నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
* నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్*
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*
Collector
నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణా పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం వరంగల్ లోని పాత ఆజంజాహి మీల్స్ గ్రౌండ్లో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను సందర్శించి పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయాల సముదాయాలలో మూడు అంతస్తుల నిర్మాణాలను,కలెక్టర్ క్వార్టర్స్,అడిషనల్ కలెక్టర్ క్వార్టర్స్ మొదటి, రెండవ అంతస్తులలో
Collector
డిజైన్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించారు. స్ట్రక్చరల్ పనులు పూర్తయినందున ఫీనిషింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, అవసరమైన సిబ్బందిని వనరులను వియోగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.రోడ్లు,కాంపౌండ్ వాల్, పైప్ లైన్ తదితర నిర్మాణ పనులను కూడా ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించి సమర్థ నిర్వహణకు పలు సూచనలు చేశారు.కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,జిల్లా రోడ్ల భవన అధికారి రాజేందర్,డి.ఈ శ్రీధర్,నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.
సంచార వైద్యశాల మరియు నూతన అంబులెన్స్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్
Collector Jitesh V Patil, District SP Rohit Raj
నేటి ధాత్రి చర్ల
చర్ల మండలం మారుమూల పూసుగుప్ప గ్రామంలో కోటిన్నర వ్యయంతో నిర్మించిన సంచార వైద్యశాల మరియు నూతన అంబులెన్స్ ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ సిఆర్పిఎఫ్ 81 బెటాలియన్ కమాండెంట్ ఎంకే సింగ్ ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ మారుమూల ప్రాంతంలో ఇంత గొప్ప వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినందుకుగాను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జిల్లా అధికారులను గ్రామస్తులు అభినందించారు
Collector Jitesh V Patil, District SP Rohit Raj
24 గంటలు వైద్య సదుపాయాలు మరియు వైద్యాధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఐ రాజ్ వర్మ తహసిల్దార్ శ్రీనివాసు ఎంపీడీవో యాదయ్య ఎస్సై నర్సిరెడ్డి ఎస్సై కేశవ్ మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు
విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.
రామాయంపేట జూలై 4 నేటి ధాత్రి (మెదక్)
Medical College.
కొత్త సీసాలో పాత సారా పోసినట్లు కాంగ్రెస్ బి ఆర్ ఎస్ యొక్క పథకాలను తమ పథకాలుగా నూతనంగా ప్రవేశపెట్టినట్లు చెప్పుకుంటున్నదని మెదక్ మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు ఆమె రామయంపేట పట్టణంలోని టిఆర్ఎస్ నూతన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు జరిగి 19 నెలలు కావస్తున్న ఒక పైసా అభివృద్ధి జరగలేదని జరిగిందంతా శూన్యమైన అని ఆమె విమర్శించారు టిఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన ప్రొసీడింగ్ ఇచ్చిన తెచ్చిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు మళ్లీ ప్రారంభోత్సవాలు శిలాఫలకాలు శంకుస్థాపనలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టడం హాస్యాస్పదమని ఆమె అన్నారు రామాయంపేట పట్టణంలో గత వారం నుండి 12 వార్డుల్లో వివిధ ప్రాంతాల్లో తన హాయంలో తీసుకువచ్చిన అభివృద్ధి పనులను ప్రోసిడింగ్ ఇచ్చి చేసిన పనులపై కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే నూతనంగా ప్రకటిస్తూ తామే తీసుకువచ్చినట్లు చెప్పుకోవడం