అధిక ధరలకు ఎరువులు అమ్మిన దుకాణం సీజ్ చేసిన పి.కలెక్టర్ ప్రావిణ్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి కొహీర్ మండల పోతిరెడ్డిపల్లి గ్ గ్రామంలో డిసిఎంఎస్ ఎరువుల షాపును బుధవారం జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేసారు.ఈపాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు.అనంతరం ఒక రైతుతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు.రైతులకు ఎరువులను అధిగ ధరకు ఎమ్మార్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్మారని తెలియజేయడంతో జిల్లా కలెక్టర్ యూరియాను రైతులకు అధిక ధరకు విక్రయించినందుకు షాపును సీజ్ చేయమని డిఏఓ కు కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు.