సెల్ఫ్ గవర్నమెంట్ డే స్వయం పరిపాలన దినోత్సవం.

సెల్ఫ్ గవర్నమెంట్ డే స్వయం పరిపాలన దినోత్సవం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని మండల కేంద్రమైన ఝరాసంగంలోని విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ ఈరోజు పాఠశాలలోని విద్యార్థులు బి దీక్షిత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గా ఉపాధ్యాయులుగా ప్రజ్వలిక సంజన వైష్ణవి సాయి కీర్తన రుహీన మహిన్ అబూబకర్ అలీ అబ్బాస్ బి ప్రకాష్ జి మధు జి నితీష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పాఠశాల బి నాగన్న ప్రధానోపాధ్యాయురాలు బి శ్వేత మరియు ఉపాధ్యాయుల బృందంతో వారిని శాలువాలతో సన్మానం చేసి బహుమతులు అందజేశారు.

ఎల్ఆర్ఎస్ పై అవగాహన నిర్వహించిన డిఐజి..

ఎల్ఆర్ఎస్ పై అవగాహన నిర్వహించిన డిఐజి

గంగాధర నేటిధాత్రి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎల్ఆర్ఎస్ పథకం పట్ల గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డీఐజీ రవీందర్ అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల విక్రేతలకు, దస్తావేజు లేఖరులకు ఎల్ఆర్ఎస్ ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను వివరించారు. పలువురు అడిగిన సందేహాలను నివృత్తి చేసారు. ఈ నెలా 31 వరకు 25%శాతం రాయితీ తో అధిక సంఖ్యలో చెల్లించుకోవాలని కోరారు.

మేమేం పాపం చేశాం.. మాకు ఇంత తక్కువ ధరెందుకు.

మేమేం పాపం చేశాం.. మాకు ఇంత తక్కువ ధరెందుకు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

మేమేం పాపం చేశామ్..మా చుట్టుపక్కల నిమ్జ్ ప్రాజెక్టులో ఎకరా భూమి ధర రూ.40 నుంచి రూ.60 లక్షల ఉంది. నిమ్జ్ ప్రాజెక్టుకు భూములిస్తే తమకు వచ్చే ప్రయోజనం ఏమిటని రైతులు మూకుమ్మడిగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆవేదనను వ్యక్తం చేశారు. నిమ్జ్ భూసేకరణలో భాగంగా బుధవారం న్యాల్కల్ మండలంలోని మామడ్గిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. 2013 చట్టం గురించి రైతులకు వివరించారు. అనంతరం రైతులు తమ అభిప్రాయాలు చెప్పేందుకు అవకాశం ఇచ్చారు. గ్రామస్తులను ఒక్కొక్కరు వేదికపై పిలిచి వారితో మాట్లాడించారు. ఈ సందర్భంగా రైతు రాజిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2013 చట్టాన్ని సెక్షన్ రెండు, మూడుని మీనాయించి రైతులకు అన్యాయం చేసిందన్నారు.

మా గ్రామానికి సంబంధించిన భూములు సారవంతమైన భూములని, సంవత్సరానికి మూడు పంటలు పండుతాయన్నారు. అయిన ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారానికి భూములు ఇవ్వమని స్పష్టం చేశారు. మరో రైతు కూరన్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో అల్లం, పసుపు, ఆలుగడ్డ, అన్ని రకాల వాణిజ్య పంటలు పండే సారవంతమైన భూములన్నారు. పర్యావరణ శాఖ వారు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్లకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసిన సమగ్ర విచారణ నిర్వహించకుండా తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందారు.ఇకనైనా మా విన్నపాన్ని మన్నించి సమస్య పరిష్కరించాలన్నారు. దాబేవాలె మహబూబ్ మాట్లాడుతూ… మీరిచ్చే ఒక ఎకరానికి నష్టపరిహారం రూ.15 లక్షలకు జహీరాబాద్ లో ఒక ప్లాటు రాదన్నారు. దీంతో తమ జీవనాధారం కోల్పోయి తమ కుటుంబాలు వీధిన పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు నాగప్ప మాట్లాడుతూ.. నాకు పది ఎకరాల పొలం నలుగురు కుమారులు పది ఎకరాలు తీసుకొని 8 ఎకరాలు ఇచ్చిన పర్వాలేదని విన్నవించారు. నా నలుగురు కుమారులకు 2013 చట్టం ప్రకారం ఉపాధి హామీ కల్పించిన పర్వాలేదన్నారు. ప్రభుత్వం స్పందిస్తే భూమి ఇవ్వటానికి ఆలోచిస్తామన్నారు. లేకుంటే మూడు పంటలు పండే భూమి ఇవ్వనని తేల్చి చెప్పారు. మరో రైతు చింతల్ జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు 2013 చట్టం గురించి అవగాహన కల్పిస్తే తెలుస్తుందని, మార్కెట్ వ్యాలు ప్రకారం రూ.45 నుంచి 60 లక్షలు భూమి పలుకుతుందని రూ. 15 లక్షలు ఇస్తే ఒక ఫ్లాట్ కూడా రాదన్నారు. ప్రభుత్వానికి భూములిచ్చి తమ కుటుంబాలు అడుక్కుతినాలా అని ప్రశ్నించారు.
పట్టా భూమి, అసైన్మెంట్ భూముల రైతుల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో సమాధానం చెప్పలేని అధికారులు గ్రామ సభ వాయిదా వేశారు. అసైన్మెంట్ భూమికి సంబంధించిన ఓ భూ నిర్వాసితుడు మాట్లాడుతూ..” మీ భూములు మూడు పంటలు పండితే, మా భూములు నాలుగు పంటలు పండుతాయి” అంటూ సభలో వెటకారంగా భూసేకరణకు అనుకూలంగా మాట్లాడటంతో కొద్దిసేపు రైతుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రైతుల మధ్య సమన్వయం లోపించి ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకా అధికారులు గ్రామ సభ వాయిదా వేసి అక్కడి నుంచి జారుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ భూపాల్, నాయబ్ తహసిల్దార్ రాజిరెడ్డి, నిమ్జ్ ప్రాజెక్ట్ ఆర్ఐ సిద్ధారెడ్డి, డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, జహీరాబాద్ రూరల్ సీఐ.జక్కుల హనుమంతు, జహీరాబాద్ సీఐ శివలింగం, హద్నూర్ ఎస్ఐ. చల్ల రాజశేఖర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

నాసిరకం ఇసుకతో మోడల్ ఇందిరమ్మ హౌస్ నిర్మాణం పనులు..