ప్రారంభోత్సవాలు నిర్వహించడం విడ్డూరమన్నారు అన్నారు రామాయంపేట మున్సిపల్ అభివృద్ధి కోసం టిఆర్పిఏ నుండి వచ్చిన 20 కోట్ల నిధుల నుండి 10 కోట్లకు ప్రోసిడింగ్ ఇచ్చిన అన్ని కార్యక్రమాలపై ఒక పైసా కూడా తీసుకురాకుండా కనీసం మంత్రులను ముఖ్యమంత్రిని కూడా కల్వకుండా సిద్ధంగా ఉన్న తన ఐయంలో ప్రొసీడింగ్ ఇచ్చిన కార్యక్రమాలపై ప్రారంభోత్సవాలు శిలాఫలకాలు కొబ్బరికాయలు కొట్టడం ఆమె ప్రశ్నించారు కెసిఆర్ హయంలో ఇచ్చిన అభివృద్ధి పనులను పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకొంటూ తాము చేసినట్లు పాత నిధులను వాడుకుంటూ కొత్త నిధులకు ఏమాత్రం కూడా తీసుకురావడం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద అభివృద్ధి పనులకు గాని ఎలాంటి కొత్త నిర్మాణాలకు ఒక్క పైసా లేదని బహిరంగంగా చెప్పడం ఇది టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమాలని ప్రజల ముందుకు కాంగ్రెస్ చేసింది అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు కేబుల్ 33 నూతన ట్రాన్స్కో కార్యాలయాలను నిర్మించిన ఘనత తమరి అన్నారు సుమారు 30 కరెంటు కార్యాలయాలు నిర్మించినట్లు ఆమె తెలిపారు డబుల్ బెడ్ రూమ్ లకు కోటి రూపాయలతో రోడ్డు ప్రకటించి ప్రొసీడింగ్ ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ అని ఆమె అన్నారు దానిపై కూడా ఎమ్మెల్యే తన గట్టు అభివృద్ధి ప్రకటించుకొని ప్రారంభోత్సవం చేశారన్నారు మీకే దమ్ముంటే నిలిచిపోయిన 25 కోట్ల ఎస్డిఎఫ్ నిధులను తీసుకువచ్చి చేసి చూపండి అభివృద్ధి చేయండి మేము కూడా హర్షిస్తామని ఆమె అన్నారు కెసిఆర్ పై అడ్డగోలుగా మాట్లాడితే అడ్డుకున్న వారిపై కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు కేసులు దౌర్జన్యాలు మాని ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి అభివృద్ధి కొరకు నిధులు తేవాలని ఆగిపోయిన రామాయంపేట 25 కోట్ల మెదక్ 50 కోట్ల ఎస్ డి ఎఫ్ నిధులు తేవాలని ఆమె డిమాండ్ చేశారు మెదక్కు మెడికల్ కాలేజీని అసెంబ్లీలో ప్రకటింపజేసి వంద పడకల నర్సింగ్ మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగిందని ఆమె సమావేశంలో ప్రోసిడింగ్ పేపర్ను చూపించడం జరిగింది దాన్ని మెదక్ ఎమ్మెల్యే తానే మెడికల్ కాలేజీ ప్రొసీడింగ్ తెచ్చినట్లు చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు అంతేకాక 100 పడకల మెడికల్ కాలేజీని 50 పడకల కాలేజీ గా మార్చడం జరిగిందని ఆమె అన్నారు గత ప్రభుత్వంలో ఇల్లు కూడా రాలేదన్న వాదనపై ఆమె రామాయంపేట పేదవారికి 304 ఇల్లు ఇవ్వడం జరిగిందన్నారు రామాయంపేట మెయిన్ రోడ్డు మసీద్ నుండి గాంధీ వరకు 10 కోట్ల 84 లక్షల రూపాయలతో వేసే రోడ్డులో నష్టపోయే వారికి 54 ఇండ్లను కూడా నిర్వహించిన సంగతి తెలుసుకోవాలని ఆమె గుర్తు చేశారు రామాయపేటకు డివిజన్ ను డిగ్రీ కాలేజీని తీసుకువచ్చామన్నారు డివిజన్ తీసుకువచ్చిన ఇంతవరకు గెజిట్ రాలేదన్న విలేకరుల ప్రశ్నకు ఆ పని 19 నెల నుండి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు నడిపించవలసిందిగా చేయవలసిన బాధ్యత వారిదని ఆమె అన్నారు రామాయంపేట క్రీడల స్టేడియం గురించి అడిగినప్పుడు వాటికి సంబంధించి స్టేడియం నిధులు తిరిగి వెళ్ళిపోయాయని అది కూడా కాంగ్రెస్ అయం లేని జరిగిందని ఆమె ఆరోపించారు మండల పరిషత్ కార్యాలయంలోని పశువుల ఆస్పత్రి 50 సంవత్సరాల నుండి కూడా శిథిలవస్తులో ఉండి కూలిపోయిన విషయంలో ప్రశ్నించగా దానికి నిధులు కేటాయించామని కానీ ఇప్పుడు ఉన్న అధికారం నాయకులు పట్టించుకోవడంలేదని ఆమె అన్నారు ప్రజలు అమాయకులు కారని వారు ఎప్పటికీ మోసపోరని తగిన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్పడం జరుగుతుందన్నారు
Medical College.
