మ్యానిపెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని నిరసన ప్రదర్శన…

మ్యానిపెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని నిరసన ప్రదర్శన

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర శనివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే మ్యానిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారం చేపట్టి 18 నెలలు అవుతున్న ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం అంటే కేవలం బీసీ సమాజాన్ని మభ్యపెట్టడం అవుతుంది.ఇప్పటికైనా ఈ అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.అమలు చేయవలసిన
బీసీ అంశాలు..మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ సివిల్ కన్స్ ట్రాక్షన్ మెంటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం,రిజర్వేషన్లు కల్పించాలి.చిరు వ్యాపారులకు విద్యార్థుల ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచి కత్తులేని వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి.బీసీ కార్పొరేషన్లు అలాగే ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలి.అన్ని జిల్లా కేంద్రాలలో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్ ప్రెస్ క్లబ్ స్టడీ సర్కిల్ లైబ్రరీల క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు ఈ ఐక్యత భవనాలలోనే బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాల ఏర్పాటు చేస్తామని అనేక అంశాలను మానిఫెస్టోలో పెట్టి బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించడం అంటే బీసీ సమాజాన్ని మభ్యపెట్టడమే అవుతుంది ఇప్పటికైనా ఈ అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.లేనిపక్షంలో ఈ అంశాలను బీసీ సమాజం దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందట దోషిగానిలబెడతామనిహెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్
రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకన్న,జిల్లా కార్యదర్శి శాఖ పురం భీమసేన్,ఏదునూరు రమేష్,కీర్తి బిక్షపతి,చంద్రగిరి చంద్రమౌళి,రంగు అశోక్,గుండా రాజమల్లు,వేముల అశోక్,ఆరెందుల రాజేశం, అంకం సతీష్,జక్కం పూర్ణచందర్,తదితరులు నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన..

తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన చేపట్టిన బీసీ హక్కుల పోరాట సమితి

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్ లో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర శనివారం రోజున జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.నాయకులు మాట్లాడుతూ.. పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నుండి 32 పార్టీలు బిసి రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయి.అలాగే దేశంలోని తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ బీసీ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రవేశ పెట్టలేదో బీసీ సమాజానికి చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న బీసీలకు ప్రజాస్వామ్య వాటా దక్కకపోవడం అత్యంత బాధాకరమని,దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే దేశాన్ని రాష్ట్రాన్ని 78 సంవత్సరాలుగా పాలిస్తున్నారని,దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగా మారిందని, ఇంకెంతకాలం బీసీలకు అన్యాయం చేస్తారని,ఇదేనా ప్రజాస్వామ్యం,ఇదేనా సామాజిక న్యాయమని ప్రశ్నిస్తున్నామన్నారు.ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా అని రాజ్యాంగం చెప్తుంటే ఈ అగ్రకులాలు బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందనీ,ఇప్పటికైనా బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని,లేని పక్షంలో పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్,కర్రె లచ్చన్న సీనియర్ రాష్ట్ర నాయకులు,గజెలి వెంకటయ్య జిల్లా కార్యదర్శి,శాఖపురి భీమ్సేన్,నాయకులు అంకం సతీష్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RDO కార్యాలయం ముందు SFI, DYFI ధర్నా..

RDO కార్యాలయం ముందు SFI, DYFI ధర్నా

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో
అదనపు తరగతి గదులు నిర్మించాలి, ఇతర సమస్యలు పరిష్కరించాలి.గదులు లేక అడ్మిషన్స్ తీసుకొని పరిస్థితి నెలకొంది.SFI, DYFI ల ఆధ్వర్యంలో RDO కార్యాలయం ముందు ధర్నా, వినతి..

రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన.

రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన బిజెపి నాయకులు
కొద్దిపాటి వర్షానికే గుంతల మయమైన కొత్త పెల్లి భట్టుపల్లి రోడ్డు
నెలలు గడుస్తున్న పూర్తికాని రోడ్డు పనులు
కంకరపై ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

నేటి ధాత్రి అయినవోలు :-

వర్ధన్నపేట నియోజకవర్గంలో రోడ్డు విస్తరణలో భాగంగా మంజూరైన కొత్తపెళ్లి బట్టుపల్లి రోడ్డు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత ఆరు నెలల క్రితం రోడ్డు వెడల్పు లో భాగంగా కంకర పోసి వదిలేసిన అధికారులు ఇప్పటికీ తారు రోడ్డు పనులు పూర్తి చేయలేదని తద్వారా చిన్న వర్షానికి రోడ్డుపై వర్షపు నీరు నిలిచి గుంతలు ఏర్పడి ప్రయాణికులు ప్రమాదాల గురవుతున్నారని బిజెపి నాయకులు ఆరోపించారు. బుధవారం అయినవోలు భాజపా మండల పార్టీ అధ్యక్షుడు మాదాస్ ప్రవీణ్ ఆధ్వర్యంలో రోడ్డుపై నిలిచిన బురద నీటిలో వరి నాట్లు వేయడం ద్వారా నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్చార్జి కోట కిరణ్, పోలింగ్ బూత్ అధ్యక్షులు కట్కూరి రమేష్ , మహేష్, భరత్, శివమణి తదితరులు పాల్గొన్నారు.

తీన్మార్ మల్లన్న పై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన.

తీన్మార్ మల్లన్న పై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద మొన్న తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని ఖండిస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈసందర్భంగా బీసీ నాయకులు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న అనుచిత వాక్యాలు చేశాడు.అని చెప్పి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేయడాన్ని బీసీ సమాజం పై దాడిగా భావిస్తున్నాం అని అన్నారు.ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం మన సంస్కృతి కాదు మల్లన్న పై దాడికి ఉసిగొలిపిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే మా పప్పులు ఏమి ఉడకవని అన్న ఉద్దేశంతో దాడికి పాల్పడిందని భావిస్తున్నట్లు తెలిపారు.ఇలాంటి ఘటన పునరావృత్తం అయితే కలవకుంట్ల కవిత బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు అని హెచ్చరిస్తున్నాం.తీన్మార్ మల్లన్నకు బీసీ సమాజం అండగా నిలుస్తుందని ఈసందర్భంగా తెలియజేస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, తుల మధుసూదన్ రావు, శాఖ పురం భీమ్సేన్,గజ్జెల్లి వెంకన్న,చంద్రగిరి చంద్రమౌళి, ఆరెంధుల రాజేశం,వేముల అశోక్,శాఖ పురం కోటేశ్వరరావు,కీర్తి బిక్షపతి, అంకం సతీష్,నగునూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

లేబర్ కోడ్ లను రద్దు చేయాలని మెడికల్ .!

లేబర్ కోడ్ లను రద్దు చేయాలని మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల నిరసన.

చిట్యాల, నేటిధాత్రి :

దేశ వ్యాప్తగా వామపక్షాల సమ్మెపిలుపు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయడంతో పాటు, ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ పర్మినెంట్ చేయాలి, ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కనీస వేతనం 26,000 తక్షణమే చెల్లించాలని, ఏజెన్సీ వ్వవస్థను రద్దు పరచాలి కార్పొరేష ఏర్పాటు చెయ్యాలని పలు డిమాండ్లతో ఆల్ రికగ్నైజ్డ్ యూనియన్సు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగముగా చిట్యాల హాస్పిటల్ ల్లో మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమం చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ &హెల్త్ ఔట్సోరింగ్ కాంట్రాక్టు రాష్ట్ర ఆర్గనైసింగ్ సెక్రటరీ కట్కూరి నరేందర్ రాష్ట్ర నాయకులు కిషోర్. ఉద్యోగస్థులు రమణ. స్వామి. రఘు. సంధ్య. శ్రీకాంత్. మహేందర్. కళ్యాణ్. రాజేష్ .కుమార్. భిక్షపతి. శంకర్. శశి కుమార్. శారదా. కోమల.తదితరులు పాల్గొన్నారు.

విలేకరిపై దాడి అనైతికం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన.

విలేకరిపై దాడి అనైతికం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే పత్రిక విలేకరులపై దాడి చేయడం అనైతికమైన చర్య అని మండల జర్నలిస్టులు, విద్యావంతుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కుమారస్వామి లు అన్నారు. తాడ్వాయి మండల ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్ రెడ్డి పై మంగళవారం జరిగిన దాడులు నిరసిస్తూ మండల కేంద్రంలోనీ చౌరస్తాలో బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో ఒక భాగమని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే పత్రిక విలేకరులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం సరికాదన్నారు. సమాజ హితం కోసం విలేకరులు స్వేచ్ఛపూరిత వాతావరణంలో పని చేసే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు యాదగిరి, శ్రీనివాస్, రవి, రామకృష్ణ, కుమార్, కిషోర్, మురళి, వెంకట్, రమేష్, విష్ణు, బాబు, శంకర్, ఎల్లయ్య, తదితరులు ఉన్నారు.

