రేగూరి గంగమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-11T111045.120.wav?_=1

 

రేగూరి గంగమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా

గంగమ్మ ప్రతివాదేహానికి మహిళా కమిటీ నాయకురాళ్ల నివాళులు

పరకాల నేటిధాత్రి

 

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి తల్లి రేగూరి రంగమ్మ నిన్న సాయంత్రం మృతిచెందడం జరిగింది.విషయం తెలుసుకున్న పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి రంగమ్మ పార్దివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.పరామర్శించిన వారిలో పరకాల నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.

రంగమ్మ పార్థివదేహానికి మహిళ నాయకురాళ్ల నివాళులు

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి తల్లి రేగూరి రంగమ్మ నిన్న సాయంత్రం మృతిచెందగా బిఆరఎస్ మహిళా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రంగమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.మహిళా పట్టణ అధ్యక్షురాలు గంటా కళావతి,సాంబరాజు జ్యోతి మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.

ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది…

ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట,నేటిధాత్రి:

 

రాష్ట్ర మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తండ్రి ఎర్రోళ్ల విజ్జయ అనారోగ్యంతో గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్, బిఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్జయ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.రాష్ట్ర మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అనుపర్తి యాకయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు

అనుపర్తి యాకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు
వర్దన్నపేట (నేటిధాత్రి)

Vaibhavalaxmi Shopping Mall

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట టౌన్ లోని 1వ వార్డు కు చెందిన అనుపర్తి యాకయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే వెంట ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, టౌన్ పార్టీ అధ్యక్షుడు మైస సురేష్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్, వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తుల్లా రవి, మాజీ కౌన్సిలర్ తుమ్మల రవీందర్, కాంగ్రెస్ నాయకులు బెజ్జం పాపరావు, సిలువేరు శ్రీధర్, పులి శ్రీను, వెంకట్, ఎండి అన్వర్, చిటూరి రాజు, పాక సుజాత తో పాటు తదితరులు పాల్గొన్నారు..

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన పెద్ది సుదర్శన్ రెడ్డి.

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రానికి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి నన్నేసాహెబ్ తల్లి అనారోగ్యంతో మృతిచెందగా. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతురాలి స్వగృహానికి చేరుకొని ఆమె పార్థివ దేహం పై పూలమావిసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగడ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్ నాయకులు నాన బోయిన రాజారాం, సట్ల శ్రీనివాస్ గౌడ్, ఖ్యాతం శ్రీనివాస్ గుమ్మడి వేణు పాండవుల రాంబాబు ముదిరాజ్ తదితరులు ఉన్నారు.,

తహెరా బేగం కు తన్వీర్ నివాళి…

మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిని కోల్పోవడం బాధాకరం టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తహరాబేగం మృతి చెందగా విషయం తెలుసుకున్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితో పాటు పలువురు నాయకులు స్థానికంగా ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన అంతక్రియలో పాల్గొని పార్థివధ్యాన్ని నివాళులు అర్పించారు తన్వీర్ మాట్లాడుతూ తాహెరా బేగం చేసిన సేవలు మరువ లేనివి వారి మరణం బాధాకరం.

మాజీ మునిసిపల్ కౌన్సిలర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన…

మాజీ మునిసిపల్ కౌన్సిలర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన

◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్:సోమవారం నాడు, పట్టణంలోని వార్డ్ నెంబర్ 2, వాస్తవ్యులు మాజీ మునిసిపల్ కౌన్సిలర్ శ్రీమతి.తహెరా బేగం గారు పరమపదించారన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డా౹౹ఏ.చంద్రశేఖర్ జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా వద్ద నిర్వహించిన అంతఃక్రియలలో పాల్గొని వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు,హన్మంత్ రావు పాటిల్ మాక్సూద్ అహ్మద్ పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు,కాంగ్రెస్ నాయకులు ఖాజా భాయ్ నాయీమ్ గౌసోద్దీన్ పాండురంగ రెడ్డి ,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

వెంకటస్వామి కుటుంబాన్ని పరామర్శించిన నిరంజన్ రెడ్డి.

మృతుడికుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి

వనపర్తి నేటిధాత్రి .
పెద్ద గూడెం గ్రామానికి చెందిన బీ అర్ యస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటస్వామి ఆకస్మికంగా మరణించారు ఈ విషయం తెలియడంతో మృతుని కుటుంబ సబ్యలను మాజి మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు
మాజీ మంత్రి గారి వెంట వనపర్తి మండల బీ ఆర్ ఎస్ అధ్యక్షులు మాణిక్యం, మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, మాజీ సర్పంచ్ కొండన్న, లక్ష్మీకాంతరెడ్డి, తిరుమలయ్య, శీను, చిరంజీవి, బి రాములు, బాలస్వామి, వంశీ, బాలకృష్ణ, వెంకటయ్య, ఏం రాములు, గ్రామ అధ్యక్షులు అశోక్, చోటు తదితరులు పాల్గొన్నారు

మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన మునిగాలా సురేందర్ రావు…

మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన మునిగాలా సురేందర్ రావు

పరకాల నేటిధాత్రి

 

 

 

కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతు మరణించిన పరకాల మాజీ జడ్పిటిసి సిలివేరు మొగిలి పార్థివదేహానికి తన స్వగ్రామం మండలంలోని వెంకటపూర్ గ్రామంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు మునిగాల సురేందర్ రావు నివాళులు అర్పించారు.మొగిలి మరణ వార్త తెలిసి పరకాల ప్రాంత ప్రజలు తీవ్రంగా విచారాన్ని వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.రాజకీయ నాయకులు,స్థానిక ప్రజలు ఆయన మరణంపై సంతాపం తెలియజేస్తూ,వారి ఆత్మకు శాంతి కలగాలని,కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ప్రార్థించారు.

