రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కు గురై కోలుకున్న.

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కు గురై కోలుకున్న సీనియర్ జర్నలిస్ట్ దూరదర్శన్ ప్రతినిధి మల్యాల బాలస్వామి

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన దూరదర్శన్ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ మలియాల బాలస్వామి గత నెల 25 న వనపర్తి గోశాల దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు . ఈ మేరకు సీనియర్ జర్నలిస్ట్ బాలస్వామి హైదరాబాదులో ఆర్థోపెడిక్ కేర్ హాస్పిటల్ డాక్టర్ తో చికిత్స చేయించుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న నేటి దాత్రి దినపత్రిక జిల్లా విలేకరి పోలిశెట్టి సురేష్ బుధవారం నాడు నాగవరంలో జర్నలిస్ట్ బాలస్వామి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు .జర్నలిస్ట్ బాలస్వామి త్వరగా కోలుకొని జర్నలిస్ట్ విధుల్లో చేరాలని పొలిశెట్టి సురేష్ ఆకాంక్షించారు

ఆర్డీవోని కోరిన సీనియర్ సిటిజన్ సమస్యలను.

ఆర్డీవోని కోరిన సీనియర్ సిటిజన్ సమస్యలను పరిష్కరించాలని విన్నపం

సిరిసిల్ల టౌన్: మే 21 (నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిరిసిల్ల జిల్లా సీనియర్ సిటిజన్ ప్రతినిధులు రాష్ట్ర కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సీనియర్ సిటిజన్ వృద్ధులను తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం నుండి గాని,సేవా సంస్థల నుండి గాని,ప్రభుత్వ పెన్షన్ విధానాలు గాని,జిల్లాలో ఉన్న వృద్ధులకు సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగినది. ఏదైనా వృద్ధులకు ఇబ్బంది ఉంటే సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్డీవో ని కోరడం జరిగింది , ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య, కోశాధికారి దొంత దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండలంలోని చెన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎఫ్ ఎస్ సి ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానం, మద్దతు ధర అమలు పరిస్థితులు, కేంద్రంలో ఉన్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతమైన ధాన్యం కొనుగోలు జరుగాలని అధికారులను ఆదేశించారు. తూకంలో పారదర్శకత ఉండాలని, తడిపడిన ధాన్యాన్ని తిరస్కరించకూడదని స్పష్టం చేశారు. అలాగే తక్షణమే ధనరాశిని రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరించిన ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం.

కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం
కేంద్రీయ విద్యాలయం ఎట్టకేలకు ప్రారంభోత్సవా నికి సిద్ధమైంది.

దశాబ్ద కాలానికి పైగా మండల కేంద్రంలో అరకొరా వసతుల మధ్య కొనసాగిన విద్యాలయం గత సంవత్సరం అక్టోబర్ 14న కొత్త భవనంలోకి సామగ్రిని, విద్యార్థులను తరలించారు.

మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన సెంట్రల్ సెలబస్ ను అందించడమే లక్ష్యంగా 12ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఝరాసంగంలో కేంద్రీయ విద్యాల యాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

సొంత భవనాల కోసం ప్రభుత్వం మాచ్నూర్ శివారులో 10ఎకరాల స్థలాన్ని కేటాయించి రూ.26 కోట్ల కేటా యించింది.

నిర్మాణం పనులు పూర్తికాగా, గత ఆరు నెలల నుంచి సొంత భవనంలో తరగతులు కొనసా గుతున్నాయి.

‘ఏ’ ఆకారంలో జీప్లస్-2 నిర్మాణం.

ప్రతి జిల్లాకు కేంద్రీయ విద్యాలయం ఉండాలనే
కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఝరాసంగంలో 12 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పాఠశా లలో 1-10 పదో తరగతి వరకు విద్య అందిస్తున్నారు.

ప్రస్తుతం పాఠశాలలో 425 మంది విద్యార్థులున్నారు. 2025 – 26 సంవత్సరానికి మొదటి తరగతిలో మరో 40 మంది విద్యార్థులను ఏర్పాటు చేశారు.

గత సంవత్సరం సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ) ద్వారా రూ.26 కోట్లు కేటాయించారు.

పాఠశాల క్యాంపస్ చుట్టూ ప్రహరీ, ఆంగ్ల అక్షరం ‘ఏ’ ఆకారంలో జీప్లస్-2 అంతస్తులుగా నిర్మాణం పూర్తయింది.

1వ తరగతి నుంచి 12 తరగతి వరకు సరిపడా 2 రెండేసి గదుల చొప్పున తరగతి గదులను నిర్మించారు.