నేడు బిజెపి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా నిరసన ర్యాలీ.

నేడు బిజెపి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా నిరసన ర్యాలీ

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు యాభై ఏళ్ల క్రితం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా పరిగణిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన తన్నీరు ప్రభాకర్ రావు, గాల్ రెడ్డిలను సన్మానించారు. ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడాతూ..
యాభై ఏళ్ల క్రితం ఇదే రోజున దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని హత్య చేశారని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ఈ నిరసన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మౌన ప్రదర్శన, నిరసన ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. ఇందిరాగాంధీ 1975 లో అధికారం కొరకు, అహంకారంతో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. ఈ ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలను అణిచివేస్తూ ఒక కుటుంబం కోసం చేసిన పని అని ఆయన వివరించారు. ఎమర్జెన్సీ భారత ప్రజలు మరచిపోలేని చీకటి రోజు అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అధికారం, అహంకారం కొరకు ఎమర్జెన్సీని తీసుకురావడం వల్ల దేశానికి నష్టం జరిగిందన్నారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ బిజెపి అగ్రనాయకులు అద్వానీ, వాజపేయి, మోడీ లు నినదిస్తే అణిచివేసేందుకు కుట్రలు పన్నారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ రోజును ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన దినోత్సవమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు నిరసన

కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు నిరసన

కొమ్మినేని శ్రీనివాస్ రిపోర్టర్ అరెస్టుకు నిరసన

భూపాలపల్లి నేటిధాత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే విధంగా సాక్షి సీనియర్ రిపోర్టర్
కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్ ను నిరసిస్తూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జిలు ధరించి ర్యాలీ నిర్వహించి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ లో కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి కి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన జర్నలిస్టులు. సాక్షి ఛానల్ పత్రిక కార్యాలయాలపై దాడులను ఖండిస్తున్నామని అక్రమంగా అరెస్టు చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులు.

కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా.

కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగు బిల్లులకై,వినతి పత్రం అందజేత.ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన రంగం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సంబంధించి దాదాపు 5 నుంచి 6 నెలల మే స్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు, అలాగే గౌరవ వేతనం దాదాపు నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్నవి. దీనివల్ల కార్మికుల ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొద్ది రోజుల్లో స్కూలు తిరిగి ప్రారంభం అవుతున్న సందర్భంగా వంట చేయడానికి చేతులు డబ్బులు లేనందున విద్యార్థులకు భోజనాలు పెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రభుత్వం గౌరవ వేతనం 10000, రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి 15 నెలలు పూర్తికావస్తున్న కూడా ఎక్కడ కూడా అమలుకు నోచుకున్న పరిస్థితి లేదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గౌరవ వేతనం 2000, కూడా దాదాపు నాలుగు నెలల నుంచి కార్మికులకు ఇవ్వడం లేదు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సి.ఐ.టి.యు పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.కావున కార్మికులకు రావాల్సిన 5 నెలల పెండింగ్ మెస్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు వెంటనే అందించి, గౌరవ వేతనం 10000 ,రూపాయలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సి.ఐ.టి.యు అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి, మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్, మరియు కార్మికులు వసంత, సత్తవ్వ, పద్మ, ఎల్లవ్వ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

పుష్కర సమయంలో ఆటో డ్రైవర్ల నిరసన.

పుష్కర సమయంలో ఆటో డ్రైవర్ల నిరసన.

గోదావరి వద్ద ప్రైవేట్ వాహనాలు ఏర్పాటు చేసి మా పుట్ట కొడుతున్నారు.

వెంటనే స్కూల్ బస్సులను నిలిపివేయాలి.

పెద్ద మొత్తంలో ఆటో డ్రైవర్ల నిరసన. రోడ్డుపై బైఠాయి.

