రాష్ట్ర స్థాయికి తూప్రాన్ గురుకుల విద్యార్థి రాయికోటి వివేక్ ఎంపిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
తూప్రాన్ గురుకుల పాఠశాల కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి రాయికోటి వివేక్ ఇటీవల కొండాపూర్ మండలం గిర్మాపూర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహించబడిన 69వ SGF ఎంపిక శిబిరంలో పాల్గొని వాలీబాల్ ఆటలో చక్కని ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది. విద్యార్థి ఝరాసంగం గ్రామానికి చెందిన బల్ రాజ్ కుమారుడు రాయికోటి వివేక్ ఎంపికయ్యారు తనకి వెన్నంటే ఉండి శిక్షణ ఇచ్చినవ్యాయామ ఉపాధ్యాయులు కళాశాల ప్రిన్సిపాల్ సుహాసిని ఉపాధ్యాయ బృందమంతా అభినందించిశుభాకాంక్షలు తెలిపారు.