ఈ కార్యక్రమంలో రామాయంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ సి ఎస్ సి సి ఎస్ చైర్మన్ భాజీ చంద్రం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి మాజీ ఎంపీటీసీ ఎస్కే హైమద్ కొండల్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఉమామహేశ్వర్ ఆస్నూద్దీన్ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
సిరిసిల్ల పట్టణ నూతన కమిషనర్ ను కాదిర్ పాషా మర్యాదపూర్వకంగా కలిసిన మానవ హక్కుల సంఘం
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)
ఈ రోజు సిరిసిల్ల పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్ కాదిర్ పాషా రాజన్న సిరిసిల్ల జిల్లా మానవ హక్కుల సంఘం మరియు యాంటీ కరెప్షన్ జిల్లా ఛైర్మెన్ గజ్జె శివరాం మరియు గౌరవ సభ్యులు అందరూ మర్యాద పూర్వకంగా కలిసి,బొకే ఇచ్చి శాలువ తో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మీ అసోసియేషన్ తరుపున మీరు చేసే కార్యక్రమాలలో తగిన సహాయ సహకారాలు అందించాలని అలాగే ప్రతి ఒక్క కార్యక్రమానికి మున్సిపల్ ను భాగస్వామ్యం చేసుకొని ముందుకు సాగాలని కోరారు.ఈ సందర్భంగా జిల్లా ఛైర్మెన్ గుజ్జె శివరాం ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఇవ్వడం లో జాప్యం జరుగుతుంది కాబట్టి తక్షణంగా స్పందించి జాప్యం కాకుండా లబ్ధి దారులకు ఇసుక ను అందించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి పంజా బాలరాజు,ప్రధాన కార్యదర్శి రాచకొండ మహేశ్,గొల్లపెల్లి మహిపాల్,కొడం బాలకిషన్,సజ్జనం శ్యామ్ సుందర్,కడార్ల మురళీ,మిద్దె ప్రకాశ్,జింక శరత్, నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.
సీపీ సన్ ప్రీత్ సింగ్ ను కలిసిన వరంగల్ నూతన ఏఎస్పీ
వరంగల్, నేటిధాత్రి
వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నాడు, వరంగల్ డివిజన్ నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శుభం ప్రకాశ్, వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ, పేద ప్రజలకు సత్వర న్యాయం అందించాలని, డివిజన్ పరిధిలో పెండింగ్ కేసులు లేకుండా శాంతి భద్రతలు కాపాడాలని ఏఎస్పీకి సూచించారు.
AP BJP Chief: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి పేరు ఖరారైందని ఎమ్మెల్సీ సోమువీర్రాజు తెలిపారు. కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు పేరు ఖరారైందన్నారు.