మహదేవ్పూర్ -నేటి ధాత్రి;

 

కాలేశ్వరం బస్టాండ్ వద్ద స్థానిక ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు బస్టాండ్ నుండి గోదావరి వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉండడంతో స్థానిక ఆటోల్లో భక్తులకు తరలించడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా భక్తులను ఆటోలో తరలించడంతో స్థానిక ఆటో డ్రైవర్లకు ఉపాధి కలుగుతుంది. కానీ పుష్కరాల సందర్భంగా మండలానికి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలల వాహనాలను భక్తుల కు గోదావరి వద్ద తరలించుటకు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఉపాధి కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తక్షణమే స్కూల్ బస్సులను తీసివేయాలంటూ ఆటో డ్రైవర్లు సుమారు రెండు గంటల పాటు ధర్నా కొనసాగించడం జరిగింది. పోలీసుల జోక్యంతో ఆటో డ్రైవర్లు ధర్నా ను విరమించినట్లు తెలుస్తుంది.

మే 24న జహీరాబాద్‌లో నిరసన సమావేశం.!

వక్ఫ్ సవరణ బిల్లు 2025 కు వ్యతిరేకంగా మే 24న జహీరాబాద్‌లో నిరసన సమావేశం.

◆ ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాసీ కాను మరియు వక్ఫ్ బచా ప్రచారం, ముస్లిం పర్సనల్ లా బోర్డు జహీరాబాద్ సమాచారం ప్రకారం, వక్ఫ్ సవరణ బిల్లు 2025.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు వ్యతిరేకంగా వక్ఫ్ బచా దస్తూర్ బచా ప్రచారం యొక్క కేంద్ర నిరసన అఖిల పక్ష సాధారణ సమావేశం మే 24వ తేదీ శనివారం అసర్ ప్రార్థనల తర్వాత రాత్రి 10 గంటల వరకు ఈద్గా మైదాన్ జహీరాబాద్‌లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలో అన్ని ఆలోచనా విధానాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు మరియు ఇతర మతాల నాయకులు ప్రసంగిస్తారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యవస్థాపక కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కూడా పాల్గొంటారు. ఈ నల్లజాతి చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించే నిరసన సమావేశంలో అన్ని ఇస్లామిక్ సోదరులు తమ మతం లేదా మతంతో సంబంధం లేకుండా పాల్గొని, తమ ఐక్యత, జాతీయ సంఘీభావం, మతపరమైన గర్వం మరియు సజీవ దేశంగా నిరూపించుకోవాలని మరియు ఈ వివాదాస్పద నల్లజాతి చట్టానికి వ్యతిరేకంగా తమ సమిష్టి నిరసనను నమోదు చేయాలని అభ్యర్థించారు.

యజమానుల వైఖరి నిరసిస్తూ వార్పిన్,.!

యజమానుల వైఖరి నిరసిస్తూ వార్పిన్, పై పని కార్మికుల సమ్మె

సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్
కేకే మహేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత కార్మికులకు
ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్న మహిళా సంఘాల చీరలకు కార్మికులకు,మెరుగైన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం మీటరుకు రెండు రూపాయలు యజమానులకు పెంచిన కూడా,సరియైన వేతనం ఇవ్వకుండా తగ్గించాలని చూస్తున్నా యజమానులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిని
రేపు పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం వద్ద
ధర్నా వై పని,పవర్లూమ్ కార్మికులు పాల్గొని ధర్నాలు విజయవంతం చేయాలి అని పిలుపునివ్వడం జరిగినది.
ఈరోజు అమృత శుక్ల కార్మిక భవనం వద్ద వార్పిన్ కార్మికుల జనరల్ సమావేశం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ పవర్లూమ్,వార్పిన్, వై పని కార్మికులు,15 రోజుల క్రితం మహిళా సంఘాల చీరలకు కూలి పెంచాలని సమ్మె చేసిన సందర్భంగా, చేనేత జోలి శాఖ అధికారులు గత బతుకమ్మ చీరలకు ఏ విధంగా అయితే కూలి వచ్చిందో అంతకంటే మెరుగైన వేతనం కార్మికులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి సమ్మె విరమించడం జరిగింది.