ఇదే ప్రాంగణంలో సిబ్బంది నివాస గృహాలు, నీటి వసతి, శౌచాలయాలు, సిమెంటు రహదారులు, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాల నిఘా, రన్నింగ్ దారి, క్రీడా ప్రాంగణాలు వాలీబాల్, బాస్కెట్ బాల్, కోకో, కబడ్డీ కోర్టు నిర్మాణం చేపట్టారు.

విద్యార్థుల కోసం ప్రత్యేకమైన స్కూటర్, సైకిల్ ఇతర వాహనాల నిలిపేందుకు పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

మంజీరా, మిషన్ భగీరథ వంటి నీటి పథకాల పైప్లెన్ ను పాఠ శాలకు అనుసంధానం చేశారు.

24 గంటల విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు.

దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకమైన గదుల.

Collector inspected.

 

 

 

◆*రూ.26 కోట్లతో భవన ನಿರಾಣಂ.*

◆*ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్.*

◆*12 ఏండ్ల క్రితం ఏర్పాటు.*

◆*గతేడాదే భవనంలోకి విద్యార్థులు.*

◆*ప్రస్తుతం కేవీలో 426 మంది పిల్లలు.*

ర్యాంపులు, మరుగుదొడ్లు నిర్మించారు.

విశాలమైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య పాఠశాల నిర్మాణం పూర్తి కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

23న సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభోత్సవం.

కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి 23న ప్రారంభించను న్నారు.

కేంద్రీయ విద్యాలయం నుంచి విద్యా ర్థులు, తల్లి దండ్రులు హాజరు కావాల్సిందిగా సందేశాలు పంపించారు.

ఇప్పటికే జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎంపీ సురేష్ షెట్కా ర్, జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవే క్షించారు.

సీఎం రాకకోసం కేంద్రీయ విద్యాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబ వుతోంది.

రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన తరువాత మొదటిసారి జహీరాబాద్ తో పాటు ఝరాసంగం మండలాన్ని సందర్శిస్తున్న సందర్బంగా మండల ప్రజలు, నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ సద్వినియోగం చేసుకోవాలి.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ సద్వినియోగం చేసుకోవాలి
మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట నేటి ధాత్రి:

రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన రైతు రిజిస్ట్రేషన్ కార్డును సద్వినియోగం చేసుకోవాలన్నారు. దానికి కావాల్సిన ఆధార కార్డు, పట్ట పాస్ బుక్, లింక్ అప్ మొబైల్ నెంబర్ ను వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు అందివ్వలన్నారు. ఇప్పటికే గ్రామాల్లో అధికారులు రైతుల నుండి రిజిస్ట్రేషన్లు ప్రారంభించడం జరిగిందన్నారు.

సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు.

సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు.

◆ ఈ నెల 23న జహీరాబాద్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిమ్స్ రోడ్డు, కేంద్రీయ విద్యాలయం ప్రారంభం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్లో ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పట్టణంలోని అలోల్ పాస్ చౌరస్తా వద్ద హెలిప్మాద్, బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లు పనులు చకచకా కొనసాగుతున్నాయి.

సీఎం ప్రారంభించనున్న బసవేశ్వర విగ్రహం, ఝరాసంగం మండలంలోని కేంద్రీయ విద్యా లయం వద్ద ఏర్పాట్లను సంగారెడ్డి ఎస్సీ పరితోష్పంకజ్ పరిశీలించి పలు సూచనలు. చేశారు. 05వ జాతీయ రహదారి నుంచి బరీ పూర్ వరకు 5లోమీటర్ల మేర నిర్మించిన నిమ్స్ రోడ్డును సీఎం ప్రారంభించనున్నారు. జహీరాబాద్ నుంచి కేంద్రీయ విద్యాలయం వరకు రోడ్లకు మరమ్మతులు చేసి వంతెనలకు రంగులు వేశారు.

ఆదివాసి కుటుంబాలకు అండగా ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్.

ఆదివాసి కుటుంబాలకు అండగా ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్..

*యువతకు వాలీబాల్ కిట్లు అందజేత *

నేటిధాత్రి చర్ల:

ఆదివాసి కుటుంబాలకు ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అండగా నిలిచారు.భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చర్ల పోలీసుల ఆధ్వర్యంలో చర్ల మండలం లోని చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామమైన చెన్నాపురంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది.

ASP

ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఈ గ్రామంలో ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.అనంతరం గ్రామస్తులందరితో సమావేశమై అక్కడ నివసించే మహిళలకు,చిన్న పిల్లలకు దుస్తులతో పాటు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్లను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

ASP

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సారధ్యంలో ఆదివాసీ ప్రజలకు విద్య వైద్యం రవాణా వంటి కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు. అదేవిధంగా నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో చర్ల పోలీస్ శాఖ ఉన్నతాధికారి సీఐ రాజువర్మ,ఎస్సై నర్సిరెడ్డి,ఎస్సై కేశవ్,సిఆర్పిఎఫ్ బలగాలు మరియు స్పెషల్ పార్టీ సిబ్బందితో పాటు చెన్నాపురం గ్రామంలోని 90 కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు.!

దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు వివాహ ప్రోత్సాహకం పట్ల హర్షం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పథకం తో పాటుగా ఒక లక్ష రూపాయలు అదనపు వివాహ ప్రోత్సాహక పురస్కార జీవో ను అమలుచేసి దివ్యాంగులకు తీపి కబురు అందించడం పట్ల తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసీమ లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .గత ప్రభుత్వ పాలనలో వికలాంగుల వివాహానికి సకలాంగులు వికలాంగులను వివాహమాడితే లక్ష రూపాయల వివాహ ప్రోత్సాహక పురస్కారం అందించేది.నేడు కాంగ్రెస్ ప్రజా పాలన లో సీఎం రేవంత్ రెడ్డి వికలాంగుల పై దృష్టి సారించి సకలాంగులు వికలాంగులను పెళ్లి చేసుకుంటే ఒక లక్ష రూపాయల అదనపు వివాహ ప్రోత్సాహక పురస్కార పథకంను మార్చేసి ఇద్దరు దివ్యాంగులు వివాహమాడిన కూడా దివ్యాంగులకు కల్యాణ లక్ష్మి పథకంతో పాటుగా వివాహ ప్రోత్సాహక పురస్కారం జీవో ప్రకారం ఒక లక్ష రూపాయలు వికలాంగులకు అమలుపరుస్తూ జీవో జారీ చేసిందన్నారు.ఇద్దరు దివ్యాంగుల వివాహానికి ఆర్థిక అండదండలుగా వివాహ ప్రోత్సాహక పురస్కారం తరపున ఒక లక్ష రూపాయలు దివ్యాంగులకు ఇచ్చి జీవో అమలుపరిచిన సీఎం రేవంత్ రెడ్డి వికలాంగుల ఆత్మ బంధువు అని మరోసారి నిరూపించుకున్నారన్నారు అన్నారు..

సత్య వాది..నిత్య వాది రేవంత్‌ రెడ్డి.

-18 నెలలు ధరల పెరుగుదల లేకుండా పాలిస్తున్న ఏకైక సీఎం రేవంత్‌ రెడ్డి

-ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా నిజమే చెబుతారు.

-యదార్ధ వాది లోక విరోధి..కానీ రేవంత్‌ ప్రజా సారధి.

-ప్రజల మేలు కోసం… తెలంగాణ వెలుగు కోసం రేవంత్‌ రెడ్డి.

-సంక్షేమ ప్రధాత, ప్రగతి విధాత రేవంత్‌ రెడ్డి.

-అబద్దాలు లేవు, ఆడంబరాలు లేవు.

-ప్రజా పాలనలో ప్రజా సంక్షేమం వెల్లివిరుస్తోంది.

-నిజాలు చెప్పడం మాత్రమే తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.

-ప్రజలను మభ్యపెట్టి రాజకీయం చేయడం లేదు.

-అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని బైటపడేస్తున్నారు.

-వున్నదాంట్లోనే గొప్పగా పాలిస్తున్న పాలకుడు రేవంత్‌.

-పేదలకు సన్న బియ్యం అందిస్తున్న దేవుడు.

-పేదలకు సన్న బియ్యం అందిస్తున్న తొలి, ఏకైక రాష్ట్రం తెలంగాణ.

-ఎప్పటికప్పుడు ఉద్యోగ నియామకాలు వేగ వంతం చేస్తున్నారు.

-ఇప్పటికే 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు.

-స్వయం సహాయక బృందాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు.

-యువత స్వయం ఉపాధి కోసం రాజీవ్‌ యువ వికాసం పథకం తెచ్చారు.

-రైతులకు ఏ రాష్ట్రంలో లేనంత మద్దతు ధర చెల్లిస్తున్నారు.

-పైగా సన్నాలకు బోనస్‌ కూడా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

-ఏక కాలంలో రైతులను రుణ విముక్తి చేశారు.

-తెలంగాణ వ్యాప్తంగా మొదలైన ఇందిరమ్మ ఇండ్లు.

-పదేళ్లుగా అందకుండా పోయిన వారికి కొత్త రేషన్‌ కార్డులు.

