హౌసింగ్ బోర్డ్ కాలనీ ని సర్వనాశనం చేస్తున్నారని స్థానిక మహిళలు దుమ్మెతిపోస్తున్నారు.

అంతా నేనే ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీకి అధ్యక్షుడనని నాకు ఎదురు చెప్పే వారు లేరని, నాకు ఎదురు చెప్పితే వారు కాలనీ లో ఉండరని,వాళ్ల సంగతి ఎట్లా చెప్పాలో మాకు బాగా తెలుసు అని స్థానికులను, మహిళలను, ఒంటరిగా ఉన్న సమయంలో వారి వద్దకు వచ్చి రౌడీల సహాయంతో వారిని భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బంది పెడుతున్నాడని స్థానికులు వాపోతున్నారు.స్థానికులకు,మహిళలకు ఏదైనా జరిగితే పూర్తిగా తిరుపతి రెడ్డి,అతని అనుచరులే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.వారితో స్థానికులకు ప్రాణభయం ఉందని అన్నారు. తిరుపతి రెడ్డి ఆగడాలు రోజురోజుకీ అత్యంత ప్రమాదకరంగామారుతుందని అన్నారు.హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్న తిరుపతి రెడ్డి, రౌడీ ముకల పై చర్యలు తీసుకోవాలని హౌసింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కు స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై మందమర్రి.!

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై మందమర్రి పట్టణంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుల సంబరాలు

మందమర్రి నేటి ధాత్రి:

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై మందమర్రి పట్టణంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు ధార రవి సాగర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు అందుగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.పాత బస్టాండ్ ఏరియాలో ర్యాలీ నిర్వహించి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.అనంతరం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Sindhu

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వ ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పై గట్టి చప్పట్లతో అభినందనలు తెలుపుతూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు.

Sindhu

ప్రజలందరూ ఉగ్రవాదుల చర్యలకు బుద్ధి చెప్పే విధంగా సైనిక చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు.దేశ సమగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇస్తు వారికి మానసిక ధైర్యం ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలని ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో మార్తా కుమార్, దీక్షితులు,వినయ్,రంగు శ్రీనివాస్,జకుల కంకయ్య,బస్టాండ్ వ్యాపార సంఘం నాయకులు తదితరు పాల్గొన్నారు.

వివాహ వేడుకల్లో పాల్గొన జహీరాబాద్ ఎమ్మెల్యే .

వివాహ వేడుకల్లో పాల్గొన జహీరాబాద్ ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ముంగి ఎస్ ఎల్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన న్యాల్కల్ మండల  .మాజీ జెడ్పీటీసీ భాస్కర్ గారి బావమరిది గారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజి మార్కెట్ చైర్మన్ గుండపా,మాజి సిడిసి చైర్మన్ ఉమాకంత్ పాటిల్ ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ నేను అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచ్చేందర్, మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్, మాజి సర్పంచ్ లు కళీమ్,ప్రభు పటేల్,మల్లా రెడ్డి,జగదీశ్వర్,కరణ్,మాజి ఎంపీటీసీ రాములు,నాయకులు విజేందర్ రెడ్డి,దత్తురెడ్డి,రాథోడ్ భీమ్ రావ్ నాయక్ తదితరులు.

దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెను కార్మికులంతా విజయవంతం.!

దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెను కార్మికులంతా విజయవంతం చేయాలి…

ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ ఆలీ

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

ఈనెల 20వ తారీకు తలపెట్టిన దేశవ్యాప్త ఒక్క రోజు సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మికులను ఏఐటియుసి సంఘం సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ కోరారు. శుక్రవారం మందమర్రి ఏరియాలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సిహెచ్పీ లో ఫిట్ సెక్రటరీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏఐటియుసి యూనియన్ ద్వార సమావేశం ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథులుగా ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ లు సుదర్శన్, ఇప్పకాయల లింగయ్య లు హాజరయ్యారు.