నాసిరకం ఇసుకతో మోడల్ ఇందిరమ్మ హౌస్ నిర్మాణం పనులు..

పునాదిలోనే నాసిరకం పనులు చేస్తే భవనం భవిష్యత్తు ఏమిటి..?

స్థానిక ఇసుకతోటే పనులు చేయాలని ఆదేశాలు.

హౌసింగ్ డి.ఈ విష్ణువర్ధన్ రెడ్డి వింత వివరణ..

నర్సంపేట,నేటిధాత్రి:

రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులు ప్రారంభం చేసింది. కాగా అందుకు సంబంధించిన మోడల్ ఇందిరమ్మ భవనాన్ని ప్రతి మండలానికి ఒక భవనం నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జార్ చేసింది. ప్రజలు లబ్ధిదారులు ఇందిరమ్మ పథకంలో బాగంగా 400 స్క్వేర్ ఫీట్స్ తో రూ.5 లక్షల నిధులతో ఇంటి నిర్మాణం నమూనా కోసం హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రాలలో ఇందిరమ్మ పథకం మోడల్ భవనం నిర్మాణ పనులు చేపట్టారు. కాని ఆ భవనం నిర్మాణ పనులు పునాదిలోని నాసిరకంగా పనులు చేపట్టడం వాళ్ళు చర్చలకు దారితీస్తున్నది. దుగ్గొండి మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో
400 స్క్వేర్ ఫీట్స్ తో రూ.5 లక్షల నిధులతో నమూనా భవనం నిర్మాణం పనులు ప్రారంభం చేశారు. భవనం నిర్మాణం పనులు మొదలుపెట్టిన అధికారులు పునాదిలోని నాసిరకం ఇసుకతో పనులు చేపట్టడం పట్ల పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భరణం పునాదిలోనే నాసిరకంగా పనులు చేపడితే ఏంద తరబడి ఉండాల్సిన భవనం ప్రమాదాల గురయ్యా అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు నాసిరకం పనులు చేపట్టకుండా నాణ్యతతో కూడిన పనులను చేపట్టి గ్రామాల్లో చేపట్టబోయే ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు నిలువుటద్దంగా నిరూపించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

స్థానిక ఇసుకతోటే పనులు చేయాలని ఆదేశాలు..

హౌసింగ్ డి.ఈ విష్ణువర్ధన్ రెడ్డి వింత వివరణ..

దుగ్గొండి మండల కేంద్రంలో ఇందిరమ్మ హౌసింగ్ నమూనా భవనాన్ని 400 స్క్వేర్ ఫీట్లతో 5 లక్షల రూపాయల నిధులు వ్యయంతో నిర్మాణం కోసం పనులు ప్రారంభించాము. భవనం నిర్మాణం కోసం రోబో ఇసుక, గోదావరి ఇసుక వాడాల్సి ఉంటుంది. మేము కొత్తగా వరంగల్ జిల్లాలో బాధ్యతలు తీసుకున్నాము. ప్రస్తుతం లోకల్ ఇసుకతో పనులు ప్రారంభం చేపట్టాము. ఇప్పుడున్న లోకల్ ఇసుకను మార్చి గోదావరి ఇసుకతో పనులు చేపడతామని హౌసింగ్ డిఈ విష్ణువర్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు.

తెలంగాణ ఉద్యమ కెరటానికి దక్కనున్న గౌరవం

-రాములమ్మకు మంత్రి యోగం.

-త్వరలో మంత్రిగా రాములమ్మ.

-మలి తరం తెలంగాణ ఉద్యమానికి తొలి మహిళ.

-తల్లి తెలంగాణ పార్టీతో పోరాడిన ధీర వనిత.

-మహా మహా నాయకులే పార్టీ నడపలేదు.

-మహిళగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నింపారు.

-జయశంకర్‌ సార్‌ కోరిక మేరకు పార్టీని విలీనం చేశారు.

-లేకుంటే రాములమ్మ రాజకీయం మరో లెవల్‌లో వుండేది.

-మొదట జై తెలంగాణ అన్న వాళ్లెందరో వెనుకడుగు వేశారు.

-తెలంగాణ ప్రకటన వచ్చే దాక రాములమ్మ అలుపెరగని పోరాటం చేశారు.

-తెలంగాణ బిల్లు రోజు ప్రాణాలకు తెగించి స్పీకర్‌కు అండగా నిలబడ్డారు.

-తెలంగాణ బిల్లు చించేయాలని చూసిన వారికి అందకుండా రక్షణగా నిలిచారు.

-సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా ఆమె సూపర్‌ స్టార్‌ అనిపించుకున్నారు.

-రాజకీయ కుయుక్తులు తెలియక నమ్మి మోసపోయారు.

-కాలం మళ్ళీ సమాధానం చెప్పే అవకాశం రాములమ్మకు ఇచ్చింది.

-ఇప్పుడు రాములమ్మ టైమ్‌ మళ్ళీ వచ్చింది.

