మతాల మధ్య ఐక్యత సామరస్యమే తెలంగాణకు గుర్తింపు

మతాల మధ్య ఐక్యత సామరస్యమే తెలంగాణకు గుర్తింపు

క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతి సందేశం అందించాలి

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఎమ్మెల్యే మాధవరెడ్డితో కలిసి నర్సంపేట డివిజన్ చర్చిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రార్థనలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

అన్ని మతాల మధ్య ఐక్యత సామరస్యమే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపని ప్రజలంతా కలిసికట్టుగా పండుగలను జరుపుకోవడమే నిజమైన అభివృద్ధికి సంకేతమని రాష్ట్ర ఐటీ పరిశ్రమ, వాణిజ్యం,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.క్రిస్టమస్ పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ చెన్నారావుపేట మండలం తిమ్మరాయన్ పాడ్ లో జరిగిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి పాల్గొన్నారు. అలాగే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

 

 

 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు,నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు,స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి క్రిస్మస్ పండుగా
శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, కరుణ, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.ఈ క్రిస్మస్ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు ఆరోగ్యం సమృద్ధి నిండాలని కోరుకుంటూ ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నామని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version