బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పిటిసి
మహాదేవపూర్ ఆగస్టు 30 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రం లో శని వారం రోజున మండిగ బాబు కుటుంబాన్ని మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ పామర్శించారు. మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన మండిగ బాబు గత నాలుగు రోజుల క్రితం కాలేశ్వరం గోదావరిలో గల్లంతైన విషయం విధితమే కావున వారి కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యాన్ని నింపి, అన్నివేళలా అన్ని రకాల కాంగ్రెస్ పార్టీ తోడు నీడల ఉంటుందని, మీ కుటుంబాన్ని ఆదుకుంటుందని మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ అన్నారు.