సర్పంచులు గ్రామాల్లో ప్రజల సమస్యలు తీర్చాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిదాత్రి .
రాజపేట శివారులో వైటీసీ భవనంలో సర్పంచులకు శిక్షణ కార్యక్రమం అధికారులు ఏర్పాటు చేశారు ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి పాల్గొన్నారు కలెక్టర్ నూతనంగా ఎన్నికైన సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు ఈసందర్భంగా
కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో బాధ్యతాయుతంగా మెలిగి ప్రజల సమస్యలు తీర్చడమే లక్ష్యంగా పనిచేయాలని సర్పంచ్ లకు సూచించారు. సర్పంచులు బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ శిక్షణ శిబిరాన్ని సర్పంచులు అవగాహన చేసుకోవాలని కోరారు పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న అంశాలను సర్పంచులు శిక్షణ శిబిరంలో తెలుసుకోవాలని . సర్పంచులకు 5 సంవత్సరాల పదవి ఉంటుందని 5 సంవత్సరాలు బాధ్యత గా పనిచేయాలని కోరారు గ్రామాల అభివృద్ధి ప్రజల కొరకు సర్పంచులకు సహకరిస్తానని కలెక్టర్ ఆదర్శ్ సురబి సర్పంచ్ లకు హామీ ఇచ్చారు. గతంలో పని చేసిన సర్పంచ్ లతో నూతన సర్పంచ్ లు సూచనలు సలహాలు స్వకరించాలని కోరా రు సర్పంచులకు కలెక్టర్ శిక్షణ సామాగ్రిని పంపిణీ చేశారుఈ సమావేశంలో డీపీ ఓ తరుణ్, డిఎల్పిఓ రఘునాథ్, ఎంపీడీవోలు అధికారులు తదితరులు పాల్గొన్నారు