విజయవాడ, జూన్ 30: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా (AP BJP New Chief) మాజీ ఎమ్మెల్సీ మాధవ్ (Former MLC Madhav) పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాల మేరకు మాధవ్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే అధికారికంగా వెల్లడించే వరకు పేరు చెప్పవద్దని కమలం పార్టీ నాయకులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బీజేపీ చీఫ్ ఎంపిక నేపథ్యంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కొత్త బాస్‌పై మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యిందన్నారు.రాష్ట్ర రాజకీయ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అధ్యక్ష పదవికి పేరు నిర్ణయం జరిగిపోయిందని చెప్పారు. కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు పేరు ఖరారైందన్నారు. అధికారికంగా అధ్యక్షుడి పేరు ప్రకటించడమే మిగిలి ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు.బీజేపీ ఎన్నికల నియమావళికి అనుగుణంగా అధ్యక్ష ఎంపిక జరుగుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నామినేషన్లు వేయడం, సాయంత్రం ఉపసంహరణ జరుగుతుందన్నారు. రేపు అధికారికంగా అధ్యక్షుని పేరు ప్రకటిస్తారన్నారు. రెండేళ్ల పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నిక జరుగుతోందని చెప్పారు. అధిష్టానం నిర్ణయాలను అందరూ గౌరవిస్తారని..స్వాగతిస్తారని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ వెల్లడించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ డివిజన్ ఏఎస్పీ గా ఎన్. శుభం ప్రకాష్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 ఐ.పి.ఎస్ బ్యాచ్ కు చెందిన శుభం 2024 సంవత్సరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఆరు నెలల పాటు ట్రైనీ ఐపిఎస్ గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం వరంగల్ ఏసీపీ గా పనిచేస్తున్న నందిరాం నాయక్ డిజిపి కార్యాలయంకు బదిలీ అయ్యారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లయన్స్ క్లబ్ ఆఫ్ గోపాలరావుపేట వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగినది. అధ్యక్షులుగా రాంపల్లి శ్రీనివాస్ కార్యదర్శిగా పాకాల మోహన్, కోశాధికారిగా గొడుగు అంజయ్యలను ఎన్నుకున్న అనంతరం ప్రమాణస్వీకారం చేశారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మోర బద్రేషం, రీజియన్ చైర్మన్ కొల్లూరి జితేందర్, జోన్ చైర్మన్ కర్ర ప్రభాకర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ మైక్రో కాబినెట్ మెంబెర్ గోలి మధుసూదన్ రెడ్డి, ప్రోగ్రాం చైర్మన్ కర్ర శ్యాంసుందర్ రెడ్డి, కోచైర్మన్ కొడిమ్యాల వెంకటరమణ, రీజియన్ సెక్రెటరీ యం.మల్లేశం, డైరెక్టర్స్ కర్ర రాజిరెడ్డి, ముదుగంటి రాజిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, చాడ దామోదర్ రెడ్డి, కోట్ల మల్లేశం, మచ్చ గంగయ్య, మోర కేత, శారద, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డి బోయిని గోపి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ శాఖ నూతన బిజెపి కార్యవర్గం నియమించడం జరిగినది. ఇందులో భాగంగా ఉపాధ్యక్షులుగా మోర శ్రీహరి మరియు అంకారపు రాజు, కాంభోజ శ్రీధర్, పల్లికొండ నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా కొండ సురేష్, మేర్గు శ్రీనివాస్, పట్టణ కార్యదర్శులుగా కోడంతవి సురం వినయ్ పంపరి అర్జున్, కోడం శ్రీనివాస్, కోశాధికారిగా ఇoజపురి మురళి బిజెపి సిరిసిల్ల పట్టణ శాఖగా నియమితులయ్యారని జిల్లా బిజెపి అధ్యక్షుడు తెలిపారు.
మొహరం ఇస్లామిక్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ఇస్లామిక్ మొహరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని,సంపద, సమృద్ధి కలుగాలని డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సంవత్సరకాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నూతన సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విధంగా కృషి చేస్తానని, ఇస్లామిక్ నూతన సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు దీవెనలు అందిస్తారని ఆశిస్తూ డాక్టర్ ఉజ్వల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అర్థనారి తెప్ప సముద్రం వెడ్డింగ్ డైరీస్ వంటి వైవిద్య భరితమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న అర్జున్ అంబటి నటించిన తాజా చిత్రం…
‘అర్థనారి’, ‘తెప్ప సముద్రం’, ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైవిద్య భరితమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న అర్జున్ అంబటి నటించిన తాజా చిత్రం ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. నాగ శివ దర్శకత్వం వహించారు. గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివప్రసాద్ నిర్మించారు. జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రం టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ ‘శివ నాకు ఈ కథను చెబుతున్నప్పుడు హీరో ఎలివేషన్స్ డైరెక్టర్ పూరి స్టయిల్లో అనిపించేవి’ అని అన్నారు. హీరోయిన్ జెన్నిఫర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను నేహా అనే పోలీస్ ఆఫీసర్‌పాత్ర పోషించాను. కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. చిత్రదర్శకుడు నాగ శివ మాట్లాడుతూ ‘హీరో అర్జున్ యాక్షన్ సీన్స్‌లో, భావోద్వేగ సన్నివేశాల్లో బాగా నటించాడు’ అని తెలిపారు. నిర్మాత శివ ప్రసాద్ మాట్లాడుతూ ‘కొత్త తరహా కథల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని కలిగిస్తుందీ చిత్రం’ అని అన్నారు.
మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండల కేంద్రానికి చెందిన కొత్త కాపురం వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హాజరయ్యారు. కేక్ కట్ చేసి పలువురికి పంచారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నూతన కలెక్టర్ ప్రావిణ్యను కలిసిన దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాకు ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన నూతన జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ను గురువారం నాడు దివ్యాంగుల అసోసియేషన్ ముఖ్య ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసీ పూల మొక్క ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ జిల్లాలో ఎన్ని దివ్యాంగుల సంఘాలు అసోసియేషన్ లు ఉన్నాయి అని అసోసియేషన్ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల అభ్యున్నతికి అవసరమైన సదుపాయాల ఏర్పాటుపై, ప్రభుత్వ పథకాల అమలు, ఉపాధి అవకాశాలు మరియు శిక్షణా కార్యక్రమాలపై స్పందనను కలెక్టర్ కు తెలియజేశారు. కలెక్టర్ సా నుభూతితో సమస్యలు విని అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో సోలార్ సొసైటీ అధ్యక్షురాలు జుబేదా బేగం, తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు,దివ్యాంగుల సంఘం జిల్లా నాయకులు రామ్ శెట్టి, ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి కె నర్సిములు, ఇస్మాయిల్, నాయకురాలు విజయలక్ష్మి,,దివ్యాంగుల సంఘం నాయకులు లక్ష్మణ్ సుశీల వయోవృద్దుల దివ్యంగుల రెస్పాన్స్ అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
పరకాల పట్టణానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ విటల్ ని ఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్,మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మర్యాదపూర్వకంగా కలిసారు.
హన్మకొండ జిల్లా పరకాల మండలపరిధిలోని మల్లక్కపేట గ్రామంలో గల భక్తంజనేయ స్వామి దేవాలయ కమాన్ కొత్త హంగులను పులుముకుంది.ఆలయ ముఖ ద్వారానికి భక్తుల సహ కారంతో నూతనంగా రంగులు మరియు విద్యుత్ దీపాల కాంతులతో కొత్త శోభ సంతరించుకుంది.సమారుగా 80 వేల రూపాయలతో ఈ పనులు జరిగినట్టు ఆలయ చైర్మన్ అంబీరు మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ చైర్మన్ అంబీర్ మహేందర్ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఆలయం నూతన వసతులతో విరాజీళ్ళుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు.ఆలయ అభివృద్దికి సహకరించే దాతలు ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి లను సంప్రదించాలని కోరారు.
కోహీర్ మండల ఫొటో వీడియో గ్రఫీ నూతన కార్యవర్గం ఏక గ్రీవంగా ఎన్నిక…
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలో ని జహీరాబాద్ నియోజకవర్గ కోహీర్ మండలం ఫొటో వీడియో గ్రఫీ నూతన కమిటీ ఏర్పాటు చేసారు.. మండలం లోని ఆయా గ్రామ ల ఫొటో వీడియో గ్రాఫర్లు గురువారం నాడు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్ను కున్న కమిటీ ని అందరు ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు కోహీర్ మండల ఫొటో వీడియో సంక్షేమ కార్యవర్గ వ్యవస్థాపకులుగ శ్యామ్ రావు, అధ్యక్షులు రచన్న,ప్రధాన కార్యదర్శి రాజు,కోశాధికారి పరమేష్,సoయక్త సహాయ కార్యదర్శులు సంజువు, ప్రవీణ్ కుమార్, సంయుక్త కోశాధికారి కృష్ణ,ఉపాధ్యక్షలు ప్రకాష్, రాజు జనార్దన్ ఆర్గానేజర్ సెక్రటరీ శేఖర్, నవీన్ కుమార్, లక్ష్మాన్, నాగరాజు, మీడియా ఇంచార్జి కె.అశోక్, కార్యవర్గ సభ్యులు రవి, జకీర్, నందు, కాశినాథ్, వినోద్,ఎన్నుకొన్నారు.
