ఓవైపు చీఫ్ ఆర్కిటెక్ట్.. మరో వైపు కొత్త ఆర్కిటెక్ట
విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా బిగ్ మూవీ “కింగ్డమ్” ప్రమోషన్స్ జోరుగా ప్రారంభమయ్యాయి.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌డమ్’ (Kingdom)చిత్రం ఈ నెల 31న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. రిలీజ్‌కు మరో వారం మాత్రమే సమయం ఉండడంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి నా కింగ్డమ్ ను రూపొందించిన చీఫ్ ఆర్కిటెక్ట్ ఒకవైపు, దాన్ని మరింతగా పెంచుతున్న కొత్త ఆర్కిటెక్ట్ మరోవైపు ఉన్నారని విజయ్ దేవరకొండ వ్రాసుకొచ్చాడు.
ఇదిలాఉంటే.. ఈ సినిమా ట్రైలర్‌ను రేపు (శనివారం) తిరుపతి ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి విడుదల చేయనున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని ‘సామ్రాజ్య’ ( Samrajya) పేరుతో హిందీలో విడుదల చేస్తున్నారు.భాగ్యశ్రీ బోర్సే కథానాయిక నటించగా సత్యదేవ్ కీలక పాత్రలో కనిపంచనున్నాడు. అనిరుధ్ సంగీతం అందించాడు. సితార బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు.