అర్ధరాత్రి ఆర్డర్లూ అధికమే..
ఆన్‌లైన్(Online)లో పగటిపూటతో పాటు అర్ధరాత్రిళ్లు సైతం ఆర్డర్లు అధికమైనట్లు ఇన్‌స్టామార్ట్ సంస్థ (Instamart Company)అధ్యయనంలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బాగా పెరిగినట్లు తెలిపింది.
– గతేడాదితో పోలిస్తే ఎక్కువే
హైదరాబాద్‌లో పాలకు డిమాండ్
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్(Online)లో పగటిపూటతో పాటు అర్ధరాత్రిళ్లు సైతం ఆర్డర్లు అధికమైనట్లు ఇన్‌స్టామార్ట్ సంస్థ (Instamart Company)అధ్యయనంలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బాగా పెరిగినట్లు తెలిపింది. సంస్థ అధ్యయనం ప్రకారం గడిచిన తొలి ఆరు నెలల్లో ఒక వ్యక్తి ఏకంగా 617కు పైగా ఆర్డర్లు చేశాడు. నగరంలో పాలకు అత్యధిక డిమాండ్ ఉంది. ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, వ్యక్తిగత సంరక్షణ విభాగాలు 117 శాతం వృద్ధితో దూసుకుపోతున్నాయి.