విద్యార్థులలో గ్రంథాలయ పఠనంపై అసక్తిని పెంచే శిక్షణ..

విద్యార్థులలో గ్రంథాలయ పఠనంపై అసక్తిని పెంచే శిక్షణ

మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలంలోని కేసముద్రం విలేజ్ ఉన్నత పాఠశాలలో 25 జూలై మరియు 26 జూలై తేదీలలో జడ్పీహెచ్ఎస్ కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ మరియు జడ్పీహెచ్ఎస్ కేసముద్రం స్టేషన్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులకు పాఠశాల గ్రంధాలయాలను ఏర్పాటు చేయడం మరియు గ్రంథాలయాల నిర్వహణ, పాఠశాలలో గ్రంథాలయ పఠన కార్యక్రమాలను నిర్వహించడం, విద్యార్థులలో పఠనంపై ఆసక్తిని కలిగించడం మొదలగు అంశాలపై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి, మరియు ఇనుగుర్తి మండల విద్యాశాఖాధికారి జంగా రూపారాణి, జడ్పీహెచ్ఎస్ కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చీకటి వెంకట్రాంనర్సయ్య, జెడ్ పి హెచ్ ఎస్ కేసముద్రం స్టేషన్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు, ఆర్పీలుగా ఎం సురేష్ నాయుడు, వి భాస్కరరావు, రాజ్ కుమార్, సి.ఆర్.పి.లు సుల్తానా, స్వాతి, సరిత, నాగవాణి పాల్గొన్నారు,

అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించిన.

అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ప్రాథమిక పాఠశాల న్యాల్కల్ మండల రేజింతల్ గ్రామంలో ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా అధ్యక్షతన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నూతనంగా 1 వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా ఉపాధ్యాయులు జ్యోతి, మానస, ఏ ఏ పి సి చైర్మన్ రామేశ్వరీ, మాజీ ఎంపీటీసీ నల్లవల్లి మల్లిక, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్న చిన్నారులు.

ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్న చిన్నారులు

నస్పూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలో చిన్న పిల్లలు అంతా కలిసి హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ప్రతి సంవత్సరం మార్చి నెలలో కామ దహనం తర్వాత వచ్చే హోలీ పండుగను చిన్నా పెద్ద అంతా కలిసి కులమత బేధాలు లేకుండా రంగురంగుల రంగులతో ఒకరిపై ఒకరు ప్రేమ ఆప్యాయతో చల్లుకుంటూ రంగులు పూస్తూ కేరింతలతో జరుపుకునే గొప్ప పండుగ హోలీ అలాగే పిల్లలతో పెద్దలు అందరూ కూడా సంతోషంగా ఈ హోలీని జరుపుకున్నారు.

విద్యుత్ అధికారుల అత్యుత్సాహం.

విద్యుత్ అధికారుల అత్యుత్సాహం..

ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించకుంటే సరఫరా బంద్..

రామయంపేట మార్చి 12 నేటి ధాత్రి (మెదక్)

విద్యుత్ శాఖ అధికారులు పేదవారిపై తమ అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. రామయంపేట పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటున్న రాజు అనే ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది. కేవలం 500 రూపాయలు బిల్లు చెల్లించాల్సి ఉండగా అధికారులు తక్షణమే చెల్లించాలని ఒత్తిడి జరిగింది. తనకు కొంత సమయం కావాలని ఎంత ప్రాధేయపడిన ఆ ఏరియా కు సంబంధించిన స్థానిక లైన్మెన్ వినిపించుకోకపోగా తక్షణమే కరెంట్ కట్ చేసి వెళ్లడం జరిగింది. ఒక్కొక్కరు నెలల తరబడి చెల్లించకుండా వారిని కనీసం ప్రశ్నించడం లేదని నిరుపేద అయిన తన పట్ల కావాలని ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. విద్యుత్ అధికారులు కూడా వేళల్లో ఉన్న కరెంట్ బిల్లులు వసూలు చేయడంలో ఈ ఉత్సాహం చూపడం లేదనీ బాధితుడు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.పలుకుబడి ఉన్న వ్యక్తులు ఏప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటున్నారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయమై విద్యుత్ షాక ఏఈ తిరుపతి రెడ్డి ని అడగగా తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని బకాయిలు ఎక్కడ కూడా లేకుండా వసూలు చేస్తున్నామని తెలిపారు.

ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్న.

* ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్న తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్*

జహీరాబాద్. నేతి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేధపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మహిళా దినోత్సవం సందర్బంగా స్థానిక అంగన్వాడీ కేంద్రం లో మహిళా దినోత్సవ కార్యక్రమం లో పాల్గొని. ఇసందర్బంగ మేధాపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మహిళలని ఉద్దేశించి మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు మహిళలను గౌరవించాలని. ప్రతి ఆడబిడ్డ లో తన తల్లిగా చెల్లిగా అక్కగా చూడాలని. స్త్రీ లేనిదే జననం లేదు అని.ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించి మహిళా హక్కుల పోరాటాలకు స్పూర్తినింపిన మహిళా దినోత్సవం అని అయన కొనియాడుతూ స్పూర్తిని ఎత్తిపడుతూ హక్కులను సాధించుకోవాలని తెలియజేస్తూ నారీ లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ అన్నారు.

స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు.

స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు

జహీరాబాద్:నేటి ధాత్రి

ఝరాసంగం మండలం లోని క్రిష్ణాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం నాడు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ సర్పంచ్ శ్రీ సూర్యప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా, ఇష్టంతో చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. విద్యార్థులు కనబర్చిన ప్రతభను కొనియాడారు. ప్రధానోపాధ్యాయులు ధర్ము రాథోడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పర్చుకుని ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎచ్.యం. గా శాంసన్, ఎంఈఓ గా జెస్సిక, ఉపాధ్యాయులుగా దీపిక, అర్చన, ఎస్తర్ రాణి, వెన్నెల, సంధ్య, అరవింద్, సూరజ్ మంచి ప్రతిభ కనబర్చినారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బుర పరిచాయి. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్టార్ లిన్, సురేష్, నాగమణి గ్రామ పెద్దలు, అంగన్వాడీ కార్యకర్తలు, అంబమ్మ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version