-అప్పుడు ఉద్యమం… ఇప్పుడు అసలైన రాజకీయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాల్లో అందరూ నిస్వార్ధ పరులువుండరు. కాని కొంత మంది మాత్రమే ఎలాంటి స్వార్ధం లేకుండా, ప్రజల కోసం జీవితం త్యాగంచేస్తుంటారు. వారి భవిష్యత్తు ఫణంగా పెట్టి ప్రజల కోసం నిలబడతారు. కేవలం తన ప్రజల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తారు. అయితే అందులోనూ అటు ప్రజల కోసం, ఇటు తన మాతృభూమి కోసం కొంత మందే త్యాగాలు చేస్తుంటారు. అలాంటి అతి కొద్ది మందిలో తెలంగాణ ఉద్యమ కెరటం విజయశాంతి ఒకరు. తెలంగాణ అనే ఉద్యమం లేకుండా వుంటే ఆమె రాజకీయాల్లోకి వచ్చేవారు. కాని తన ప్రాంత ప్రజలు కొన్ని దశాబ్ధాలుగా సొంత రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బకడం ఆమెను కలిచివేసింది. ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతం పచ్చగా, మరో ప్రాంతం ఎడారిగా వుండడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఒక ప్రాంతమంతా పాడి పంటలతో సస్యశ్యామలంగా వుంటే, మరో ప్రాంతంలో కనీసం తగడానికి చుక్క నీరు దొకరని దుస్ధిని చూసి ఆమె చలించిపోయారు. ఆంద్రా ప్రాంతలో సీటి సవ్వడులతో ఏడాదంతా గళగళాపారే నీళ్లులో పచ్చని పొలాలు, అందమైన ప్రకృతి, సంతోషంలో ప్రజలు, ఆర్ధికంగా వారి ఉన్నత స్ధితిని చూసిన రాములమ్మ, నా ప్రాంతం ఏం పాపం చేసుకున్నది అని తల్లడిల్లిపోయింది. గోదావరి, కృష్ణ నదులు తెలంగాణ నుంచే పారుతుంటాయి. ఎక్కువ శాతం తెలంగాణ నుంచే వెళ్తుంటాయి. తలాపున గోదావరి వున్నా ఉత్తర తెలంగాణ, పక్కనే కృష్ణ పరుగులు పెడుతున్నా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండలు పలుగు రాళ్లు తెలి, బీళ్లు కనిపిస్తుంటే ఆమె గుండె చెరువైంది. దశాబ్ధాలుగా తెలంగాణ ప్రజలు కోరుతూనే వున్నారు. మాకు నీళ్లు కావాలని పోరాటాలు చేస్తూనే వున్నారు. కాని అప్పటి పాలకులుపట్టించుకోలేదు. కనీసం తెలంగాణ బతుకులను కూడా చలించలేదు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నా చేయూతనివ్వలేదు. తెలంగాణ యువతకు పనిలేదు. తెలంగాణ రైతులు సాగు చేసే పరిస్ధితి లేదు. కనీసం తెలంగాణలో వున్న గొలుసు కట్టు చెరువులు నింపినా కాని, కనీసం తెలంగాణ ఎంతో కొంత బాగుపడేది. తెలంగాణ రైతు కన్నీళ్ల వ్యవసాయం చేయాల్సిన అవసరం వచ్చేదికారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు కాకముందే నిర్మాణం చేయాలనుకున్నా పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసినా కనీసం తెలంగాణలో సాగు సాగేది. ఏ రకంగా చూసినా తెలంగాణ అంతగా వెనుకబడేదికాదు. తెలంగాణ పల్లెలు వలసలు పోయవి కాదు. బొంబాయి, బొగ్గుబాయి, అప్పులు చేసి దుబాయిలకు వెళ్లే పరిస్దితి వచ్చేదే కాదు. తెలంగాణను పూర్తిగా ఎండబెట్టి, ఆంద్రాకు నీళ్లన్నీ తరలిస్తూ, తెలంగాణ రైతుల ఆత్మహత్యల పరంపరసాగుతున్నా కనీసం పట్టించుకోలేదు. పైగా తెలంగాణ రైతులు ఎక్స్‌గ్రేషియా కోసం చనిపోతున్నారని కూడా ఎద్దేవా చేసిన ఆంద్రా నాయకులు ఎద్దేవా చేసేవారు. తెలంగాణ భూముల్లో పంటలు కాదు, కనీసం తొండలు గుడ్లు పెట్టేందుకు కూడా పనికి రావంటుండేవారు. ఇదిలా వుంటే పుండు మీద కారం చల్లినట్లు, రైతాంగానికి ఇచ్చే కరంటు చార్జీలు విపరీతంగా పెంచారు. తెలంగాణ ప్రాంతానికి సాగు నీరందించాలంటే ఎత్తిపోతల ప్రాజెక్టులే శరణ్యం. వాటిని నిర్మాణాలు చేయలేం. రైతుల కోసం తెల్ల ఏనుగులాంటి ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఏటా అయ్యే ఖర్చును భరించలేమంటూ ఆంద్రా పాలకులు అంటుండేవారు. అంతే కాకుండా రైతులు ఆత్మగౌరవం మీద అడుగడుగునా దెబ్బ కొడుతుండే వారు. ఏపిలో చిన్న చినుకు పడి చేను చెడిపోయినా, పరిహారం అందించేవారు. కాని తెలంగాణలో అకాల వర్షాలుకు పంటలు చెడిపోయినా పట్టించుకునేవారు కాదు. ఎండలకు పంటలు ఎండిపోయి, సరైన నీరందక పంటలు పొట్టకొచ్చేదశలో చేతికి రాకుండాపోయినా కనీసం అయ్యే అని కూడా అనేవారు కాదు. ఇవన్నీ దాటుకొని రైతు పంట పండిస్తే గిట్టుబాటు ధర ఇచ్చేవారు కాదు. రైతుకు ఎప్పుడూ కష్టమే.. ఇవన్నీ చూసి రాములమ్మకు కుడపు తరుక్కుపోయింది. దాంతో సినీ రంగాన్ని ఏలుతున్న ఉచ్చ దశలో ఆ రంగాన్ని వదిలేశారు. అప్పటి నుంచి సినిమా వైపు చూడలేదు. సినిమా గురించి ఆలోచించేలేదు. వస్తూ, వస్తూనే తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ మొత్తం కలియ తిరిగారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేశారు. అనేక ఉద్యమాలు చేపట్టారు. ఓ వైపు కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని, తాను సంపాదించిన కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. అయితే ఇదే సమయంలో కేసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి సాగుతోంది. అంతకుముందే ఆలెనరేంద్ర తెలంగాణ సాధన సమితి ఏర్పాటు చేశారు. అప్పటికే నరేంద్ర పార్టీని కేసిఆర్‌ పార్టీలోవిలీనం చేశారు. అలా రెండు పార్టీలు కలవడంతో తెలంగాణ ఉద్యమం మరింత బలపడిరదని ప్రొఫెసర్‌. జయశంకర్‌ సార్‌ అంచనావేశారు. అదే సమయంలో తల్లి తెలంగాణ పార్టీ ఊరూరా రెపరెపలాడుతోంది. ఆసమయానికి విజయశాంతి తెలియని వారులేరు. ఒక రకంగా చెప్పాలంటే కేసిఆర్‌ కంటే రాములమ్మ తెలంగాణ ప్రజలకు ఎక్కువ తెలుసు. రాములమ్మ సినిమాతో ప్రతి గుడెసికు ఆమె పేరు చేరిపోయింది. అలా తెలంగాణ మాస్‌ ప్రజలకు కూడా ఆమె పేరు చేరిపోయింది. అలా కేసిఆర్‌ కంటే ఎక్కువగా తెలంగాణ సమాజానికి తెలిసిన రాములమ్మ పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని జయశంకర్‌ సార్‌ ప్రతిపాదన పంపించారు. ఆయన మాట మీద నమ్మకంతో మాత్రమే తెలంగాణ సాధన కోసమే రాములమ్మ తన పార్టీని కేసిఆర్‌ పార్టీలో విలీనం చేశారు. లేకుంటే ఇప్పటికీ ఆ పార్టీ వుంటే రాములమ్మ రాజకీయం వేరుగా వుండేది. తెలంగాణలో అప్పటికే తెలుగుదేశం పార్టీలో నెంబర్‌ టూగా వున్నా దేవేందర్‌ గౌడ్‌ నవ తెలంగాణ అని పార్టీ ఏర్పాటు చేశారు. కాని ఆయన పట్టుమని పది నెలలు కూడా నడిపించలేకపోయారు. తన పార్టీని నడపలేక, సామాజిక తెలంగాణ నినాదంతో వచ్చిన చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీలో ఆ పార్టీని విలీనం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవి లాంటి నటుడు కూడా పార్టీని నడపలేక జెండా పీకేశారు. జయశంకర్‌లాంటి వారితో చెప్పించి, కేసిఆర్‌ తన పార్టీ తప్ప మరో పార్టీ వుండడానికి వీలు లేదని తల్లి తెలంగాణపార్టీ గొంతు కోశాడు. నిజంగా ఆమె పార్టీ అలాగే వుంటే ఇప్పుడు తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీగా వెలుగొందుతూనేవుండేది. మొదట్లో విజయశాంతికి ప్రాదాన్యతనిచ్చినట్లే కనిపించినా, ఆలె నరేంద్ర రాజకీయాన్ని ఎలా తుంచి వేశారో అలాగే విజయశాంతిని కూడా రాజకీయాలకు దూరం చేయాలనుకున్నారు. చెల్లి, చెల్లి అంటూ నమ్మించి తన రాజకీయ అవసరాల కోసం, తల్లి తెలంగాణ పార్టీని ఆనవాలు లేకుండా, విజయశాంతికి తెలంగాణ రాజకీయాల్లో స్ధానం లేకుండా చేయాలనుకున్నారు. అయినా ఎప్పుడూ విజయశాంతి దిగులు చెందలేదు. నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో విజయశాంతికి కీలక భూమిక. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ఆమె పోషించిన పాత్ర మరే మహిళా నాయకురాలు పోషించలేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరూ ఆమెకు సాటి రారు. తెలంగాణ రాష్ట్రసాధన కోసం వచ్చింది. తెగించి పోరాటం చేసంది. తెలంగాణ కోసం జరిగిన సుధీర్ఘ పోరాటంలో ఆమె ముందుండి నడిచారు. రాజకీయ పదవుల కోసం ఆమె ఆలోచించలేదు. పదవులు కావాలని కోరలేదు. తన వచ్చిన లక్ష్యం తెలంగాణ ఏర్పాటు. అది పూర్తయింది.. అందులోనూ విజయశాంతి పాత్ర పెద్ద అందరికన్నా పెద్దది. తెలంగాణ బిల్లు రోజున ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలను ఫణంగా పెట్టారనే చెప్పాలి. లోక్‌సభ స్వీకర్‌ మీరా కుమారి తెలంగాణ బిల్లు చదువుతుంటే ఆ ప్రతులను లాక్కొని చించేయాలని, బిల్లు పాస్‌ కాకండా చూడాలని ఏపి పార్లమెంటు సభ్యులు ఎంతో ప్రయత్నం చేశారు. ఆ సమయంలో స్పీకర్‌ పక్కన వుండి బిల్లు ప్రతులు వారికి దక్కకుండా రాములమ్మ చూశారు. ఒక వేళ స్పీకర్‌ మీద దాడి జరిగే ప్రయత్నాలు జరిగినా అడ్డుకునేందుకు సిద్దంగా వున్నారు. అయినప్పటికీ లగడపాటి రాజగోపాల్‌ పెప్పర్‌ స్ప్రే చల్లి మీరా కుమార్‌ సృహ తప్పి పడిపోయేలా చేశారు. ఆ సమయంలో విజయశాంతి అక్కడే వున్నారు. ఆమె తృటిలో తప్పించుకున్నారు. అలా తెలంగాణ బిల్లు పాస్‌ అయ్యేందుకు రాములమ్మ చేసిన తెగింపు తెలంగాణ వున్నంత వరకు మర్చిపోరు. అలాంటి రాములమ్మకు మళ్లీ టైం వచ్చింది. పదేళ్లపాటు ఆమె రాజకీయాలు దూరం కావాల్సి వచ్చినా కాలమనేది ఒకటుంటుంది. అది మళ్లీ త్యాగ ధనులకు మళ్లీ మంచి రోజులు తెస్తుంది. ఇప్పుడు మళ్లీ రాములమ్మకు గుడ్‌ టైమ్‌ మళ్లీ స్టార్ట్‌ అయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. త్వరలోనే మంత్రి కానున్నారు. ఇక రాములమ్మ రంగలోకి దిగితే ఇక బిఆర్‌ఎస్‌కు దబిడిదిబిడే..

