అసెంబ్లీ ముట్టడిస్తారన్న ముందస్తు సమాచారంతో మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేసిన పోలీసులు
అక్రమ అరెస్టులను ఖండించిన చందుర్తి మండల మాజీ సర్పంచులు
కక్ష్య సాధింపుతో తమ బిల్లులను విడుదల చేయడం లేదు: జిల్లా అధ్యక్షుడు దుమ్మ అంజయ్య
చందుర్తి, నేటిధాత్రి:
తెలంగాణ అసెంబ్లీ ముట్టడిస్తారన్న కారణంతో జిల్లా తాజా మాజీ సర్పంచ్లను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. చందుర్తి మండలంలోని పలువురు మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ అధ్యక్షుడు దుమ్మ అంజయ్య మాట్లాడుతూ ప్రజా పాలనా అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష్య సాదింపు ధోరణితో మాజీ సర్పంచుల యొక్క సుమారు వేయి కోట్ల రూపాయలను విడుదల చేయకుండా అక్రమంగా అరెస్టులను చేపిస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. వారి వెంట సిరికొండ శ్రీనివాస్ తదితర మాజీ సర్పంచులు ఉన్నారు.