రిలే నిరవధిక దీక్షలు…
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత పార్లమెంటులో చేసేంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్ నిలిపివేయాలని రిలే నిరవధిక దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కే సముద్రం మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు వల్లందాస్ మహేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి మామిళ్ల ప్రేమ్ కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్ము యాకయ్యమాదిగ, దుర్గం ఆకాష్ మాదిగ, గుజ్జునూరి నవీన్ మాదిగ, కొమ్ము రాధా, కొమ్ము బొందమ్మ, పందుల అనసూర్య తదితరులు పాల్గొన్నారు.