బీబీ చారి అందరి మనసుల్లో నిలిచారు
బీబీ చారి మరణంపట్ల కన్నీటిపర్యంతం అయిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన బేతోజు భరత్ కుమార్ చారి (బీబీ చారి) గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. యువకులతో సమానంగా పోటీ పడుతూ,అందరికీ సలహాలు సూచనలు అందిస్తూ,స్నేహపూర్వక స్వభావంతో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా బీబీ చారి అందరి మనసుల్లో నిలిచారు.
ఈ సందర్భంగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు.బీబీ చారి పార్టీ కోసం చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