దివంగత రావుల.కౌసల్యమ్మ కు నివాళులు అర్పించిన మాజీ ఎంపీ రావుల…

దివంగత రావుల.కౌసల్యమ్మ కు నివాళులు అర్పించిన మాజీ ఎంపీ రావుల

వనపర్తి నేటిదాత్రి

 

 

మాజీ ఎంపీ

రావుల చంద్రశేఖరరెడ్డి వదిన న్యాయవాది హేమవర్ధన్ రెడ్డి తల్లి రావుల.కౌసల్యమ్మ చిత్ర పటానికి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పూల మాలవేసి నివాళులర్పించారు కొత్తకోట బి.పి.ఆర్ గార్డెన్స్ లో దశదిన కర్మ నిర్వహించారు వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు ఈ కార్యక్రమములో కొత్తకోట మాజీ ఎంపీపీ గుంత మోనిక మల్లేష్ వనపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ పలస రమేష్ గౌడ్ బీ ఆర్ ఎస్ నేతలు నందిమల్ల అశోక్ తిరుమాల్ బండారు కృష్ణ నందిమల్ల అశోక్ స్టార్ రహీం తదితరులు పాల్గొన్నారు

పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

V6 రిపోర్టర్ అయ్యుబ్ ఖాన్ సోదరుడు అహ్మద్ ఖాన్ అనారోగ్యంతో మంగళవారం మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పట్టణంలోని ఈద్గా వద్దకు వెళ్లి వారి మృతదేహాన్నీ సందరర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు,మాజీ కౌన్సిలర్ అబ్దుల్లా,ఆతార్ అహ్మద్ ఏఐఎంఐఎం నాయకులు, జర్నలిస్ట్ లు మహబూబ్, కరీం,తదితరులు ఉన్నారు,

మాజీ సర్పంచ్ సుష్మ రాజ్ గోపాల్ గౌడ్ కుటుంబానికి పరమార్శ…

మాజీ సర్పంచ్ సుష్మ రాజ్ గోపాల్ గౌడ్ కుటుంబానికి పరమార్శ

గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

నెల్లికుదురు మండలం బొడ్లాడ గ్రామ తాజా మాజీ సర్పంచ్ మండ సుష్మ రాజగోపాల్ గౌడ్ తండ్రి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి జలగం వెంకన్న అకాల మరణం చెందగా వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి వెంకన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రగాఢ సానుభూతిని తెలిపి సుష్మ రాజగోపాల్ గౌడ్ కి, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు సిపిఎం రాష్ట్ర నాయకులు భిక్షమయ్య గౌడ్ దంపతులు,కేసముద్రం కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్..ఈ పరామర్శలో వీరితోపాటు మాజీ సర్పంచ్ నరేందర్ ఉన్నారు.

నివాళులు అర్పించిన మాజీ చైర్మన్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T152320.210-1.wav?_=2

 

నివాళులు అర్పించిన మాజీ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అయుబ్ రిపోర్టర్ తమ్ముడు అహ్మద్ మృతి చెందడం బాధాకరమని వారి మృతి కుటుంబానికి తీరనిలోటని టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ అన్నారు వారి భౌతిక కాయం సందర్శించి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పాపయ్య గారికి నివాళులర్పించిన నల్లాల ఓదెలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-68.wav?_=3

పాపయ్య గారి పార్థివదేహానికి పూలమాలవేసి ప్రగాఢ సానుభూతి తెలిపిన నల్లాల ఓదెలు

మందమర్రి నేటి ధాత్రి

*మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ తండ్రి పాపయ్య కి నివాళులు అర్పించిన మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు

మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ గారి తండ్రి మేడిపల్లి పాపయ్య స్వర్గస్తులవగా విషయం తెలుసుకొని కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం, రామన్నపల్లి గ్రామంలోని వారి స్వగృహం నందు పాపయ్య గారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన *మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు

హత్యకు గురైన బాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-63-1.wav?_=4