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు…

తంగళ్ళపల్లి మండలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు….

తంగళ్ళపల్లి:నేటి ధాత్రి

తంగళ్ళపల్లిమండలంలో పలు గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముందుగా తంగళ్ళపల్లి గ్రామపంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసి గ్రామ పంచాయతీలో ఉన్న వివరాలు అడిగి తెలుసుకుని సిబ్బంది సరైన టైంలో వస్తున్నారా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారనిఅధికారులను ఆదేశించారు అలాగే మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ముందుగా ప్రజాపాలన కౌంటర్ ను పరిశీలించి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం టి సైబర్ సర్వర్ రూమ్ను పరిశీలించి మండలంలో ఇంటి ఇతర పనులపై ఆరా తీశారు మండలంలో భూముల క్రమబద్ధీకరణకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిలో ఎన్ని అప్రూవ్ అయ్యాయని ఎంపిడిఓ లక్ష్మీనారాయణ ఆరా తీయగా . 2893. దరఖాస్తులు అప్రూవ్ అయ్యాయని
కలెక్టర్అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు అలాగే నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తూ ముందుగా ఓపి రిజిస్ట్రేషన్ పరిశీలించారు ఇతర రూములు తిరుగుతూ ఆసుపత్రికి వచ్చే రోగులపై ఎటువంటి రకాల పరీక్షలు చేస్తూ వారికి మందులు ఇచ్చే గది ల్యాబ్ తనిఖీ చేసి మందులు వ్యాక్సిలపై ఆరా తీశారు ప్రభుత్వ వైద్య సేవ చేసుకునేలా ప్రజలందరికీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు ప్రభుత్వ దావఖానాలోనే ప్రసవం అయ్యేలా చూడాలని ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఇక్కడ ఏమైనా ఇబ్బందులు కొరతలు ఉన్నాయని నేరెళ్ల వైద్యశాల అధికారి డాక్టర్ చంద్రిక రెడ్డిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు తర్వాత నేరెళ్ల టీజి ఆర్ ఎస్ గర్ల్స్ విద్యార్థి హాస్టల్లో సందర్శించి విద్యార్థుల కు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు జిల్లా కలెక్టర్ మెనూ ప్రకారం రాగిజావయిస్తుండగా పరిశీలించారు తర్వాత ఏ ఆహారాలు విద్యార్థులకు అందిస్తున్నారు అని అడగగా ప్రిన్సిపల్ సమాధానం చెబుతూ మెనూ ప్రకారం బగారా రైస్ ఆలుగడ్డ కూర టమాట ఉడికించిన గుడ్లు, సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఉత్తమఫలితాలు సాధించేలా చర్యలు తీసుకొని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రణాళికల ప్రకారం విద్యార్థులను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు

రాజకీయ లబ్ధి కోసమే మాజీ ఎమ్మెల్యే ధర్నా..

రాజకీయ లబ్ధి కోసమే మాజీ ఎమ్మెల్యే ధర్నా..

రైతులు ఆందోళన చెందవద్దు… పంటలకు రక్షణగా ఉంటాo

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి రాజకీయ లబ్ధి కోసమే రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ధర్నా పేరుతో దివాలా కోరు రాజకీయాలు చేస్తున్నా డని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని చలివాగులో పరివాహక ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే ధర్నా నిర్వహించిన నేపథ్యంలో మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల తో కలిసి బుచ్చిరెడ్డి మాట్లా డుతూ రైతులు బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, వరి పంటలకు కాంగ్రెస్ మండల నాయకులు రక్షణగా ఉంటారని భరోసా ఇచ్చారు. భూగర్భ జలాలు అడుగంటిన తరుణంలో చలివాగులో నీటి లెవెల్స్ తగ్గడం జరిగిందని, అందుకు రైతులకు ఇబ్బంది కలగకుండా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు ఆదేశాలతో అధికా రులపై ఒత్తిడి తీసుకువచ్చి నీటి లిఫ్టింగ్ నిలిపివేయించడం జరిగిందని గుర్తు చేశారు. చలివాగు కాలువలమరమ్మత్తు లు జరుగుతున్న తరుణంలో క్రాప్ హాలిడే ప్రకటించినప్పటికీ రైతుల విజ్ఞప్తి మేరకు జాలు కాలువ ద్వారా నీటిని విడుదల చేసి చిత్తశుద్ధిని చాటుకున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉండగా చలివాగును అడ్డు పెట్టుకొని చాపల వ్యాపారం చేశారని, ప్రాజెక్టులో 15 ఫీట్లు మినిమం నీరు ఉండేలా కట్ట ఎత్తుగా పోయిస్తానని హామీ ఇచ్చి గెలిచాక విస్మరించారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చలివాగులో నీటి లెవెల్స్ తగ్గిపోయినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు ధర్నా చేస్తే అక్రమ కేసులు నమోదు చేయించిన హీన చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. ఉనికి కోసం రైతులను ఆందోళనకు గురి చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిందం రవి, వలి హైదర్, దుబాసి కృష్ణమూర్తి, వైద్యుల వెంకటరాజు రెడ్డి, ఆదిరెడ్డి, లడే రాజ్ కుమార్, ఐలయ్య, కట్టయ్య, మార్కండేయ, డిటి రెడ్డి, బాసవి రవి, సదయ్య, జక్కుల నరేష్, రాజు, జగన్, రాజయ్య, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ ప్రక్రియను అమలు చేయాలి.!

ఎస్సీల వర్గీకరణ అమలైన తర్వాతనే ఉద్యోగ ప్రక్రియను అమలు చేయాలి
రెండవ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్‌ ఎంఎస్పి రిలే నిరాహార దీక్షలు
వర్ధన్నపేట,నేటిధాత్రి:
వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర బుధవారం రోజున ఎమ్మార్పీఎస్‌ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నిరాహార దీక్షలు ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షులు ఎర్ర సంతోష్‌ మాదిగ అధ్యక్షతన రెండో రోజు కొనసాగడం జరిగింది . ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్‌ వరంగల్‌ జిల్లా సీనియర్‌ నాయకులు గోలి సుధాకర్‌ మాదిగ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని ఎస్సీల వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఇప్పుడు ప్రకటించినటువంటి ఉద్యోగాలు ఎస్సీల వర్గీకరణ అమలైన తర్వాతనే ఈ ఉద్యోగ ప్రక్రియను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నా లేని పక్షంలో పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఉప కులాలను అన్నిటిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం
ఈ కార్యక్రమంలో ముత్యాల మల్లేష్‌ మాదిగ ఎంఎస్పి వర్ధన్నపేట మండల అధ్యక్షులు , సినపెల్లి రాజు మాదిగ ఎమ్మార్పీఎస్‌ వర్ధన్నపేట మండల అధికార ప్రతినిధి , ముత్యాల నులేందర్‌ మాదిగ , సిలువేరు రాజు మాదిగ కడారి గూడెం గ్రామ అధ్యక్షులు , కంచర్ల రంజిత్‌ కుమార్‌ మాదిగ ఎమ్మార్పీఎస్‌ నాయకులు , బీరెల్లి నాగార్జున మాదిగ ఎమ్మార్పీఎస్‌ నాయకులు , పసునూరు సాయిలు మాదిగ తదితరులు పాల్గొన్నారు

రిలే నిరవధిక దీక్షలు…

 

రిలే నిరవధిక దీక్షలు…

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత పార్లమెంటులో చేసేంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్ నిలిపివేయాలని రిలే నిరవధిక దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కే సముద్రం మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు వల్లందాస్ మహేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి మామిళ్ల ప్రేమ్ కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్ము యాకయ్యమాదిగ, దుర్గం ఆకాష్ మాదిగ, గుజ్జునూరి నవీన్ మాదిగ, కొమ్ము రాధా, కొమ్ము బొందమ్మ, పందుల అనసూర్య తదితరులు పాల్గొన్నారు.

