వనపర్తి డిపోలో బస్సులు చాలక ప్రయాణికుల తిప్పలు
ఎమ్మెల్యే ఆర్ టి సి ఆర్ ఎం స్పందించాలి
వనపర్తి నేటిదాత్రి .
సోమవారం పండగ సందర్భంగా వేలాది ప్రయాణికులకు బస్సు ల సౌకర్యం కల్పించలేని స్థితిలో వనపర్తి బస్ డిపో ఉన్నందున ప్రయాణికులు కష్టాలు గంటలుగా వేచి ఉండడం చూసి బస్ లో ప్రయాణం చేసే ప్రయాణికులు అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ దృష్టి కి తెచ్చామని ప్రయాణికులు చెప్పారు వెంటనే డాక్టర్ సతీష్ యాదవ్ వనపర్తి డి.ఎం మాట్లాడి ప్రయాణికుల అవస్థలు తిప్పలను తెలుపగ ఆర్ టి సి బస్సులు లేవు ,ఉన్న కొద్దీ బస్సులు హైదరాబాద్ వెళ్లాలయని, అవి వచ్చిన తర్వాత పంపిస్తామని డి ఎం చెప్పారని సతీష్ యాదవ్ విలేకరుల కు తెలిపారు బస్ ప్రయాణికుల తరుపున గట్టిగా డి ఎం ను కోరడంతో రెండు బస్సులు పంపిస్తామని చెప్పారని అన్నారు వనపర్తి జిల్లాకు రాష్ట్రంలో రెండవ డిపోగా పేరు ఉన్న వనపర్తి డిపోకు బస్సులో కొరత ఉండడం ఎవరి పాపమని, ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యే లు ప్రయాణికుల ఆర్ టి సే డిపోలను పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని డాక్టర్ సతీష్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో వెయ్యి కరెంటు ఎలక్ట్రికల్ బస్సులలో వనపర్తి జిల్లాకు ఎన్ని వచ్చాయో ప్రజలకు ఎమ్మెల్యే లు అధికారులు తెలుపాలని కోరారు జిల్లా కలెక్టర్ ,వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి ఆర్.యం డి ఎం స్పందించి కరెంటు ఎలక్ట్రానిక్ బస్.లు తెప్పిం చసాలని వనపర్తి ప్రయాణికుల తరుపున సతీష్ యాదవ్ కోరారు
