వేసవి సెలవుల్లో భద్రతా సూచనలు

వేసవి సెలవులలో ఊరెళ్తున్నారా.. జరభద్రం..

◆-: ఎస్సై క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్. వేసవి సెలవుల దృష్ట్యా స్కూల్స్, కళాశాలలకు సెలవులు రావడంతో చాలా వరకు తమ సొంత గ్రామాలకు కానీ, ఇతరప్రాంతాలకు గాని ప్రయాణాలు చేస్తూంటారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారాని, ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ సూచించారు. దొంగతనాల నియంత్రణకు జిల్లా పోలీసు వారి సూచనలు ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించమని చెప్పాలి. ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు. ఊళ్ళకు వెళ్లే వారు ఇంటి లోపల, ఇంటి బయట ఒక లైటు వేసి ఉంచాలి. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. ఆరుబయట వాహనాలకు హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ వేయాలి.ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. సిసి కెమెరాలను ఇంటర్నెట్ కు అనుసంధానం చేస్తే మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది. ఇండ్లలో నుండి బయటకు వచ్చే ముందు గ్యాస్ లివర్ తప్పనిసరిగా ఆఫ్ చేయడం మంచిది షార్ట్ సర్కుట్ కాకుండా జాగ్రతలు పాటించాలి. ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. తమ ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారి ఫోన్ నెంబర్ ఇతర అధికారుల నెంబర్ లు ప్రజలు తమ సెల్ ఫోన్ లలో ఉంచుకోవాలి. అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ కు గాని సంబందిత పోలీస్ అధికారులకు గాని సమాచారం ఇవ్వాలి. సుదూర ప్రాంతాల ప్రయాణాలకు వెళుతున్నట్లైతే, సమీప పోలీసు స్టేషన్ లలో మీ ఫోన్ ఇచ్చి వెళ్లాలని, తద్వారా ఎలాంటి విపత్కర పరిస్థితులలో నైనా గుర్తించడానికి వీలుగా ఉంటుంది. • ప్రయాణాలలో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, జాగ్రతగా వాహనాలను నడుపుతూ క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ సూచించారు.

సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం

మల్చల్మ గ్రామంలో ఉన్న వీరన్న వాగు చెరువు తూములు మూడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంవత్సరాలుగా.సరిగా పనిచేయకపోవడంతో సారవంతమైన వ్యవసాయ భూములకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యపై మాజీ ఎంపీటీసీ శెట్టి నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెరువు తూములను వెంటనే మరమ్మతు చేసి రైతులకు నీటి సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయాన్ని కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అధికారులు తక్షణ చర్యలు తీసుకొని చెరువు తూములను పునరుద్ధరించి సాగునీటి సమస్యను పరిష్కరించాలనరు

మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి……

మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి…

మేడారం జాతర జరిగే మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించాలి.

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన జాతర కాబట్టి పిల్లల సెలవులకై నిరీక్షణ

ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక కూడా

విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకునే గొప్ప అవకాశం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

మేడారం జాతరకు సెలవులు మూడు రోజులు ప్రకటించాలని కోరుతూ టిపిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో కేసముద్రం గ్రామ ప్రాథమిక పాఠశాలలో , ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు నేతృత్వంలో అర్పణపల్లి పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను ప్రపంచంలో రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించారనీ, ఈ జాతరలో గత సంవత్సరాల గణాంకాల ప్రకారం లక్షలాది మంది భక్తులు తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దర్శించుకున్నారని గుర్తు చేశారు. ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాకుండా, గిరిజన సంప్రదాయాలకు ప్రధాన ప్రతీక అని, తెలంగాణ సంస్కృతికి మూల స్తంభం అని వివరించారు.
ఈ జాతర సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో దైవ దర్శనం చేసుకుంటారని అన్నారు. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు సమ్మక్క, సారక్క తల్లులు ఇద్దరు కొలువుదీరిన మరుసటి రోజును సెలవు దినంగా ప్రకటిస్తూ వస్తున్నాయని, దీనివల్ల ఆరోజే అందరూ
మేడారం జాతరకు వస్తూ ఉండడం వలన లక్షలాది మంది ప్రజలు పాల్గొనే కారణంగా ట్రాఫిక్ సమస్యలు, కష్టతర ప్రయాణం , వసతి సౌకర్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, దర్శన సమయంలో కిక్కిరిసిన జనాభా వల్ల పిల్లలకు దర్శన భాగ్యం కూడా కలగట్లేదు అని అన్నారు. ఇది కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన జాతర అనీ, పిల్లలకు సెలవులు ఇవ్వందే వాళ్ళు జాతరకు వెళ్ళరని, వారి సెలవులకై వేచి చూసి, సెలవులు ఇచ్చాక మాత్రమే జాతరకు తరలి వెళ్తారని అన్నారు. మూడు రోజులు సెలవులు ఉంటే పబ్లిక్ ఇంత పోటెత్తరని, జాతరను కూడా ఎంజాయ్ చేస్తారని, ఇది విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకునే గొప్ప అవకాశం అని అన్నారు.
ఈ నెల 28న సారక్క తల్లి,29న సమ్మక్క తల్లి గద్దెల పైకి కొలువుదీరుతారని ,30న భక్తుల మొక్కులందుకొని తిరిగి 31న వన ప్రవేశం చేస్తారనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు
కావున ప్రభుత్వం ప్రజా ఆకాంక్షను గౌరవించి మేడారం జాతర సందర్భంలో తల్లులు కొలువుదీరే ఈ మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు మరియు విద్యాసంస్థలకు అధికారికంగా సెలవులు ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊటుకూరి ప్రణయ్ కుమార్, ఉపాధ్యాయులు అప్పాల నాగరాజు, నరసింహస్వామి, భూక్య శ్రీను, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఇంకా.. జలదిగ్బంధంలో శివారు ప్రాంతాలు…

