రబ్బి జాతీయ స్థాయి పోటీలకు కస్తూరిబా పాఠశాల విద్యార్థి.
#రాష్ట్రస్థాయి పోటీలో రెండవ స్థానం గెలుపొందడం హర్షనీయం.
#స్పెషల్ ఆఫీసర్ సునీత.
నల్లబెల్లి నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని బానోతు అన్విత మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో జరిగిన రాష్ట్రస్థాయి రబ్బి పోటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి జట్టును విజయం దిశగా తీసుకో పోవడంతో పాటు అన్విత రెండవ స్థానంలో నిలవడం అభినందనీయం. అదేవిధంగా ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొని విజయం సాధించి తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కస్తూరిబా గాంధీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీత అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఈ టి సుజాత, ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు అభినందించారు.
