వ్యాసరచన పోటీలో సత్తాచాటిన సరస్వతి విద్యార్థి
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ విద్యార్థుల్లో కృతజ్ఞత, సమానత్వ భావనలు పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రజ్ఞా వికాస్, వికాస తరంగిణి ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం రేకుర్తి కోటా జూనియర్ కాలేజీలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థి సత్తా చాటినట్లు స్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాసరచన పోటీలో పదో తరగతి విద్యార్థి నిట్టు సంజన ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా స్కూల్ కరస్పాండెంట్, కో కరస్పాండెంట్ ఉప్పుల సత్యం, సాంఘిక శాస్త్రం ఉపాద్యాయులు సంపత్ విద్యార్థినిని అభినందించారు.
