కొత్త రోడ్డు సరే సరి, కనీసం ఉన్న రోడ్లను బాగు చేయండి మహా ప్రభో.
కేసముద్రం లో బి ఆర్ ఎస్ ధర్నా లో మాజీ జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి
కేసముద్రం/ నేటి ధాత్రి
అభివృద్ధి పేరిట కొత్త రోడ్లు వేస్తున్నాం అని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ నాయకులు, కనీసం ఉన్న రోడ్డు ను కూడా మరమ్మత్తు చేయలేక పోతున్నారని బి ఆర్ ఎస్ నాయకులు సోమవారం కేసముద్రం పట్టణం లో ధర్నా చేపట్టారు. ఇటీవలే మున్సిపాలిటీ గా మారిన కేసముద్రం కు రోడ్డు వెడల్పు లో భాగంగా కోట్ల రూపాయలు తెచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు ప్రస్తుత పట్టణ రోడ్ల దుస్థితి కనబడటం లేదా అని మాజీ జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి ప్రశ్నించారు. మండల బి ఆర్ ఎస్ పార్టీ రోడ్ల దుస్థితి పై చేపట్టిన ధర్నా లో మాజీ జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల అబద్ధపు మాటల పై నిప్పులు చెరిగారు. కేసముధ్రం మున్సిపాలిటీ పరిధి లోని ఉప్పరపల్లి రోడ్, అంబేత్కర్ సెంటర్, గాంధీ సెంటర్, మార్కెట్ బజార్, పూలే సెంటర్, పొట్టి శ్రీరాములు సెంటర్, కేసముద్రం విలేజ్ మైన్ రోడ్, తో సహా మొత్తం పట్టణపు రోడ్లన్నీ గుంతలు పడి, నీరు నిలిచి, వాహన చోదకులకు ఎంతో కష్టం అవుతున్నదని, పలు ప్రమాదాలకు దారి తీస్తున్నట్లు శ్రీనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు వీరు నాయక్ మాట్లాడుతూ… మోసపు మాటలతో గద్దె ఎక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిపై, ప్రజల ఇబ్బందులపై కొద్దిగానైనా దృష్టి సారించాలి అని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి, మాజీ మార్కెట్ ఛైర్మెన్ నీలం సుహాసిని దుర్గేశ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు వీరు నాయక్, బి ఆర్ ఎస్ నాయకులు కొండ్రీడ్డి రవీందర్ రెడ్డి, సట్ల వెంకన్న, ముత్యాల శివకుమార్, నల్లా కిరణ్, తొనుపునూరి సాయి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.