-అన్ని వర్గాల ప్రజల సంతోషం లక్ష్యంగా సాగుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిజమైన పాలకుడు. పరిపాలనా దక్షుడు. గొప్ప పాలకుడు. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే చరిత్రలో ఏ రాజు గురించి చెప్పుకోవాల్సి వచ్చినా, ఏ ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినా వారి పాలనలో ప్రజలు ఎలా వున్నారు అనేదే ప్రాతిపదిక. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయాంలో ప్రజలు సుఖశాంతులతోవున్నారు. సుబిక్షంగానే వున్నారు. అంతే కాదు గతంలో రాజులైనా, ప్రజా పాలకులైనా పన్నుల భారం లేని రాజ్యమే గొప్పది అని చెప్పుకునేవారు. అదే దారిలో నడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలన కూడా అంతే గొప్పది. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ పాలన పోయి, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి సుమారు 18 నెలలు గడుస్తోంది. ఈ ప్రజా ప్రభుత్వంపై ఇప్పటి వరకు ఎక్కడా ప్రజల తిరుగుబాటు జరిగింది లేదు. ప్రజా పోరాటాలు సాగింది లేదు. ప్రభుత్వం మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసింది లేదు. కేవలం సోషల్‌ మీడియా ప్రచారం తప్ప, ఏ ఒక్క వర్గం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెలెత్తి చూపించింది లేదు. తిరుగుబాటుకు తావే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ 18 నెలల కాలంలో ప్రజల మీద ఎలాంటి భారాలు వేయలేదు. చాటు మాటుగానైనా పన్నుల భారం మోపలేదు. ప్రజా శ్రేయస్సు కోరుకునే ఏ పాలకుడైనా ప్రజలను పీడిరచాలనుకోరు. ఇప్పుడు సిఎం.రేవంత్‌రెడ్డి కూడా అదే చేస్తున్నారు. రాష్ట్ర ఆర్దిక పరిస్దితి ఆయనకు బాగా తెలుసు. ప్రజల పరిస్దితి అంతకన్నా తెలుసు. ఇలాంటి పరిస్దితుల్లో పిండికొద్ది రొట్టె అనేలా పాలన సాగాలే తప్ప, ప్రజల ఇబ్బందులో వున్నప్పుడు బాదించకూడదనుకుంటున్నారు. పన్నుల భారం వేసి వేదించొద్దునుకుంటున్నారు. ఇంత కంటే గొప్ప పాలకుడు ఎవరూ వుండరు. పైగా గత నుంచి వస్తున్న సంక్షేమ కార్యాక్రమాలు ఎక్కడా ఆపడం లేదు. గత పాలకుల పథకాలను ఎక్కడా గండి కొట్టలేదు. వాటని యాదా తధంగా అమలు చేస్తున్నారు. వాటి అమలులో కూడా ఎక్కడా విమర్శలులేవు. గత పాలనలో ప్రజలకు అందుతున్న వృద్దాప్య పించన్లు అంతకన్నా మెరుగ్గానే అందుతున్నాయి. గతంలో కాస్త ఆలస్యమైన సందర్భాలున్నాయి. కాని రేవంత్‌రెడ్డి పాలనలో వృద్దాప్య పించన్లు గాని, ఇతర పించన్లకు ఎక్కడా ఇబ్బంది లేదు. ఆలస్యం కూడా ఎక్కడా జరుగుతున్న దాఖలాలు లేవు. ఇక ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వ హాయాంలో నెలాఖరు వరకు కూడా కొన్ని శాఖలకు జీతాలు సరిగ్గా అందినసందర్భాలు చాలా తక్కువ. కాని ఇప్పుడు ఏ శాఖ ఉద్యోగులకైనా సరే ఒకటో తారీకే జీతాలు పడుతున్నాయి. గతమెంతో ఘనంగా చెప్పుకునే వాళ్లు ఉద్యోగులకు నెల నెల సకాలం జీతాలు చెల్లించిన పరిస్దితి లేదు. ఇక రైతుల విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. పైగా గతం కన్నా రైతులు సంతోషంగానే వున్నారు. ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇరవై నాలుగు గంటల కరంటు నిర్విరామంగానే అందుతోంది. విమర్శలు ఎప్పుడూ వుంటాయి. రాజకీయ విమర్శలు పట్టించకోవాల్సిన అసవరం లేదు. నిజంగా రైతులకు ఇబ్బందులు వుంటే ఈపాటి రైతులు ఎప్పుడో రోడ్డెక్కెవారు. ఇక రైతు భరోసా కాస్త అటూ ఇటైనా సరే రైతులకు చేరుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం రైతు రుణమాఫీ. ఇది రైతుల జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పడంలో సందేహం లేదు. చెప్పిన సమయానికి రుణమాఫీ కాకపోవచ్చు కాని, మొత్తానికి ఏడాదిలో పూర్తి స్ధాయి రుణమాఫీ అందిరికీ జరిగింది. పై పెచ్చు రైతులకు బ్యాంకులు ఇచ్చే రుణాలు ఎక్కడా ఆగలేదు. ఏ రైతును బ్యాంకును ఇబ్బంది పెట్టింది లేదు. రైతులందరికీ బ్యాంకు రుణాలు సకాలంలో అందేలా చేశారు. రైతులకు పెట్టుబడి సాయాలు అందుకునేలా చూసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత మద్దతు ధర తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నారు. ఇది ఏ రైతును అడిగినా చెబుతారు. గత పాలకులకన్నా ఎక్కువే ఇస్తున్నారు. వడ్లు ఎలా వున్నా ప్రభుత్వం సేకరిస్తూనే వుంది. తప్ప తేమ శాతం పేరుతో ఎక్కడా రైతులను ఇబ్బందులు పెట్టడం లేదు. అలాంటి వార్తలు ఎక్కడా