కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా పాత్ ఫైండర్ ఐనవోలు పాఠశాల సంతాపం.

విమాన ప్రమాద మృతులకు ఘన నివాళి • కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా పాత్ ఫైండర్ ఐనవోలు పాఠశాల సంతాపం

అయినవోలు నేటి ధాత్రి:

అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అనేక అమాయక ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయిన విషయం అత్యంత హృదయవిదారకమైనది. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చేలా అయినవోలు ఫాత్ పైండర్ పాఠశాలలో శనివారం విద్యార్థులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వర్ రావు మరియు ప్రిన్సిపాల్ సుభహనోద్దీన్ ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాలుపంచుకుని, మౌనంగా కాంతి ప్రదీపాలు చేతబట్టి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ధైర్యం, ఆదరణ కలగాలని ప్రార్థించారు.మానవత్వాన్ని ప్రతిబింబించే విధంగా నిర్వహించిన ఈ కాండిల్ ర్యాలీ ద్వారా, శాంతి, ప్రేమ, మరియు ఐక్యత సందేశం సమాజానికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పాఠశాల డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు తెలియజేశారు.

ఉగ్రదాడికి నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్రదాడికి నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ
జమ్మికుంట: నేటిధాత్రి

 

జమ్మికుంట పట్టణంలో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ గాంధీ చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ వరకు శాంతియుత కొవ్వొత్తుల రాణి నిర్వహించారు ఈ ర్యాలీలో ప్రజా సంఘాలు డాక్టర్లు ప్రైవేటు టీచర్లు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు ఈ దాడితో భారతదేశం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిందన్నారు ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version