ఇంకా.. జలదిగ్బంధంలో శివారు ప్రాంతాలు

 

చెన్నై శివారు ప్రాంతాలన్నీ.. ఇంకా.. జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ‘దిత్వా’ తుఫాను వల్ల రాజధాని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలన్నీ తడిసి ముద్దయిపోయాయి. తుపాన్ వల్ల జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించిపోయింది. ప్రజానీకం ఇళ్లనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

 ‘దిత్వా’ తుఫాను కారణంగా గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షం కారణంగా చెన్నైతో పాటు శివారు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. కుమరన్‌ నగర్‌లో 15 గృహాల్లోకి వర్షపునీరు చేరింది. నగరంలోని 22 సబ్‌వేల్లో నీరు నిల్వ లేకుండా జీసీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. వాయుగుండం బలహీనపడినప్పటికీ ఏడు జిల్లాలకు మాత్రం వర్ష సూచన ఉందని వాతావారణశాఖ హెచ్చరించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా అనేక ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. కాగా గురువారం చెన్నై , తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.రాజధాని వాసులు మూడు రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. దిత్వా తుఫాన్‌ కారణంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థల కు సెలవు ప్రకటించారు. రహదారుల్లో వాహనాల రద్దీ తక్కువగా కనిపించింది. ఒక వైపు వర్షం, మరోవైపు చలి పెరడగంతో నగర వాసులు ఇంటికే పరిమితమయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే జాలర్లు కూడా గత 8 రోజులుగా చేపల వేటకు దూరంగా ఉన్నారు.

చెన్నై నగరంలో మొత్తం 22 సబ్‌వే (అండర్‌పాస్)లున్నాయి. భారీ వర్షం కురిస్తే ఈ సబ్‌ వేలలోకి వర్షపునీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే, ఈ సారి ఆ పరిస్థితి రాకుం డా, కార్పొరేషన్‌, అగ్నిమాపకదళం, ట్రాఫిక్‌ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఒక్క సబ్‌వేలో కూడా నీరు చేరకుండా మోటర్లతో నీటిని ఎప్పటికప్పుడు పంపింగ్‌ చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగలదేఉ.

ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం

ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం

 

రాజధాని చెన్నై నగరం తడిసి ముద్దవుతోంది. ఒకరోజు మొత్తం వర్షం విపరీతంగా కురవడంతో జనజీవనం అతలాకుతమైంది. ‘దిత్వా’ తుఫాన్‌ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా.. వర్షం కారణంగా మంగళవారం చెన్నై సహా 4 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

చెన్నై: ‘దిత్వా’ తుఫాన్‌ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో సోమవారం వేకువజాము నుంచి సాయంత్రం దాకా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఆదివారం రాత్రి నుంచే పెనుగాలులతో నగరం, శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. వేకువజామున కాసేపు విరామం తర్వాత ఉదయం 7 గంటల నుంచి వర్షం కురిసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు వాతావరణ కేంద్రం అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షం కురిసింది.
చేపాక్‌, ట్రిప్లికేన్‌ రాయపేట, మైలాపూరు, పట్టినంబాక్కం, ప్యారీస్‌ కార్నర్‌, వాషర్‌మెన్‌పేట, టి.నగర్‌, కోడంబాక్కం, కీల్పాక్‌, కోయంబేడు తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి విరామం లేకుండా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపై మోకాలిలోతున వర్షపునీరు ప్రవహించింది. దీంతో వాహన చోదకులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు హాఫ్‌డే సెలవు ప్రకటించాయి. ఇక నగర శివారుప్రాంతాల్లోనూ చెదురుమదురుగా వర్షం కురవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

రహదారుల్లో వర్షపునీరు ప్రవహిస్తుండటంతో పూందమల్లి – చెన్నై సెంట్రల్‌, సెంట్రల్‌ తాంబరం మార్గాలలో వాహనాలు నత్తనడక నడిచాయి. పోరూరు, అయ్యప్పన్‌ తాంగళ్‌, పెరుంగుడి, పెరుంగళత్తూరు ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభించింంది. రహదారులపై వర్షపు నీరు వరదలా ప్రవహించడంలో బస్సులు, ఆటోలు, కార్లు నత్తనడక నడిచాయి. ఉదయం 7 గంటల నుంచే పూందమల్లి హైరోడ్డులో సెంట్రల్‌ వైపు, తిరువేర్కాడు వైపు వెళ్లే బస్సులు గమ్యస్థానాలను గంటకుపైగా ఆలస్యంగా చేరుకున్నాయి. విధంగా పోరూర్‌ జంక్షన్‌, గిండి, కోయంబేడు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అండమాన్‌ విమానాల రద్దు…

నగరంలో వేకువజాము నుంచి ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు, అండమాన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితు ల కారణంగా అండమాన్‌కు వెళ్ళాల్సిన రెండు విమాన సర్వీసులు, అదే విధంగా అండమాన్‌ నుండి నగరానికి రావాల్సిన రెండు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇదే విధంగా పలు నగరాల వైపు ప్రయాణించే విమానాలు కూడా ఆలస్యంగానే బయలుదేరాయి.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version