లేవు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పూర్తి స్దాయిలో సేకరిస్తున్నారు. డబ్బులు కూడా రైతులకు వెంట వెంటనే అందజేస్తున్నారు. గతంలో రైతులకు డబ్బులు అందడంలో కొంత జాప్యం జరిగిన సందర్బాలున్నాయి. కాని రేవంత్‌ సర్కారులో ఎలాంటి జాప్యం లేదు. రైతుల నిరసన ఎక్కడా కనిపించలేదు. పైగా ప్రభుత్వ సూచనల మేరకు రైతులు ఎక్కువ భాగం సన్నాలు పండిరచారు. గతంలో ఎప్పుడూ లేనంతగా రైతులంతా సన్నాలను పండిచేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం సన్నాలు పండిరచే రైతులకు ఇచ్చే బోనస్‌కు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. సన్నాలు పండిస్తున్నారు. గతంలో 2020లోనే రైతులను వరి వేయొద్దని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వడ్లు కొనుగోలు చేయమని హెచ్చరించింది. రైతులకు విత్తన వడ్లు అమ్మితే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతే కాకుండా రైతులకు సన్నాలు పండిరచమని చెప్పి చేతులెత్తేశారు. సన్నాలకు, దొడ్డు వడ్లకు తేడా లేకుండా చేసి రైతులను నష్టం కల్గించారు. తర్వాత వాణిజ్యపంటలు పండిరచాలని చెప్పి, వరి వేస్తే ఉరే అంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కాని రేవంత్‌ సర్కారు సన్నాలు పండిస్తే బోనస్‌ ఇస్తామన్నారు. ఇస్తున్నారు. తెలంగాణను సన్నాలు పండిరచే అన్న పూర్ణగా మార్చారు. అక్కడితో ఆగలేదు. తెలంగాణను గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మరో అడుగు ముందుకు పడిరది. ముఖ్యమంత్రి రేవంత్‌ సర్కారు రైతులు పండిచే సన్నాలను రేషన్‌ షాపుల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్నారు. ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన చర్య అని చెప్పాలి. తెలంగాణలో పేదలకు సన్నాలు అందించడం అనేది చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం మొదలు పెట్టిన ఎన్టీఆర్‌ను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. తర్వాత ఎంత మంది పాలకులు అమలు చేసినా వారి పేరు చరిత్రలో నిలిచిపోలేదు. అలాగే పేదలకు మెరుగైన కార్పోరేట్‌ ఉచిత వైద్యం అందించిన రాజీవ్‌ ఆరోగ్య శ్రీ అనేది గొప్ప కార్యక్రమం. దానికి శ్రీకారం చుట్టిన వైఎస్‌ను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆయన పేరు చిరస్దాయిగా ఈ పధకం ద్వారా నిలిచిపోతుంది. అలాగే పేద ప్రజలు ఉచితంగా సన్న బియ్యం అందించిన ఘనత మాత్రం సిఎం. రేవంత్‌రెడ్డికే దక్కుతుంది. పేద ప్రజలు రేషన్‌ ద్వారా సన్న బియ్యం తీసుకున్నంత కాలం రేవంత్‌ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఒక వేళ భవిష్యత్తులో ఏ పాలకుడైనా ఆ పధకానికి తూట్లు పొడవాలని చూసినా చరిత్ర క్షమించనంత గొప్పగా ఈ పథకం అమలుకు అనుములు రేవంత్‌ రెడ్డి రూపకల్పన చేశారు. పేదవారి కడుపు నింపుతున్నారు. రేవంత్‌ రెడ్డి పాలనలో గొప్ప కార్యక్రమం ఏమిటని చరిత్రను ప్రశ్నిస్తే చెప్పే గొప్ప కార్యక్రమం సన్న బియ్యం. పాలకులు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా, చరిత్ర మొత్తం చెప్పుకోవడంలో నిలిచిపోయేది ఒకటే వుంటుంది. అదే సన్న బియ్యం పధకం. గతంలో పేదలకు బియ్యం ఇస్తున్నామా? లేదా? అన్నట్లు వుండేది. కాని ఇప్పుడు సన్న బియ్యం సరఫరా ఒక గొప్ప విప్లవాత్మకమైన అడుగు అని చెప్పకతప్పదు. పైగా దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి ఆలోచన ఏ ప్రభుత్వం చేయలేదు. తెలంగాణలో మాత్రమే మొదటి అడుగు పడిరది. అంతే కాకుండా రేపటి రోజు ఇతర రాష్ట్రాలలో సన్న బియ్యం అమలు కావాలన్నా తెలంగాణ నుంచే సన్న బియ్యం సరఫరా చేయాల్సి వుంటుంది. అలా తెలంగాణకు వరాన్ని, తన కీర్తిని ఏక కాలంలో పెంచుకున్న నాయకుడు రేవంత్‌ రెడ్డి. అన్నం ఉడికిందా? లేదా? తెలుసుకునేందుకు ఒక్క మెతుకు చాలు. రేవంత్‌ రెడ్డి పాలన గురించి చెప్పుకోవడానికి సన్న బియ్యం సరఫరా ఒక్కటి చాలు. నిజం చెప్పాలంటే రేవంత్‌ రెడ్డి పేదల పక్షపాతి. పల్లె నుంచి వచ్చిన నాయకుడు. ప్రజల జీవితాలు తెలిసిన నాయకుడు. ప్రజల బతుకులు బాగు చేయాలన్న లక్ష్యంతో రాజకీయం చేస్తున్న నాయకుడు. అందుకే తన 18 నెలల పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాలన సాగిస్తున్నారు. మరిన్ని మెరుగైన పధకాలు అమలు చేయాలని చూస్తున్నారు. ప్రజల చేత నిజమైన పాలకుడు అని అనిపించుకుంటున్నారు. ప్రజా పాలకుడుగా జేజేలు కొట్టించుకుంటున్నాడు.

