“రామంతపూర్ విషాదం: కేటీఆర్, కవిత ఆవేదన”
హైదరాబాద్ ఉప్పల్ రామంతపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపులో రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.