Warpin, Pyi workers

వారు హామీ ఇచ్చిన ప్రకారంగా కార్మికుల కూలి పెంచడం కోసం మీటరుకు రెండు రూపాయలు బట్ట ధర పెంచడం జరిగింది 32 రూపాయలు ఉన్నది 34 రూపాయలు పెంచడం జరిగింది.కార్మికుల కోసం రెండు రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన కూడా కార్మికుల శ్రమకు తగ్గ వేతనం ఇచ్చేందుకు యజమానులు మనసు రావడం లేదు కార్మికులు ప్రభుత్వం నుంచి పోరాడి సాధించినటువంటి కూలీ నుండి కూడా. యజమానులు లాభం పొందాలని చూస్తున్నారు
బతుకమ్మ చీరల కూలి ఇంతకుముందు పవర్ లోన్ కార్మికులకు 5.25 పైసలు ఒక మీటర్ కు కార్మికునికి కూలి ఉంటే ఇప్పుడు ఐదు రూపాయలు ఇస్తామని అంటున్నారు .వార్పిన్. వై పని కార్మికునికి గత బతుకమ్మ చీరల పనికంటే.విపరీతమైన పని భారం పెరిగింది చిన్నకోములు వస్తున్నాయి పోగులు పెరిగినాయి అయినా కూడా పెరిగిన పనికి ధర ఇవ్వడానికి. యజమానులు ఒప్పుకోవడం లేదు.. చేనేత జౌళి శాఖ అధికారులు కూలి నిర్ణయం చేయకపోవడం.యజమానులకు కూలి నిర్ణయించాలని బాధ్యతలు అప్పజెప్పడం వలన ఈ పరిస్థితి రావడం జరిగినది.అధికారుల యజమానుల మధ్య.కార్మికులు నష్టపోవడం జరుగుతుంది.అధికారులు వెంటనే జోక్యం చేసుకొని కూలి సమస్య పరిష్కరించాలి లేని ఎడల
పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు
సమావేశంలో సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి
కోడం రమణ,అధ్యక్షులు సిరిమల్ల సత్యం, ఉడుత రవి,మచ్చ వేణు,బుట్ల వెంకటేశం, దోమల రమేష్ ఐరన్ ప్రవీణ్,సామల శీను తదితరులు పాల్గొన్నారు.

పహల్గాం టెర్రరిస్టుల దాడికి నిరసనగా జిల్లా కలెక్టర్.!

పహల్గాం టెర్రరిస్టుల దాడికి నిరసనగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగినది.
పహాల్గంలోని టెర్రరిస్టులు అమాయక హిందువులను కాల్చి చంపడంలో పాకిస్తాన్ హస్తం ఉందని భారత దేశంలో ఉన్న పాకిస్థానీయులందరినీ వెంటనే బహిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నేడు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా

BJP district president

 

అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీ సందీప్ కుమార్ ఝా కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు శ్రీ దుమాల శ్రీకాంత్,జిల్లా కార్యదర్శి శ్రీ గొప్పాడి సురేందర్ రావు, ఒబిసి మోర్చా అధ్యక్షుడు శ్రీ నంద్యాడపు వెంకటేష్, మరియు మాజీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు శ్రీ పొన్నాల తిరుపతి రెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీ నాగుల శ్రీనివాస్ మరియు రాష్ట్ర పదాధికారులు జిల్లా పదాధికారులు మరియు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని.

వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని

బీ ఆర్ ఎస్ అధ్యర్యములో రైతులు రాస్తా రోకో

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యర్యములో రైతులు వనపర్తి లో రాస్తా రోకో చేశారు రైతులకు అండగా ఉంటామని బి.ఆర్.ఎస్ నాయకులు రైతులకు అండగా ఉంటామని చెప్పారు.
రాత్రి వనపర్తి జిల్లా లో కురిసిన వర్షాలకు తడిసిన వడ్లను మార్కెట్ యార్డ్ లో పరిశీలించి ప్రభుత్వం ధాన్యాని కొనుగోలు చేసేవరకు పోరాడుతామని బి.ఆర్.ఎస్ నాయకులు రైతుల కు ధైర్యం చెప్పారు జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,పి.రమేష్ గౌడ్,మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,పి.ఏ.సి.ఎస్ అధ్యక్షులు వెంకట్రావ్,రఘువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజుల క్రితం వచ్చిన వడ్లను సంచులు లేవని,ట్రాస్ఫోర్ట్ లేదని కొనుగోళ్లు చేయకపోవడం వడ్లు వర్షాల వల్ల నీటి పాలు అయినాయని ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు
ఈ యాసంగిలో 75లక్షల బస్తాలు మార్కెట్ యార్డ్ కు వస్తాయని అంచనా ఉన్నా పర్యవేక్షణ లేక రైతులను ప్రభుత్వం నట్టేట మంచిదని విమర్శించారు.
రైతులతో కలసి దాదాపు గంటసేపు రాస్తారోకో చేసి వాహనాలను స్తంభింపజేసి నిరసన తెలిపారు.రాస్తా రోకో దగ్గిరి కి వచ్చిన తహసీల్దార్ తడసిన వడ్లను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,భానుప్రకాష్ రావు,మహేశ్వర్ రెడ్డి,ధర్మా నాయక్,నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్, గులాం ఖాదర్ ఖాన్, సూర్యవంశం.గిరి,ఇమ్రాన్, జోహెబ్ హుస్సేన్ సునీల్ వాల్మీకి,చిట్యాల రాము బాబు నాయక్,పాషా,నారాయణ నాయక్,రైతులు పాల్గొన్నారు.

