మ్యానిపెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని నిరసన ప్రదర్శన…

మ్యానిపెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని నిరసన ప్రదర్శన

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర శనివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే మ్యానిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారం చేపట్టి 18 నెలలు అవుతున్న ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం అంటే కేవలం బీసీ సమాజాన్ని మభ్యపెట్టడం అవుతుంది.ఇప్పటికైనా ఈ అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.అమలు చేయవలసిన
బీసీ అంశాలు..మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ సివిల్ కన్స్ ట్రాక్షన్ మెంటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం,రిజర్వేషన్లు కల్పించాలి.చిరు వ్యాపారులకు విద్యార్థుల ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచి కత్తులేని వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి.బీసీ కార్పొరేషన్లు అలాగే ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలి.అన్ని జిల్లా కేంద్రాలలో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్ ప్రెస్ క్లబ్ స్టడీ సర్కిల్ లైబ్రరీల క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు ఈ ఐక్యత భవనాలలోనే బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాల ఏర్పాటు చేస్తామని అనేక అంశాలను మానిఫెస్టోలో పెట్టి బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించడం అంటే బీసీ సమాజాన్ని మభ్యపెట్టడమే అవుతుంది ఇప్పటికైనా ఈ అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.లేనిపక్షంలో ఈ అంశాలను బీసీ సమాజం దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందట దోషిగానిలబెడతామనిహెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్
రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకన్న,జిల్లా కార్యదర్శి శాఖ పురం భీమసేన్,ఏదునూరు రమేష్,కీర్తి బిక్షపతి,చంద్రగిరి చంద్రమౌళి,రంగు అశోక్,గుండా రాజమల్లు,వేముల అశోక్,ఆరెందుల రాజేశం, అంకం సతీష్,జక్కం పూర్ణచందర్,తదితరులు నాయకులు పాల్గొన్నారు.

సర్వే ప్రకారమే పట్టాలి ఇవ్వండి సారూ….!

* సర్వే ప్రకారమే పట్టాలి ఇవ్వండి సారూ….!

నారాయణపురం గ్రామ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రైతుల ఆద్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట వంటావార్పు…

ఎంజాయ్ మెంట్ సర్వే ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రైతుల డిమాండ్..

తహసిల్దార్ జి.వివేక్ కి వినతి పత్రం అందజేత.

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

మా భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వండి సారు అంటూ కేసముద్రం మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట నారాయణ పురం గ్రామ రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతుల ఆద్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి నాయక్ మాట్లాడుతూ తాము గత 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 1827 ఎకరాల భూములను 2017లో గత ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అటవీ భూములుగా పేర్కొంటూ పట్టాలు రద్దు చేసిందని 1959 సంవత్సరంలోని 2384 జీవో నెంబర్ ప్రకారం నారాయణపురం గ్రామంలోని భూములను 2021 ,ఫిబ్రవరిలో రెవెన్యూ పట్టా భూములుగా తేల్చింది.

 

 

 

 

గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జూన్ 2021 లో ఎంజాయ్మెంట్ సర్వే చేసి 1827 ఎకరాల్లో 1633 ఎకరాలు సాగుభూమిగా తెల్చి ఇందులో 633 ఎకరాలకు పట్టాలు ఇచ్చిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీవో 94 జారీ చేసి రైతు పేరు తండ్రి పేరు అనే చోట వస్తున్న అడవి అనే పదం తొలగించారని కానీ గ్రామంలో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి ఆరు నెలలు గడుస్తున్న అధికారులు కాలయాపన చేస్తూ పాస్ పుస్తకాల జారీ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. తహసిల్దార్ కార్యాలయంలో ఉన్న పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిశీలించి మా గ్రామ భూ సమస్యను పరిష్కరించాలన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చేలా కృషి చేయాలని తహసిల్దార్

 

 

 

 

 

 

జి. వివేక్ కుమార్ కి వినతి పత్రం అందజేసి తక్షణమే మా గ్రామ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిచో రైతులందరం తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నూతన భూభారతి చట్టంలో తమ భూముల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని..దేశానికి అన్నం పెట్టే రైతన్న అనాధగా మారే పరిస్థితి ఎదుర్కొంటుందని మా గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేక దాదాపు 700 మంది రైతులకు పంట రుణాలు రుణమాఫీ రైతు భరోసా రైతు భీమా ఇతర ప్రభుత్వం పథకాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