మిల్స్ కాలని సిఐ సస్పెండ్.

మిల్స్ కాలని సిఐ సస్పెండ్

మిల్స్ కాలని పోలీసు స్టేషన్ సిఐ జె. వెంకటరత్నం ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

వరంగల్ నేటిధాత్రి:

వరంగల్ డివిజన్ పరిధిలో సిఐ సస్పెండ్ కావడం నగరంలో కలకలం రేపింది. వరంగల్ తూర్పులోని మిల్స్ కాలని పోలీసు స్టేషన్ సిఐ జె. వెంకటరత్నం ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ భూ వివాదం కేసులో బాధితులకు న్యాయం చేయకుండా, తప్పుడు కేసును నమోదు చేయడమే కాకుండా, ఈ కేసులో మరణించిన వ్యక్తి పేరును కూడా నమోదు చేసి నిందితులకు సహకరించిననందుకు, అలాగే మరో కేసులో మహిళ నిందితురాలిని పోలీస్ స్టేషన్ ఆవరణలో లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా విచారణలో నిర్ధారణ కావడంతో మిల్స్ కాలనీ ఇన్స్ స్పెక్టర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఎరువులు విక్రయం చేసే సమయంలో తప్పనిసరిగా రైతుల నుంచి వేలిముద్రలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ పాస్ యంత్రాల ద్వారా మాత్రమే విక్రయించాలని చెప్పారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

కార్మికులను బానిసలుగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.

కార్మికులను బానిసలుగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

*కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక
విధానాలు మానుకోవాలి*

BRTU జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ డిమాండ్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):

