పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్.

పేదింటి అడబిడ్డలకు కళ్యాణలక్మి షాదీముభారక్ పథకాలు ఒక వరం లాంటివి .

◆ -పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్

◆ – ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పట్టణం లోని గౌరి ప్యాలెస్ లో కళ్యాణలక్మి/షాదీముభారక్ సంబంధిత నియోజకవర్గ లోని 925 మంది లబ్దిదారులకు గాను ₹.92,607,300 /- విలువ గల చెక్కులను పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ గారితో కలిసి పంపిణీ చేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పథకాలు పేదింటి అడబిడ్డలకు వరప్రదాయినిలని .దేశంలో ఏ రాష్రంలో కూడా కళ్యాణలక్మి, షాదీముభారక్ లాంటి పథకాలు లేవని, పేదింటి అడబిడ్డలను కన్న తల్లిదండ్రులు పడే బాధలు తెలిసి సీఎం కేసీఆర్. ఈ పథకాలు ప్రవేశపెట్టారని, వారికి ఎప్పటికి రుణపడి ఉంటామని తెలిపారు.అలాగే ఇటీవలే ముఖ్య మంత్రి గారి జహీరాబాద్ పర్యటనలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి పనుల కొరకు నిధులను కేటాయిస్తారేమో అని ఆశాభావం వ్యక్తం చేశాం అని, కానీ ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిధులను వరాలను ఇవ్వలేదు అని పువ్వు ఇవ్వక పోయినా కనీసం పత్రి అయినా ఇవ్వలేదు అని అన్నారు మోసపూరిత హామీలతో గద్దెను ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తూ కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక పథకం లో 1,00,116 తో పాటుగా తులం బంగారం ఇస్తాం హామీ ఇచ్చారని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండలల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,సంజీవ్ రెడ్డి,వెంకటేశం,పాక్స్ చైర్మన్ మాచెందర్, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ సురేష్ శెట్కార్ కలిసిన మిషన్ భగీరథ డి. ఈ సృజన్ చక్రవర్తి.

ఎంపీ సురేష్ శెట్కార్ కలిసిన మిషన్ భగీరథ డి. ఈ సృజన్ చక్రవర్తి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మిషన్ భగీరథ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ జహీరాబాద్ డివిజన్ నూతన డి. ఈ గా నియమితులైన జి. సృజన్ చక్రవర్తి గురువారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, మాజీ మంత్రి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్లను మర్యాదపూర్వకంగా ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డివిజన్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల వివరాలను ఎంపీ సురేష్ షెట్కర్, మాజీ మంత్రి చంద్రశేఖర్ లకు డి ఈ సృజన్ చక్రవర్తి వివరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version