కార్పొరేట్ స్థాయిలో విద్య ను అందిస్తున్న ప్రభుత్వ కళాశాల.
ఫిజిక్స్ వాల, క్లాట్ వంటి ప్రోగ్రాములు.
ప్రిన్సిపాల్ శ్రీదేవి.
చిట్యాల, నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం రోజున కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి అధ్యక్షతన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటే ఏలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలిపారు, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీలో ఉచితంగా ఫీజు లేకుండా చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, అలాగే ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా స్పెషల్ క్లాస్లులు మన నిర్వహించడం జరుగుతోంది అని, విద్యార్థులకు ఐఐటి , జె ఈ
ఈ, ఎంసెట్ ,స్థాయిలలో కూడా విద్యాబోధన జరుగుతుందని కావున తల్లిదండ్రులు ప్రభుత్వ కాలేజీ లపై చిన్న చూపు చూడకుండా పిల్లలను ప్రతిరోజు కాలేజీకి రెగ్యులర్ గా వచ్చేటట్లు చూడాలని, ఈ సంవత్సరము నుంచి ఎంపీసీ వాళ్లకు ‘ఫిజిక్స్ వాల’ ప్రోగ్రామును, కామర్స్ వాళ్లకు క్లా ట్ వంటి ప్రోగ్రాంను విద్యార్థులకు అందించడం జరుగుతుందని అన్నారు, దాతల సహకారంతో మధ్యాహ్న భోజన ప్రోగ్రామ్ కూడా గతంలో అందించడం జరిగిందని దాతల సహకారం ఉంటే మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభిస్తామని, కావున విద్యార్థులకు తల్లిదండ్రులుగా మీ బాధ్యత గా విద్యార్థులను ప్రతిరోజు క్రమం తప్పకుండా కాలేజీకి పంపించేలా ఏర్పాటు చేయాలని కోరినారు, జిల్లా కలెక్టర్ కూడా కళాశాలకు మరమ్మత్తురు పనుల కోసం 6 లక్షల రూపాయల ఫండ్ ను ఆట వస్తువుల కోసం నిధులు మంజూరు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు, ఈ సంవత్సరం విద్యార్థులకు యూనిఫామ్ కూడా అందించడం జరుగుతుందని, జిల్లాలోనే ఉత్తీర్ణతలో మొదటి స్థానం సాధించిందని సందర్భంగా గుర్తు చేశారు, విద్యార్థుల హాజరు శాతం కోసం ప్రభుత్వం ఎఫ్ఆర్ సి విధానాన్ని కూడా ప్రవేశపెట్టిందని మన కళాశాలలో చదివిన 13 మంది విద్యార్థులు నేడు తెలంగాణలోని మల్లారెడ్డి జేఎన్టీయూ, కేఎంఐటి, జి ఎన్ ఐ టి, కి ట్స్ లాంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరు సీట్లు సాధించారని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కళాశాల లెక్చరర్స్ యుగేందర్ బాల కృష్ణ ,కర్నాజి ,సురేష్, ఉమాదేవి ,ఉమా, సురేష్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.