సిరిసిల్ల పట్టణంలోని BRTU జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , ప్రజా వ్యతిరేక విధానాలు అవలాంభిస్తూ 4 లేబర్ కోడ్ తెచ్చి కార్మికులను బానిసలను చేసే విధంగా చేయాలని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు.కార్మికులందరికీ కనీస వేతనం 26,000 అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఈ రోజు తంగళ్లపల్లిలో బీడీ కార్మికులతో కలసి ఫ్లకార్డులతో నిరసన చేపట్టడం జరిగినది.
ఈ సందర్భంగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను తొలగించి పెట్టుబడిదారులు , యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులను కట్టు బానిసలను చేసే కుట్ర చేస్తుందని మండిపడ్డారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం , కొన్ని అనివార్య కారణాల నేపథ్యంలో సార్వత్రిక సమ్మెను జూలై 9 వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వo కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని లేకుంటే రాబోయే రోజుల్లో కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.లక్షలాది మంది ఆధారపడి జీవనోపాది పొందుతున్న బీడీ పరిశ్రమపై అనేక ఆంక్షలు పెట్టి ఈ రోజు ఉపాధి లేకుండా చేసి బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసి కార్మికులను రోడ్డుపాలు చేస్తోందని మండిపడ్డారు.జూలై 9న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా సంఘటిత , అసంఘటిత అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ తప్పకుండా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా బీడీ కార్మికులందరికీ ఎటువంటి నిబంధనలు లేకుండా 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

సంగారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం చేయాలి.

సంగారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలో 23 న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సీఎం పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలన్నారు. అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ, బందోబస్తు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, హెలిప్యాడ్, హెల్త్ క్యాంప్ లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.

అద్భుత నిర్మాణం కోటగుళ్లు ఆలయం.

అద్భుత నిర్మాణం కోటగుళ్లు ఆలయం

ఆలయ శిల్ప సంపద భావితరాలకు అందించాలి

తెలంగాణ స్టేట్ ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి

ఆలయ సందర్శన స్వామివారికి ప్రత్యేక పూజలు

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయులు నిర్మించిన కోట గుళ్ళు ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతమని తెలంగాణ స్టేట్ ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి అన్నారు.

మంగళవారం ఆయన శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళ ను సందర్శించారు.

ఈ సందర్భంగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ఘన స్వాగతం పలికారు.

మొదట గణపతి, నందీశ్వర గణపేశ్వర స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజా కార్యక్రమాలు అనంతరం ఆలయ కమిటీ పక్షాన శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

పూజా కార్యక్రమాల అనంతరం ఆయన ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామప్ప శిల్ప సంపదని పోలిన విధంగా కోటగుళ్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయని తను వరంగల్ లో పని చేసిన సమయంలో ఎప్పుడు ఇక్కడికి రాలేదని ఈ ఆలయంలో పూజలు జరుగుతున్న విషయం తమకు తెలియదన్నారు.

మొట్టమొదటిసారి ఆలయాన్ని సందర్శించడం జరిగిందని ఇక్కడి వాతావరణం తనకెంతో నచ్చిందని అన్నారు.

Temple

కాటేశ్వరాలయం నందిమండపం నాట్య మండపాలను ప్రత్యేకంగా పరిశీలించారు. సుమారు గంటపాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపారు.

అనంతరం హరిత అతిథి గృహం ప్రాంగణంలో ఉన్న శివ ద్వారా పాలక విగ్రహాలను పరిశీలించారు.

మరోసారి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శిస్తారని అన్నారు.

ఆయన వెంట చిట్యాల సిఐ మల్లేష్, భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ గణపురం ఎస్ఐ రేఖ అశోక్ తదితరులు ఉన్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ.

వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం బుర్రకాయల గూడెం లోవడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచక్షణ రహితంగా దాడి చేసిన విషయం తెలుసుకొని వడ్ల కొనుగోలు కేంద్రం నీ సందర్శించి వారి నుండి వివరాలు అడిగి తెలుసుకునీ,ఉన్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడీ వారికి ధైర్యం నింపి నిర్వహించిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిధర్ రెడ్డి వారితో బిజెపి నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు మంద మహేష్ సోమ దామోదర్ మా దాస్ మొగిలి తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం.

ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్ లను పంపిణి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనీ కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో పంక్షన్ హల్ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ద్వారా మైనారిటీలకు ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం ద్వారా మంజూరు అయిన 150 కుట్టు మిషన్ ల పంపిణి కార్యక్రమం రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుళ్ల కొత్వాల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి పాల్గొని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి,రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుళ్ల కొత్వాల్ కలిసి మైనారిటీ మహిళకు కుట్టు మిషన్ లను పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు,పొల్యూషన్ బోర్డు మెంబెర్ బాలాజీ సింగ్ గారు కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తాజా &మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నాలుగు లేబర్ కోడ్ ల దగ్ధం.

నాలుగు లేబర్ కోడ్ ల దగ్ధం

శ్రీరాంపూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని శ్రీరాంపూర్ లో భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్ ల ప్రతులను దగ్ధం చేశారు. మంగళవారం ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. బ్రహ్మానందం మాట్లాడుతూ.. దేశంలో కార్మిక వర్గం బ్రిటిష్ కాలం ( 1926 ) నుండి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అనేక చట్టాలను సాధించుకున్నట్లు తెలిపారు.మొత్తం 44 కార్మిక చట్టాలు కొనసాగుతున్నాయని అందులో 29 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం కుదించి నాలుగు లేబర్ కోడ్ లుగా మారుస్తున్నారని ఆరోపించారు.వేతనాలు,వృత్తి భద్రత,ఆరోగ్యం,పని పరిస్థితులు,సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాల కోడ్ లు వీటి ద్వారా 29 కార్మిక చట్టాలు రద్దు చేయబడతాయన్నారు. కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేయడం కొరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నాలుగు కోడ్లను తీసుకొస్తున్నారని అన్నారు. నాలుగు లేబర్ కోడ్లను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి కార్మిక వర్గం ఒక పెద్ద మిలిటెంట్ ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. జాతీయ వ్యాప్తంగా పెద్దన్న పాత్ర పోషిస్తున్న కార్మిక సంఘాలు కార్మికులని ఈ నాలుగు లేబర్ కోడ్ లు అమలైతే జరిగే నష్టాన్ని వివరించాలన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసే వరకు పోరాడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అనిల్,సుధాకర్,వెంకటి,సురేష్,రాజేష్,నగేష్,రాంబాబు, సమ్మయ్య,శేఖర్,రాము, విజయేందర్,శారద,కవిత, శిరీష,లక్ష్మీ,మల్లేశ్వరి, కమలమ్మ పాల్గొన్నారు.

రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు.

రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు

మండల వ్యవసాయ అధికారి గంగాజమున

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో రైతులకు జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి తెలియజేశారు2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మండ లానికి ఈ వానాకాలం వేసుకో డానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై శాయం పేట పిఎసిఎస్ కు 266 బస్తాలు మరియు ప్రగతి సింగారం గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 233 బస్తాలు కెటాయించడం జరిగింది. ఒక్కో బస్తా సైజ్ 30 కిలోలు ఉండగా, బస్తా ధర 2137 రూపాయల 50 పైసలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రైతులు తమ యొక్క పట్టాదారు పాసు పుస్తకం మరియు ఆధార్ ల జిరాక్స్ తీసుకొని వెళ్లి సమర్పించి విత్తనాలు కొనుగోలు చేయవలిసిందిగా తెలియ జేయడమైనది. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పచ్చి రొట్టె ఎరువులైన జీలుగ వాడడం వల్ల పంటలకు మరియు నేల ఆరోగ్యానికి అనేక లాభాలు కలుగుతాయి. ఇవి ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో, మట్టిని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి మట్టిలోకి తీసుకువెళ్తా యి. తద్వారా తదుపరి పంటకు కావాల్సిన నత్రజని మొక్కలకు అందుతుంది.
మట్టిలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచి, మట్టి జీవక్రియలను ఉత్తేజితం చేస్తాయి.రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ఖర్చు తగ్గిస్తుంది.సేంద్రియ పదార్థం పెరిగి, మట్టి సూత్రధర్మాలు పెరిగి, నీటి నిలువ సామర్ధ్యం పెరుగుతుంది.కొన్నిరకాల హానికర పురుగులను నియంత్రించేందుకు ఉపయోగ పడుతుంది.కావున మండలం లోని రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి.

వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం బుర్రకాయల గూడెం లోవడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచక్షణ రహితంగా దాడి చేసిన విషయం తెలుసుకొని వడ్ల కొనుగోలు కేంద్రం నీ సందర్శించి వారి నుండి వివరాలు అడిగి తెలుసుకునీ,ఉన్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడీ వారికి ధైర్యం నింపి నిర్వహించిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిధర్ రెడ్డి వారితో బిజెపి నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు మంద మహేష్ సోమ దామోదర్ మా దాస్ మొగిలి తదితరులు పాల్గొన్నారు

 నూతన వధూవరులను ఆశీర్వదించిన.

 నూతన వధూవరులను ఆశీర్వదించిన ధన్నసరి సింగిల్ విండో మాజీ చైర్మన్ బండారి వెంకన్న

కేసముద్రం నేటి ధాత్రి:

మహబూబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ సతీమణి మహబూబాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఉమా తమ్ముడు
చిరంజీవి రోహిత్ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వెన్నెల ను
ఆశీర్వదించిన ధన్నసరి సింగిల్ విండో మాజీ చైర్మన్ బండారి వెంకన్న                              
మహబూబాబాద్ చిట్టి మల్ల రామకృష్ణ.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version