Strike

అనంతరం వారు మాట్లాడారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్ చేయడం కార్మికులకు నష్టమని, కార్మికుల హక్కులు కోల్పోతామని, కార్మిక చట్టాలను నీరుగార్చే విధానం అని అన్నారు. కార్మిక లోకానికి తోడుగా ఏఐటియుసి ఉంటుందని తెలిపారు. అనేక సమస్యలతో ఉన్న కార్మికులకు ఈనెల 20న జరిగే దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెలో పాల్గొనాలని కార్మికులను కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి ఫిట్ సెక్రటరీ నాగేంద్ర బట్టు, దినేష్, వేణుగోపాల్, సిరాజ్ ,నరేంద్ర, అబ్బాస్, స్వామి, శ్రీనివాస్, రాజమౌళి, ఏఐటీయూసీ సంఘ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు.

భూపాలపల్లి జిల్లాలో విచ్చలవిడిగా ఇసుక రవాణా.

భూపాలపల్లి జిల్లాలో విచ్చలవిడిగా ఇసుక రవాణా:-
ఇసుక క్వారీల లైసెన్సులు రద్దు చెయ్యాలి:-

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్:-

యు వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ :-

భూపాలపల్లి నేటిధాత్రి:

 

శుక్రవారం రోజున సి పి ఐ ఎం ఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలోని ఇసుక రీచ్ ను సందర్శించడం జరిగిందని. అనంతరం ఆయన భూపాలపల్లి లో మాట్లాడుతూ అక్కడనుండి ఇష్టానుసారంగా అధిక లోడుతో వందలాది లారీలతో ఇసుకను తరలిస్తున్నారని అన్నారు. అదేవిధంగా కాటారం సబ్ డివిజన్ పరిధిలో 10 ఇసుక క్వారీలు నడుస్తున్నాయని విచ్చలవిడిగా ఇసుకను డంపు చేసుకుంటూ అధిక లోడుతో లారీల్లో తరలిస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించు కుంటున్నారని తక్షణమే వారి లైసెన్స్ రద్దు చేసి  ఇసుక క్వారీ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అని డిమాండ్ చేసారు.సహజ సంపదను అక్రమంగా తరలించుకుంటు సొమ్ము చేసుకుంటున్నారని.

Transportation

  గత ప్రభుత్వంలో ఇలాగే విచ్చలవిడిగా దందా కొన సాగిందని , ఈ ప్రభుత్వంలో నైనా మార్పు వస్తుందని ఆశించిన ప్రజల ఆకాంక్ష నెరవేర లేదని , ఇప్పుడు కూడా విచ్చలవిడిగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదన ద్యేయంగా దందా కొనసాగిస్తున్నారని , అనేకమంది నిరుపేదలు యాక్సిడెంట్లో చనిపోతున్నారని , కాళేశ్వరం నుండి భూపాలపల్లి కి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రావాల్సిందే అని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్నదని, అధిక ఇసుక లోడ్ల తో లారీలు నడవడం వలన రోడ్లు మొత్తం కృంగి పోయాయి అని, ఇంత నష్టం జరుగుతున్న సంబంధిత అధికారులు చూచి చూడనట్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇట్టి విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఒక వేళ తీసుకోకపోతే పార్టీ తరుపునుండి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.

భారత్ మాతాకీ జై అంటూ మసీదులో హోరెత్తిన నినాదాలు.

పాకిస్తాన్ డౌన్ డౌన్
భారత్ మాతాకీ జై. అంటూ మసీదులో హోరెత్తిన నినాదాలు .