 

 

ఈ కార్యక్రమంలో సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, మిరియాల యాకుబ్ రెడ్డి, కొయ్యగూరి రాంరెడ్డి ,జాటోత్ వెంకన్న, బానోత్ భాష గుగులోత్ లక్ పతి, బానోత్ శంకర్ , ధరంసోత్ శ్రీను , దారావత్ వీరన్న, ధరావత్ మాతృ, జాటోత్ రమేష్, గుగులోత్ శంకర్,ఇస్లావత్ సురేష్, గుగులోతు వెంకన్న, ధారావత్ బీమా, ధారావత్ దేవా ,ధారావత్ రమేష్, జాటోత్ సరిత, బానోతు రంగమ్మ, బానోత్ కమల, ధరావత్ కాంసల్య, ధరావత్ కమలమ్మ రైతులు తదితరులు పాల్గొన్నారు.

మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా

మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం చారకొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన తల్లి లక్ష్మమ్మ తండ్రి నరసింహ పెద్ద కుమారుడు చరణ్ (23) గత నెల కింద తల్లి మృతి చెందగా.. తండి కూడా చనిపోవడం జరిగినది. కల్వకుర్తికి మోటార్ సైకిల్ ప్రయాణిస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ బైకు పైకి దూసుకెళ్లడం జరిగినది. బుధవారం సుమారుగా 12 గంటల ప్రాంతంలో కొండారెడ్డిపల్లి గేటు సమీపంలో ఢీకొట్టడం ద్వారా అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీ కొట్టి 24 గంటలు గడిచిన మృతుడి కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగలేదని గ్రామస్తులు మహబూబ్ నగర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మృతుడికి ఒక తమ్ముడు ఉన్నాడు.

డీఎస్సీ 2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు.!

డీఎస్సీ 2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని డీఈఓ కార్యాలయంలోతపస్ వినతిపత్రం.

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

డీఎస్సీ 2008 ద్వారా కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియమితులైన వనపర్తి జిల్లాలోని 34 మంది ఉపాధ్యాయులకు ఇంకా వేతనాలు చెల్లించకపోవడం వల్ల వారు మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నార ని తపస్ జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తంచేశారుకావున వెంటనే పాఠశాల విద్యాశాఖ దృష్టికి తీసుకువెళ్లి వారికి వేతనాలు వెంటనే చెల్లించే విధంగా డీఈవో చొరవ తీసుకోవాలని కార్యాలయ సూపరిండెంట్ శ్రీనివాస చారి కి వినతిపత్రం అందజేశారు
ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వేముల అమరేందర్ రెడ్డి గారు విష్ణువర్ధన్ గారు ఈశ్వర్ గారు జిల్లా మీడియా కన్వీనర్ శశి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని.

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సరైన భద్రత కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు,
గ్రామపంచాయతీలో పని చేసే కార్మికులకు సరియైన భద్రత కల్పించాలని పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఎంపీడీవో కు వినతి పత్రం అందించారు, ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్యాల నరసయ్య, మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెబాట పట్టిన సమయంలో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమయంలో గ్రామపంచాయతీ కార్మికుల వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని వారికి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు, దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అలాగే ఈ గ్రామపంచాయతీ కార్మికులలో చదువుకున్న కార్యదర్శి సహాయకులుగా నియమించాలని, ప్రభుత్వం ఎప్పుడూ చెప్తుంది, వీఆర్ఏలను మళ్లీ తీసుకు వస్తామని కాబట్టి గ్రామపంచాయతీ కార్మికులు ఎవరైనా చదువుకున్న వారిని గుర్తించి వారికి వీఆర్ఏ పోస్టులు ఇవ్వాలని అన్నారు, అలాగే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలుపెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని అన్నారు, వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడాలని వారు అన్నారు,ఈ నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షులు మామిడి నరేష్,
వాసంకిరణ్ కుమార్,కొమ్ము చరణ్, లక్కీ బాబు , రాములు
మల్యాల లచ్చయ్య,
వజ్రవ్వ ,గంగజల, లక్ష్మి,లచ్చవ్వ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version