మతాల మధ్య ఐక్యత సామరస్యమే తెలంగాణకు గుర్తింపు

మతాల మధ్య ఐక్యత సామరస్యమే తెలంగాణకు గుర్తింపు

క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతి సందేశం అందించాలి

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఎమ్మెల్యే మాధవరెడ్డితో కలిసి నర్సంపేట డివిజన్ చర్చిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రార్థనలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

అన్ని మతాల మధ్య ఐక్యత సామరస్యమే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపని ప్రజలంతా కలిసికట్టుగా పండుగలను జరుపుకోవడమే నిజమైన అభివృద్ధికి సంకేతమని రాష్ట్ర ఐటీ పరిశ్రమ, వాణిజ్యం,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.క్రిస్టమస్ పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ చెన్నారావుపేట మండలం తిమ్మరాయన్ పాడ్ లో జరిగిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి పాల్గొన్నారు. అలాగే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

 

 

 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు,నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు,స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి క్రిస్మస్ పండుగా
శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, కరుణ, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.ఈ క్రిస్మస్ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు ఆరోగ్యం సమృద్ధి నిండాలని కోరుకుంటూ ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నామని తెలిపారు.

బెగ్లూర్ గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు…

బెగ్లూర్ గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు
*మహాదేవపూర్ అక్టోబర్28 నేటి ధాత్రి **

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం గ్రామంబేగ్లూర్ కంటి పరీక్షలు
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి మరియు టిపిసిసి జనరల్ సెక్రెటరీ దుద్దిల్ల శ్రీను బాబు గారి ఆదేశాల మేరకు
బెగుళూరు గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్ మరియు ఆదర్శ యూత్ టీం ఆధ్వర్యంలో శరత్ మాక్సిజన్ ఐ హాస్పిటల్ హనుమకొండ వారి డాక్టర్లరూప ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు చేపించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్. ఆదర్శ యూత్ క్లబ్. అధ్యక్షులు ములకల పోచమల్లు. పోలు మొండి. బుర్రి శివరాజ్.చల్ల తిరుపతి. యూత్ కాంగ్రెస్ నాయకులు. దోమల రాజేష్. మళ్ళా గౌడ్. ములుకల తిరుపతి. ములుకల సతీష్. రాసాకట్ల శ్రావణ్.. మరియు. గ్రామ ప్రజలుకాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

తెలంగాణలో ఇక సులభంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ..!!

తెలంగాణలో ఇక సులభంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ..!!

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్: కుల ధ్రువీకరణ పత్రాలను సులభంగా పొందేలా ‘మీ సేవ’ నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు(ప్రత్యేక కేసులు మినహా) ఇప్పుడు మీ సేవ కేంద్రాల్లో నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. గతంలో ప్రతి దరఖాస్తుకు కొత్తగా తహసీల్దార్ ఆమోదం పొందాల్సిన అవసరం ఉండేది. దీనివల్ల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో జాప్యం ఏర్పడుతుండడంతో.. ఈ సమస్యను నివారించడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో.. మీ సేవ విభాగం దీనిపై దృష్టిపెట్టింది. సీసీఎస్ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, తహసీల్దార్లతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన అనంతరం తాజా మార్పులు చేపట్టారు.

ప్రయోగాత్మకంగా ఈ మార్పును 15 రోజుల క్రితం అమ తెచ్చారు. ఇప్పటికే 17,571 మంది ఈ సేవను విజయవంతంగా పొందారు. ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. కొత్తగా జారీ చేసే సర్టిఫికెట్లో.. గతంలో ఆమోదించిన అధికారి వివరాలు, తిరిగి జారీ తేదీ ఉంటాయి. ప్రత్యేక కేసుల్లో (ఉదాహరణకు హిందూ ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి బీసీ-సీ కిందకు వస్తే.. జీవో ఎంఎస్ నం.3, తేదీ 9.9.2020 ప్రకారం) దరఖాస్తును గత ప్రక్రియ ప్రకారం ఆమోదం కోసం పంపిస్తారు.

సేవను ఎలా పొందాలంటే…

◆:- పాత సర్టిఫికెట్ నంబర్ తెలిస్తే: మీ సేవ కౌంటర్లో ఆ నంబర్ను అందించడం ద్వారా కొత్త ప్రింటవుట్ పొందవచ్చు.

◆:- నంబర్ తెలియకపోతే: మీ సేవ సిబ్బంది మీ జిల్లా, మండలం, గ్రామం, ఉప-కులం, పేరు ఆధారంగా శోధిస్తారు. మరిన్ని వివరాల కోసం మీ సేవ వెబ్సైట్ను లేదా సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చని మీ సేవ కమిషనర్ రవికిరణ్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version