నిరసనగా రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతం..

పహల్గామ్ దాడికి నిరసనగా రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతం..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతంగా కొసాగింది. ఈ బందులో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని తమ దుకాణాలను మూసివేసి సంఘీభావం ప్రకటించారు. అమాయకులైన పర్యాటకులను ముష్కరులు లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడడం హేయనీయమైన చర్య అని అందుకే స్వచ్ఛందంగా బందు పాటిస్తున్నామని పలువురు వ్యాపారస్తులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కోర్టు సిబ్బంది న్యాయవాదులు ఉగ్రవాదుల.!

కోర్టు సిబ్బంది న్యాయవాదులు ఉగ్రవాదుల దాడి కి నిరసన గా మౌనం

చేర్యాల నేటిధాత్రి

చేర్యాల పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్,సిబ్బంది న్యాయవాదులు 22-04-2025 రోజున జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ వద్ద మన భారత విహార యత్రికులపై పాకిస్తానీ ఉగ్రవాదులు దాడి చేసి కాల్పులు జరిపి అమాయక భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఇట్టి దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టులలో రెండు నిముషాలు మౌనం పాటించాలని గౌరవనీయులైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి ఆదేశాల ననుసరించి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, చేర్యాల యందు కోర్టు సిబ్బంది మరియి న్యాయవాదులు రెండు నిముషాలు మౌనం పాటించి ప్రాణాలు కోల్పోయిన మన భారతీయుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చేర్యాల కోర్టు సూపరిండెంట్ సుధాకర్ కోర్ట్ సిబ్బంది మరియు చేర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరెల్లి వీరమల్లయ్య మరియు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు

జేఏసీ ఆధ్వర్యంలో జిఎం ఆఫీస్ ముందు.!

జేఏసీ ఆధ్వర్యంలో జిఎం ఆఫీస్ ముందు కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా

మందమర్రి నేటి ధాత్రి

కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో జి ఎం ఆఫీస్ మరియు సివిల్ ఆఫీస్ ముందు ధర్నా మెమోరం ఇవ్వడం జరిగింది
సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల కూలిండియా వేతనాలు ఇతర హక్కుల సౌకర్యాలు అమలుపరచడం గురించి
సింగరేణి సంస్థలో అన్ని విభాగాలలో సుమారు 35,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఔట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు కాంటాక్ట్ కార్మికులకు చట్టబద్ధమైన వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు చట్టబద్ధమైన హక్కులను సౌకర్యాలను అమలు చేయకుండా ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయకపోవడం వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సింగరేణి యాజమాన్యం వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం జెవిసిసిఐ నిర్ణయించిన హై పవర్ కమిటీ వేతనాలను 2013 నుండి అమలు చేయవలసి ఉండగా సింగరేణి సంస్థ అమలు చేయడం లేదు కూల్ ఇండియా పరిధిలో కొన్ని సంస్థలు జేబీసీసీ నిర్ణయించిన హైపర్ కమిటీ వేతనాలను అమలు చేస్తున్నప్పటికీ లాభాలతో నడుస్తున్న సింగరేణిలో కుంటి సాకులు చూపి అమలు చేయకపోవడం అన్యాయం కాంట్రాక్ట్ కార్మికులుగా