చిట్యాల నేటిధాత్రి :

జయశంకర్ చిట్యాల మండల కేంద్రంలోని కౌసర్ ఏమసీదులో జుమ్మా నమాజ్ తరువాత ముస్లిం సోదరులందరూ పాల్గొని మన పొరుగు దేశమైన పాకిస్తాన్ డౌన్ డౌన్ భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ ఏప్రిల్ 22వ తేదీన పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్ము కాశ్మీర్ లోని పైల్గాం లో విహారయాత్రకు పోయిన అమాయకులైన 26 మందిని కాల్చి చంపడం జరిగింది దానికి ప్రతీకారంగా మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల పైన మాత్రమేదాడి చేయడం జరిగింది కానీ వక్రబుద్ధి గల పాకిస్తాన్ భారతదేశం లోని సరిహద్దు ప్రాంతాల పైన అమాయక ప్రజల పైన దాడి చేస్తూ యుద్ధం చేస్తున్న ది ఈయుద్ధంలో మన భారత సైన్యానికి మనమందరం ఆత్మస్థైర్యాన్ని కలిగించి మన భారతదేశ ప్రభుత్వానికి అండగా నిలవాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం పౌరుడు కూడా భారత్ మాతాకీ జై అంటూ నినాదం చేస్తూ మన దేశం పాకిస్తాన్ పై మరొక్కసారి గెలవాలని కోరుకుంటున్నాం అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మొహమ్మద్ అజ్మత్ మియా హైదర్ పాషా మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య.

*ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య *
జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన గుణాత్మక విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పిడిసిల్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మహ్మద్ సాదిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి సబ్జెక్టులో తగిన అర్హతలతో మంచి అనుభవం గల ఉపాధ్యాయులచే అన్ని ప్రభుత్వ పాఠశాలలో బోధన అందిస్తున్నామన్నారు. ఐఎఫ్ఫీ (IFP)ప్యానల్ బోర్డుతో విద్యార్థులకు పరిపూర్ణమైన అవగాహనను కల్పిస్తూ, ప్రతి అంశాన్ని కళ్ళకు కట్టినట్టు విద్య బోధన జరుగుతుందన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో ఏఐ (కృత్రిమ మేధ) తో కూడా విద్య బోధన అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టిక ఆహారం, ఉదయం రాగి జావా, ఉచిత పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, 10వ తరగతి విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతుల బోధన, ఆ సమయంలో విద్యార్థులకు స్నాక్స్ కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు విశాలమైన ఆట స్థలంలో వారి ఆసక్తికి అనుగుణంగా వ్యాయామ ఉపాధ్యాయులచే వివిధ రకాల ఆటలు ఆడిస్తూ వారి మానసిక, శారీరక పెరుగుదలకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సాదిక్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బడి ఈడు పిల్లలను, ప్రవేట్ పాఠశాలకు వెళ్తున్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిడిసిల్ల ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ చేపించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సామల రమేష్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శోభ, అంగన్వాడి సిబ్బంది, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు…

రైతులందరు తమ వివరాలను నమోదు చేసుకోవాలి .

రైతులందరు తప్పకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలి – ఎన్.ప్రియదర్శిని

రామడుగు నేటిధాత్రి:

 

 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అమలుపరుస్తున్న విశిష్ట రైతుల గుర్తింపు కార్డుల నమోదు కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట, రంగసాయిపల్లి గ్రామాల్లో సహాయక వ్యవసాయ సంచాలకులు ఎన్.ప్రియదర్శిని సందర్శించారు. ఈసందర్భంగా ఎన్.ప్రియదర్శిని మాట్లాడుతూ ఈనమోదు కార్యక్రమం ప్రతి గ్రామంలో నిర్వహించబడుతుందని రైతులందరు తప్పకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఆయా క్లస్టర్ లో ఏఈవోలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని కోహీర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సరస్వతి పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని కోహీర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సరస్వతి పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో ఏపీఓ.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో ఏపీఓ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో సుధాకర్ ఏపీఓ రాజ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు చేసిన పనులకు సంబంధించిన కొలతలను పరిశీలించారు. ఎంపీడీవో సుధాకర్ మాట్లాడుతూ. ఎండాకాలం కావున ఉపాధి హామీ కూలీలు ఉదయం తొందరగా రావాలని, ఎండలు ముదురుతున్న కొద్ది పనుల వద్ద జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. అలాగే పని ప్రదేశంలో నీటి సౌకర్యం కూడా కల్పించాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ మల్లప్ప ఫీల్డ్ అసిస్టెంట్ శశి కూలీలు పాల్గొన్నారు.