పవన్ కళ్యాణ్ కొత్త కథలు వింటున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయనతో హిట్ సినిమా తీసిన దర్శకుడితో మరోసారి సినిమా చేయబోతున్నాడని తెల్సింది
పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్ల్లు’ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. ‘ఓజీ’కీ కూడా కాల్షీటు ఇచ్చారు. త్వరలోనే ఆ చిత్రం కూడా పూర్తికానుందని మేకర్స్ వెల్లడించారు. ఇంకో వైపు హరీశ్ శంకర్ కూడా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ షురూ చేశారు. ఈసినిమా సెట్‌లోనూ పవన్ పాల్గొంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కొత్త కథలు వింటున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయనతో ‘బ్రో’ చిత్రం తీసిన తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని పవన్‌తో మరో సినిమా చేయాలనుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే ఇటీవల సముద్రఖని పవన్‌కు ఓ కథ చెప్పారట.
ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘బ్రో’ సినిమా వచ్చింది. పవన్ ఫ్యాన్స్‌ను మెప్పించిన సినిమా అది. అప్పట్లోనే పవన్ సముద్రఖనితో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారట. ఇప్పుడు అది పట్టాలెక్కబోతోందని తెలిసింది. పవన్‌కు ఇప్పటికే కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చారు. ఆయన పార్టీ పనులతో బిజీ కావడం, సినిమాలకు కొంత గ్యాప్ ఇవ్వంతో కొందరికి అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేశారు. అందులో కొంత మందికి ఇవ్వాల్సి ఉంది. వారిలో ఓ నిర్మాత కోసం ఇప్పుడీ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. తక్కువ సమయంలో, లిమిటెడ్ బడ్జెట్ లో ఈ సినిమా ప్లాన్ చేశారట. ఇటీవల సముద్రఖని పవన్‌ని కలిసి కథ చెప్పేసినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.
ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలోకి విద్యార్థులు.
మరిపెడ నేటిధాత్రి:
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో అడ్మిషన్లు జోరందు కున్నాయి. ఇటీవల ప్రభుత్వ బడుల బలోపేతానికి సర్కారు తీసుకున్న చర్యలు, బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. స్కూళ్లు ప్రారంభమైన వారం రోజుల్లోనే కొత్త అడ్మిషన్లు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం ప్రాథమిక పాఠశాలలో 30 నూతన అడ్మిషన్లు రావడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుర్రం వెంకన్న గౌడ్ తెలిపారు కొత్త అడ్మిషన్లలో సగానికి పైగా ఒకటో తరగతిలో 18 మంది విద్యార్థులు, 2 వ తరగతి లో 5 మంది విద్యార్థులు, 3 వ తరగతి లో 5 మంది విద్యార్థులు, 4 వ తరగతి లో 1, 5 వ తరగతి లో 1 చొప్పున మొత్తం 30 మంది విద్యార్థులు నూతన అడ్మిషన్లు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు అయితే, ఇంకా కొంత మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది అని వారు తెలిపారు, ఈ నెల 12 నుంచి 2025-26 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపునకు ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుందన్నారు.
ఫలితాలిస్తున్న సర్కారు నిర్ణయాలు.
ఇటీవల బడుల బలోపేతానికి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. కొత్తగా పదివేల కు పైగా టీచర్లను నియమించగా, ఖాళీగా ఉన్న చోట్ల బదిలీలు నిర్వహించి సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చింది. దీనికితోడు 1.10లక్షల మంది టీచర్లకు ఐదు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చింది. దీనికితోడు బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ తరగతులు, చదువులో వెనుకబడిన స్టూడెంట్ల కోసం పలు బడుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్ సహకారంతో పాఠాలు బోధించడం లాంటివి ఉపయోగపడుతున్నాయి అన్నారు,మరోపక్క బడులు తెరిచిన రోజే ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు యూని ఫామ్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గువ్వడి లక్ష్మయ్య,రాజేశ్వరి, క్రాంతి, గణేష్,ఎస్ఎంసి చైర్ పర్సన్ పసుపులేటి శోభ,విద్యార్థుల తల్లిదండ్రులు బందు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.