 

విద్యార్థుల క్షేత్ర పర్యటన.!

విద్యార్థుల క్షేత్ర పర్యటన

క్షేత్ర పర్యటన ద్వారా ప్రత్యక్ష అనుభవంతో విజ్ఞానం

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి దాత్రి

మండలంలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ విద్యార్థులు బుధవారం క్షేత్ర పర్యటనలో భాగంగా మల్యాల లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారని పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. పాఠశాలకు చెందిన 8 , 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులను క్షేత్ర ప్రదర్శనకు తీసుకువెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా యాకాంతం గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వకుండా క్షేత్ర పర్యటన ద్వారా ప్రత్యక్ష అనుభవంతో ఎక్కువ విజ్ఞానాన్ని పొందుతారన్నారు. కృషి విజ్ఞాన కేంద్రంతోపాటు హార్టికల్చర్ సెంటర్ ను విద్యార్థులు సందర్శించడం జరిగింది. విద్యార్థులు శాస్త్రవేత్తలను తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ మాలతి, క్రాంతి కుమార్, ఉపాధ్యాయులు మహమ్మద్ అఫీజ్, సుభాష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

బిజెపి నాయకులు వికాస్ రావు కి ఆహ్వానం.!

మల్యాల గ్రామంలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు బిజెపి నాయకులు వికాస్ రావు కి ఆహ్వానం.

చందుర్తి, నేటిధాత్రి:

మన మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించే ప్ర ప్రధమ బ్రహ్మోత్సవాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి రావాలని బిజెపి నాయకులు చెన్నమనేని వికాస్ ని ఆలయ కమిటీ కలిసి ఆహ్వానం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతోపాటు అల్లాడి రమేశ్, మార్త సత్తయ్య, మొకిలే విజయేందర్, సిరికొండ శ్రీనివాస్, లోకోజి సతీష్, పాటి సుధాకర్, దురిశెట్టి రాజు, మూడపెళ్లి ముఖేష్ మరియు ఇతర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యుత్ అధికారుల అత్యుత్సాహం.

విద్యుత్ అధికారుల అత్యుత్సాహం..

ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించకుంటే సరఫరా బంద్..

రామయంపేట మార్చి 12 నేటి ధాత్రి (మెదక్)

విద్యుత్ శాఖ అధికారులు పేదవారిపై తమ అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. రామయంపేట పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటున్న రాజు అనే ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది. కేవలం 500 రూపాయలు బిల్లు చెల్లించాల్సి ఉండగా అధికారులు తక్షణమే చెల్లించాలని ఒత్తిడి జరిగింది. తనకు కొంత సమయం కావాలని ఎంత ప్రాధేయపడిన ఆ ఏరియా కు సంబంధించిన స్థానిక లైన్మెన్ వినిపించుకోకపోగా తక్షణమే కరెంట్ కట్ చేసి వెళ్లడం జరిగింది. ఒక్కొక్కరు నెలల తరబడి చెల్లించకుండా వారిని కనీసం ప్రశ్నించడం లేదని నిరుపేద అయిన తన పట్ల కావాలని ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. విద్యుత్ అధికారులు కూడా వేళల్లో ఉన్న కరెంట్ బిల్లులు వసూలు చేయడంలో ఈ ఉత్సాహం చూపడం లేదనీ బాధితుడు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.పలుకుబడి ఉన్న వ్యక్తులు ఏప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటున్నారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయమై విద్యుత్ షాక ఏఈ తిరుపతి రెడ్డి ని అడగగా తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని బకాయిలు ఎక్కడ కూడా లేకుండా వసూలు చేస్తున్నామని తెలిపారు.

మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.!

అసెంబ్లీ ముట్టడిస్తారన్న ముందస్తు సమాచారంతో మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేసిన పోలీసులు

అక్రమ అరెస్టులను ఖండించిన చందుర్తి మండల మాజీ సర్పంచులు

కక్ష్య సాధింపుతో తమ బిల్లులను విడుదల చేయడం లేదు: జిల్లా అధ్యక్షుడు దుమ్మ అంజయ్య

చందుర్తి, నేటిధాత్రి:

తెలంగాణ అసెంబ్లీ ముట్టడిస్తారన్న కారణంతో జిల్లా తాజా మాజీ సర్పంచ్లను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. చందుర్తి మండలంలోని పలువురు మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ అధ్యక్షుడు దుమ్మ అంజయ్య మాట్లాడుతూ ప్రజా పాలనా అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష్య సాదింపు ధోరణితో మాజీ సర్పంచుల యొక్క సుమారు వేయి కోట్ల రూపాయలను విడుదల చేయకుండా అక్రమంగా అరెస్టులను చేపిస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. వారి వెంట సిరికొండ శ్రీనివాస్ తదితర మాజీ సర్పంచులు ఉన్నారు.

సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.

సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలంలోని కిష్టంపేట గ్రామనికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో సిసి రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయి. 14 లక్షల విలువైన సిసి రోడ్ల నిర్మాణానికి బుధవారం కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధియే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆది శ్రీనివాస్ అహర్నిశలు శ్రమిస్తున్న తీరుపై కొనియాడారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ ఏ ఎంసి డైరెక్టర్ కరీమ్, మాజీ ఎంపిటిసి మొకానపెల్లి దేవరాజు మంజుల, బాణాల లక్ష్మా రెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాస్, పోతుగంటి రఘుపతి,పోతుగంటి రంజిత్, చిగుర్ల మల్లేశం, చిగుర్ల నాగేష్,భూమాండ్ల కొమురయ్య, మ్యాదరి లచ్చయ్య, పుల్లూరి జెలందర్, భూమాండ్ల మధు,తదితరులు పాల్గొన్నారు.

రైతులకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ.

రైతులకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ

గద్వాల /నేటి ధాత్రి

గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రము సబ్ స్టేషన్ దగ్గర 200 రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో గద్వాల ప్రాంతంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని.. రైతులు కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కరెంటు లేక సరైన పంటలు లేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునేవారన్నారు.
నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఈ ప్రాంతంలోని రైతుల కష్టాలను తీర్చానన్నారు. గద్వాల నియోజకవర్గంలో కొత్తగా ఏడు గ్రామాలలో 7 విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పరీక్ష ఫ్యాడ్లు పెన్నుల పంపిణీ.

పరీక్ష ఫ్యాడ్లు పెన్నుల పంపిణీ
– గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడులను పెన్నులను పంపిణీ చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి..
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను, పెన్నులను అందించరు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలను సాధించాలని జీవితంలో విద్యార్థులు ఏర్పరచుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో పదవ తరగతి ఎంతో కీలకమైనదని ఈ సమయంలో చదువు పట్ల ఎవ్వరు అశ్రద్ధ చేయరాదని అన్నారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గడ్డం లత భాస్కర్, బి. ఆర్. ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్, జిల్లా అధ్యక్షులు మానాల అరుణ్ పాల్గొన్నారు.

విద్యాలయంలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు.

మంజీర విద్యాలయంలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు..

రామయంపేట మార్చి 12 నేటి ధాత్రి (మెదక్)

Graduation Day

మంజీరా విద్యాలయంలో నేడు యూకేజీ విద్యార్థులకు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది .విద్యార్థులు ప్రీ ప్రైమరీ ముగించుకొని ప్రైమరీ స్థాయిలోకి వెళ్లడం సందర్భంగా ఈ గ్రాడ్యువేషన్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనంలోనే ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం నేటితరం విద్యార్థుల యొక్క అదృష్టంగా భావించడం జరిగింది. వాసవి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలలో జరుపుకునేటటువంటి గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఘనంగా పాఠశాలలో నిర్వహించడం జరిగింది. పిల్లలని చూసి గ్రాడ్యుయేషన్ డ్రెస్ లో తల్లిదండ్రులు వచ్చినటువంటి వాళ్ళు ఎంతో ఆనందించారు. అతిధి రాజేశ్వరి (చైల్డ్ సీనియర్ మేనేజర్ అండ్ ట్రేనర్ స్కాలరి ప్రోగ్రాం )గారు మాట్లాడుతూ తల్లిదండ్రులు చేసే పనులను చూసి విద్యార్థులు నేర్చుకుంటారని, ఉపాధ్యాయులు గాని తల్లిదండ్రులు గాని వారిని చూసి ఆచరిస్తారని అందుకే చెప్పడం కంటే మనం ఆచరించి చూపించడం వారికి ఆదర్శనీయంగా ఉంటుంది, అని చెప్పారు. పిల్లలని చదువుకోమని చెప్పి తల్లిదండ్రులు టీవీ సీరియల్ చూస్తే పిల్లలు టీవీ చూడొద్దంటే ఫోన్ చూడొద్దు అని చెప్పడం తల్లిదండ్రులు అస్తమానం ఫోన్లో చూస్తుంటే, రీల్స్ చేయడం కోసం ఎంకరేజ్ చేస్తుంటే పిల్లలు ఏ విధంగా సరైన మార్గంలో వెళ్తారు చెప్పడం కంటే ఆచరించడం ఉత్తమం. క్లాస్ కి టీచర్లు కూడా రోజు పిల్లల కంటే ముందుగా వచ్చి ఎందుకు ఆలస్యంగా వచ్చారని అడిగితే వారు మారుతారు కానీ టీచర్ రోజు లేటుగా వస్తే అడగడానికి అర్హులు కారు అని చెప్పడం జరిగింది .కేవలం ఐదు సంవత్సరాల వయసులోనే పిల్లలు స్టేజి మీద చక్కగా ఉపన్యసించడం జరిగింది .ఈ వయసు నుంచి స్టేజ్ ఫియర్ అనేది పోవడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలను ఈ డ్రెస్ లో చూడడం ఈ కార్యక్రమాన్ని చూడడం ఈ చుట్టుపక్కల ఏ పాఠశాలలో జరిగినటువంటిది మంజీర పాఠశాల వాళ్ళు నిర్వహించడం మా పిల్లలు మరియు మా యొక్క అదృష్టంగా భావిస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి, స్వాతి ,మౌనిక ,మీనా ప్రజ్ఞ ,శ్రీశైలం, అనిల్ శ్రీనివాస్ ,అమూల్యాలు పాల్గొన్నారు.

వేసవికాలం దృష్ట్యా కంట్రోల్ రూమ్ ఏర్పాటు.!

సిరిసిల్ల పట్టణ మున్సిపల్ వేసవికాలం దృష్ట్యా కంట్రోల్ రూమ్ ఏర్పాటు

సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తాగునీరు సమస్య లేకుండా అందించడం కోసం

ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు

సిరిసిల్ల టౌన్:( నేటిదాత్రి )

సిరిసిల్ల పట్టణంలోని ప్రజలందరికీ వచ్చే వేసవికాలం దృష్ట్యా, తాగునీరు సరఫరా కోసం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ గదిని ఏర్పాటు చేయడం జరిగినది. సిరిసిల్ల పట్టణ ప్రజలకు తాగునీరు సమస్య రాకుండా వార్డుల వాయిసుగా ఎలాంటి సమస్య లేకుండా ఉండడం కోసం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా టోల్ ఫ్రీ నెంబర్ 7893593330 సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు.

జన్మ జన్మలకు ఇలా సేవచేసే భాగ్యం కలుగాలి.!