హత్యకు గురైన బాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తిలో పట్టణానికి చెందిన బాలయ్య కొడుకు బీరయ్య చేతిలో హత్యకు గురైన బాలయ్య కుటుంబ సభ్యులను ప్రభుత్వ హాస్పిటల్ లో పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అనంతరం బాలయ్య భార్యను కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని అధైర్య పడద్దని అని అన్నారు.అదేవిధంగా అనంతరం హాస్పిటల్లో సందర్శించారు. వివిధ గ్రామాలకు చెందిన పాముకాటు గురైన చికిత్స పొందుతున్న యువకులను పరామర్శించి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలని అదేవిధంగా డాక్టర్లకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను సూచించారు అదేవిధంగా ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ సమాజంలో ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఘోరాలు చాలా ఎక్కువ అయ్యాయి దయచేసి కుటుంబ సభ్యులు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి సంఘటనలు చేసేటప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాటన్ మిల్ యూనియన్ అధ్యక్షులు సూర్య ప్రకాష్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బావుండ్ల మధు, మార్కెట్ మాజీ చైర్మన్ బాలయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మనోహర్ రెడ్డి,బండారి శ్రీనివాస్, భగత్ సింగ్ ,కిషోర్ వరుణ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబాన్ని పెండెం రామానంద్ పరామర్శ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download.wav?_=5

 

మృతురాలి కుటుంబాన్ని పెండెం రామానంద్ పరామర్శ

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణం 23 వ వార్డుకు చెందిన వరంగంటి బుచ్చమ్మ మరణించగా ఆమె మృతదేహంపై టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు ఓర్సు తిరుపతి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేవండ్ల రాంబాబు, 23వ వార్డు అధ్యక్షుడు పెద్దపల్లి శ్రీనివాస్, 24వ వార్డు అధ్యక్షుడు కోల చరణ్ గౌడ్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మాజీ నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేల్లి సారంగం గౌడ్, మాజీ నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొలువుల వెంకటేశ్వర్లు, దూడేల సాంబయ్య, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేడబోయిన కుమార్, గద్ద వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పిటిసి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-30T123732.949.wav?_=6

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పిటిసి

మహాదేవపూర్ ఆగస్టు 30 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రం లో శని వారం రోజున మండిగ బాబు కుటుంబాన్ని మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ పామర్శించారు. మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన మండిగ బాబు గత నాలుగు రోజుల క్రితం కాలేశ్వరం గోదావరిలో గల్లంతైన విషయం విధితమే కావున వారి కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యాన్ని నింపి, అన్నివేళలా అన్ని రకాల కాంగ్రెస్ పార్టీ తోడు నీడల ఉంటుందని, మీ కుటుంబాన్ని ఆదుకుంటుందని మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ అన్నారు.

“రామంతపూర్ విషాదం: కేటీఆర్, కవిత ఆవేదన”

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-6-9.wav?_=7

“రామంతపూర్ విషాదం: కేటీఆర్, కవిత ఆవేదన”

హైదరాబాద్‌ ఉప్పల్‌ రామంతపూర్‌ గోకులే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపులో రథానికి విద్యుత్‌ తీగలు తగలడంతో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.

కామ్రేడ్ గాజర్ల రవి మృతికి సంతాపం తెలిపిన.

కామ్రేడ్ గాజర్ల రవి మృతికి సంతాపం తెలిపిన టి యు డబ్ల్యూ జే (ఐజేయు ) జర్నలిస్ట్ యూనియన్ .

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి సమాజానికి తీరని లోటని భూపాలపల్లి ఐజేయు జిల్లా అధ్యక్ష,కార్యదర్శి లు క్యాతం సతీష్ , సామంతుల శ్యామ్ లు అన్నారు.

వెలిశాల గ్రామంలో శుక్రవారం గాజర్ల రవి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈనెల 18న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు, ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన తెలిసిందే.

 

కాగా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి గత 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరి..

పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన అమరుడు గాజర్ల రవి అని అన్నారు.

కార్యక్రమంలో చిట్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఐలయ్య జర్నలిస్టులు పుల్ల రవితేజ కట్కూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఆమ్మదాబాద్ విమానం ప్రమాదం లో మృతులకు.

ఆమ్మదాబాద్ విమానం ప్రమాదం లో మృతులకు నివాళులు అర్పించిన గణేష్ వాకింగ్ టీమ్

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమానము ప్రమాదంలో మృతి చెందిన ప్రజలు గుజరాత్ మాజీ సీఎం మృతి చెందిడము పట్ల వనపర్తి గణేష్ వాకింగ్ గ్రూప్ సబ్యుల అధ్యర్య ములో రాజవారి బంగ్లాలో నివాళులర్పించామని అధ్యక్షులు గోనూర్ వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు రాజాపేట సుదర్శన్ రెడ్డి దొంత అశోక్ వాకింగ్ టీము సబ్యులు నివాళులర్పించారు

ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముల్తాని.

ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముల్తాని.

జహీరాబాద్ నేటి ధాత్రి:

గుజరాత్ లో జరిగిన విమాన ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మొహమ్మద్ ముల్తాని
అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌ పై జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల మాచునూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సంఘటన అత్యంత బాధాకరం,సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ కు బయలుదేరిన ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే కుప్ప‌కూలిపోవ‌డం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని,ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ
వారి కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..ఈ ప్రమాదంలో గాయ‌ప‌డ్డ వారు ఆ భ‌గ‌వంతుడిని దయతో త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మనసారా కోరుకుంటున్నానని మరియు చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version