ఈనెల 20న కార్మిక సంఘాల.!

ఈనెల 20న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపు

కరీంనగర్ నేటిధాత్రి:

నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మే20న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతుందని దీని జయప్రదంకై జిల్లాలోని సంఘటిత, అసంఘటిత కార్మిక లోకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ శుక్రవారం పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని బైపాస్ రోడ్ లో గల సిమెంట్ గోదాం వద్ద సార్వత్రిక సమ్మె పోస్టర్ ను శుక్రవారం హమాలీ కార్మికులతో ఆవిష్కరించడం జరిగింది. ఈసందర్భంగా బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకోండు సంవత్సరాలైనా శ్రమిస్తున్న ప్రజల జీవితాలు మరియు జీవన ఉపాధిపై తన కార్పోరేట్ కుతంత్రాలు అమలు చేయాలని ప్రయత్నిస్తుందని దీనివల్ల దేశంలో పేదరికం, ఆకలి, పోషకాహార లోపం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నలబై నాలుగు లేబర్ కోడ్లను సంస్కరించి కార్మికుల పని భారoని పెంచారని ఎనిమిది గంటలు ఉన్న పని గంటలకు పన్నేండు గంటలుగా మార్చారని దీనిని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేబర్ కోడులు అనేవి శ్రామిక ప్రజలపై బానిసత్వం విధించే బ్లూ ప్రింట్ లాంటివని సంఘంలోని కార్మికులకు సంబంధించిన అన్ని హక్కులు కార్మికుల నుండి లాక్కుంటున్నారని పని గంటలు, కనీస వేతనాలు, సామాజిక భద్రత పని పరిస్థితులకు సంబంధించిన అన్ని ప్రాథమిక హక్కులను తీవ్రమైన సవాలుగా పరిగణించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యూనియన్ హక్కులు గుర్తింపు సమిష్టి నిరసనల హక్కు బావ వ్యవస్థీకరణ హక్కు తీవ్రమైన సవాలుగా మారాయని కార్పొరేట్ యజమానుల ప్రయోజనాల కోసం శ్రామిక ప్రజలపై బానిసత్వం యొక్క షరతులను విధించే బ్లూప్రింట్ లాంటివని కార్మికులు యూనియన్ నాయకులను నాన్ బెలబుల్ జైలు శిక్షలతో సహా కఠినమైన పోలీస్ చర్యలకు దారితీస్తుందని యజమాన్యానికి లేదా కార్మిక శాఖకు సమిష్టి ఫిర్యాదులను నిరాకరిస్తుందని ఇలాంటి చట్టాలను కార్మిక లోకం వ్యతిరేకించాలన్నారు. అసంఘటిత కార్మికుల జీవన ఉపాధికి సంబంధించిన ప్రాథమిక హక్కులను దూరం చేస్తుందని అందుకని కేంద్ర కార్మిక సంఘాల ఫెడరేషన్లు దేశవ్యాప్త సమ్మెను చేస్తున్నాయని దీని విజయవంతం చేయాలని చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారుచేసి మే20న దేశవ్యాప్త నిరవధిక సమ్మె నిర్వహించడo జరుగుతుందని దీనిలో ప్రభుత్వ, ప్రవేట్ రంగంలో పనిచేసే కార్మిక లోకం జిల్లా వ్యాప్తంగా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈపోస్టర్ ఆవిష్కరణలో సిమెంట్ గోదాంహమాలీ అధ్యక్షులు జంగం తిరుపతి ఉపాధ్యక్షులు బాగోతం వీరయ్య, నాయకులు నన్నవేని శ్రీనివాస్, ననవేని కొమరయ్య, పల్లెర్ల రాములు గౌడ్, ముత్యాల శ్రీనివాస్, దానవేని కొమరయ్య, ఉప్పారం శ్రీనివాస్, జక్కుల ఐలయ్య, దొంగల శ్రీనివాస్, బోయిని ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version