GM office

పనిచేస్తున్న వారు దళిత గిరిజన మైనార్టీ నిరుపేద కాంట్రాక్ట్ కార్మికులు వారి శ్రమకు తగ్గ వేతనం లభించకపోవడంతో లక్షలాది రూపాయల కష్టార్జితం కోల్పోయి ఇబ్బందులను అనుభవిస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆదేశాలున్నప్పటికీ అందుకు కూడా సింగరేణి యాజమాన్యం అమలు చేయడం లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినప్పటికీ సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచడానికి పూనుకొనలేదు ఈ మేడే సందర్భంగా సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను చట్టబద్ధహక్కులను తక్షణమే అమలు చేయాలని కోరుచున్నాము ఇట్లు జేఏసీ సంఘాల ప్రతినిధులు ఎండి జాఫర్ ఐ ఎఫ్ టి యు పి.మహేశ్వరి ఆర్ అజయ్ ఎస్ కనకయ్య ఎస్ భూమయ్య వెంకట స్వామి గణేష్ తదితరులతోపాటు టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు మణిరం సింగ్ ఎండి సుల్తాన్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
జిఎం ఆఫీస్ లో పీఎం సివిల్ ఆఫీసులో డివైజిఎం రాములు మెమోరండం ఇవ్వడం జరిగింది

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 30న.!

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 30న జరిగే నిరసనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ముఫ్తీ మౌలానా అబ్దుల్ సబూర్ ఖాస్మీ అధ్యక్షతన జహీరాబాద్‌లోని ఇస్లామిక్ సెంటర్ లతీఫ్ రోడ్‌లో విలేకరుల సమావేశం జరిగింది. స్థానిక జమాతే-ఇ-ఇస్లామీకి చెందిన మౌలానా అతిక్ అహ్మద్ ఖాస్మీ, ముఫ్తీ నజీర్ అహ్మద్ హసమి, ముఫ్తీ ఉబైద్-ఉర్-రెహ్మాన్, ముహమ్మద్ నజీముద్దీన్ ఘౌరి, అమీర్ సంయుక్తంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్వహించిన నిరసన కార్యక్రమం ప్రకారం, ఏప్రిల్ 30 బుధవారం రాత్రి 9 గంటల నుండి రాత్రి 9:15 గంటల వరకు, అంటే 15 నిమిషాల పాటు “బాతి గుల్ ప్రచారం” కింద ముస్లింలందరూ తమ ఇళ్ళు, దుకాణాలు, కర్మాగారాలు మరియు ఇతర వ్యాపార సంస్థలలో లైట్లు ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన ద్వారా, కేంద్ర ప్రభుత్వ వక్ఫ్ సవరణ చట్టం, 2025పై మీ అసంతృప్తిని నమోదు చేయండి. ఈ బ్లాక్ వక్ఫ్ సవరణ చట్టం ద్వారా, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను ఆక్రమించడం ద్వారా మరియు ఇతర వర్గాల సంక్షేమం పేరుతో వివక్ష చూపడం ద్వారా భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన ప్రాథమిక హక్కులతో ఆడుకోవడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది, ఇది వాస్తవాలకు విరుద్ధం. ఈ సందర్భంగా, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, తీవ్రంగా ఖండించారు మరియు ఈ సంఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించి, నిందితులను న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బతిగుల్ ప్రచారం సందర్భంగా, ఎలాంటి శబ్దం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ముహమ్మద్ మజీద్ ముహమ్మద్ మొయిజుద్దీన్, హఫీజ్ ముహమ్మద్ అక్బర్ ముహమ్మద్ మొయినుద్దీన్ ముహమ్మద్ ఖ్వాజా నిజాముద్దీన్ ముహమ్మద్ యూసుఫ్ ముహమ్మద్ అబ్దుల్ ఖదీర్, ముహమ్మద్ ఫిరోజ్, ముహమ్మద్ అయూబ్ ఖాన్ ముహమ్మద్ వసీం మరియు ఇతరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

ఉగ్రదాడికి నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్రదాడికి నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ
జమ్మికుంట: నేటిధాత్రి

 

జమ్మికుంట పట్టణంలో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ గాంధీ చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ వరకు శాంతియుత కొవ్వొత్తుల రాణి నిర్వహించారు ఈ ర్యాలీలో ప్రజా సంఘాలు డాక్టర్లు ప్రైవేటు టీచర్లు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు ఈ దాడితో భారతదేశం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిందన్నారు ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version