మానవత్వం పరిమళించే యువ దంపతులకు హార్దిక శుభాకాంక్షలు

జన్మ జన్మలకు ఇలా సేవచేసే భాగ్యం కలుగాలి

ప్రజలకోసం ప్రతిస్పందించే మనుసున్న ప్రజా ప్రతినిధి

మన తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్

బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులకు శతమానం భవతి అని దీవెనలు అందించిన ప్రముఖులు

పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన గ్రామ ప్రజలు

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-

మానవత్వం పరిమళించే బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ యువ దంపతులకు పెళ్లి రోజు పురస్కరించుకొని సర్వత్ర హార్దిక శుభాకాంక్షలు తెలిపి అభినందించి ఆశీర్వదించారు. ఆది దంపతులైన వీరిద్దరూ జన్మ జన్మలకు ఇలా సేవచేసే భాగ్యం కలుగాలి అని దీవించారు. ప్రజల కోసం ప్రతిస్పందించే, పరితపించే మనుసున్న ప్రజా ప్రతినిధి మన తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ లు అని వేనోళ్ళ కొనియాడారు. బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులకు పెళ్లి రోజు సందర్భంగా శతమానం భవతి అని దీవెనలు ప్రముఖులు దీవెనలు అందించి ఆశీర్వదించారు. వివరాల్లోకి వెళ్లితే… మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామానికి చెందిన వ్యవసాయ ముద్దుబిడ్డ బుడ్డ రామయ్య బుడ్డ బాలవ్వ మనుమడు, బుడ్డ బాలయ్య పోచవ్వ దంపతుల కొడుకు బుడ్డ భాగ్యరాజ్ చందాయిపేట గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండి తనకు ఉన్న అనుభవంతో గ్రామంలో మంచిచెడులు తెలుసుకున్న భాగ్యరాజ్, సర్పంచ్ ఎన్నికల్లో ఆయన భార్య బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ 2019 వ సంవత్సరంలో గ్రామ పంచాయితీ సర్పంచ్ గా పోటీ చేయించి గ్రామ ప్రజలు గ్రామ ప్రజల ఆశీర్వాదంతో 951మెజార్టీతో ఘన విజయం సాధించారు. అప్పటినుంచి ప్రజాసేవలో ముందుండి గ్రామమలో నెలకొన్న సమస్యలపై అను నిత్యం అధికారులతో అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపించే బాధ్యత తనపై వేసుకున్నారు. నిరుపేదలకు అండగా నిలిచి అభాగ్యులకు ఆదుకున్న అపర చాణక్యుడు. గ్రామంలో నిరుపేదలుగా ఉన్న వారికి నేనున్నానంటూ ఏ ఆపద వచ్చిన ఇంటికి పెద్ద కొడుకు లాగా మనసున్న మారాజు లాగా ఆదుకునే మనస్తత్వం కలిగిన తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ అని చెప్పుకోవచ్చు. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెండ్లి లు అయితే ఆడపడుచుల కుటుంబానికి పుస్తె మట్టెలు తన వంతు సహాయంగా ఆర్థిక సాయం అందజేశారు. అంతే గాకుండా మరణించిన వారికీ ఆర్థిక సహయం చేసి అండగా నిలిచి ఆదుకున్న మాస్. గ్రామంలో నిరుపేద కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి దశదిన కర్మకు 50 కేజీల బియ్యం తో పాటు రెండు వేలు రూపాయల ఆర్థిక సాయం ఎందరికో అందజేసిన ఘనత భాగ్యరాజ్ దంపతులకు దక్కింది. ఎవరైనా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా తనకు తోచినంత సహాయం అందించేవారు. మెదక్ జిల్లా ఉత్తమ సర్పంచిగా అవార్డు అందుకొని ఉత్తమ సేవకునిగా నిలిచిన దాన గుణం కలిగిన దాన కర్ణుడు మన స్వర్ణలత భాగ్య రాజు. గ్రామ సర్పంచ్ గా ఐదు సంవత్సరాలు గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తించిన అధికారులు ప్రజలకు సేవ చేసిన బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ మెదక్ జిల్లాలోని ఉత్తమ సర్పంచిగా ప్రజల ఆశీర్వాదాలతో ఉత్తమ అవార్డు అందుకున్నారు. ప్రజల ఆశీర్వాదాలతోనే అభివృద్ధి పనులు చేశాడూ…. తన పై నమ్మకంతో సర్పంచిగా గెలిపించిన చందాయిపేట గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ మాట్లాడుతూ 13/3/2025 రోజున 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వివాహ వార్షికోత్సవ సందర్భంగా పెళ్లి రోజు శుభాాంక్షలు తెలిపిన గ్రామ ప్రజలకు అధికారులకు ధన్యవాదములు తెలిపారు. గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో ఇటువంటి పెళ్లి రోజులు ఇంకెన్నో జరుపుకోవాలని, నేను చేసిన సేవలను గ్రామ ప్రజలు గుర్తించి ఆశీర్వదించాలని , ఇకముందు జరగబోయే పనుల్లో ఉన్నత పదవులు సాధించాలని, అలాగే నాపై గ్రామ ప్రజల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులకు గ్రామ ప్రజలు, మహిళలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, యువకులు, యువజన సంఘాల నాయకులు, అధికారులు, అనాధికారులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులకు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని, ఇటువంటి పెళ్లి రోజులు ఇంకెన్నో జరుపుకోవాలని అక్షాసిస్తూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలే కాకుండా చెగుంట మండలం లోని పలు గ్రామాల్లో తోచిన ఆర్థిక సహాయం, బియ్యం, కిరాణ సామాను అందజేసి అండగా నిలిచిన స్వర్ణలత భాగ్యరాజు చేసిన సేవలకు అపూర్వ స్పందన లభించి యువ దంపతులను అభినందించి ఆశీర్వదించారు.

సిరిసిల్ల బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్న.!

సిరిసిల్ల బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

సిరిసిల్లబిజెపి బిజెపి కార్యకర్తల్లో జోష్

సిరిసిల్ల టౌన్:( నేటిదాత్రి )

సిరిసిల్ల కి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ * తేదీ:16-03-2025 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా * విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా నేడు సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు శ్రీ నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీ రెడ్డబోయిన గోపి మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ రాంప్రసాద్, పార్లమెంటు కో- కన్వీనర్ శ్రీ ఆడెపు రవీందర్, మరియు జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరి భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, మరియు రాజాసింగ్ మరియు సిరిసిల్ల బీజేవైఎం టౌన్ అధ్యక్షుడు వంగ అనిల్, మరియు సిరిసిల్ల ఓ బి సి టౌన్ అధ్యక్షుడు శ్రీ అంకారపు రాజు, సిరిసిల్ల ఎస్టి టౌన్ అధ్యక్షుడు మొగిలి రాజు మరియు సిరిసిల్ల టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీ వైశాలి మరియు బిజెపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version